family clashes
-
మరిది చేతిలో వదిన హతం.. వివాహేతర సంబంధమే కారణమా?
హుబ్లీ (బెంగళూరు): మరిది చేతిలో వదిన దారుణ హత్యకు గురైన ఘటన జిల్లాలోని కుందగోళ తాలూకా ఏరినారాయణపుర గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. హతురాలు సునంద మెణసినకాయి కాగా నిందితుడిని మంజునాథగా గుర్తించారు. కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి చేరడంతో ఈ హత్య జరిగిందని తెలుస్తోంది. కొడవలితో పట్టపగలే హత్య జరగడంతో గ్రామంలో భయాందోళనకర పరిస్థితి తలెత్తింది. కుందగోళ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమా? మరేదైనా కారణమా అన్న కోణంలో హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. చదవండి: (నగల వ్యాపారి హనీట్రాప్‌లో కొత్త ట్విస్ట్) -
పాతాళగంగలో దూకి మరణిస్తా.. భర్తకు వాట్సప్ మెసేజ్
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలోని పాతాళగంగలో దూకి మరణిస్తానని నంద్యాలకు చెందిన కృష్ణకుమారి తన భర్తకు వాట్సాప్ ద్వారా శనివారం సందేశం పంపించింది. అనంతరం ఆమె అదృశ్యమైంది. దీంతో మత్స్యకారుల సహకారంతో ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని వన్‌టౌన్ ఎస్ఐ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయా ల్సిందిగా కోరారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఈ మెసేజ్ పంపినట్లు తెలుస్తుంది. చదవండి: (అయ్యా నా కొడుకు పరిస్థితి విషమంగా ఉంది.. వెంటనే ఆస్పత్రికి కోటంరెడ్డి) -
విశాఖ జిల్లాలో విషాదం.. అర్ధరాత్రి ఇద్దరు పిల్లలతో..
సాక్షి, విశాపట్నం: ఆర్థిక సమస్యల కారణంగా భార్య, భర్తల మధ్య చేలరేగిన విభేదాలు ఆ కుటుంబాన్ని శోకంలో ముంచింది. అన్నెం, పున్నెం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారుల మరణానికి ఈ ఘటన దారితీసింది. వివరాలిలా ఉన్నాయి. రోలుగుంట మండలం, జె.నాయుడుపాలెంకు చెందిన గడదాసు నాగరాజుకు, అదే మండలం, వడ్డిప గ్రామానికి చెందిన సాయితో ఆరేళ్ల క్రితం వివాహమయ్యింది. నాగరాజు ఆటో డ్రైవర్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి భాను(4), పృధ్వీరాజ్(2) జన్మించారు. ఆటో డ్రైవర్ కావడంతో అంతంమాత్రంగా వచ్చే ఆదాయంతో నిత్యం ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ క్రమంలో భార్యా, భర్తల మధ్య తరచూ వాగ్వివాదం జరుగుతుండేది. ఇటీవల బంగారం కొనే క్రమంలో వీరిరువురి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ వల్ల తన పిల్లలను తీసుకుని భార్య సాయి హడావిడిగా బయటకు వెళ్లిపోయింది. తిరిగి తనే వస్తుందని భావించిన నాగరాజు పట్టించుకోలేదు. అయితే సాయి తన పిల్లలైన భాను, పృధ్వీలను తీసుకుని సమీపంలో ఉండే భావి వద్దకు వెళ్లింది. ముందు పిల్లలను బావిలో పడేసి, తరువాత తనూ దూకేసింది. చదవండి: (మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..) ఈ ఘటనలో చిన్నారులు మృతి చెందగా, దూకిన తరువాత భయపడ్డ తల్లి సాయి బావిలో మెట్టుపట్టుకుని వేలాడుతూ ఉండిపోయింది. ఉదయం అటుగా వస్తున్న మనుషుల శబ్ధం విని సాయి గట్టిగా కేకలు వేయడంతో అప్పటికే చనిపోయిన చిన్నారులతో పాటు తల్లిని బయటకు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
ప్రేమ వివాహం.. వేధింపులు.. ఇక భర్తతో కలిసి ఉండలేనని..
సాక్షి, గుంటూరు(తెనాలి): కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కోర్టు ప్రాంగణంలోకి పెట్రోలు సీసా, ప్లకార్డులతో వచ్చి, పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, గమనించిన న్యాయవాదులు, పోలీసులు అతని వద్ద నుంచి పెట్రోలు సీసా, లైటర్ లాక్కుని స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే తనపై భర్త పెట్రోలు పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడని, తాను తప్పించుకున్నానని అతని భార్య తెలిపింది. పోలీసులు, బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెనాలి 12వ వార్డుకు చెందిన ఆటో డ్రైవర్ చెరుకూరి ప్రదీప్‌జయచంద్ర సుమారు పదేళ్ల క్రితం తెనాలికే చెందిన హరితను ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొద్ది రోజులకే భార్యను వేధించడం ప్రారంభించాడు. 2019 వరకు ఓపిక పట్టిన ఆమె ఇక భర్తతో కలిసి ఉండలేనని పుట్టింటికి వెళ్లిపోయి, వారి సహకారంతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టగా ప్రస్తుతం కోర్డులో నడుస్తోంది. చినరావూరులో వార్డు వలంటీర్‌గా పని చేస్తున్న ఈమె ఇంటికి తరచూ ప్రదీప్‌జయచంద్ర వెళ్లి దాడి చేయడం, ధూషించడం చేస్తుండేవాడు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా ప్రియున్ని మరిచిపోలేదు.. భర్తకు తెలిసి..) ఈ క్రమంలో బుధవారం రాత్రి11.30 గంటల ప్రాంతంలో ఆమె ఇంటికి వెళ్లి ధూషించడంతో పాటు విద్యుత్ ఫ్యూజు తొలగించాడు. దీంతో బాధితురాలు గుంటూరులోని దిశ పోలీస్‌స్టేషన్‌కు సమాచారమివ్వగా, వారు తెనాలి వన్‌టౌన్ పోలీసులను బాధితురాలి ఇంటికి పంపారు. అదే సమయంలో టవల్‌తో ఆమె మెడకు ఉరి వేసేందుకు ప్రదీప్‌జయచంద్ర యత్నిస్తున్నాడు. పోలీసులు అతన్ని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. తిరిగి గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హరిత ఇంటికి వెళ్లి జయచంద్ర ఆమెపై పెట్రోలు పోసి, నిప్పంటించేందుకు యత్నించగా కేకలు వేయడంతో చుట్టపక్కల వాళ్లు రావడంతో పరారయ్యాడు. ఇది జరిగిన కొద్ది గంటలకు పెట్రోలు సీసా, తనకు న్యాయం కావాలంటూ ప్లకార్డులతో అతను కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాడు. తన తప్పు లేకుండా వన్‌టౌన్ ఎస్ఐ చాణక్య తనపై దాడి చేశాడని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోలు పోసుకుని లైటర్‌తో నిప్పంటించుకునేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న న్యాయవాది హరిదాసు గౌరీశంకర్, పోలీసు కానిస్టేబుళ్లు పెట్రోలు సీసా, లైటరును లాక్కుని నీళ్లు పోశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు జయచంద్రను స్టేషన్‌కు తరలించారు. భర్తపై హరిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ఐపీసీ 307 సెక్షను కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జయచంద్రపై దాడి చేశారన్న ఆరోపణల గురించి ఎస్ఐ చాణక్యను వివరణ కోరగా, బుధవారం రాత్రి దిశ పోలీస్‌స్టేషన్ నుంచి వచ్చిన సమాచారం మేరకు తమ సిబ్బంది హరిత ఇంటికి వెళ్లారని, లేకుంటే అదే సమయంలో జయచంద్ర ఆమెను హతమార్చి ఉండేవాడని తెలిపారు. వెంటనే స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపామని చెప్పారు. -
నాన్న తిరిగొచ్చాడు..! నెల్లూరు చిన్నారుల ఆనందం..
సాక్షి, అమరావతి బ్యూరో: మద్యం మత్తులో విజయవాడ రైల్వేస్టేషన్లో పిల్లలను వదిలివెళ్లిన తండ్రి తిరిగి వారి చెంతకు చేరాడు. తండ్రిని చూసిన ఆ చిన్నారులు నాన్నా! అంటూ ఆనందంతో ఉప్పొంగారు. పిల్లలను చూడగానే తండ్రి, నాన్నను చూసిన ఆనందంలో పిల్లలు ఉద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తురిమెర్లకు చెందిన తాపీ మేస్త్రి చప్పిడి ప్రసాద్ విజయవాడ రామవరప్పాడులో కొన్నాళ్లుగా తన ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. ప్రసాద్ భార్య ఇదివరకే అతడిని వదలి వెళ్లిపోయింది. నాలుగు రోజుల క్రితం సొంతూరు వెళ్దామంటూ ప్రసాద్ పిల్లలతో కలిసి బెజవాడ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. పిల్లలను అక్కడే వదిలి ఎటో వెళ్లిపోయాడు. ఆ రాత్రంతా రైల్వేస్టేషన్లోనే ఏడుస్తూ ఎదురు చూసిన పిల్లలను చైల్డ్‌లైన్ ప్రతినిధులు చేరదీసి ఆశ్రయం కల్పించారు. తండ్రి కోసం ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో శనివారం ‘పాపం పసివాళ్లు’ శీర్షికన ‘సాక్షి’ దిన పత్రికలో కథనం ప్రచురితమైంది. ఇంతలో తండ్రి ప్రసాద్ తాను పనిచేసే నిర్మాణ రంగ సంస్థ ప్రతినిధిని వెంటబెట్టుకుని రైల్వేస్టేషన్‌కు చేరుకుని తన బిడ్డల గురించి వాకబు చేశాడు. జీఆర్పీ సిబ్బంది సూచనలతో చైల్డ్‌లైన్ ప్రతినిధుల వద్దకు వెళ్లాడు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సంరక్షణలో ఉన్న పిల్లల వద్దకు ప్రసాద్‌ను తీసుకెళ్లారు. అక్కడ తండ్రిని చూడగానే పిల్లలు ఒక్కసారిగా నాన్నా.. అంటూ భోరుమన్నారు. ప్రసాద్ పరుగున వారి వద్దకు వెళ్లి గట్టిగా హత్తుకుని రోదించారు. తండ్రి కూడా భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ సన్నివేశాన్ని చూసిన అక్కడి వారూ కన్నీరొలికారు. తండ్రికి తాత్కాలికంగా అప్పగింత.. సీడబ్ల్యూసీ ప్రతినిధులు విజయవాడలో ప్రసాద్ ఉంటున్న పరిసరాల్లో విచారణకు సామాజిక కార్యకర్తను పంపారు. అక్కడ ప్రసాద్ వ్యవహారశైలి, తదితర అంశాలను తెలుసుకుని మంగళవారం సోషల్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు సమర్పిస్తారు. అప్పటి వరకు నిర్మాణ సంస్థ ప్రతినిధి నుంచి హామీ తీసుకుని పిల్లలను తండ్రికి తాత్కాలికంగా అప్పగించినట్టు సీడబ్ల్యూసీ చైర్మన్ సువార్త ‘సాక్షి’కి చెప్పారు. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రసాద్ తల్లి వృద్ధాప్యంతో ఉన్నందున పిల్లలను తురిమెర్లకు పంపేకంటే కౌన్సెలింగ్ ఇచ్చి తండ్రి వద్దనే ఉంచాలని యోచిస్తున్నారు. నాలుగు రోజుల ఎదురు చూపుల అనంతరం తండ్రి చెంతకు చేరడంతో పసివాళ్ల కథ సుఖాంతమైంది. చదవండి: Nellore: పాపం పసివాళ్లు! అమ్మానాన్నలు కాదనుకున్న అభాగ్యులు -
కలహాలతో విసిగిపోయి.. బిడ్డతో సహా కావేరి నదిలో దూకి..
మండ్య (కర్ణాటక): కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ మూడేళ్ల కుమార్తెతో కలిసి కావేరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండ్య జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని పాండవపుర తాలూకా లక్ష్మీసాగర గ్రామానికి చెందిన ప్రదీప్‌కుమార్‌కు భార్య భార్గవి (30), కుమార్తె దీక్ష (3) ఉన్నారు. వీరు మైసూరు నగరంలోని ఊటెగహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాలతో విసుగు చెందిన భార్గవి శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో గంజా వద్ద ఉన్న గోసాయి ఘాట్ వద్దకు కుమార్తెతో వచ్చి మొబైల్ ఫోన్ పక్కన బెట్టి కావేరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడే ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చదవండి: (ఒమిక్రాన్ సోకిన మహిళ తండ్రికి కరోనా పాజిటివ్) -
ఊరి చివర పాడుబడిన బావిలో పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, తిరువొత్తియూరు (చెన్నై): కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన విరుదునగర్‌లో చోటుచేసుకుంది. తమ్మనాయకన్ పట్టి రోడ్డుకు చెందిన రైతు శివకుమార్, లక్ష్మీ ప్రియ దంపతులకు కుమార్తె దర్శని ప్రియా (9), కుమారుడు శివ షణ్ముగ వేల్ (5) ఉన్నారు. లక్ష్మీ ప్రియాను శివకుమార్ అనుమానించడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన లక్ష్మీ పిల్లలను తీసుకుని బయటకు వెళ్లింది. బంధువులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. ఊరి చివరనున్న పాడుబడిన వ్యవసాయ బావిలో లక్ష్మీప్రియ, ఇద్దరు పిల్లల మృతదేహాలను గుర్తించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. వత్సకారపట్టి పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. చదవండి: (కరోనా కాటుకు బలి.. తీరిగ్గా 15 నెలల తర్వాత సమాచారం.. తీరని క్షోభ) -
అమ్మా కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టకోనివ్వద్దు..
సాక్షి, జగ్గయ్యపేట: కట్టుకున్న భార్య ప్రవర్తన నచ్చక ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మండలంలోని మిట్టగూడెంనకు చెందిన ఆళ్ల వెంకటేశ్వరరావు (25) బైక్ మెకానిక్‌గా జీవిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం రాచేపల్లికి చెందిన కృష్ణవేణితో అతనికి వివాహమైంది. కొన్నేళ్ల పాటు సజావుగానే ఉన్నా ఇటీవల ఆమె మరొక వ్యక్తికి విహేతర సంబంధం పెట్టుకుంది. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లి అక్కడే భర్తపై కేసు పెట్టింది. అయితే పెద్దలు రాజీచేసి ఆమెను కాపురానికి పంపించారు. రెండు, మూడు రోజుల క్రితం భార్య మళ్లీ పుట్టింటికి వెళ్లగా ఆమె ప్రవర్తన నచ్చక రాత్రి తొమ్మిది గంటల సమయంలో తాను పనిచేస్తున్న షెడ్డులోనే వెంకటేశ్వరరావు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు అతను కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ‘అమ్మా నన్ను క్షమించు. ఇక నీతో మాట్లాడలేనమ్మా. ఇవే నా ఆఖరి మాటలమ్మా. నేను చచ్చిపోతున్నాను. మీరు నా గురించి ఆగం కావద్దు. ఇద్దరు తమ్ముళ్లను మంచిగా చూసుకుంటూ ఆనందంగా ఉండండమ్మా. మీరు సంతోషంగా ఉంటే చాలమ్మా. చదవండి: (ఒంటరి మహిళలే టార్గెట్: అదే కిరణ్ ప్రత్యేకత) నా జీవితంలో కష్టం తప్ప ఏ నాడూ సుఖపడలేదమ్మా. మీ అందరినీ వదిలిపెట్టి పోవాలని లేదు. అన్ని విధాలా మోసపోయాను. నేను చనిపోయిన తరువాత కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టకోనివ్వద్దు. నా చేతిపై ఆమె పేరు ఉంది. దానిని తీసేసి దహనం సంస్కారాలు చేయండి’ అని కన్నీటి పర్యంతమై ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. మృతుడి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐ–2 రామారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యింది.. మీరు కూడా రండి’
నాగారం: కుటుంబ కలహాలతో భార్యను హత్య చేసిన భర్త.. మృతదేహాన్ని టాటా ఏస్ వాహనంలో స్వగ్రామానికి తీసుకొచ్చాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నాగారం మండల పరిధిలోని పస్తాల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పస్తాల గ్రామానికి చెందిన చిత్తలూరి శ్రీనివాస్, సూరాంబ (35) దంపతులు తమ పిల్లలు శ్రావణి, ప్రశాంత్. పదేళ్లుగా హైదరాబాద్‌లోని రామాంతాపూర్‌లో నివసిస్తూ కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కాగా భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి శ్రీనివాస్ ఇంట్లో ఇద్దరు పిల్లలను పక్క గదిలో నిద్రించమని చెప్పి భార్యతో ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో సూరాంబను విచక్షణారహితంగా కొట్టి, ప్లాస్టిక్ తాడుతో ఆమె మెడకు ఉరివేసి హత్య చేశాడు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో కూరగాయలకు వినియోగించే తన టాటా ఏస్ వాహనంలో ఆమె మృతదేహాన్ని వేసుకొని స్వగ్రామం పస్తాలకు బయల్దేరాడు. మార్గమధ్యలో గురువారం తెల్లవారుజామున పిల్లలకు ఫోన్‌చేసి ‘మీ అమ్మకు బీపీ డౌన్ అయ్యి మృతిచెందింది. పస్తాలకు తీసుకెళ్తున్నా, మీరు కూడా రండి’ అని చెప్పాడు. అనంతరం మృతదేహాన్ని పస్తాలకు తీసుకొచ్చి తన ఇంటిముందు ఉంచాడు. బీపీ డౌన్ అయ్యి మృతిచెందిందని గ్రామస్తులతో చెప్పగా వారు మృతదేహంపై ఉన్న గాయాలను గుర్తించి ఏమైందని నిలదీశారు. దీంతో శ్రీనివాస్ తానే చంపానని అంగీకరించాడు. అయితే గ్రామస్తులు దాడి చేస్తారనే భయంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని మృతదేహాన్ని తుంగతుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి మొగుళ్ల బక్కయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేశ్ తెలిపారు. -
ఆడపడుచుతో గొడవ: పిల్లలతో బావిలో దూకిన తల్లి
పెద్దపల్లి రూరల్: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం మూడు నిండుప్రాణాలను బలిగొంది. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి గ్రామంలో బుధవారం ఈ సంఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని దేవగూడకు చెందిన ఎతిరాజు స్వామి కుటుంబం పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామానికి వచ్చి స్థిరపడింది. స్వామికి «జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామానికి చెందిన మమత (27) తో వివాహం జరిగింది. వీరికి శివకృష్ణ (3), శ్రీకృతి (14 నెలలు) సంతానం. స్వామి తోబుట్టువు పద్మ భర్త చనిపోవడంతో ఆమె వీరి వద్దే ఉంటోంది. ఆడపడుచు పద్మతో స్వామి భార్య మమతకు తరచూ గొడవలు జరిగేవి. మంగళవారం స్వామి కూలిపనికి వెళ్లిన తర్వాత ఏదో విషయమై ఆడపడుచుతో గొడవపడ్డ మమత తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్వామి ఇంటికి వచ్చిన తర్వాత భార్యాపిల్లలు కనపడక పోవడంతో పద్మను అడగ్గా తనకు తెలియదని చెప్పింది. తర్వాత అత్తింటివారిని, బంధువులను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకోగా, తమ వద్దకు రాలేదని చెప్పారు. బుధవారం ఉదయం వారిని వెతికేందుకు బయల్దేరేలోగా మృతదేహాలు సమీపంలోని బావిలో తేలాయని తెలియడంతో హతాశులయ్యారు. ఈ సమాచారం అందడంతో డీసీపీ రవీందర్, ఏసీపీ నితికపంత్, సీఐ ప్రదీప్.. సిబ్బందితో వెళ్లి మృతదేహాలను వెలికి తీయించారు. కాగా, తమ కూతురు అత్తింటివారి వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని మమత కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని డీసీపీ తెలిపారు. -
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు : మద్యం వ్యసనం ఓ కుటుంబాన్ని బలి తీసుకొంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీ రంగరాజపురం మండలం చియ్యురులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..సుధాకర్ ప్రతీ రోజూ మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇరువురికి జరిగిన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన భార్యసింధు తన ఇద్దరు కుమార్తెలు మధు ప్రియ, శ్రీలతలతో కలసి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత సుధాకర్ సైతం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసకొని చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. -
మందలించిన మామను హత్య చేసిన అల్లుడు
సాక్షి, మంథని: కాపురంలో కలహాలు లేకుండా కూతుర్ని బాగా చూసుకోవాలని మందలించిన మామను.. అల్లుడు హత్యచేసిన సంఘటన మంగళవారం రాత్రి మంథని మండలం బిట్టుపల్లి గ్రా మంలో జరిగింది. మంథని సీఐ మహేందర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొబ్బిల లక్ష్మయ్య(55)కు భార్య, కూతురు, ఇద్దరు కూమారులు. 2006లో కూతురు సుమలతను పెద్దపల్లి జిల్లా పెద్దకల్వలకు చెందిన బాసనేని శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. పెండ్లి జరిగిన కొన్ని రోజులకే శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను కొట్టేవాడు. ఈక్రమంలో పదినెలల క్రితం భార్యాపిల్లలతో వచ్చి అత్తగారి గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకొని నివా సముంటున్నాడు. తాగుడుకు బానిసైన శ్రీనివాస్ ఈమధ్యకాలంలో సుమలతను కొట్టడంతో ఆమె తండ్రి, తల్లి, సోదరులు వెళ్లి అడిగే క్రమంలో ఇరువురి మధ్య ఘర్ణణ జరిగింది. బావమరిది మహేశ్ మూలంగా తన తలకు గాయమైందని శ్రీనివాస్ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ గొడవ జరిగినప్పటి నుంచి అత్తింటివారిని చంపుతానని శ్రీనివాస్ బెదిరించేవాడు. మంగళవారం రాత్రి పనికి వెళ్లి వచ్చిన శ్రీనివాస్ అత్తింట్లో ఉన్న భార్యాపిల్లలను తను అద్దెకు ఉండే గది రావాలని కబురు పంపడంతో మామ లక్ష్మయ్య వారిని దింపి వెళ్తున్నాడు. ఈక్రమంలో పాత కక్షను మనసులో పెట్టుకున్న శ్రీనివాస్ ఒంటరిగా ఉన్న మామపై గుర్తుతెలియని ఆయుధంతో తలపై బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు పారిపోయాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయిన్‌పల్లిలోని కళింగ ఎన్‌క్లేవ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సందీప్ యాదవ్(35), రుక్మిణి(30)దంపతులు గురువారం రాత్రి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు వారిని రక్షించడానికి యత్నించినా లాభం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్యను నరికి చంపిన భర్త
-
భార్యను హతమార్చిన భర్త