చెప్పినట్టు వింటే సరే లేకుంటే.... | TRS Leaders smoothly warning to MPTC Candidates in karimnagar district | Sakshi
Sakshi News home page

చెప్పినట్టు వింటే సరే లేకుంటే....

Published Sat, Mar 22 2014 9:22 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM

చెప్పినట్టు వింటే సరే లేకుంటే....

చెప్పినట్టు వింటే సరే లేకుంటే....

‘ఈ ఎన్నికల్లో మిమ్మల్ని అభ్యర్థినిగా నిలబెట్టి గెలిపిస్తాం. గెలిచిన తర్వాత మాకే మద్దతివ్వాలి. లేకుంటే రూ.పది లక్షల చెల్లించాలి.’ ఇలా టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఓ మహిళా అభ్యర్థితో పత్రం రాయించుకోవడం కోనరావుపేట మండలంలో చర్చనీయూంశమైంది. మండలంలోని ఓ గ్రామంలో ఎంపీటీసీ స్థానాన్ని మహిళలకు కేటాయించడంతో టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ రాలేదు. మండల ముఖ్య నాయకులు గ్రామంలోని ఓ మహిళను గుర్తించి ఆమెతో సంప్రదింపులు జరిపారు.

 

 టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చి గెలిపిస్తామని హామీఇచ్చారు. తీరా గెలిచాక తమకు మద్దతు ఇవ్వకపోతే ఎలా? అన్న అనుమానం వారికి వ చ్చింది. దీంతో సదరు మహిళా అభ్యర్థితో బాండ్ పేపర్‌మీద రూ.పది లక్షల అప్పు ఉన్నట్లు రాయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల్లో గెలవకపోతే ఏమీ లేదు. ఒకవేళ గెలిస్తే తమకు మద్దతు తెలపాలి. మద్దతు ఇవ్వకపోతే  రూ.పది లక్షలు చెల్లించాలి.

 

 ఇదీ బాండ్ పేపర్‌లోని సారాంశం. ఈ విషయం అనూహ్యంగా బయటకు పొక్కి మండలంలో చర్చనీయాంశమైంది. సదరు అభ్యర్థిని టీఆర్‌ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడి విషయాన్ని బయటకు తెలియనివ్వకుడా చూస్తున్నారు. అయినా కూడా ఆ నోటా ఈ నోటా విషయం బయటకు పొక్కింది. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు జుట్టు పీక్కుంటున్నట్లు చర్చ జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement