బాలిక మృతదేహంతో రాస్తారోకో | Rasta Rocco with girl's body | Sakshi
Sakshi News home page

బాలిక మృతదేహంతో రాస్తారోకో

Feb 23 2016 10:46 AM | Updated on Nov 6 2018 7:56 PM

తోటి విద్యార్థి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన భార్గవి మృతదేహంతో కుటుంబసభ్యులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు.

తోటి విద్యార్థి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన భార్గవి మృతదేహంతో కుటుంబసభ్యులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన భార్గవి తోటి విద్యార్థి వేధింపులతో సోమవారం ఆత్మాహుతికి పాల్పడింది.

ఇందుకు కారణమైన అదే గ్రామానికి చెందిన వేణును కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలిసిన ఎస్సై విజయ్‌కుమార్ సంఘటన స్థలికి చేరుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు.కుటుంబసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు సాగిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement