Rasta Rocco
-
ధిక్కార స్వరంతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి
రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. టికెట్ల కోసం పోటాపోటీగా సమావేశాలు పెడుతూ వీధికెక్కుతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల సత్యప్రభకు వ్యతిరేకంగా ఆ పార్టీ బీసీ నాయకుడు పైలా సుభాష్‌చంద్రబోస్ వర్గీయులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టికెట్లన్నీ ఓసీలకే ఇస్తున్నారని పలువురు టీడీపీ బీసీ నేతలు మీడియా ముందుకు వచ్చి నిరసన తెలియజేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ తనదంటేతనదని టీడీపీ నాయకులు బూరగడ్డ వేదవ్యాస్, కాగిత కృష్ణప్రసాద్ ఎవరికివారే ప్రచారం చేసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. టీడీపీ నియోజకవ ర్గ ఇన్చార్జి వరుపుల సత్యప్రభకు వ్యతిరేకంగా ఆ పార్టీలో బలహీనవర్గాల నుంచి మరో నాయకుడైన పైలా సుభాష్‌చంద్రబోస్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ రెండు వర్గాల మధ్య కుమ్ములాటలు ఈనాటివి కావు. ఏలేశ్వరంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు జరిగిన సందర్భంగా సత్యప్రభ భర్త, అప్పటి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్చార్జి వరుపుల రాజా వర్గానికి చెందిన నేతపై పైలా వర్గీయులు చేయిచేసుకున్నారు. ఆ తరువాత వీరి మధ్య విభేదాలు ముదురు పాకానపడ్డాయి. రాజా హఠాన్మరణం తరువాత ఆయన భార్య సత్యప్రభకు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె నాయకత్వంపై పైచేయి సాధించేందుకు బోస్ వర్గం గట్టి ప్రయత్నమే చేస్తోంది. సత్యప్రభకు ప్రత్తిపాడు సీటు ఖాయమైందంటూ పార్టీ ముఖ్య నేతల నుంచి సంకేతాలు అందడంతో ఏలేశ్వరం మెయిన్ రోడ్డులో సత్యప్రభకు వ్యతిరేకంగా పైలా వర్గ నేతలు గురువారం రాస్తారోకో నిర్వహించారు. బీసీలకు రిక్తహస్తం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో బీసీలకు స్థానం దక్కలేదు. నెల్లూరు ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎక్కడా బీసీలకు సీట్లు కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో వారు రగిలిపోతున్నారు. వెంకటగిరి సీటును బీసీలకే కేటాయించాలంటూ పలువురు టీడీపీ నేతలు మీడియా ముందు డిమాండ్‌చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గూడూరు, సూళ్లూరుపేట ఎస్సీ రి జర్వ్డ్. మిగిలిన 8 నియోజకవర్గాలైన వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, కావలి సీట్లు దాదాపు అగ్రవర్ణాలకే ఖరారయ్యాయని టీడీపీ అనుకూల పత్రిక ద్వారా ఇటీవల లీకులిచ్చారు. వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ.. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. నెల్లూరు నగరంలో పొంగూరు నారాయణ.. కోవూరులో దినేష్ లేదా సుమంత్‌రెడ్డి.. కావలిలో కావ్య కృష్ణారెడ్డి.. ఉదయగిరిలో కాకర్ల సురేష్ లేదా బొల్లినేని రామారావుకే సీట్లు ఖరారయ్యాయని ఆ పత్రికలో ప్రచురించారు. ఎక్కడా బీసీ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోలేదనే అంశం దీని ద్వారా వెల్లడైంది. నమ్ముకున్న వారిని నట్టేట ముంచి.. ♦ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు పార్టీ పదవులతోనే టీడీపీ సరిపెట్టింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీకి అవకాశం కల్పించలేదు. ♦ ఉదయగిరిలో జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబుయాదవ్ పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నా, ఆయన పేరునూ పరిగణనలోకి తీసుకోలేదు. ♦ గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థి దొరకలేదు. దీంతో చివరి నిమిషంలో మై నార్టీ నేత అబ్దుల్ అజీజ్‌కు అవకాశమిచ్చారు. ఆ సీటు పోతుందని తెలిసినా ఆయన బరిలో నిలిచారు. ఆటు పోట్లకు ఎదురొడ్డి నిలిచినా చివరికి మొండిచేయి చూ పారు. వెంకటగిరిలో మస్తాన్‌యాదవ్ కు పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరికి మోసం చేశారు. ♦ కావలిలో పసుపులేటి సుధాకర్‌ను నమ్మించి పార్టీ ఫండ్ సేకరించి హ్యాండిచ్చారు. నెల్లూరు పార్లమెంట్ స్థా నానికీ ఇదే తీరును అవలంబించారు.వెంకటగిరి సీటు ను బీసీలకే ఇవ్వాలనే డిమాండ్‌తో సైదాపురంతో పాటు పలు మండలాల బీసీ నేతలు మీడియా ముందుకొ చ్చారు. టీడీపీలో బీసీలకు న్యాయం జరగాలంటే మస్తాన్‌యాదవ్‌కు సీటు ఖరారు చేయాలని కోరారు. పెడన ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే: వేదవ్యాస్ కృత్తివెన్ను: పెడన నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని, పెడన ఎమ్మెల్యే అభ్యర్థిని తానే నని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ అ న్నా రు. గురువారం ఆయన మండలంలోని చినగొల్లపాలెంలో విలేకరులతో మాట్లాడారు. పెడన సీటు ఎవరికీ కేటాయించలేదని, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తానే పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. మరోవైపు బుధవారం టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్‌కు సీటు కేటాయించారంటూ ఆయన వర్గీయులు బాణాసంచా కాల్చడం విశేషం. -
గుంతలు పూడ్చాలని వైఎస్సార్సీపీ రాస్తారోకో
ధర్మారం: మండలంలోని కటికెనపల్లి నుంచి ధర్మారం వరకు రహదారిపై పడిన గుంతలను పూడ్చాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో శుక్రవారం కటికెనపల్లి బస్టాండు వద్ద రాస్తారోకో చేశారు. ఆందోళన కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై హరిబాబు సంఘటన స్థలానికి చేరుకుని రాస్తారోకో విరమించారు. ఈ సందర్భంగా డాక్టర్ నగేష్ మాట్లాడుతూ కరీంనగర్ నుంచి రాయపట్నంవరకు ఉన్న స్టేట్‌హైవే గుంతలమయంగా మారి ప్రయాణికులకు ఇబ్బందులు కల్గుతున్నాయన్నారు. కటికెనపల్లినుంచి ధర్మారం వరకు రోడ్డు పూర్తిగా శిథిలమై గుంతలు ఏర్పడటంతో రోడ్డు ప్రమాదకరంగా ఉందని తెలిపారు. పలు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడంలేదని పేర్కొన్నారు. ఈవిషయమై చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వం యంత్రాంగం తక్షణమే స్పందించి మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్‌రెడ్డి, సంపంగి సతీష్, రాము, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, నాయకులు మహేందర్, సంతోష్, మనోజ్, సంజీవ్, రాజు, కుమార్, శ్రీనివాస్, రాజేశ్, ఆవుల వేణు, కనుకయ్య, నాగరాజు, తిరుపతి పాల్గొన్నారు. -
విద్యార్థులను ఢీకొన్న మినీ లారీ
ఏడుగురికి గాయాలు తిరువళ్లూరు: పాఠశాల ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లడానికి బస్టాండ్‌లో నిల్చున్న విద్యార్థులను మినీలారీ ఢీకొట్టిన సంఘటన తిరవళ్లూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కనకవల్లిపురం గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థినులు షీబా(14), సునీత (12), పదవ తరగతి విద్యార్థిని సౌమ్య(15), ఆరవ తరగతి విద్యార్థినులు షైనీ (11), భారతీ (12), ప్లస్‌టూ విద్యార్థులు పురుషోత్తం(16), తులసీరామన్(16) తిరువళ్లూరు జిల్లా పాండూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. పాఠశాల ముగిసిన అనంతరం గురువారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో వీరంతా బస్సు కోసం వేచి ఉన్నారు. ఆ సమయంలో తిరుత్తణి నుంచి తిరువళ్లూరు వైపు వెళుతున్న ఐషర్ లారీ వీరి ఢీకొంది. వీరిలో సౌమ్య, భారతిల పరిస్థితి విషమంగా ఉండడంతో చెన్నై వైద్యశాలకు తరలించారు. రాస్తారోకో: ఇదిలాఉండగా స్పీడు బ్రేకర్లను వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ పాండూర్ వద్ద రాస్తారోకో స్థానికులు ఆందోళనకు దిగారు. వేగంగా వచ్చే వాహనాలను అదుపు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని వారు ఆరోపించారు. దీంతో తిరువళ్లూరు- తిరుత్తణి రోడ్డులో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
పరిహారం కోసం రోడ్డెక్కిన రైతన్న
గాంధారి: ప్రభుత్వ తీరుపై రైతులు కన్నెర్ర చేశారు. వరుస వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని, వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గాంధారిలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. అఖిల పక్ష నేతలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నేతలు కానీ, అధికారులు కానీ పట్టించుకోవడం లేదని, పంట నష్టం వివరాలు సేకరించడం లేదని ఆరోపించారు. నష్టపోయిన పంటలపై ప్రభుత్వం సర్వే చేయించి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు తానాజీరావు, సర్పంచ్ సత్యం, ఎంపీటీసీ సభ్యుడు రాంకిషన్‌రావు, ఏవో యాదగిరి ఎంత నచ్చచెప్పినా రైతులు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు రాస్తారోకో చేశారు. తన రెండెకరాలతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తే మొత్తం వర్షార్పణం అయిందని నేరల్‌తండాకు చెందిన మంజూరియా వాపోయారు. ప్రభుత్వం చెప్పడం వల్లే పత్తికి బదులు సోయా సాగు చేశామని, ఇప్పుడు పంట మొత్తం నష్టపోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని గాంధారికి చెందిన సాయిలు కోరారు. ఏవో యాదగిరి అక్కడకు చేరుకొని పంట నష్టం వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. సర్వే నెంబర్ల వారీగా పంట నష్టం వివరాలను సేకరించి నివేదిక పంపిస్తామన్నారు. రైతులు పట్టా పాసుబుక్, ఆధార్, బ్యాంక్ ఖాతా జిరాక్స్‌లు ఇవ్వాలని కోరారు. -
హైవే దిగ్బంధం
వారాబందీ సక్రమంగా అమలు చేయాలని.. జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు మూడున్నర గంటల పాటు ఆందోళన భారీగా నిలిచిన వాహనాలు బాల్కొండ: గుత్ప ఎత్తిపోతల నీటి సరఫరాపై మళ్లీ వివాదం రాజుకుంది. వారాబందీ ప్రకారం సక్రమంగా నీటిని పంపిణీ చేయాలని బాల్కొండ, ఆర్మూర్ మండలాల్లోని చిట్టాపూర్, చేపూర్, ఫతేపూర్ రైతులు సోమవారం 44వ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మూడున్నర గంటల పాటు చిట్టాపూర్ కూడలి వద్ద బైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. అన్ని గ్రామాలకు నీరందిస్తామని నీటిపారుదల శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన రైతులు నీటిని అడ్డుకుంటుండడంతో తమ గ్రామాలకు నీరు రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీరు అందక చెరువులు వెలవెలబోతున్నాయని, పంటలు ఎండుతున్నాయని వాపోయారు. ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ పిప్రి గ్రామస్తులకే వత్తాసు పలుతున్నాడని విమర్శించారు. అధికారులు అన్ని గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మూర్ రూరల్ సీఐ నరసింహస్వామి, ఎస్సై స్వామిగౌడ్ వచ్చి రైతులకు సర్దిచెప్పేందుకు యత్నించారు. రాస్తారోకో విరమించేందుకు నిరాకరించిన రైతులు.. ఇరిగేషన్ ఎస్ఈ వచ్చే వరకూ ఆందోళన కొనసాగిస్తామని బీష్మించుకు కూర్చున్నారు. చివరకు ఆర్మూర్ ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ కృష్ణమూర్తి వచ్చి రైతులతో మాట్లాడారు. వారాబందీ ప్రకారం అన్ని గ్రామాలకు నీరందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. భారీగా నిలిచిన ట్రాఫిక్ రైతులు మూడున్నర గంటల పాటు జాతీయ రహదారిపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గుత్ప నీటి కోసం వారం వ్యవధిలో చిట్టాపూర్ గ్రామస్తులు రోడ్డెక్కడం ఇది రెండోసారి. ఉదయం 11 నుంచి మద్యాహ్నం 2.30 గంటల వరకు రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. -
‘మాకు మంచిర్యాలే మంచిది’
తమ మండలాన్ని కొత్తగా తలపెట్టిన నిర్మల్ జిల్లాలో కలపవద్దంటూ ఆదిలాబాద్ జిల్లా దండేపల్లిలో ఆందోళన జరిగింది. వివిధ పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మండల కేంద్రంలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దండేపల్లి నుంచి నిర్మల్ దూరం 120 కిలోమీటర్లు కాగా మంచిర్యాల 40 కిలోమీటర్ల దూరంలోనే ఉందని వారు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం ప్రతిపాదిత మంచిర్యాల జిల్లాలోనే తమ మండలాన్ని ఉంచాలని వారు డిమాండ్ చేశారు. -
ఉప్పలపాడులో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
► రాస్తారోకోకు దిగిన గ్రామస్తులు ► 48 గంటల్లో నిందితులను అరెస్ట్ చేయాలి ► లేకుంటే ఆమరణ దీక్ష ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేట రూరల్ : ఉప్పలపాడు ప్రధాన సెంటర్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో విగ్రహం చేయి పూర్తిగా విరిగిపోగా, ముఖంపై పగులగొట్టేందుకు ప్రయత్నించిన గుర్తులు కనిపించాయి. తెల్లవారుజామున గ్రామస్తులు ఈ విషయాన్ని గుర్తించారు. పార్టీ మండల నాయకులు, వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దెబ్బతిన్న విగ్రహాన్ని పరిశీలించారు. గ్రామస్తులతో కలసి ఆయన వినుకొండ-గుంటూరు రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. గంటపాటు జరిగిన రాస్తారోకోతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రూరల్ ఎస్సై సురేంద్రబాబు రాస్తారోకో వద్దకు చేరుకుని ఎమ్మెల్యేతో చర్చించారు. గతంలో ఒకసారి విగ్రహంపై దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే తెలిపారు. ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిందితులను పోలీసులు గుర్తించలేదన్నారు. తాజా ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లో నిందితులను గుర్తించకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామస్తులు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై వివరించారు. పోలీసుల హామీతో ఎమ్మెల్యే గోపిరెడ్డి రాస్తారోకోను విరమించారు. దమ్ముంటే పగలు వచ్చి విగ్రహం మీద చేయి వేయండి వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం పిరికిపంద చర్యని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ధైర్యం ఉంటే పగటి పూట విగ్రహం మీద చేయి వేయాలని సవాల్ విసిరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్న గ్రామంలో రెచ్చగొట్టేందుకే ఇటువంటి సంఘటనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు కొమ్మనబొయిన శంకర్‌యాదవ్, పిల్లి ఒబుల్‌రెడ్డి, వల్లెపు నాగేశ్వరరావు, గాబ్రియెల్, గోగుల మనోహర్, చల్లా నారాపరెడ్డి, శివయ్య, నంద్యాల సత్యనారాయణరెడ్డి, శనివారపు బ్రహ్మారెడ్డి, కాసా ఆంజనేయులు, మూరే రవింద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆలయంలో నంది విగ్రహం చోరీ
గొండ్యాల్ గ్రామస్తుల రాస్తారోకో పోలీసుల హామీతో ఆందోళన విరమణ హన్వాడ : పురాతన ఆలయంలోని నంది విగ్రహాన్ని దుండగులు ఎత్తుకెళ్లగా, నిందితులను పట్టుకోవాలంటూ గ్రామస్తులు కొద్దిసేపు రాస్తారోకోకు దిగారు. చివరకు పోలీసుల హామీతో ఆందోళన విరమించారు. వివరాలిలా ఉన్నాయి. హన్వాడ మండలంలోని గొండ్యాల్ శివారులోని దేవునిగడ్డకాలనీలో సుమారు 200ఏళ్లనాటి నందీశ్వరాలయం ఉంది. గురువారం అర్ధరాత్రి ఆలయం తాళం పగులగొట్టి నంది విగ్ర హాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం అక్కడికి వచ్చిన భక్తులు విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాక వేపూర్ రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఈ ఆలయంలో మూడుసార్లు దుండగులు చోరీకి విఫలయత్నం చేశారని ఆరోపించారు. ఈ విగ్రహం అతి ప్రాచీనకాలం నాటిదని, దాని కొమ్ములు, గోపురం, కడుపు ప్రాంతం లో వజ్రాలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అక్కడికి ఎస్ఐ లక్ష్మయ్య చేరుకుని వారితో మాట్లాడారు. అనంతరం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడి ఆనవాళ్లను బట్టి దొంగలు భారీ గంభీరంగా కనిపించే ఈ విగ్రహాన్ని తవ్వి తీసి ఓ వాహనానికి కట్టి లాకెళ్లినట్లు భావిస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. -
బాలిక మృతదేహంతో రాస్తారోకో
తోటి విద్యార్థి వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన భార్గవి మృతదేహంతో కుటుంబసభ్యులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన భార్గవి తోటి విద్యార్థి వేధింపులతో సోమవారం ఆత్మాహుతికి పాల్పడింది. ఇందుకు కారణమైన అదే గ్రామానికి చెందిన వేణును కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలిసిన ఎస్సై విజయ్‌కుమార్ సంఘటన స్థలికి చేరుకున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు.కుటుంబసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చలు సాగిస్తున్నారు. -
రైతులకు మార్కెట్ ధర చెల్లించాలి
కృష్ణా జిల్లా జి.కొండూరులో 33వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులు గురువారం ఆందోళనకు దిగారు. తమకు ప్రభుత్వం సరైన ఇవ్వటం లేదని రహదారిపై రాస్తారోకోకు దిగారు. మార్కెట్ రేటు ప్రకారం ఎకరా రూ.2 కోట్లు పలుకుతున్న భూములకు ప్రభుత్వం కేవలం రూ.16 లక్షలు మాత్రమే చెల్లిస్తుండటంతో ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం కనీసం రూ.కోటి ఐనా చెల్లించాలని ధర్నా చేపట్టారు. రైతులు చేపట్టిన రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. -
ఇన్పుట్ సబ్సిడీకోసం రాస్తారోకో
విడపనకల్లు: ఇన్పుట్ సబ్సిడీ మంజూరులో తమకు అన్యాయం జరిగిందంటూ డొనేకల్లు గ్రామ మెట్ట భూమి రైతులందరూ బుధవారం సాయంత్రం రాస్తారోకోకు దిగారు. దాదాపు రెండు గంటల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి పోయాయి. దీంతో ప్రయాణికులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం మొదలైంది. కొంతమంది ప్రయాణికులు, పోలీసులకు, తహశీల్దార్‌కు స్వయంగా ఫోన్ చేసి పిలిపించారు. రైతులు మాట్లాడుతూ 2014లో ఇన్పుట్ సబ్సిడీలో మొత్తం అధికార పార్టీ నాయకులు మాగాణీ భూములకే మంజూరు చేశారని, మెట్ట భూమి రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఈ విషయమై సోమవారం జిల్లాలోని కలెక్టర్‌కు వివరిస్తే గ్రామంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు ఆర్డీఓను మంగళవారం పంపిస్తామని చె ప్పారు. అయితే బుధవారం స్వయంగా రెవెన్యూ అధికారులే వచ్చి ఆర్డీఓ విచారణ కోసం వస్తున్నారని, రైతులంతా గ్రామ పంచాయతీ వద్దకు రావాలని చెప్పారు. దీంతో అని పనులు వదులుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూశామన్నారు. చివరికి ఉరవకొండ వరకు వచ్చి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఆర్డీఓ ఉన్న ఫళంగా వెళ్లిపోవడమేంటని ప్రశ్నించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ఆందోళన విర మించాలని కోరినా, తహశీల్దార్ వచ్చి హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని రైతులు భీష్మించుకున్నారు. దీంతో తహశీల్దార్ శంకరయ్య, డిప్యూటీ తహశీల్దార్ రమేష్‌బాబు, ఆర్ఐ నాగరాజు ఆందోళనకారుల వద్దకు చేరుకొని స్వ యంగా తానే గురువారం విచారణ చేసి అర్హులైన వారందరికీ ఇన్పుట్ సబ్సిడీ అందే విధంగా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో డొనేకల్లు క్రిష్ణమూర్తి, సత్యమయ్య, సింపరన్న, మల్లికార్జున, ఎర్రిస్వామి, సురేష్, శేఖర్ పాల్గొన్నారు. -
బస్సు కోసం పాట్లు
♦ రాస్తారోకోలు, ధర్నాలు చేసినా ఫలితం శూన్యం ♦ చదవలేకపోతున్నామంటున్న విద్యార్థులు రామాయంపేట : విద్యార్థులు చదువు మాటేమోగానీ ప్రతిరోజూ రోడ్డెక్కుతున్నారు. బస్సులకోసం రోజూ ఎక్కడో ఒక చోట ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్సులు సరిగా రాక పోవడం, వందలాది మంది విద్యార్థులకు సరిపడేటన్ని బస్సులు లేకపోవడం ఆందోళనకు దారి తీస్తుంది. పదిహేను రోజులుగా రోజూ విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తునే ఉన్నారు. మండలంలోని జాన్సీలింగాపూర్, ఆర్.వెంకటాపూర్, నందగోకుల్, రాయిలాపూర్ స్టేజీ, చల్మెడ స్టేజీ వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఒక్కో ప్రాంతం నుంచి వందలాది మంది విద్యార్థులు చదువు నిమిత్తం రామాయంపేటకు వస్తుండగా వారికి సరిపడేటన్నీ బస్సులు రావడం లేదు. నిజామాబాద్ జిల్లా బీబీపేట, ఇస్సానగర్, ఉప్పర్‌పల్లి, చల్మెడగ్రామాలకు చెందిన 350 మంది విద్యార్థులు, నార్లాపూర్, కల్వకుంట, బచ్చురాజ్‌పల్లి, రాయిలాపూర్ గ్రామాలకు చెందిన 500 మంది విద్యార్థులు, చేగుంట మండలం పులిమామిడి, బోనాల, ఇబ్రహీంపూర్, రామాయంపేట మండలం డి.ధర్మారం, శివాయిపల్లి, సుతార్‌పల్లి, ఆర్.వెంకటాపూర్ గ్రామాల నుంచి 400 మంది విద్యార్థులు చదువు నిమిత్తం రోజూ రామాయంపేటకు వస్తున్నారు. ఉదయం పూట ఒక్కోరూట్ నుంచి ఒక బస్సును మాత్రమే నడిపిస్తుండగా అది సరిపోక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 7 గంటలకే ఇంట్లో నుంచి బయలుదేరినా తాము ఏ రోజూ సకాలంలో కాలేజీలకు వెళ్లలేక పోతున్నామని విద్యార్థులు వాపోయారు. ఆర్టీసీ డ్రైవర్లు స్టేజీల వద్ద బస్సులను ఆపడం లేదని, దీంతో తాము ఆటోలు, ట్రాక్టర్లు ఇతర వాహనాల్లో అష్టకష్టాలు పడి రామాయంపేటకు చేరుకుంటున్నామని వాపోయారు. తమకు బస్సుటాప్ ప్రయాణాలు తప్పడంలేదని, ప్రమాదమని తెలిసినా టాప్‌పై ప్రయాణిస్తున్నామన్నారు. ప్రమాదకరంగా బస్సు టాప్‌పై ప్రయాణిస్తున్నాం.. నాలుగు, ఐదు వందల మంది విద్యార్థులకు ఒకే బస్సు నడిపితే ఎలా ఎక్కేది. దీంతో ప్రతిరోజూ డ్రైవర్, కండక్టర్‌తో గొడవలు జరుగుతున్నాయి. దీంతో ప్రమాదకర పరిస్థితుల్లో టాప్‌పై కూర్చోవాల్సి వస్తోంది. -నాగరాజు, ఇంటర్ విద్యార్థి, ఆర్.వెంకటాపూర్ రోజూ ఇబ్బందులే... ఆర్టీసీ బస్సులు సరిగా రాకపోవడంతో తాము కాలేజీలకు వెళ్లడానికి ప్రతిరోజూ ఇబ్బందులకు గురవుతున్నాం. బస్సులు సరిగా ఆపడం లేదు. దీంతోప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. - మధు, ఇంటర్ విద్యార్థి, ఆర్.వెంకటాపూర్ గంటల తరబడి రోడ్డుపై పడిగాపులు కాస్తున్నాం... సకాలంలో ఆర్టీసీ బస్సులు రాకపోవంతో ప్రతి రోజూ గంటల తరబడి రోడ్డుపై పడిగాపులు కాయాల్సి వస్తోంది. వచ్చినా బస్సుల నిండా ప్రయాణికులు ఉంటున్నారు. దీంతో తాము బస్సులో ఎక్కలేని పరిస్థితి నెలకొంది. -ప్రియాంక విద్యార్థిని, డి.ధర్మారం రోజూ కళాశాలకు ఆలస్యంగా వెళ్తున్నాం... ఆర్టీసీ బస్సు సకాలంలో రాకపోవడంతో ప్రతి రోజూ కళాశాలకు ఆలస్యంగా వెళ్తున్నాం, దీంతో మొదటి పిరియడ్ పూర్తి కావస్తున్న సమయంలో తాము కాలేజీలో అడుగుపెడుతున్నాం. అదనపు ట్రి ప్పులు నడపాలి. -రేవతి, ఇంటర్ విద్యార్థిని, బోనాల -
హాస్టల్ వర్కర్ల రాస్తారోకో
- ఐటీడీఏ వద్ద కొనసాగుతున్న దీక్షలు - డీడీతో కొలిక్కిరాని చర్చలు పాడేరు: ఆందోళనలో భాగంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ వసతిగృహాల డైలీవైజ్, క్యాజువల్ వర్కర్లు శనివారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు. బకాయి వేతనాలు చెల్లించాలని, తమను రెగ్యులర్ చేయాలని, డైలీవైజ్ వర్కర్లు చేపట్టిన నిరవధిక నిరాహారదీక్షలు శనివారం రెండోరోజు కొనసాగాయి. రాస్తారోకో చేసిన హాస్టల్ వర్కర్లు తమకు పీఎఫ్, గ్రాడ్యుటీ, ప్రమాదబీమా, యూనిఫాం తదితర సౌకర్యాలు కల్పించాలని, కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, తొలగించిన క్యాజువల్ వర్కర్లను, హెల్త్ వలంటీర్ల్లనువిధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. దీక్షలకు పలు సంఘాల మద్దతు... తమ డిమాండ్ల పరిష్కారం కోసం దీక్షలు చేపట్టిన హాస్టల్ వర్కర్లకు శనివారం పలు సంఘాలు మద్దతునిచ్చాయి. గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.అప్పారావు, రూఢి అప్పారావు, కాంగ్రెస్ నాయకులు అశోక్, కెజియా, వుడా త్రినాథ్, గెమ్మెలి సర్పంచ్ అప్పలనాయుడు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు వి.భాగ్యలక్ష్మి, పంచాయతీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కె.అర్జున్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు శంకురాజు ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించి హాస్టల్ వర్కర్ల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. డీడీతో చర్చలు విఫలం హాస్టల్ వర్కర్ల సమస్యలపై గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎం.కమలతో శనివారం సీఐటీయూ నాయకులు ఉమా మహేశ్వరరావు, శ్రీను, హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలన్నచర్చలు జరిపారు. హాస్టల్ వర్కర్ల సమస్యలపై డీడీ కమల స్పందిస్తూ డైలీవైజ్, క్యాజువల్ వర్కర్లకు వేతన బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని, తొలగించిన క్యాజువల్ వర్కర్లందరిని ప్రభుత్వ అనుమతితో విధుల్లోకి తీసుకుంటామని, కలెక్టర్ గెజిట్ ప్రకారం పెరిగిన వేతనాలను ఎరియర్స్‌తో సహా చెల్లిస్తామని యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. అలాగే పిఎఫ్, గ్రాడ్యుటీ, ఇన్సూరెన్స్ మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని, ప్రస్తుతం ఏజెన్సీలో పని చేస్తున్న 110 మంది డైలీవైజ్ వర్కర్లను రెగ్యులర్ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదించామని, ప్రభుత్వ అనుమతి రాగానే వీటిని పరిష్కరిస్తామని ఆమె వివరించారు. నోటిమాట సరిపోదని, ఈ హామీలపై రాతపూర్వకంగా తమకు ఇవ్వాలని, అప్పటి వరకు ఆందోళన విరమించేది లేదని యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. దీంతో చర్చలు కొలిక్కి రాలేదు. -
ఆగని నిరసన
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఆసరా’ పథకం తమకు అందడం లేదంటూ లబ్ధిదారులు సోమవారం కూడా నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు కొనసాగించారు. నిజామాబాద్, ఆర్మూ రు, బోధన్, కామారెడ్డి డివిజన్లలో అర్హత కోల్పోయిన పలువురు రోడ్లెక్కారు. అధికారులు ఈ నెల పది నుంచి పింఛన్ల పంపిణీని ప్రారంభించిన విషయం విదితమే. చివరి రోజైన సోమవారం నాటికి మొత్తం 2,03,868 మందికి నవంబర్, డిసెంబర్ నెలలకు చెందిన పింఛన్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. మొదటి రోజే బాలారిష్టాలు తప్పలేదు. ఆ రోజు, మొత్తం 2,03,886 మంది లబ్ధిదారులకుగాను 21,157 మందికే రూ.4.42 కోట్లు అందజేశారు. ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా అధికారులతో సమీక్ష జరిపిన కలెక్టర్ రోనాల్డ్‌రోస్ పంపిణీలో వేగం పెంచారు. అయినా, సోమవారం జిల్లా కేంద్రంలో జరిగే ప్రజావాణికి వేలాది మంది దరఖాస్తులతో తరలిరావడంతో నగరం జాతరను తలపించింది. తేలని అర్హుల జాబితా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఆద్యంతం ఆందోళనలకు కారణమవుతోంది. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలలో చాలా మంది ఈసారి అవకాశం కోల్పోయా రు. ఈ నేపథ్యంలో జనం రోడ్లెక్కారు. నిజామాబా ద్ కార్పొరేషన్‌తోపాటు ఆర్మూరు, బోధన్ మున్సిపాలిటీల ఎదుట ధర్నాకు దిగారు. పలుచోట్ల వృద్ధులు, మహిళలు, వికలాంగులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. ‘ఆసరా’ కింద మొత్తం 3,62,166 దరఖాస్తులు రాగా, అందులో 2,03,868 మందిని అర్హులుగా ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఫించన్ల జాబితాలో పేర్లు లేని వారందరూ ఆందోళనబాట పట్టారు. నిజామాబాద్ కార్పొరేషన్‌ను ముట్టడించిన వృద్ధులు, వికలాంగులు అనంతరం ధర్నాచౌక్‌లో రాస్తారోకో నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బోధన్ మున్సిపల్ కమిషనర్ డీవీవీ ప్రసాదరావును నిలదీశారు. బోధన్ పట్టణంలో పలు వార్డులకు సంబంధించిన తమ పేర్లు పింఛన్ జాబితాలో లేవని అధికారులను ప్రశ్నించారు. ఆర్మూరు మున్సిపాలిటీ ఎదుట ఫించన్ల కోసం చేపట్టిన దీక్షలు ఆరవ రోజుకు చేరాయి. ఎంపీడీఓ, తహసీల్దారు కార్యాలయాల ఎదుట మున్సిపాలిటీలతోపాటు జిల్లావ్యాప్తంగా ఎంపీడీఓ, తహసీల్దారు కార్యాల యాల ఎదుట లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఇందులో అత్యధికంగా వృ ద్దులు, వికాలాంగులు పాల్గొన్నారు. బోధన్‌లో హుస్సా, మందారా గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. బాల్కొండ మండలం ముప్కాల్, రెంజర్లలో పంపిణీ కా వల్సిన పింఛన్లకు సంబంధించి నగదు కొరత ఏర్పడింది. గ్రామ పంచాయతీల వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాశారు. కమ్మర్పల్లి మండలం ఉప్పులూర్కు చెం దిన అనేక మంది పింఛన్లు రావడం లేదంటూ తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఫించన్ల కోసం తరచుగా అర్హులైన లబ్ధిదారులు ఆందోళనలకు దిగుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రం లో వృద్ధులు ధర్నా చేశారు. కోటగిరిలోనూ ఆందోళన చేశారు. పింఛన్లు రాలేదం టూ ధర్పల్లి మండల మండల కార్యాలయాన్ని ముట్టడించారు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, సదాశివనగర్ మండలాల తహసీల్దారు కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి వినతిపత్రాలను సమర్పించారు. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో గ్రామ పంచాయతీల వద్దా నిరసనలు కొనసాగాయి. -
ఎస్ఎంఎస్ కార్మికుల రాస్తారోకో
పూసపాటిరేగ, న్యూస్‌లైన్ : స్థానిక జాతీ య రహదారిపై ఎస్ఎంఎస్ కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కార్మికుల డిమాండ్లు పరిష్కారం కోరుతూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. యూజమాన్యం దిగిరాకపోవ డం.. తిరిగి కార్మికులపైనే దాడులకు దిగడంతో వారంతా శుక్రవారం సుమారు 20 నిమిషాలపాటు జాతీయ రహదారి పై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భం గా కార్మికులనుద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ.. యాజమాన్యం మొండివైఖరి విడనాడాలని అన్నారు. ఇద్దరు కార్మికుల కోసం యాజమాన్యం అనుసరిస్తున్న తీరు బాధాకరమన్నారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నా రు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందిం చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పరిశ్రమ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సూర్యనారాయణ, పలువురు కార్మికులు పాల్గొన్నారు. -
వ్యవసాయ వర్శిటీ తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాస్తారోకో
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాయచూరులో,తాలూకా కేంద్రాల్లో గురువారం రాస్తారోకో చేశారు. రాయచూరులో ఏడో మైలు క్రాస్ వృత్తం వద్ద ఏఐఆర్డబ్ల్యూ, ఏఐఆర్ఎస్ఓ, ఆర్వైఎఫ్వై నేతృత్వంలో దాదాపు 15 నిమిషాల పాటు రాస్తారోకో చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు మానసయ్య ,రాజశేఖర్ , నూర్జహాన్ తదితరులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక రైతు సంఘం రాష్ట్రధ్యక్షడు మానసయ్య మాట్లాడుతూ రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 20 ఏళ్ల నుంచి తాత్కాలిక ఉద్యోగులుగా విధులు నిర్వహించిన వారిని తొలగిస్తూ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి బి.వి.పాటిల్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు.తాత్కాలిక ఉద్యోగులు 8 రోజుల నుంచి జిల్లాధికారి కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నా విశ్వవిద్యాలయం పాలకమండలి స్పందించలేదని విమర్శించారు. వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.