
భార్గవి (ఫైల్)
మండ్య (కర్ణాటక): కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ మూడేళ్ల కుమార్తెతో కలిసి కావేరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పాండవపుర తాలూకా లక్ష్మీసాగర గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్‌కు భార్య భార్గవి (30), కుమార్తె దీక్ష (3) ఉన్నారు. వీరు మైసూరు నగరంలోని ఊటెగహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు.
కుటుంబ కలహాలతో విసుగు చెందిన భార్గవి శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో గంజా వద్ద ఉన్న గోసాయి ఘాట్ వద్దకు కుమార్తెతో వచ్చి మొబైల్ ఫోన్ పక్కన బెట్టి కావేరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment