Old-age pensions
-
6.62 లక్షల మందికి...కొత్త 'ఆసరా'
సాక్షి, హైదరాబాద్: మరింత మంది వృద్ధులకు ‘ఆసరా’దక్కనుంది. 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా 6.62 లక్షల మందికి ప్రయోజనం లభించనుంది. అసహాయులైన పేదలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం.. ప్రస్తుతం 65 ఏళ్లుపైబడిన వృద్ధులకు ఆసరా పింఛన్లను అందజేస్తోంది. ఈ ఆర్థిక ఏడాది నుంచి ఈ వయోపరిమితిని 57 ఏళ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం పంపిణీ చేస్తున్న 12.46 లక్షల వృద్ధాప్య పింఛన్లకు అదనంగా మరో 6.62 లక్షలు పెరుగుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. గతేడాది నుంచే దీన్ని వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అప్పట్లో క్షేత్రస్థాయిలో సర్వే జరిపి అర్హుల జాబితాను సేకరించింది.దీనికి అనుగుణంగా ఈ మేరకు వృద్ధాప్య పింఛన్లు పెరుగుతాయని లెక్కతీసింది. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా గ్రామాలవారీగా ఓటర్ల జాబితాను సేకరించి.. అందులో 57 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాలను నమోదు చేస్తోంది. కేవలం దీన్నే ప్రామాణికంగా తీసుకోకుండా.. క్షేత్రస్థాయిలో శిబిరాలు జరిపి వయస్సును నిర్ధారించాలని నిర్ణయించింది.ఆధార్, ఓటర్ ఐడీ తదితర ధ్రువీకరణల ఆధారంగా జాబితాను స్క్రీనింగ్ చేయనుంది. అదనంగా నెలకు రూ.133.45 కోట్ల భారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద పంపిణీ చేస్తున్న ఆసరా పింఛన్లకు ప్రభుత్వం 2019–20లో రూ.9,402 కోట్లు కేటాయించగా, 2020–21 వార్షిక సంవత్సరానికి రూ.11,758 కోట్లకు పెంచింది. పెంచిన రూ.2,356 కోట్లు ఈసారి అదనంగా పెరిగే వృద్ధాప్య పింఛన్లకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. కొత్తగా పెరిగే 6.62 లక్షల పింఛన్లతో నెలకు రూ.133.45 కోట్ల మేర భారం పడనుందని అంచనా. ఏప్రిల్ నుంచి ఈ పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, దీనిపై కరోనా ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రతి గడపా సమస్యల నిలయమే
వైఎస్సార్ కాంగ్రెస్ సీపీ నేతలకు వినతుల వెల్లువ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న గడపగడపకూ.. కార్యక్రమం విశాఖపట్నం : ‘రేషన్ కార్డులు తీసుస్తున్నారు.. వృద్ధాప్య పింఛన్లు లేవంటున్నారు.. ఉద్యోగాలిస్తామని ఓట్లేయించుకుని, నడి రోడ్డులో వదిలేశారు.. రుణ మాఫీ అంటూ మాయ మాటలు చెప్పారు.. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికల్లో చెప్పిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు.. నిలువునా మోసపోయామయ్యా’.. అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల వద్ద ప్రజలు తమ బాధలను చెప్పుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నాలుగో రోజు సోమవారం కొనసాగింది. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం ముసిడిపల్లిలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం నిర్వహించారు. రాష్ర్ట ప్రభుత్వం రుణమాఫీ పేరుతో జనాన్ని మోసం చేసిందని, పంటల బీమా ఇవ్వకుండా రైతుల్ని దెబ్బతీసిందని విమర్శించారు. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ పనసలపాడు గ్రామంలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గడపడగపకు వెళ్లి గిరిజనులతో మమేకమయ్యారు. పింఛన్లు అందడం లేదని గిరిజనులు ఎమ్మెల్యేకు విన్నవించారు. అటవీ ఉత్పత్తులకు రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఎమ్మెల్యే విమర్శించారు. నిధుల్లో కోత విధించి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం అనకాపల్లి పట్టణం, నర్సింగరావుపేటలో జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో జరిగింది. దాదాపు వంద కుటుంబాలను అమర్ పలకరించారు. ప్రతి గడపలో సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదోనని ఆరాతీశారు. వృద్ధునికి వైఎస్సార్సీపీ నేతల పింఛన్ పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలం దేవవరంలో వైఎస్సార్సీపీ నేతలు గొల్లబాబూరావు, చిక్కాల రామారావు, డి.వి.సూర్యనారాయణరాజు, వీసం రామకృష్ణ పాల్గొన్నారు. పింఛన్ మంజూరు కాలేదని, నడవలేని స్థితిలో ఉన్న 80 ఏళ్ల వృద్ధుడు దమ్ము శ్రీరాములు నక్కపల్లి మండలం దేవవరం గ్రామంలో గ్రామంలో పర్యటించిన వైఎస్సార్సీపీ నాయకుల ముందు వాపోయాడు. వెంటనే స్పందించిన గొల్ల బాబూరావు తన వంతు సాయంలో భాగంగా కొంత నగదును వృద్ధుడికి అందించారు. రాజయ్యపేటకు చెందిన దుంగా రాజు, మైలపల్లి సూరిబాబులు ప్రతి నెలా రెండొందల రూపాయలు పింఛన్ రూపంలో ఆ వృద్ధుడికి ఇస్తామని ప్రకటించారు. యలమంచిలిలో సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు నేతృత్వంలో కొక్కిరాపల్లిలో జరిగింది. చోడవరం నియోజకవర్గం రోలుగుంటలో సమన్వకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించారు. నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం నాగాపురంలో సమన్వయకర్త ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి జనం సమస్యలు తెలుసుకున్నారు. అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం దముకు, కొండిబల్లో త్రిసభ్య కమిటీ సభ్యురాలు అరుణకుమారి నేతృత్వంలో జరిగింది. -
సెప్టెంబర్ నుంచి పెరగనున్న పింఛన్లు
- జిల్లా ఉన్నతాధికారులకు అందిన ఆదేశాలు - జిల్లాలో 3.49 లక్షల మందికి లబ్ధి - ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లు రూ.8.93 కోట్లు - పెరిగిన పింఛన్లు రూ.27.69 కోట్లు సాక్షి,గుంటూరు: జిల్లా వ్యాప్తంగా ఉన్న పింఛన్‌దారులకు సెప్టెంబర్ నుంచి పెరిగిన పింఛన్లు అందనున్నాయి. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. వీటిని అక్టోబర్ 2న చెల్లిస్తారు. జిల్లాలో 80,570 మందికి రూ.200 చొప్పున మొత్తం రూ.1,61,14,000 అందిస్తున్న వృద్ధాప్యపింఛన్లు వెయ్యి రూపాయలకు పెంచడంతో రూ.8,05,70,000కు చేరుకున్నాయి. ఇందిరమ్మ పథకం ద్వారా 88,967 మందికి 200 వంతున 1,77,93,400 పింఛను వస్తుంది. దీన్ని వెయ్యిరూపాయలకు పెంచడంతో రూ.8,89,67,000 ఇవ్వాల్సి ఉంది. 6,573 మంది చేనేత కార్మికులకు నెలకు రూ.200 చొప్పున ప్రస్తుతం రూ.13,14,600 చెల్లిస్తుండగా వెయ్యి రూపాయలు పెంచడంతో రూ.65,73,000 చెల్లించాల్సి ఉంటుంది. వితంతు పింఛన్లు 1,07,681 మందికి రూ.200 చొప్పున రూ.2,15,36,200లు చెల్లిస్తుండగా తాజాగా రూ. వెయ్యికి పెంచడంతో రూ.10,76,81,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇందిరమ్మ పథకం ద్వారా 41,413 మంది వికలాంగులకు ప్రస్తుతం నెలకు రూ.500 చొప్పున రూ.2,07,06,500 చెల్లిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వీటిని రెండుగా విభజించి 40 శాతం నుంచి 79 శాతం వరకూ అంగవైకల్యం ఉన్నవారికి వెయ్యి రూపాయలు, 80 శాతం పైగా అంగవైకల్యం ఉన్న వారికి రూ.1500 ఇచ్చే విధంగా నిర్ణయించారు. దీంతో పెంచిన పింఛన్ల ప్రకారం వికలాంగులకు రూ.5,13,07,000 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో 23,459 మందికి అభయహస్తం ద్వారా నెలకు రూ.500 చొప్పున ప్రస్తుతం రూ.1,17,29,500 చెల్లిస్తున్నారు. పెంచిన ఫించన్ల ప్రకారం రూ.3,04,96,700 చెల్లించాల్సి ఉంటుంది. 660 మంది కల్లుగీత కార్మికులకు నెలకు రూ.200 చొప్పున రూ.1,32,000 చెల్లిస్తున్నారు. పెంచిన పింఛన్ల ప్రకారం రూ.6,60,000 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,49,323 మందికి ఇప్పటి వరకూ నెలకు రూ.8,93,26,200 చెల్లిస్తుండగా పెంచిన పింఛన్ల ప్రకారం అక్టోబర్ నుంచి రూ.36,62,54,700 చెల్లించాల్సి ఉంటుంది. అంటే పెంచిన పింఛన్ల వల్ల జిల్లా వ్యాప్తంగా రూ.27,69,28,500 భారం పడనున్నట్టు అధికారిక లెక్కల ప్రకారం తెలుస్తోంది. -
పింఛన్ల కోసం పడిగాపులు
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఇచ్చే పింఛను సొమ్ము కోసం లబ్ధిదారులు పడిగాపులు పడుతున్నారు. ఏప్రిల్ ఏడో తేదీ గడిచినా ఇంతవరకు జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఈ నెల పింఛన్లు ఇచ్చిన దాఖలాలు లేవు. లబ్ధిదారులు ప్రతిరోజూ పింఛన్ల సొమ్ము పంపిణీ చేసే సీఎస్పీల వద్దకు వచ్చి తిరిగి వెళుతున్నారు. ఇంకా తమ వద్దకు నగదు చేరలేదని, ఎప్పుడొస్తుందో తెలియదని వారు సమాధానం చెబుతుండటంతో ఈ నెల పింఛను ఇస్తారా, లేదా అన్న అనుమానాలు లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వృద్ధాప్య పింఛన్లు 1,35,692 మంది, వితంతు పింఛన్లు 1,20,229 మంది, వికలాంగ పింఛన్లు 45,257, గీతకార్మికుల పింఛన్లు 1,894 మంది, అభయహస్తం 20,242 మంది, చేనేత పింఛన్లు 4,914 మంది పొందుతున్నారు. జిల్లా మొత్తంగా వివిధ రకాల పింఛన్లను 3,28,228 మందికి ప్రతినెలా ఐదో తేదీ లోపు ఇస్తున్నారు. ఈసారి ఏప్రిల్ ఏడో తేదీ గడిచిపోతున్నా సీఎస్పీలకు నగదు అందకపోవటంతో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్తచేతనావస్థలో ఉండటంతో పాటు ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవటంతోనే పింఛన్ల మంజూరు నిలిచిపోయిందనే వాదన అధికారుల నుంచి వినబడుతోంది. పింఛను పొందే వికలాంగులు అష్టకష్టాలు పడి వచ్చినా సొమ్ము రాలేదని తెలియడంతో ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి పింఛన్లు త్వరగా ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. -
జెడ్పీ ఎన్నికల్లో గెలుపు మాదే..!
బెజ్జంకి, న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ ఎన్నికల్లో వై ఎస్సార్సీపీదే విజయమని, మానకొండూర్ ని యోజకవర్గంలోని నాలుగు స్థానాలతోపాటు జి ల్లాలో మరో ఎనిమిది స్థానాల్లో గెలుస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి అ న్నారు. బెజ్జంకి జెడ్పీటీసీ అభ్యర్థిగా పార్టీ తరఫు న పోటీచేస్తున్న కాల్వ కొమురయ్యకు మద్దతు గా శనివారం గుండ్లపల్లిలో ప్రచార రథాలను ప్రారంభించారు. అనంతరం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను వివరిం చారు. ఫీజురీయంబర్స్‌మెంట్, పెన్షన్లు, వృ ద్ధాప్య పింఛన్లతో లక్షలాది మంది లబ్ధిపొందార ని, ఈ నేపథ్యంలో ప్రజలంతా పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అభ్యర్థి కాల్వ కొమురయ్య, జిల్లా స్టిరింగ్ కమిటీ సభ్యుడు సొల్లు అజయ్‌వర్మ, అనిల్, సంతోష్, రాజు, మహేశ్, మధు, రాజు, రమేశ్, రామకృష్ణ, కిట్టు, అంజి, శ్రీను, తిరుపతి, ప్రవీణ్‌కుమార్, ఓదెలు, పర్శరాములు పాల్గొన్నారు. -
అవ్వతాతలకు బువ్వేది ?
* బాబు జమానాలో ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్.. * రోశయ్య, కిరణ్ హయాంలోనూ అంతే * వైఎస్ తరువాత పెరగని పింఛన్లు పెద్ద కొడుకు కోసం ‘కోటి’ కళ్లేసుకొని... కోటి మంది... వీళ్లంతా పింఛన్ల కోసం ఎదురుచూసే అభాగ్యులు. పిడికెడు మెతుకుల కోసం పరితపిస్తున్నవారు. ఇందులో పండుటాకులే సగానికి పైగా ఉన్నారు. జీవిత చరమాంకంలో బతుకు పోరు సాగిస్తున్న ఇలాంటివారిని ఆదుకోవాలని చంద్రబాబుకు ఏనాడూ అన్పించలేదు. కేవలం 75 రూపాయలు విదిల్చి అదే భారమని భావించారు. అది కూడా మూణ్ణెల్లకోసారే! ఎవరైనా లబ్ధిదారుడు చస్తేనే కొత్త పింఛన్‌దారుడిని ఎంపిక చేస్తామన్నారు. అలాంటివారి కోసం నేనున్నానంటూ ముందుకొచ్చి భరోసా ఇచ్చారు వైఎస్ రాజశేఖరరెడ్డి. తల్లడిల్లే ముసలి తల్లిదండ్రులకు పెద్ద కొడుకయ్యాడు. అధికారంలోకి రాగానే పింఛన్‌ను రూ.200లకు పెంచడమేగాక నెలనెలా ఠంచనుగా అందించి వారి జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపారు. వైఎస్ హఠాన్మరణంతో ప్రభుత్వానికి అవ్వాతాతలు భారమయ్యారు. ఉన్న సంఖ్యలో కోతపెట్టి ‘ఖర్చు’ తగ్గించుకుంటున్నారు. ‘పెద్దకొడుకు’ రూపంలో వచ్చి తమ బతుకులు మార్చేవారి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ముదిమి వయసులోనూ తమ ఓటును ఆయుధంగా మలిచేందుకు సిద్ధమవుతున్నారు. పెన్షన్.. బలహీనులకు ఆర్థిక భరోసానిచ్చే ఆయుధం. వృద్ధాప్యం వల్లనో, వైకల్యం వల్లనో సొంతంగా సంపాదించుకోలేని, వారికి ప్రభుత్వం కచ్చితంగా అందించాల్సిన చేయూత. కానీ వైఎస్ హయాం వరకు ప్రభుత్వాలు పింఛను అంశాన్ని ఆర్థికాంశంగా, ఖజానాపై భారంగా, అనవసర వ్యయంగానే చూశాయి. పెన్షన్ల పథకం 1995-96లో ప్రారంభమైంది. అంతకుముందు వితంతు పెన్షన్లు ఉన్నా అతి తక్కువ మందికి లబ్ధి చేకూరేది. 1995-96లో వృద్ధాప్య, 2000లో వికలాంగ, 2001లో చేనేత పెన్షన్ల ప్రక్రియ ప్రారంభ మైంది. 1995లో వితంతు, వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వారి సంఖ్య 9.68 లక్షలు ఉంటే.. అందులో వృద్ధులకు రూ. 75, వితంతువులకు రూ. 50 మాత్రమే చెల్లించేవారు. - కె. శ్రీకాంత్ రావు పొన్ను కర్ర పోటేసుకుంటూ వచ్చిందా అవ్వ. వైఎస్ ఆ ఊరొచ్చాడని ఎవరో చెప్పారట. జన ప్రవాహంలోనే రాజన్న దగ్గరకొచ్చింది. ‘ఏంటమ్మా?’ అని ప్రశ్నిస్తే ఆ అవ్వ కన్నీటి పర్యంతమైంది. ‘అయ్యా! ఆరేళ్లుగా పెన్షన్ కోసం తిరుగుతున్నాను. కన్పించిన ప్రతి నాయకుడిని వేడుకున్నా. ఎన్నికలప్పుడైతే ఇస్తామంటున్నారు. ఆ తర్వాత ఎవరైనా చస్తేనే పెన్షన్ వస్తుందని చెప్పారు. మా ఊరు వచ్చినచంద్రబాబును కలవాలనుకున్నా. కానీ ఆయన చుట్టూ ఉన్నోళ్లు ఎవరూ పోనివ్వలేదు. అయ్యా! ఆ పెన్షన్ ఇస్తే కాస్త ఆసరాగా ఉంటుంది కదా..’ ఆ అవ్వ కొంగుతో కళ్లు అద్దుకుంటూ వైఎస్ చేతులను తడిమింది. ‘వచ్చేది మన ప్రభుత్వమే, నీకు పెన్షన్ వస్తుంది’ అని రాజన్న మాట ఇచ్చారు. ఆ తర్వాత ఆ అవ్వకు పెన్షన్ వచ్చింది. ఆ ఊరి అధికారే ఆమె దగ్గరకొచ్చి ఆ విషయం చెప్పారు. ఆ సమయంలో అవ్వ ఆనందంతో కన్నీళ్లు పెట్టింది. ఇదో యదార్థ గాథ. వైఎస్ పాదయాత్ర సందర్భంగా సంచలనం కలిగించిన వార్త. ‘బాబు’ కాలంలో ఓటు కోసమే పోలింగ్ బూతుకొచ్చిన ఆ అవ్వ... ఆ తర్వాత వైఎస్ కోసమే ఓటెయ్యాలని వస్తున్నా... అని చెప్పింది. మన రాష్ట్రంలో వయోవృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓటు శాతం తక్కువేమీ కాదు. దాదాపు కోటి మంది ప్రతిసారి ఓటేయడానికి వస్తున్నారు.. ఆ క్షణంలో వాళ్లు కోరుకునేది ఒకే ఒక్కటి. గెలిచిన ప్రభుత్వం తమకు ఎంతోకొంత మేలు చేయాలని వేడుకుంటారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సామాజిక పెన్షన్ల తీరు తెన్నులే మార్చిన తర్వాత వయోవృద్ధుల ఓటింగ్ శాతం పెరిగింది. వికలాంగుల్లోనే తమ ఓటుతో మనోగతాన్ని చాటుకోవాలనే ఆలోచన రెట్టింపయింది. ఈ పరిస్థితిని గుర్తించిన పార్టీలు సామాజిక పెన్షనర్ల ఓటింగ్‌ను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పెన్షన్ల కోసం ఏళ్ల తరబడి తిప్పించుకున్న పార్టీలు సైతం, వాగ్దానాల మొసలి కన్నీరు కారుస్తున్నాయి. సామాజిక పెన్షన్ల వ్యవస్థే భారమన్న చంద్రబాబు సైతం తన మేనిఫెస్టోలో దీన్నో ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. అయితే వృద్ధులు, వికలాంగులు, వితంతువులు నిర్దిష్టమైన హామీల వైపే దృష్టి పెట్టారు. కచ్చితమైన భరోసానే కోరుకుంటున్నారు. ఇప్పుడున్న పార్టీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక పెన్షన్లపై స్పష్టమైన విధానాన్ని వెల్లడించడం వారిలో ఆశలు రేపుతోంది. అధికారంలోకి వస్తే ఏకంగా కోటి మందికి పెన్షన్లు ఇస్తామని ప్రకటించడం వారికి ఊరట కల్గిస్తోంది. ఏలికలు పేలికలైన చేనేతలూ పెన్షన్ల భద్రత కోసం రాజన్న తరహా వ్యూహం కావాలని, అలాంటి ఆశయాలతో ముందుకెళ్లే పార్టీలకే పట్టంకట్టాలనే ఆలోచనలో ఉన్నారు. పిసరంత సాయం కోసం పోటెత్తే పెన్షనర్ల ఓట్లు అన్ని స్థానాలను ప్రభావితం చేస్తాయనేది సుస్పష్టం. చంద్రబాబు - చంద్రబాబు 2004లో పదవి నుంచి దిగిపోయేనాటికి.. రాష్ట్రంలో మొత్తం వృద్ధాప్య, వితంతు, చేనేత, వికలాంగ పెన్షన్ల సంఖ్య 18.97 లక్షలు. - పెన్షన్ల కోసం ఏడాదికి చేసిన వ్యయం రూ.163.90 కోట్లు. - అర్హులైన అందరికీ కాకుండా, ‘ఒకరు మరణిస్తేనే.. మరొకరికి’ పింఛన్ ఇచ్చేవారు. అదీ మూడు నెలలకోసారి గ్రామ సభల్లో అందించేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి - 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే.. 50 రూపాయలు, 75 రూపాయలున్న పెన్షన్లను వంద రూపాయలకు పెంచారు. - 2005-06 ఆర్థిక సంవత్సరంలోనే పెన్షన్ మొత్తాన్ని రూ.వంద నుంచి రూ. 200కు పెంచారు. - 2006 సంవత్సరం నుంచి అర్హులైన అందరికీ పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో.. సంతృప్తస్థాయి విధానాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుల సంఖ్య ఒక్కసారిగా 21 లక్షల నుంచి 71 లక్షలకు చేరింది. - దరఖాస్తు చేసుకున్న, తెల్లరేషన్‌కార్డు ఉన్న, అర్హులైన వారందరికీ.. ఎలాంటి మధ్యవర్తులు, సిఫారసులు లేకుండానే పెన్షన్లు మంజూరు చేశారు. - ప్రతినెలా పెన్షన్లు ఇచ్చేవారు. రెండో సంతకం చేస్తా.. పింఛన్ రూ.700 చేస్తా పనులకు పోతున్న అవ్వతాతల కోసం రెండో సంతకం చేస్తాను. ఇవాళ ఈ అవ్వతాతలకు ఇస్తున్న రూ. 200 ఫించన్‌ను మనవడిలా రూ. 700లకు పెంచుతూ రెండో సంతకం చేస్తాను. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నేను చేసే ఐదు సంతకాలు రాష్ట్ర దశాదిశను మార్చేవిగా ఉంటాయి. పైనున్న రాజశేఖరరెడ్డి గర్వపడే విధంగా ఉంటాయి.. - వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇదీ ప్రస్తుతం ఉన్న లెక్క (2014 మార్చి వరకు) కేటగిరి లక్ష్యం మంజూరు పంపిణీ వృద్ధాప్య 42,89,616 37,50,325 33,10,111 వైకల్యం 8,84,246 9,12,807 8,20,024 వితంతు 17,77,658 22,83,351 19,52,955 చేనేత 1,44,514 1,33,067 1,17,942 గీతపని 1,00.000 37,841 33.927 రోశయ్య, కిరణ్ - వైఎస్ మరణం తరువాత అధికారం చేపట్టిన రోశయ్య, ఆ తరువాత అనూహ్యంగా సీఎం అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి పెన్షన్లను ఖజానాపై భారంగా భావించారు. - పెన్షనర్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఒకరు మరణిస్తేనే మరొకరికి పెన్షన్ అనే పాత పద్ధతికి మళ్లీ తెరతీశారు. బినామీలని, వలసలు వెళ్లారని, స్మార్ట్కార్డులంటూ చేతిముద్రలతో సరిపోలితేనే పెన్షన్ ఇవ్వాలని.. ఇలా రకరకాల పద్ధతుల్లో పెన్షన్ల సంఖ్యకు కత్తెరేశారు. - ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉన్నా.. ఇద్దరు వితంతువులు ఉన్నా.. ఒక్కరికి మాత్రమే పెన్షన్ మంజూరు చేసే పద్ధతిని రోశయ్య ప్రభుత్వం ప్రారంభించింది. - ఒకవైపు ధరలు ఆకాశానికి చేరుతున్నా.. పెన్షన్ మొత్తాన్ని మాత్రం పెంచలేదు. దీనిని కనీసం రూ.400 చేయాలని కేంద్రం పలుమార్లు రాష్ట్రానికి సూచించినా ఏనాడు పట్టించుకోలేదు. - 80 సంవత్సరాల వయస్సు దాటిన వారికి కేంద్రం రూ.500 చెల్లిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం వాటినీ తన ఖాతాలోనే వేసుకుంది. పెన్షన్‌దారుల అర్హత వయసును కేంద్రం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. - వైఎస్ హయాంలో 71 లక్షలుగా ఉన్న పెన్షన్ల సంఖ్య ఇప్పుడూ అలాగే ఉంది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు వైఎస్ తరువాత వచ్చిన ప్రభుత్వాల పనితీరు ఎలా ఉందో.. ఓదార్పు ఇచ్చేదెవరు? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. మనదేశంలో 60 ఏళ్లు పైబడిన వారు 27 కోట్ల మంది ఉన్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2001లో దేశ జనాభాలో 7.6 శాతమే ఉన్న వృద్ధులు... తాజా సర్వేలో 20 శాతానికి చేరినట్టు తేలింది. గడచిన దశాబ్దకాలంగా వీరు హక్కుల కోసం సమైక్య పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో వృద్ధుల సంక్షేమం దిశగా తొలి అడుగు వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమే. తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంరక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ముఖ్యమంత్రిగా ఆయన ఆకాంక్షించారు. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వృద్ధులను చేర్చే అంశంపై అధికారులతో సమీక్షించి విధివిధానాల రూపకల్పనకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాతి ప్రభుత్వాలు ఆ ఫైళ్లను ముట్టుకోలేదు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో రాష్ట్రంలోని 100 జిల్లాల్లో అమలు చేస్తున్న ఎన్‌పీహెచ్‌సీఈ పథకాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. సర్కారీ నిర్లక్ష్యంపై వయో వృద్ధుల సంఘాలు అనేకసార్లు ప్రభుత్వానికి నివేదించినా ఫలితంలేదు.