
మండ్య: ప్రేమ పాశంలో చిక్కుకున్న యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలిక చేత తల్లిదండ్రులు ఫోన్ చేసి పిలిపించి కొట్టడంతో మృత్యువాత పడ్డాడు. ఈ ఘోరం బుధవారం అర్ధరాత్రి సమయంలో మండ్య నగరంలోని కల్లజళ్ళి లేఔట్‌లోని విశ్వేశ్వర నగరలో చోటు చేసుకుంది. బాధిత యువకుడు అదే ప్రదేశానికి చెందిన సతీష్ కుమారుడు దర్శన్ (17). అదే ప్రాంతంలో ఉండే 10వ తరగతి బాలికతో అతడికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. తరచూ ఫోన్లతో మాట్లాడడం, బయట కలుస్తూ ఉండేవారు. ఈ విషయం తెలిసి బాలిక తల్లిదండ్రులు మండ్య నగరసభ 7వ వార్డు సభ్యుడు, స్థాయి సమితి అధ్యక్షుడైన శివలింగ, ప్రభుత్వ టీచర్ అనురాధ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. అతనికి ఎలాగైనా గట్టిగా బుద్ధి చెప్పాలని పథకం వేశారు.
ఇంట్లో ఎవరూ లేరని చెప్పించి..
ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో బాలిక తల్లిదండ్రులు ఆమె చేత యువకునికి ఫోన్‌చేయించి మా ఇంట్లో ఎవరూ లేరు, నువ్వు రా అని చెప్పించారు. నిజమేనని నమ్మి దర్శన్ వెళ్లాడు. అతని కోసం కాచుకుని కూర్చున్న బాలిక కుటుంబీకులు అతన్ని పట్టుకుని తీవ్రంగా కొట్టారు. దర్శన్ అరుపులు విన్న చుట్టుపక్కలవారు అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు పరుగున వచ్చారు. వారి ముందే మళ్లీ కొట్టడంతో అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. చుట్టుపక్కల వారితో కలిసి మండ్య మిమ్స్ ఆస్పత్రికి తరలిచారు. కొంతసేపటికి అక్కడ దర్శన్ చనిపోయాడు. దర్శన్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మండ్య పశ్చిమ విభాగం పోలీసులు పరిశీలన జరిపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యువకుని మృతికి కారణం అయినవారిని అరెస్టు చేయాలని స్థానికులు డిమాండు చేశారు.
చదవండి: దారుణం: కూతురిపై తండ్రి కాల్పులు
Comments
Please login to add a commentAdd a comment