mptc candidates
-
దివిసీమ టీడీపీలో ఉప్పెన
మోపిదేవి (అవనిగడ్డ): కృష్ణా జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మోపిదేవి మండల టీడీపీ నాయకుల మూకుమ్మడి రాజీనామాలు దివిసీమలో తీవ్ర చర్చలకు దారితీశాయి. మాజీమంత్రి కొల్లు రవీంద్ర కుటుంబం నుంచే ఈ ముసలం పుట్టడం ఆ పార్టీ శ్రేణులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. మాజీ మంత్రులు నడకుదటి నరసింహారావు సోదరుడు, కొల్లు రవీంద్ర మేనమామ అయిన జనార్దనరావు అధిష్టానంపై రాజీనామా అస్త్రాన్ని సంధించారు. ఈయన మూడు దశాబ్దాలుగా టీడీపీ నేతగా, రెండు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా, గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. శనివారం ఉత్తర చిరువోలులంకలోని ఆయన ఇంటివద్ద టీడీపీకి, అవసరమైతే ఎంపీటీసీ పదవికి సైతం తాను, తన కుటుంబం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో కమ్యూనిస్టు పార్టీలో కొనసాగామని, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు పిలుపు మేరకు ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు. అప్పటి నుంచి టీడీపీకి మండలంలో కంచుకోటగా గ్రామాన్ని బలోపేతం చేశానని చెప్పారు. సర్పంచ్‌గా తాను, తన భార్య జననీకుమారి బాధ్యతలు నిర్వహించామని గుర్తు చేశారు. 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో ఎంపీపీని చేస్తామని చెప్పడంతో ఆర్థిక స్థోమత లేకపోయినా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మళ్లీ పోటీచేయాలని, గెలిస్తే ఎంపీపీ స్థానంలో కూర్చోబెడతామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలిపారు. దీంతో తన భార్య జననీకుమారిని కార్యకర్తలు గెలిపించారని పేర్కొన్నారు. అయితే ఎంపీపీ పదవి ఇవ్వకుండా.. హామీని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలను గడ్డిపరకలకన్నా హీనంగా చూస్తున్నారని అన్నారు. అవసరానికి మాత్రమే వాడుకుంటూ అవకాశం ఉన్నా.. తమకు పదవి ఇవ్వలేదని విచారం వ్యక్తం చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన భార్య జననీకుమారి ఎంపీటీసీ పదవిని కూడా వదులు కోవడానికి సిద్ధంగా ఉందని జనార్దనరావు వివరించారు. కాగా, ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. -
కుప్పం టీడీపీలో ముసలం..
సాక్షి, చిత్తూరు: కుప్పం టీడీపీలో ముసలం పుట్టింది. చంద్రబాబు తీరుపై నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణపై మండిపడుతున్నారు. చంద్రబాబు నిర్ణయానికి నిరసనగా పార్టీకి ఐదుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసి వారు వైఎస్సార్సీపీలోకి చేరారు. టీడీపీ అభ్యర్థులు,కార్యకర్తలు, డీలాపడ్డారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘మేం ఎన్నికల కోసమని లక్షల రూపాయలు ఖర్చుపెట్టాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశాం. గెలిపించాలని ఏడాదిగా గ్రామాల్లో ప్రచారాలు చేస్తున్నాం. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు బహిష్కరించమంటే ఎలా..?. అధినేత నిర్ణయంతో నష్టపోయేదెవరు..? నామినేషన్లకు పెట్టిన డబ్బులు ఎవరిస్తారు..?’ అంటూ కుప్పంలోని టీడీపీ అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: దేవుడే అస్త్రమా.. ఇదేం రాజకీయం..? గుడివాడలో టీడీపీకి ఎదురుదెబ్బ -
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్
సాక్షి, గుంటూరు: టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా ఇద్దరు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో దుగ్గిరాల 1,3 సెగ్మెంట్ల టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. చదవండి: ‘ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటి వేషగాళ్ల డ్రామా’ కోవిడ్ సమస్యకు పరిష్కారం వ్యాక్సినేషనే: సీఎం జగన్ -
టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థులు ఒకరిపై మరోకరు దాడి
-
‘క్యాంపు విహారం’లో అపశ్రుతి
ఘట్కేసర్/ఘట్కేసర్ టౌన్/ గుత్తి: ‘క్యాంపు విహారయాత్ర’లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎంపీటీసీ సభ్యులు ప్రయాణిస్తున్న మినీబస్సు బోల్తాపడడంతో 14 మంది గాయపడ్డారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. ఈ నెల 4వ తేదీన ఘట్కేసర్ ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్కు చెందిన 18 మంది ఎంపీటీసీ సభ్యులతో పాటు వారి కుటుంబీకులను కొందరు సోమవారం రాత్రి అనంతపురం పుట్టపర్తికి విహారయాత్రకు తీసుకెళ్లారు. అర్ధరాత్రి గుత్తి శివారులోని ఓ హోటల్ వద్ద బస చేశారు. మంగళవారం ఉదయం అక్కడే టిఫిన్ చేసి ప్రయాణమయ్యారు. బస్సు అతివేగంగా వెళుతూ అదుపు తప్పింది. మిడుతూరు - రామరాజుపల్లి వద్ద 44వ నంబరు జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎంపీటీసీ సభ్యుడు మంకం రవి, మేడిపల్లి ఎంపీటీసీ స్వరూప భర్త సుభాష్‌నాయక్, వెంకటాపూర్ ఎంపీటీసీ కల్పన భర్త బుర్ర వెంకటేష్, చెంగిచెర్ల ఎంపీటీసీ బింగి భాగ్యమ్మ భర్త జంగయ్య, బోడుప్పల్ ఎంపీటీసీ జంగమ్మ భర్త నత్తి మైసయ్య, పీర్జాదిగూడ ఎంపీటీసీ మానస భర్త బృందాకర్ తదితరులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారు ఓ అద్దె వాహనంలో వెనక్కి తిరిగి వెళ్లారు. సంఘటన స్థలాన్ని గుత్తి, పామిడి, పెద్దవడుగూరు పోలీసులు పరిశీలించారు. పెద్దవడుగూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్నికకు వేళాయే!
సంగారెడ్డి డివిజన్: జెడ్పీ, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా పాలక వర్గాలు కొలువుదీరనున్నట్టు సమాచారం. మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికల కమిషన్ జెడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లతోపాటు మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎన్నికై నెల రోజులు కావస్తున్నా ఇంకా కొత్త పాలకవర్గాలు కొలువుదీరలేదు. దీంతో కౌన్సిలర్లు, జెడ్పీటీసీలుగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి నెలకొంది. మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ పదవులపై ఆశలు పెట్టుకుని క్యాంపులు నడుపుతున్న వారికి క్యాంపుల నిర్వహణ భారంగా మారుతున్నాయి. మరోవైపు షెడ్యూల్ జాప్యంతో క్యాంపులో తమకు మద్దతుగా ఉన్న కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు ఎక్కడ జారిపోతారోనన్న ఆందోళనతో ఉన్నారు. ఈ నెల 25 తర్వాత షెడ్యూల్ విడుదల చేసి నెలాఖరు వరకు కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా చూడాలని ఎన్నికల కమిషన్ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే మెజార్టీ జెడ్పీటీసీ సభ్యులు టీఆర్ఎస్కు ఉన్నందునా జెడ్పీ పీఠం ఆ పార్టీకే దక్కే అవకాశాలున్నాయి. జిల్లాలోని మెజార్టీ ఎంపీపీ పదవులను దక్కించుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటీపడుతున్నాయి. ఇందుకోసం పోటాపోటీగా క్యాంపులు నడుపుతున్నాయి. మున్సిపాలిటీల్లో మారుతున్న సమీకరణాలు జిల్లాలో మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో సమీకరణాలు మారుతున్నాయి. సంగారెడ్డి, సదాశివపేట, మెదక్, జహీరాబాద్ మున్సిపాలిటీలతోపాటు జోగిపేట, గజ్వేల్ నగరపంచాయతీలకు చైర్మన్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా చోట్ల పాగా వేసేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. మెదక్ మున్సిపాలిటీ మినహా టీఆర్ఎస్కు మిగతా మున్సిపాలిటీల్లో చైర్మన్ పదవులు దక్కించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం లేదు. అయితే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నందున తమతో కలిసివచ్చే కౌన్సిలర్లను కలుపుకుని చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు అధిక మెజార్టీ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ క్యాంపులు నిర్వహిస్తూ ఎలాగైనా చైర్మన్ పదవులు సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అయితే సంగారెడ్డిలో ఎంఐఎం, స్వతంత్ర కౌన్సిలర్ల మద్దతుతో, అలాగే సదాశివపేటలోనూ చైర్మన్ పదవులను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జహీరాబాద్ మున్సిపాలిటీల్లో 24 స్థానాలకు కాంగ్రెస్ 12 కౌన్సిలర్ స్థానాలను గెలుపొందింది. చైర్మన్ పదవి పొందాలంటే మరొక్క కౌన్సిలర్ అవసరం. అయితే ఎమ్మెల్యే గీతారెడ్డి ఎక్స్అఫీషియో హోదాలో ఓటు వేసే అవకాశం ఉన్నందునా కాంగ్రెస్‌కు చైర్మన్ పదవి దక్కేఅవకాశం ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ టీడీపీ, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు కలిస్తే వారి సంఖ్య 12 అవుతుంది. టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఎక్స్అఫీషియో హోదాలో చైర్మన్ ఎన్నికలో ఓటు వేసే అవకాశం ఉంది. దీంతో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసకందాయంలో పడింది. గజ్వేల్ నగరపంచాయతీలో టీఆర్ఎస్కు కాంగ్రెస్ కౌన్సిలర్లు మద్దతు పలకడంతో ఇక్కడ చైర్మన్ పదవి దక్కించుకోవటం అధికార పార్టీకి నల్లేరుమీద నడకలా మారింది. జోగిపేట నగరపంచాయతీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉన్నందున చైర్మన్ పదవి దక్కే అవకాశాలున్నాయి. కీలకంగా మారనున్న ‘విప్’ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో విప్ కీలకంగా మారనుంది. దీంతో ఇతర పార్టీల్లోకి జంప్ చేయాలన్న కౌన్సిలర్లకు విప్ భయం పట్టుకుంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో లోపాయికారిగా అధికార పార్టీకి సహకరించాలని అనుకుంటున్న కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీ కౌన్సిలర్లకు విప్ అడ్డంకిగామారుతోంది. కాంగ్రెస్ పార్టీ విప్‌ను అస్త్రంగా వినియోగించుకోవాలని చూస్తోంది. అయితే విప్ జారీ చేసే అధికారం ఎమ్మెల్యేలకు కట్టబెట్టాలా, డీసీసీ అధ్యక్షునికి ఇవ్వాలా అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం జిల్లా అధ్యక్షులకు విప్ అధికారం కట్టబెట్టాలని యోచిస్తోంది. ఇదిలా ఉంటే కొన్ని మున్సిపాలిటీల్లో కీలకంగా ఉన్న ఎంఐఎం పార్టీకి విప్ జారీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. -
అగ్నిగుండం.. విద్యుత్ గండం
సాక్షి, ఏలూరు: వేసవి ప్రారంభంలోనే సూర్యుడు అగ్నిగుండంలా మారడంతో జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించేందుకు ఆపసోపాలు పడుతున్నా రు. ఉదయం 11 గంటలకే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో విద్యుత్ వినియోగం రికా ర్డు స్థాయిలో పెరిగింది. దీనివల్ల విద్యుత్ కోతలు తప్పడం లేదు. విద్యుత్ కష్టాలు జిల్లా ప్రజలకు ఏటా అలవాటుగా మారిపోయింది. అటు ప్రభుత్వం, ఇటు పాలకులు పట్టించుకోకపోవడం వల్ల విద్యుత్ కేటాయింపుల్లో అన్యాయమే జరుగుతోంది. జిల్లాలో మంగళవారం 37 డిగ్రీల గరిష్ట, 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం రోజుకు అత్యధికంగా కోటి 30లక్షల యూనిట్లు విద్యుత్ అవసరం అవుతోంది. దానికనుగుణంగా విద్యుత్ కోటా ఇవ్వడం లేదు. డిమాండ్‌కు కోటాకు మధ్య 30 లక్షల యూనిట్ల వ్యత్యాసం ఉంది. ఇంత తక్కువగా విద్యుత్ ఇవ్వడంతో ప్రజావసరాలకు సరిపోవడం లేదు. దీంతో ఏలూరు నగరంతోపాటు పట్టణాల్లోనూ గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. మండలాలు, గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏలూరు నగరంలో రోజుకు 3 నుంచి 4గంటలు, పట్టణాలు, మండల కేంద్రాల్లో 4 నుంచి 6 గంటలు కోత పెడుతుంటే.. గ్రామాల్లో 8గంటలు తక్కువ కాకుండా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. రాత్రి, అర్ధరాత్రి సమయాల్లోనూ కోత విధిస్తుండటంతో ప్రజలు నిద్రకు కరువవుతున్నారు. పరిశ్రమలకు పవర్ హాలిడే పెంపు ! పరిశ్రమలకు ప్రస్తుతం వారంలో ఒక రోజు పవర్ హాలిడే అమలు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ మరింత పెరిగితే పవర్‌హాలిడే రోజుల్ని పెంచి గృహవిద్యుత్ వినియోగానికి సర్దుబాటు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పొగాకు, మొక్కజొన్న పంటలు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. వాటికి నీటి వాడకం తగ్గుతుంది. అరుుతే, కొద్దిరోజుల్లో కోకో, కొబ్బరి తోటలకు నీటి అవసరం పెరుగుతుంది. అప్పటికి వరి పంట చేతికి అందుతుంది. వరికి వాడే విద్యుత్‌ను తోటలకు మళ్లించడం ద్వారా కాస్తై ఆదుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఎండలకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం విద్యుత్ శాఖకు సమస్యగా మారింది. గడచిన నెల రోజుల్లో దాదాపు 500 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోగా, వారం రోజుల వ్యవధిలోనే అధిక శాతం కాలిపోయాయి. ఈ పరిస్థితులకు తగ్గట్టుగానే ముందస్తు చర్యలు చేపడుతున్నట్టు ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజినీర్ టీవీ సూర్యప్రకాష్ ‘సాక్షి’కి చెప్పారు. అవసరానికి అనుగుణంగా కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లు ముందుగానే సిద్ధం చేస్తున్నామన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఎప్పుడూ కనీసం 500 మెగావాట్ల విద్యుత్ కొరత ఉండటం, వినియోగం భారీగా పెరగడం వల్ల అత్యవసర లోడ్ రిలీఫ్ విధిస్తున్నామని వివరించారు. -
పల్లెల్లో ఊపందుకున్న ప్రచారం
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లలో స్థానిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మొదటి విడత ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగిన ఈ డివిజన్లలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడం, ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లను మచ్చిక చేసుకోవడంపై అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు. వెళ్లిన ఇంటికే మళ్లీ మళ్లీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మర్చిపోవద్దని, గుర్తుంచుకోండని వంగి వంగి దండాలు పెడుతూ ఓట్లు అడుతున్నారు. గతంలో మాదిరిగా హంగు.. ఆర్భాటం లేకుండానే ప్రచారం చేస్తున్నారు. అధికారులు ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేస్తుండడంతో ప్రచారానికి ఎక్కువ మందిని తీసుకెళ్లితే వారి ఖర్చు తమ ఖాతాలో పడుతుందని భయపడుతున్నారు. ఒక్కో అభ్యర్థి వెంట పది మంది కంటే ఎక్కువగా ఉండడం లేదు. అభ్యర్థులు ఓటు వేయాలని అడుగుతూ గడప గడపకూ వెళ్తున్నారు. బహిరంగ సభలు ఏర్పాటు చేయాలంటే అనుమతి కోసం పోలీసుస్టేషన్లు, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరగడం, ఏదైనా జరగరానిది జరిగితే అభ్యర్థే పూర్తి బాధ్యత వహించాల్సి రావడంతో సభలు, సమావేశాల నిర్వహణకు జంకుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం సాగుతుండడంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ అదే అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తుండడంతో ఇంట్లో పనులు చేసుకోలేక పెద్దలు, పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పాఠశాలకు వెళ్లి వచ్చి హోంవర్క్ చేసుకుంటున్న విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఎండ వేడి రోజు రోజుకు పెరుగుతుండడంతో ఉదయం 10గంటల్లోపు, మళ్లీ సాయంత్రం 4గంటల తర్వాత అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. వేసవి కావడంతో విద్యార్థులకు ఒంటిపూట బడులు ఉంటున్నాయి. ఉదయం 8గంటలకు బడికి వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధం అవుతుండగా.. ఉదయం ఏదు గంటల నుంచే ప్రచారం మొదలవుతోంది. ‘నేను ఎంపీటీసీగా పోటీ చేస్తున్న మీ ఓటు, మీ ఇంట్లో వాళ్ల ఓట్లు నాకే వేయాలి’, ‘నేను జెడ్పీటీసీగా బరిలో ఉన్న మీ ఓట్లన్నీ నాకే వేసి గెలిపించాలి’ అంటూ అభ్యర్థిస్తున్నారు. దీంతో పిల్లలను బడికి సిద్ధం చేస్తున్న తల్లిదండ్రులు సమయాన్ని వృథా చేస్తున్నారు. సాయంత్రం హోంవర్కు చేసుకునేందుకు సిద్ధమైన విద్యార్థులకు ఇదే ప్రచారం ఇబ్బందిగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ప్రతీ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కడం, లేదంటే గడియను తట్టడం చేస్తున్నారు. ఇలా ఒకరు వెళ్లిన తర్వాత ఒకరు వస్తుండడంతో తలుపుల గడియ తీయలేక తల్లిదండ్రులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. విరామం లేకుండా పోతోంది. -
జెడ్పీ ఎన్నికల్లో గెలుపు మాదే..!
బెజ్జంకి, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ ఎన్నికల్లో వై ఎస్సార్సీపీదే విజయమని, మానకొండూర్ ని యోజకవర్గంలోని నాలుగు స్థానాలతోపాటు జి ల్లాలో మరో ఎనిమిది స్థానాల్లో గెలుస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అ న్నారు. బెజ్జంకి జెడ్పీటీసీ అభ్యర్థిగా పార్టీ తరఫు న పోటీచేస్తున్న కాల్వ కొమురయ్యకు మద్దతు గా శనివారం గుండ్లపల్లిలో ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను వివరిం చారు. ఫీజురీయంబర్స్‌మెంట్, పెన్షన్లు, వృ ద్ధాప్య పింఛన్లతో లక్షలాది మంది లబ్ధిపొందార ని, ఈ నేపథ్యంలో ప్రజలంతా పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి కాల్వ కొమురయ్య, జిల్లా స్టిరింగ్ కమిటీ సభ్యుడు సొల్లు అజయ్‌వర్మ, అనిల్, సంతోష్, రాజు, మహేశ్, మధు, రాజు, రమేశ్, రామకృష్ణ, కిట్టు, అంజి, శ్రీను, తిరుపతి, ప్రవీణ్‌కుమార్, ఓదెలు, పర్శరాములు పాల్గొన్నారు. -
ఓటేస్తే అభివృద్ధి చేస్తా
పలాస రూరల్, న్యూస్‌లైన్: పలాస మండలంలో వైఎస్సార్ సీపీ తరఫున బరిలో దిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు గురువారం ముమ్మర ప్రచారం చేశారు. ఫ్యాన్‌గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జెడ్పీటీసీ అభ్యర్థి పేరాడ భార్గవి, పెదంచల, లక్ష్మీపురం, టెక్కలిపట్నం, చినంచల ప్రాదేశికాల నుంచి పోటీ చేస్తున్న దువ్వాడ దేశమ్మ, బమ్మిడి చంద్రకళ, సవర తులసీ, బమ్మిడి వరహాలు ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయూలని ఓటర్లను అభ్యర్థించారు. తమకు ఓటు వేస్తే అభివృద్ధి చేస్తామని భార్గవి చెప్పారు. ప్రచారంలో నందిగాం మండలం మాజీ ఉపాధ్యక్షుడు పేరాడ తిలక్, లొద్దభద్ర ఎంపీటీసీ అభ్యర్థి కొయ్య శ్రీనువాసరెడ్డి, పెదంచల సర్పంచ్ రౌతు జగదీశ్వరి, టెక్కలిపట్నం, పెదంచల, చినంచల మాజీ సర్పంచ్‌లు కె. కృష్ణమూర్తి, టి.శ్రీరాములు, పి.జోగారావు, టెక్కలిపట్నం ఎంపీటీసీ మాజీ సభ్యుడు జె.రామారావు, రౌతు శంకరరావు, బి.గోపి, ఆర్.షణ్ముఖరావు, షిష్టి మురళీ, ఎస్.చంద్రమౌళి, బి.హనుమంతరావు, బి.ధర్మారావు, బి.తేజేశ్వరరావు, కె.కృష్ణారావు, బి.వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
అప్పలనాయుడు కిడ్నాప్
విశాఖపట్టణం/ఉరవకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. దీంతో టీడీపీ నాయకులు బెదిరింపులు దిగుతున్నారు. లొంగకపోతే అపహరణలకు పాల్పడుతున్నారు. గెలుపుబాటలో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై బెదిరింపులకు దిగుతున్నారు. విశాఖపట్టణం జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్ధి అప్పలనాయుడును టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు అప్పలనాయుడు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులే తన భర్తను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అనంతపురం ఉరవకొండ మండలం రాయంపల్లిలో వైఎస్ఆర్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై టీడీపీ బెదిరింపులకు పాల్పడ్డారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారు. దీనిపై వైఎస్ఆర్ సీపీ నేతలు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
చెప్పినట్టు వింటే సరే లేకుంటే....
‘ఈ ఎన్నికల్లో మిమ్మల్ని అభ్యర్థినిగా నిలబెట్టి గెలిపిస్తాం. గెలిచిన తర్వాత మాకే మద్దతివ్వాలి. లేకుంటే రూ.పది లక్షల చెల్లించాలి.’ ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓ మహిళా అభ్యర్థితో పత్రం రాయించుకోవడం కోనరావుపేట మండలంలో చర్చనీయూంశమైంది. మండలంలోని ఓ గ్రామంలో ఎంపీటీసీ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ రాలేదు. మండల ముఖ్య నాయకులు గ్రామంలోని ఓ మహిళను గుర్తించి ఆమెతో సంప్రదింపులు జరిపారు. టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి గెలిపిస్తామని హామీఇచ్చారు. తీరా గెలిచాక తమకు మద్దతు ఇవ్వకపోతే ఎలా? అన్న అనుమానం వారికి వ చ్చింది. దీంతో సదరు మహిళా అభ్యర్థితో బాండ్ పేపర్‌మీద రూ.పది లక్షల అప్పు ఉన్నట్లు రాయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో గెలవకపోతే ఏమీ లేదు. ఒకవేళ గెలిస్తే తమకు మద్దతు తెలపాలి. మద్దతు ఇవ్వకపోతే రూ.పది లక్షలు చెల్లించాలి. ఇదీ బాండ్ పేపర్లోని సారాంశం. ఈ విషయం అనూహ్యంగా బయటకు పొక్కి మండలంలో చర్చనీయాంశమైంది. సదరు అభ్యర్థిని టీఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడి విషయాన్ని బయటకు తెలియనివ్వకుడా చూస్తున్నారు. అయినా కూడా ఆ నోటా ఈ నోటా విషయం బయటకు పొక్కింది. దీంతో టీఆర్ఎస్ నాయకులు జుట్టు పీక్కుంటున్నట్లు చర్చ జరుగుతోంది. -
కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరుకు తాత్కాలిక బ్రేక్
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల బీ-ఫారాలు ఎట్టకేలకు సిట్టింగు ఎమ్మెల్యేలకే అప్పగించారు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నుంచి శుక్రవారం బీ-పారాలు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అందాయి. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగులకే మరోసారి ప్రాధాన్యం ఇస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రకటించటం... ఆ వెంటనే బీ ఫారాలు ఎమ్మెల్యేలకు అందజేయడం గమనార్హం. జిల్లాలో దాదాపు అన్ని నియోజక వర్గాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆదిపత్య పోరు ఉంది. వైరి వర్గాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలల్లో టికెట్‌ను ఆశిస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కీలక భూమిక పోషిస్తారు.ఈ నేపథ్యంలో తన అనుచరులకు, అనుయాయులకే స్థానిక సంస్థల బీ-ఫారం ఇప్పించుకోవడానికి ఎమ్మెల్యే ఆశావాహా నేతలు పోటీ పడ్డారు. ఎవరి స్థాయిలో వాళ్లు పైరవీలు చేసుకున్నారు. వర్గ విభేదాలు తీవ్రంగా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధినాయకత్వం రంగంలోకి దిగి రెండు వైరి వర్గాల వారిని రాజీ చర్చలకు పిలిచి చెరికొన్ని బీ-ఫారాలు పంచుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో ఎమ్మెల్యేలకు కొంత ఊరటనిచ్చింది. ఖర్చు బాధ్యత ఎమ్మెల్యేలకే? స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులకు అయ్యే ఖర్చును ఎమ్మెల్యేలే భరించాలని కాంగ్రెస్ అధి నాయకత్వ సూచించినట్టు తెలిసింది. ఎక్కువ సీట్లు గెలిపించుకున్న వారికే తిరిగి ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని, లేకుంటే ఆశలు వదులు కోవాలని కరాఖండీగా చెప్పి బీ- ఫారాలు చేతికి ఇచ్చినట్టు సమాచారం. ఎన్నికల్లో ఎంపీటీసీకి కనీసం రూ 4 లక్షలు, జెడ్పీటీసీకి రూ 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన ప్రతి ఎమ్మెల్యేకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రూ. 3 కోట్లు నుంచి 4 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.