పలాస రూరల్, న్యూస్‌లైన్: పలాస మండలంలో వైఎస్సార్ సీపీ తరఫున బరిలో దిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు గురువారం ముమ్మర ప్రచారం చేశారు. ఫ్యాన్‌గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థి పేరాడ భార్గవి, పెదంచల, లక్ష్మీపురం, టెక్కలిపట్నం, చినంచల ప్రాదేశికాల నుంచి పోటీ చేస్తున్న దువ్వాడ దేశమ్మ, బమ్మిడి చంద్రకళ, సవర తులసీ, బమ్మిడి వరహాలు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయూలని ఓటర్లను అభ్యర్థించారు.
తమకు ఓటు వేస్తే అభివృద్ధి చేస్తామని భార్గవి చెప్పారు. ప్రచారంలో నందిగాం మండలం మాజీ ఉపాధ్యక్షుడు పేరాడ తిలక్, లొద్దభద్ర ఎంపీటీసీ అభ్యర్థి కొయ్య శ్రీనువాసరెడ్డి, పెదంచల సర్పంచ్ రౌతు జగదీశ్వరి, టెక్కలిపట్నం, పెదంచల, చినంచల మాజీ సర్పంచ్‌లు కె. కృష్ణమూర్తి, టి.శ్రీరాములు, పి.జోగారావు, టెక్కలిపట్నం ఎంపీటీసీ మాజీ సభ్యుడు జె.రామారావు, రౌతు శంకరరావు, బి.గోపి, ఆర్.షణ్ముఖరావు, షిష్టి మురళీ, ఎస్.చంద్రమౌళి, బి.హనుమంతరావు, బి.ధర్మారావు, బి.తేజేశ్వరరావు, కె.కృష్ణారావు, బి.వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.
ఓటేస్తే అభివృద్ధి చేస్తా
Published Sat, Mar 29 2014 2:13 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement