రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. టికెట్ల కోసం పోటాపోటీగా సమావేశాలు పెడుతూ వీధికెక్కుతున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభకు వ్యతిరేకంగా ఆ పార్టీ బీసీ నాయకుడు పైలా సుభాష్‌చంద్రబోస్ వర్గీయులు గురువారం రాస్తారోకో నిర్వహించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టికెట్లన్నీ ఓసీలకే ఇస్తున్నారని పలువురు టీడీపీ బీసీ నేతలు మీడియా ముందుకు వచ్చి నిరసన తెలియజేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ తనదంటేతనదని టీడీపీ నాయకులు బూరగడ్డ వేదవ్యాస్, కాగిత కృష్ణప్రసాద్ ఎవరికివారే ప్రచారం చేసుకుంటున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు టీడీపీలో వర్గపోరు తారస్థాయికి చేరింది. టీడీపీ నియోజకవ ర్గ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభకు వ్యతిరేకంగా ఆ పార్టీలో బలహీనవర్గాల నుంచి మరో నాయకుడైన పైలా సుభాష్‌చంద్రబోస్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఈ రెండు వర్గాల మధ్య కుమ్ములాటలు ఈనాటివి కావు. ఏలేశ్వరంలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు జరిగిన సందర్భంగా సత్యప్రభ భర్త, అప్పటి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి వరుపుల రాజా వర్గానికి చెందిన నేతపై పైలా వర్గీయులు చేయిచేసుకున్నారు.
ఆ తరువాత వీరి మధ్య విభేదాలు ముదురు పాకానపడ్డాయి. రాజా హఠాన్మరణం తరువాత ఆయన భార్య సత్యప్రభకు నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె నాయకత్వంపై పైచేయి సాధించేందుకు బోస్ వర్గం గట్టి ప్రయత్నమే చేస్తోంది. సత్యప్రభకు ప్రత్తిపాడు సీటు ఖాయమైందంటూ పార్టీ ముఖ్య నేతల నుంచి సంకేతాలు అందడంతో ఏలేశ్వరం మెయిన్ రోడ్డులో సత్యప్రభకు వ్యతిరేకంగా పైలా వర్గ నేతలు గురువారం రాస్తారోకో నిర్వహించారు.
బీసీలకు రిక్తహస్తం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో బీసీలకు స్థానం దక్కలేదు. నెల్లూరు ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎక్కడా బీసీలకు సీట్లు కేటాయిస్తున్నట్లు ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో వారు రగిలిపోతున్నారు. వెంకటగిరి సీటును బీసీలకే కేటాయించాలంటూ పలువురు టీడీపీ నేతలు మీడియా ముందు డిమాండ్‌చేశారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో గూడూరు, సూళ్లూరుపేట ఎస్సీ రి జర్వ్‌డ్. మిగిలిన 8 నియోజకవర్గాలైన వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, కావలి సీట్లు దాదాపు అగ్రవర్ణాలకే ఖరారయ్యాయని టీడీపీ అనుకూల పత్రిక ద్వారా ఇటీవల లీకులిచ్చారు. వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ.. సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. నెల్లూరు రూరల్‌లో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. నెల్లూరు నగరంలో పొంగూరు నారాయణ.. కోవూరులో దినేష్ లేదా సుమంత్‌రెడ్డి.. కావలిలో కావ్య కృష్ణారెడ్డి.. ఉదయగిరిలో కాకర్ల సురేష్ లేదా బొల్లినేని రామారావుకే సీట్లు ఖరారయ్యాయని ఆ పత్రికలో ప్రచురించారు. ఎక్కడా బీసీ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోలేదనే అంశం దీని ద్వారా వెల్లడైంది.
నమ్ముకున్న వారిని నట్టేట ముంచి..
♦ జిల్లాలో మాజీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు పార్టీ పదవులతోనే టీడీపీ సరిపెట్టింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంట్రీకి అవకాశం కల్పించలేదు.
♦ ఉదయగిరిలో జెడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబుయాదవ్ పార్టీని నమ్ముకొని కష్టపడుతున్నా, ఆయన పేరునూ పరిగణనలోకి తీసుకోలేదు.
♦ గత ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీకి అభ్యర్థి దొరకలేదు. దీంతో చివరి నిమిషంలో మై నార్టీ నేత అబ్దుల్ అజీజ్‌కు అవకాశమిచ్చారు. ఆ సీటు పోతుందని తెలిసినా ఆయన బరిలో నిలిచారు. ఆటు పోట్లకు ఎదురొడ్డి నిలిచినా చివరికి మొండిచేయి చూ పారు. వెంకటగిరిలో మస్తాన్‌యాదవ్ కు పార్టీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చి చివరికి మోసం చేశారు.
♦ కావలిలో పసుపులేటి సుధాకర్‌ను నమ్మించి పార్టీ ఫండ్ సేకరించి హ్యాండిచ్చారు. నెల్లూరు పార్లమెంట్ స్థా నానికీ ఇదే తీరును అవలంబించారు.వెంకటగిరి సీటు ను బీసీలకే ఇవ్వాలనే డిమాండ్‌తో సైదాపురంతో పాటు పలు మండలాల బీసీ నేతలు మీడియా ముందుకొ చ్చారు. టీడీపీలో బీసీలకు న్యాయం జరగాలంటే మస్తాన్‌యాదవ్‌కు సీటు ఖరారు చేయాలని కోరారు.
పెడన ఎమ్మెల్యే అభ్యర్థిని నేనే: వేదవ్యాస్
కృత్తివెన్ను: పెడన నియోజకవర్గంలో ఓటు అడిగే హక్కు తనకు మాత్రమే ఉందని, పెడన ఎమ్మెల్యే అభ్యర్థిని తానే నని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాస్ అ న్నా రు. గురువారం ఆయన మండలంలోని చినగొల్లపాలెంలో విలేకరులతో మాట్లాడారు. పెడన సీటు ఎవరికీ కేటాయించలేదని, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తానే పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. మరోవైపు బుధవారం టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్‌కు సీటు కేటాయించారంటూ ఆయన వర్గీయులు బాణాసంచా కాల్చడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment