దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బోయిన్‌పల్లిలోని కళింగ ఎన్‌క్లేవ్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సందీప్ యాదవ్(35), రుక్మిణి(30)దంపతులు గురువారం రాత్రి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నారు.
ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు వారిని రక్షించడానికి యత్నించినా లాభం లేకపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.