విశాఖపట్టణం/ఉరవకొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. దీంతో టీడీపీ నాయకులు బెదిరింపులు దిగుతున్నారు. లొంగకపోతే అపహరణలకు పాల్పడుతున్నారు. గెలుపుబాటలో దూసుకుపోతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై బెదిరింపులకు దిగుతున్నారు.
విశాఖపట్టణం జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్ధి అప్పలనాయుడును టీడీపీ నాయకులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు అప్పలనాయుడు భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకులే తన భర్తను కిడ్నాప్ చేశారని ఆరోపించారు.
అనంతపురం ఉరవకొండ మండలం రాయంపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై టీడీపీ బెదిరింపులకు పాల్పడ్డారు. నామినేషన్ ఉపసంహరించుకోవాలని బెదిరించారు. దీనిపై వైఎస్‌ఆర్ సీపీ నేతలు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అప్పలనాయుడు కిడ్నాప్
Published Mon, Mar 24 2014 1:31 PM | Last Updated on Sat, Sep 2 2017 5:07 AM
Advertisement
Advertisement