రౌడీ సైకిల్ రవి
యశవంతపుర : మీటర్ వడ్డీ, నెలమామూళ్లు వసూలు, రియల్ ఏస్టేట్ దందాలపై ఆరోపణలున్న రౌడీ సైకిల్ రవి కార్యకలపాలపై సీసీబీ పోలీసులు తీవ్రంగా విచారణను చేపట్టారు. అందులో భాగంగా రవి అనుచరులైన మూర్తి అలియాస్ బేకరి మూర్తి, నవీన్, రమణను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. నిందితులు ముగ్గురూ రవి చేసే ప్రతి అక్రమాల్లోనూ భాగస్వామ్యం ఉన్నట్లు పోలీసుల విచారణలో బయట పడింది. ఎక్కడెక్కడ రియల్ ఏస్టేట్ సెటిల్‌మెంట్లు చేశారు, డబ్బు కోసం ఏవరేవరిని అపహరించి వేధించారు, మీటర్ వడ్డీ తదితర ఘటనపై ఆరా తీస్తున్నారు.
గతంలో ఓ వ్యాపారవేత్తను బంధించి వేధించిన విషయాలను ముగ్గు రు నిందితులు పోలీసుల ముం దు అంగీకరించినట్లు తెలిసింది. సినీ ప్రముఖలను, అనేక మంది రియల్‌ఎస్టేట్ వ్యాపారులను కూడా సీసీబీ కార్యాలయానికి పిలిపించి విచారించాలని నిర్ణయించారు. 20 సిమ్‌ల ద్వారా చేసిన ఫోన్ కాల్ లిస్టును తెప్పించుకొని పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. గతంలో రవి ఇంటిలో స్వాధీనం చేసుకున్న పత్రాలను కూడా సీనియర్ పోలీసు అధికారులు పరిశీలీస్తున్నారు. రవి కుటుంబసభ్యుల పేరున ఆ రు ఖరీదైన ఇంటి స్థలాలున్నట్లు గుర్తిం చారు. వీటి విలువ మార్కెట్‌లో సుమారు రూ. 8 నుంచి రూ. 10 కోట్ల వరకు ఉండవచ్చని అంచన వేశారు. అక్రమాస్తులు అధికంగా ఉన్నట్లు తేలడంతో కేసును ఈడీ అప్పగించాలని సీసీబీ పోలీసులు యోచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment