thirumalagiri
-
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం: ఇక నలుదిశలా ‘దళిత బంధు’
-
కట్టుకున్నోడే కాలయముడు
సాక్షి, తిరుమలగిరి : కట్టుకున్నోడే కాల యముడయ్యాడు. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన భర్తే భార్యపై కిరోసిన్ పోసి అగ్నికి ఆహుతి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన మూడ మణెమ్మ (28)ను ఈటూరు గ్రామానికి చెందిన మూడ ఉ పేందర్కు ఇచ్చి 2009వ సంవత్సరంలో వివాహం జరిపించారు. ఆటో డ్రైవర్ అయిన ఉపేందర్ తిరుమలగిరిలోనే ఆటో నడుపుకుంటూ భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఉపేందర్ గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసై ప్రతి రోజూ భార్యను కొడుతూ వేధిస్తున్నాడు. ఆదివా రం సాయంత్రం మద్యం సేవించి వచ్చి ఇంట్లో ఉన్న భార్యతో ఘర్షణ పడ్డాడు. దాంతో ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను మణెమ్మపై పోసి అంటించడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన చుట్టుపక్కల వారు బాధితురాలిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణెమ్మ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందింది. మణెమ్మ తల్లి ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుమలగిరి ఎస్ఐ బి.డానియల్‌కుమార్ తెలిపారు. -
మంచం పట్టిన సఫావత్ తండా
సాక్షి, తిరుమలగిరి (నాగార్జునసాగర్) : అపరిశుభ్రతో... కలుషిత తాగునీరో... కారణమేదో కానీ ఆ తండాను జ్వరం మహమ్మారి పట్టిపీడిస్తోంది. వైరల్ ఫివతో తండా వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. జబ్బు చేసిందని హాస్పిటల్‌కు వెళితే మందు గోళీలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ప్రైవేట్ హాస్పిటల్‌కు వెళ్లినా డబ్బులు ఖర్చవుతున్నాయే తప్ప రోగం మాత్రం నయం కావడం లేదంటూ తండా వాసులు వాపోతున్నారు. తండాలో ఇప్పటి వరకు 100 మందికి పైగా జ్వరంతో మంచం పట్టగా ఒక్కో కుటుంబానికి రూ. 20వేలకు పైగానే ఖర్చయిందని, అయినా జబ్బు నయం కావడం లేదంటున్నారు. ఇదీ తిరుమలగిరి మండలం సఫావత్ తండా పరిస్థితి. తండాలో 756 మంది జనాభా ఉన్నారు. ఈ తండాలో ఎక్కువగా రైతులు, కూలీలే ఉన్నారు. వీళ్లు బతుకుదెరువు కోసం చుట్టుపక్కల కూలి పనికి వెళ్తుంటారు. సుమారు ఇరవై రోజులుగా వీరి కుటుంబ సభ్యులకు జ్వరం వస్తుంది. దాంతో మిర్యాలగూడ, హాలియా వంటి పెద్దాసుపత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు చేసినా జ్వరం మాత్రం నయం కావడం లేదంటున్నారు. రోజూ వచ్చే కూలి పోతుందని, ఉన్న డబ్బులు కూడా ఖర్చవుతున్నాయని బాధితులు ఆందోళన చెందుతున్నారు. అపరిశుభ్రతకు నిలయంగా.. మండలంలోని సఫావత్తండా అపరిశుభ్రతకు నిలయంగా మారింది. తండాలో డ్రెయినేజీలు లేకపోవడంతో ఇళ్లలోని మురుగునీరు మొత్తం రోడ్డుపైకి చేరి రోజుల కొద్దీ నీరు నిల్వ ఉంటుంది. అదే విధంగా తండాలో పెంటదిబ్బలు ఇళ్లమధ్యలోనే ఉండటం, తండాకు సరఫరా అయ్యే మంచినీటి ట్యాంకులను కూడా శుభ్రపరచకపోవడంతో అపరిశుభ్రతకు నిలయంగా మారింది. గిరిజన ప్రజలకు మరుగుదొడ్లపై అవగాహన కల్పించాల్సి ఉన్నా వారు మనకేంటిలే అని వ్యవహరిస్తుండటంతో తండాలో కనీసం 30 శాతం మేరకూడా మరుగుదొడ్లు లేవు. దాంతో మలమూత్రాలను రోడ్డువెంటనే విసర్జిస్తున్నారు. దీంతో తండా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. అవగాహన కార్యక్రమాలేవీ..? పరిసరాల పరిశుభ్రత... రోగాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ వైద్యఆరోగ్యí సిబ్బంది ఆ దిశగా అడుగులు మాత్రం వేయడం లేదు. ప్రజలకు రోగాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య సిబ్బందిపై ఉన్నా తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతోనే ప్రజలు అవస్థలు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ వైద్యం అందించాలి.. తండాలోని ప్రజలంతా జ్వరాలతో బాధపడుతున్నారు. అంతా కూలి పనులు చేసుకొని బతి కేటోళ్లమే. రోగం వస్తే చూపించుకునే స్థోమత కూడా మాకు లేదు. ప్రై వేట్ వైద్యం చేయించుకోవాలంటే అప్పు చేయాల్సి వస్తుంది. ప్రైవేట్ వైద్యం చేయించుకునే స్థోమతలేకపోవడం, ప్రభుత్వ వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. – సఫావత్ పాండు 20 వేలకు పైగా ఖర్చయింది.. పదిహేను రోజుల నుంచి జ్వరం వస్తుంది. హాలియా, మిర్యాలగూడలోని ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటే ఇప్పటి వరకు రూ.20వేలకు పైగా ఖర్చయింది. అయినా రోగం తగ్గలే. చేతిలో ఉన్న పైసలు కూడా అయిపోవడంతో వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇంటిబాట పట్టినం. ఉన్నతాధికారులు స్పందించి నాణ్యమైన వైద్యం అందించాలి. – సఫావత్ మంగి, సఫావత్తండా -
హైదరాబాద్‌లో పరువు హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని తిరుమలగిరిలో పరువు హత్య చోటు చేసుకుంది. నందకిషోర్ అనే వ్యక్తిని భార్య తరపున బంధువులు శనివారం అర్ధరాత్రి దారుణంగా కొట్టి చంపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాలుగేళ్ల క్రితం తిరిమలగిరిలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ యువతిని నందకిషోర్ ప్రేమ వివాహం చేసుకున్నారు.ఈ వివాహం యువతి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో పథకం ప్రకారం కిషోర్‌ని హత్య చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసునమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. -
లిఫ్టు ఏర్పాటు చేస్తేనే.. ఓట్లేస్తాం!
తిరుమలగిరి (నాగార్జునసాగర్) : సాగు నీరందించేందుకు లిఫ్టు ఏర్పాటు చేస్తేనే.. ఈ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని 7 గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. ఆదివారం మండలంలోని నెల్లికల్, జాల్‌తండా, ఎర్రచెరువుతండా, పిల్లిగుండ్లతండా, సఫావత్తండా, చెంచో నితండా, మూలతండా గ్రామాల రైతులు రాజకీయపార్టీలకు అతీతంగా ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. లిఫ్టు నేపథ్యం.. : ఆ ఏడు గ్రామాలకు సాగు నీరందించేలా ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తామని నాయకులు హామీలిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత దీనిపై ప్రశ్నిస్తే పలు కారణాలు చెబుతూ దాటవేస్తున్నారు. 2011 సంవత్సరంలోనే నెల్లికల్ లిఫ్టు నిర్మాణానికి అప్పటి ఇరిగేషన్ శాఖ అధికారులు రూ.60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవడానికి ప్రభుత్వం కూడా అనుమతులిచ్చింది. సుమారు 9 ఎకరాలు అటవీ భూమి మీదుగా పైపులైన్ల నిర్మాణం చేపట్టాల్సి ఉండటంతో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ద్వారా అనుమతులు పొందాల్సి వచ్చింది. దీంతో అటవీ భూమికి ప్రత్యామ్నాయంగా నెల్లికల్ రెవెన్యూ శివారులోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీశాఖకు అప్పగించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పర్యావరణ, హరిత ట్రిబ్యునల్‌కు ప్రభుత్వ భూమి బదలాయింపు ప్రతిపాదనలు రాష్ట్ర అటవీ, ఐడీసీ అధికారుల ద్వారా చేరవేశారు. దీంతో గతేడాది డిసెంబర్లో ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి పరిశీలించారు. ఈ నెల 20న హాలియాలో జరిగిన సమావేశంలో విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డి లిఫ్టు ఏర్పాటుకు అన్ని అనుమతులు వచ్చా యని జనవరిలో పనులు ప్రారంభవుతాయని తెలిపారు. ఈ లిఫ్టు పూర్తయితే ఆ ఏడు గ్రామాల్లో మొత్తం 7,262 ఎకరాలకు సాగునీరు అందుతుంది. -
తిరుమలగిరి పోస్టాఫీస్ ఉద్యోగులపై కేసు
సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి పోస్టాఫీసు ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసింది. నోట్ల రద్దు సమయంలో ఈ పోస్టాఫీస్ సిబ్బంది, అధికారులు కొత్తనోట్లను అక్రమంగా ప్రైవేట్ వ్యక్తులకు మార్చారని ఆరోపిస్తూ సికింద్రాబాద్ రీజియన్ పోస్టాఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ వీబీ గణేశ్ కుమార్ రెండు రోజులక్రితం సీబీఐకి ఫిర్యాదు చేశారు. తిరుమలగిరి పోస్ట్‌మాస్టర్ శ్రీనివాసులు, ట్రెజరర్ ఎస్ చంద్రమౌళి ఎలాంటి రికార్డులు లేకుండా రూ.8.8 లక్షల పాతనోట్లకు కొత్తనోట్లను మార్చి ఇచ్చినట్టు గణేశ్ కుమార్ ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరిపిన సీబీఐ అధికారులు రికార్డులో నగదు మార్పిడికి సంబంధించి ఆధారాలు లేనట్లు గుర్తించింది. దీంతో వీరిద్దరిపై పీసీయాక్ట్ 1988 కింద 13(2) రెడ్‌విత్ 13 (1)(డి), ఐపీసీ 120 బిరెడ్ విత్, 409, 420, 477 (ఏ)కింద కేసులు నమోదు చేశారు. -
తిరుమలగిరిలో తిరంగా యాత్ర
తిరుమలగిరి తెలంగాణ విమోచన దినమైన సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్రావు డిమాండ్ చేశారు. శనివారం బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక చౌరస్తాలో మాట్లాడారు. 2001 నుంచి 2014 వరకు సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని చెప్పి అధికారంలోకి రాగానే నిర్వహించకపోవడం శోచనీయమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ప్రచురించాలని డిమాండ్ చేశారు. గత 32రోజులుగా బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదని ఆరోపించారు. 2019 సంవత్సరంలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎస్సారెస్పీ కాలువల ద్వారా 5టీఎంసీల నీటిని విడుదల చేసి ఈప్రాంతంలోని చెరువులను కుంటలను నింపాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి గొంగిడి మనోహర్‌రెడ్డి, మండలశాఖ అధ్యక్షుడు కె. సోమయ్య, గౌరు శ్రీనివాస్, జీడి బిక్షం, దిన్‌దయాల్, డి. వెంకన్న, జయచందర్, రవి, శుభాష్‌రెడ్డి, యాదగిరి, వరుణ్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. -
తిరుమలగిరిలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలి
తిరుమలగిరి తిరుమలగిరిలో బస్‌డిపోను ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్కపల్లి రాములు కోరారు. బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌరస్తాలో రిలే దీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక చౌరస్తాలో మూత్రశాలలు లేకపోవడంతో ప్రయాణికులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి కడెం లింగయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి సంకెపల్లి కొండల్‌రెడ్డి, ఏపూరు సోమన్న, బొల్లు యాదగిరి, బుక్కరాజు తిరుపతి, దీన్‌దయాళ్, స్టాలిన్, పరమేశ్, గణేశ్ పాల్గొన్నారు.