ఆ యువతి కూడా రవి ప్రేమలో.. | Honor Killing in Karnataka | Sakshi
Sakshi News home page

మాగడిలో పరువు హత్య?

Jul 3 2019 6:43 AM | Updated on Jul 3 2019 6:43 AM

Honor Killing in Karnataka - Sakshi

హత్యకు గురైన రవి (ఫైల్‌)

యువకుడి ప్రాణాలు తీసిన వైనం

కర్ణాటక, దొడ్డబళ్లాపురం : కూతురిని ప్రేమిస్తున్నాడనే కోపంతో యువకుడిని హత్య చేసిన సంఘటన మాగడి తాలూకా మానగల్‌ గ్రామంలో చోటుచేసుకుంది. మానగల్‌ గ్రామానికి చెందిన రవి (24) హత్యకు గురయ్యాడు. పరువు హత్యకు సంబంధించి వివరాలు... చిన్నచిన్న సబ్‌ కాంట్రాక్టులు చేసుకుని జీవిస్తున్న రవి ఇదే గ్రామానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ఆ యువతి కూడా రవి ప్రేమలో పడింది. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు రవిని పలుసార్లు హెచ్చరించారు. అయినా రవిలో మార్పు రాలేదు. దీంతో యువతి కుటుంబ సభ్యులు బంధువులు కొందరు రవితో మాట్లాడాలని ఆటోలో గ్రామం శివారులోకి తీసికెళ్లి దాడిచేసి హత్య చేసి, గుడేమారనహళ్లి వద్ద పొదల్లో శవాన్ని విసిరేసి వెళ్లిపోయారని రవి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement