సాక్షి, న్యూఢిల్లీ: ప్రేమలో పడ్డందుకు యువతీయువకుల ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని ఆటవిక సమాజం అడుగడుగునా జడలువిప్పుతోంది. ప్రేమలో పడిన కారణంగా ఏ వ్యక్తినీ శిక్షించే అర్హత ఎవరికీ లేదంటూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోమారు విస్పష్టంగా తేల్చి చెప్పింది. ప్రేమలో పడినందుకు దండించడం నేరమని సుప్రీంకోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానం...
ఒకరినొకరు ప్రేమించి, జీవితాన్ని పంచుకోవాలని భావించిన యువతీయువకులను దండించడం కోర్టు దృష్టిలో శిక్షార్హమైన నేరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే అన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం అత్యంత దారుణమైన నేరమని వ్యాఖ్యానించారు.
అసలేం జరిగింది?
ప్రేమలో పడ్డ ఓ జంట, ఇల్లు వదిలి పారిపోయారు. వారికి ఓ దళిత బాలుడు సహాయపడ్డాడు. పెద్దల కోపం చల్లారిందని భావించిన ఆ ప్రేమికులు తిరిగి ఊరికి రావడంతో సనాతనవాదులు వారిద్దరినీ, వారికి సాయపడిన బాలుడినీ చెట్టుకి వేలాడదీసి, ఉరివేశారు. ఉరితీసే ముందు ఈ ఇద్దరు బాలురి మర్మాంగాలను కాల్చివేయడం ఆటవిక సమాజపు ఆనవాళ్ళను గుర్తుకు తెస్తోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా మెహ్రాణా గ్రామంలో 1991లో జరిగింది.
ఖాప్ పంచాయితీల క్రూరత్వం...
ప్రేమించుకొని, పెళ్ళి చేసుకోవాలని భావించి, ఇల్లువదిలి పారిపోయిన బాలికను, ఆమె ప్రియుడినీ, వీరిద్దరికీ సాయపడిన మరో దళిత బాలుడినీ చెట్టుకి ఉరివేసి చంపిన నేరానికి ఎనిమిది మందికి కోర్టు మరణశిక్ష విధించింది. మిగిలిన వారికి జీవిత ఖైదుని విధించింది. ఆ తరువాత 2016లో అలహాబాద్ హైకోర్టు మరణశిక్ష ను కూడా జీవిత ఖైదుగా మార్చింది. ఈ కేసులో ఖాప్ పంచాయితీకి చెందిన 11 మంది సభ్యుల బెయిలు కోసం పెట్టుకున్న పిటషన్‌పై విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ.బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది. ‘‘మెహ్రాణా పరువు హత్య’’ఖాప్ పంచాయితీల నేరపూరిత వైఖరిని పరాకాష్టకు చేర్చింది. ఇదే విషయంలో బెయిలు కోసం పెట్టుకున్న పిటిషన్‌లను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించింది.
కోర్టు ఏం చెప్పింది?
ఖైదీలతో ముఖాముఖి మాట్లాడాలని ఆగ్రా, మథుర సెంట్రల్ జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. జైలులో దోషుల ప్రవర్తనపై రికార్డులను రెండు వారాల్లోగా సమర్పించాలని కోరింది. రిపోర్టులో శిక్షాకాలాన్ని కూడా నమోదుచేయాలని తెలిపింది. వీటిని బట్టి ఖైదీలను బెయిలుపై విడుదల చేయడంవల్ల ఏదైనా నష్టమున్నదా అనే విషయాన్ని పరిశీలించనుంది.
రైతులకు రక్షణ ఉందా?
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తోన్న రైతులను కోవిడ్ నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది అని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశి్నంచింది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కోర్టు వ్యాఖ్యానించింది. గత ఏడాది దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించినప్పుడు ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని తబ్లిగీ జామాత్ లో భారీ సంఖ్యలో జనం సమావేశం అవడం, అలాగే ఆనంద్ విహార్ బస్ టెరి్మనల్‌వద్ద వలస కారి్మకులు గుమిగూడిన అంశాల్లో సీబీఐ దర్యాప్తు తదితర విషయాలపై విచారించిన సుప్రీంకోర్టు కోవిడ్ నుంచి రైతుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రేమిస్తే హత్యలా?
Published Fri, Jan 8 2021 8:44 AM | Last Updated on Fri, Jan 8 2021 9:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment