
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న మృతురాలి బంధువులు రోదిస్తున్న మృతురాలి తల్లి కోమల
ఘట్‌కేసర్: ఇంటికి తీసుకెళుతున్నట్లు నమ్మించి తన కుమార్తె, మనుమడిని దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు మచ్చల రమేష్‌ను కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి తల్లి కోమల డిమాండ్ చేసింది. జనగామ జిల్లా, పాలకుర్తి మం డలం గూడూరుకు చెందిన మచ్చల రమేష్, వరంగల్ రూరల్ జిల్లా బొల్లికుంటకు చెందిన దళిత యువతి శుశ్రుతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి కుమారుడు (4 నెలలు) ఉన్నాడు. శనివారం రాత్రి రమేష్ తన భార్య, కుమారుడిని ఘట్‌కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ ప్రభాకర్ ఎన్‌క్లేవ్ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం విదితమే. దీనిపై సమాచారం అందడంతో çశుశ్రుత తల్లి కోమల, మేనమామ ప్రమోద్, బంధువులు సోమవారం ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
పథకం ప్రకారమే..
శుశ్రుత అడ్డు తొలగిన్తేనే ఇంటికి రానిస్తామని రమేష్ తల్లితండ్రులు, బాబాయి, కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో అందరూ కలిసి తన కుమార్తెను అంతమొందించారని మృతురాలి తల్లి కోమలి ఆరోపించింది. దళితులమైనందుకే చంపేశారని, ఇది ముమ్మాటికి పరువు హత్యేనని ఆమె పేర్కొంది. కుట్రలో పాల్గొన్న నిందితులందరిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment