పూసపాటిరేగ, న్యూస్‌లైన్ : స్థానిక జాతీ య రహదారిపై ఎస్‌ఎంఎస్ కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కార్మికుల డిమాండ్లు పరిష్కారం కోరుతూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం విదితమే. యూజమాన్యం దిగిరాకపోవ డం.. తిరిగి కార్మికులపైనే దాడులకు దిగడంతో వారంతా శుక్రవారం సుమారు 20 నిమిషాలపాటు జాతీయ రహదారి పై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భం గా కార్మికులనుద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ.. యాజమాన్యం మొండివైఖరి విడనాడాలని అన్నారు.
ఇద్దరు కార్మికుల కోసం యాజమాన్యం అనుసరిస్తున్న తీరు బాధాకరమన్నారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న కార్మికులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయమన్నా రు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందిం చకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పరిశ్రమ యాజమాన్యం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బి.సూర్యనారాయణ, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
ఎస్‌ఎంఎస్ కార్మికుల రాస్తారోకో
Published Sat, Jun 7 2014 3:04 AM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM
Advertisement