
సాక్షి, చిత్తూరు : మద్యం వ్యసనం ఓ కుటుంబాన్ని బలి తీసుకొంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీ రంగరాజపురం మండలం చియ్యురులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..సుధాకర్ ప్రతీ రోజూ మద్యం తాగి భార్యతో గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఇరువురికి జరిగిన ఘర్షణ తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి చెందిన భార్యసింధు తన ఇద్దరు కుమార్తెలు మధు ప్రియ, శ్రీలతలతో కలసి బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత సుధాకర్ సైతం ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒకే కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసకొని చనిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment