సాక్షి, హైదరాబాద్ : నగరంలోని తిరుమలగిరిలో పరువు హత్య చోటు చేసుకుంది. నందకిషోర్ అనే వ్యక్తిని భార్య తరపున బంధువులు శనివారం అర్ధరాత్రి దారుణంగా కొట్టి చంపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల క్రితం తిరిమలగిరిలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ యువతిని నందకిషోర్ ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో పథకం ప్రకారం కిషోర్‌ని హత్య చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసునమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment