ప్రకాశం జిల్లాలో పరువు హత్య?
Published Thu, Nov 17 2016 8:01 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
బెస్తవారిపేట: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో గురువారం వెలుగుచూసింది. మండలంలోని సలకలవీడు గ్రామానికి చెందిన స్వాతి(24) ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కాగా స్వాతి మరణించిన విషయం ఆమె తల్లిదండ్రులకు తెలియజేయకుండా అత్తింటివారే దహన సంస్కారాలు పూర్తి చేశారు.
దీంతో విషయం తెలుసుకున్న స్వాతి తల్లిదండ్రులు సలకలవీడుకు చేరుకుని తమ కూతురు ఏదని నిలదీయడంతో ఆత్మహత్య చేసుకుందని.. దహన సంస్కారాలు చేశామని.. పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్వాతికి ఐదేళ్ల క్రితమే వివాహమైంది. ఆమె భర్త ఆర్మీలో పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాగా స్వాతి తీరు సరిగ్గా ఉండేది కాదని భర్త ఉద్యోగానికి వెళ్లిన తర్వాత వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని స్ధానికులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పలుమార్లు ఆమెను హెచ్చరించినా.. తీరు మార్చుకోకపోవడంతో అత్తింటి వారే హతమార్చి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement