జెడ్పీ ఎన్నికల్లో గెలుపు మాదే..! | zp elections | Sakshi
Sakshi News home page

జెడ్పీ ఎన్నికల్లో గెలుపు మాదే..!

Published Sun, Mar 30 2014 2:11 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

zp elections

బెజ్జంకి, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ ఎన్నికల్లో వై ఎస్సార్‌సీపీదే విజయమని, మానకొండూర్ ని యోజకవర్గంలోని నాలుగు స్థానాలతోపాటు జి ల్లాలో మరో ఎనిమిది స్థానాల్లో గెలుస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అ న్నారు. బెజ్జంకి జెడ్పీటీసీ అభ్యర్థిగా పార్టీ తరఫు న పోటీచేస్తున్న కాల్వ కొమురయ్యకు మద్దతు గా శనివారం గుండ్లపల్లిలో ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు.

 

దివంగత ముఖ్యమంత్రి వై ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను వివరిం చారు. ఫీజురీయంబర్స్‌మెంట్, పెన్షన్లు, వృ ద్ధాప్య పింఛన్లతో లక్షలాది మంది లబ్ధిపొందార ని, ఈ నేపథ్యంలో ప్రజలంతా పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు.  కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి కాల్వ కొమురయ్య, జిల్లా స్టిరింగ్ కమిటీ సభ్యుడు సొల్లు అజయ్‌వర్మ, అనిల్, సంతోష్, రాజు, మహేశ్, మధు, రాజు, రమేశ్, రామకృష్ణ, కిట్టు, అంజి, శ్రీను, తిరుపతి, ప్రవీణ్‌కుమార్, ఓదెలు, పర్శరాములు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement