రామకృష్ణ భార్య భార్గవి
సాక్షి, భువనగిరి జిల్లా: అదృశ్యమైన సస్పెండెడ్ హోంగార్డు రామకృష్ణ మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. రామకృష్ణది పరువు హత్యగా భావిస్తున్న పోలీసులు మామ వెంకటేష్ కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు. తాజాగా రామకృష్ణ భార్య భార్గవి మీడియాతో మాట్లాడుతూ.. రామకృష్ణ ఇంట్లో ఉండగా జిమ్మాపూర్ సర్పంచ్ భర్త అమృతరావు ఇంటి నుంచి తీసుకెళ్లారని తెలిపారు. ఆ తర్వాత తన భర్త తిరిగిఇంటికి రాలేదని తెలిపారు.
మోత్కూర్ వైపు వెళ్లారని చెప్పారు. అమృతరావుని తన భర్త గురించి అడిగితే ఇంకా రాలేదా? అని తననే ప్రశ్నించారని తెలిపారు. భూమి చూపించాలి అని తీసుకెళ్లారని అన్నారు. లతీఫ్ అనే వ్యక్తి పలుమార్లు భూమి కొనుగోలు కోసం అంటూ తన భర్త రామకృష్ణను సంప్రదించారని పేర్కొన్నారు. లతీఫ్‌ను యాకయ్య అనే వ్యక్తి రామకృష్ణకు పరిచయం చేశారని చెప్పారు.
ఒకసారి తోట కావాలి అంటూ మరోసారి రోడ్డు సైడ్ భూమి కావాలంటూ నాటకమాడారని అన్నారు. దుబాయ్ నుంచి వచ్చామని లతీఫ్ చెప్పేవారంటూ తెలిపారు. రామకృష్ణను పెళ్లి చేసుకున్న నాటి నుంచి తన పుట్టింటితో సంబంధాలు లేవని పేర్కొంది. ‘మీరు చచ్చినా మాతో సంబంధం లేదని గతంలో మా నాన్న వెంకటేష్ గొడవ పెట్టుకున్నారు’ అని భార్గవి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment