women deid
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉష అనుమానాస్పద మృతి
-
విషాదం : గర్బా డ్యాన్స్ చేస్తూ మృత్యుఒడిలోకి
గాంధీనగర్ : గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శుక్రవారం రాత్రి పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. అందరితో కలిసి సరదాగా గర్బా డ్యాన్స్ చేస్తున్న మహిళ గుండెపోటు రావడంతో సెకండ్ల వ్యవధిలోనే మరణించింది. వివరాలు.. గాంధీనగర్ జిల్లా రూపాన గ్రామానికి చెందిన 45 ఏళ్ల కల్పనాబెన్ గాద్వి తమ బంధువుల వివాహానికి హాజరైంది. (చదవండి : పెద్దాయన క్రూరత్వం, నెటిజన్ల మండిపాటు) వివాహ వేడుకలో తోటి మహిళలతో కలిసి గర్భా డ్యాన్స్ ఆడుతున్న కల్పనాబెన్ వద్దకు ఆమె కూతురు పరిగెత్తుకు వచ్చింది. దీంతో పాపను ఎత్తుకున్న కల్పనా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలింది. డ్యాన్స్ చేస్తున్న తోటి మహిళలు వచ్చేలోపే ప్రాణాలు విడిచింది. దీంతో అంతసేపు చలాకీగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన కల్పనా మరణించడం కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. (చదవండి : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు అస్వస్థత) -
కట్టుకున్నోడే కాలయముడు
సాక్షి, తిరుమలగిరి : కట్టుకున్నోడే కాల యముడయ్యాడు. అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన భర్తే భార్యపై కిరోసిన్ పోసి అగ్నికి ఆహుతి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన మూడ మణెమ్మ (28)ను ఈటూరు గ్రామానికి చెందిన మూడ ఉ పేందర్కు ఇచ్చి 2009వ సంవత్సరంలో వివాహం జరిపించారు. ఆటో డ్రైవర్ అయిన ఉపేందర్ తిరుమలగిరిలోనే ఆటో నడుపుకుంటూ భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఉపేందర్ గత కొన్ని రోజుల నుంచి మద్యానికి బానిసై ప్రతి రోజూ భార్యను కొడుతూ వేధిస్తున్నాడు. ఆదివా రం సాయంత్రం మద్యం సేవించి వచ్చి ఇంట్లో ఉన్న భార్యతో ఘర్షణ పడ్డాడు. దాంతో ఆగ్రహంతో ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను మణెమ్మపై పోసి అంటించడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అది గమనించిన చుట్టుపక్కల వారు బాధితురాలిని చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మణెమ్మ అదే రోజు అర్ధరాత్రి మృతి చెందింది. మణెమ్మ తల్లి ధనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తిరుమలగిరి ఎస్ఐ బి.డానియల్‌కుమార్ తెలిపారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
సంగెం : ఉరివేసుకుని ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. అయితే తమ కుమార్తెను ఆమె భర్త హత్యచేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మృతురాలి తల్లి సూరమ్మ, సోదరుడు అంజయ్య కథనం ప్రకారం.. వర్ధన్నపేట మండలం కట్య్రాలకు చెందిన చెంగాల సూరమ్మ, మల్లయ్య దంపతుల పెద్ద కుమార్తె స్వరూప(45)ను 30 ఏళ్ల క్రితం సంగెం మండలం షాపూర్‌కు చెందిన బొడిగె చిట్టిబాబుకు ఇచ్చి వివాహం చేశారు. కొన్నేళ్ల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో కొంతకాలం తర్వాత కలతలు చోటు చేసుకున్నాయి. చిట్టిబాబు, స్వరూప దంపతులకు సంతానం లేదు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుని శివనగర్‌లో కాపురముంటున్నాడు. దీంతో స్వరూప, చిట్టిబాబుకు మధ్య గొడవలు జరిగాయి. ఇటీవల స్వరూప తల్లిదండ్రులు రాసిచ్చిన భూమి విషయంలో కలతలు ఏర్పడ్డాయి. దీంతో ఉదయం స్వరూప వంటగదిలోని ఇనుప పైపునకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తమ కుమార్తెను భర్త చిట్టిబాబు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పర్వతగిరి సీఐ శ్రీదర్‌రావు, ఎస్సైలు దీపక్, కరుణాకర్‌రావు.. సిబ్బందితో వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు నిర్వహించారు. కాగా సాయంత్రం వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
పుష్కరాలకు వెళ్తూ మహిళ మృతి
వేంపల్లె : పుష్కరాల కోసం వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శనివారం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో జరిగింది. వివరాలు.. వైఎస్సార్‌జిల్లా వేంపల్లె మండలం అల్లిరెడ్డిపల్లెకు చెందిన ఇందిరమ్మ(45) గ్రామంలోని కొంతమందితో కలిసి రాజమండ్రిలో గోదావరి పుష్కరాలకు వెళ్లారు. కాగా, కొవ్వూరు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న సుమో టైరు ఫంక్చర్ కావడంతో రోడ్డు పక్కన నిలిపారు. అయితే, మహిళ మూత్ర విసర్జన కోసం రోడ్డు దాటుతుండగా అటుగా వచ్చిన మరో సుమో ఢీ కొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.