కట్టుకున్నోడే కాలయముడు | Auto Driver Murdred Wife In Thirumalagiri | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కాలయముడు

Jun 18 2019 12:16 PM | Updated on Jun 18 2019 12:17 PM

Auto Driver Murdred Wife In Thirumalagiri - Sakshi

సాక్షి, తిరుమలగిరి : కట్టుకున్నోడే కాల యముడయ్యాడు. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన భర్తే భార్యపై కిరోసిన్‌ పోసి అగ్నికి ఆహుతి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన మూడ మణెమ్మ (28)ను ఈటూరు గ్రామానికి చెందిన మూడ ఉ పేందర్‌కు ఇచ్చి 2009వ సంవత్సరంలో వివాహం జరిపించారు. ఆటో డ్రైవర్‌ అయిన ఉపేందర్‌ తిరుమలగిరిలోనే ఆటో నడుపుకుంటూ భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఉపేందర్‌ గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసై ప్రతి రోజూ భార్యను కొడుతూ వేధిస్తున్నాడు. ఆదివా రం సాయంత్రం మద్యం సేవించి వచ్చి ఇంట్లో ఉన్న భార్యతో ఘర్షణ పడ్డాడు. దాంతో ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను మణెమ్మపై పోసి అంటించడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన చుట్టుపక్కల వారు బాధితురాలిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణెమ్మ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందింది. మణెమ్మ తల్లి ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుమలగిరి ఎస్‌ఐ బి.డానియల్‌కుమార్‌ తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement