ఫోటో క్రెడిట్ : ఇండియా టుడే
గాంధీనగర్ : గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శుక్రవారం రాత్రి పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. అందరితో కలిసి సరదాగా గర్బా డ్యాన్స్ చేస్తున్న మహిళ గుండెపోటు రావడంతో సెకండ్ల వ్యవధిలోనే మరణించింది. వివరాలు.. గాంధీనగర్ జిల్లా రూపాన గ్రామానికి చెందిన 45 ఏళ్ల కల్పనాబెన్ గాద్వి తమ బంధువుల వివాహానికి హాజరైంది. (చదవండి : పెద్దాయన క్రూరత్వం, నెటిజన్ల మండిపాటు)
వివాహ వేడుకలో తోటి మహిళలతో కలిసి గర్భా డ్యాన్స్ ఆడుతున్న కల్పనాబెన్ వద్దకు ఆమె కూతురు పరిగెత్తుకు వచ్చింది. దీంతో పాపను ఎత్తుకున్న కల్పనా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలింది. డ్యాన్స్ చేస్తున్న తోటి మహిళలు వచ్చేలోపే ప్రాణాలు విడిచింది. దీంతో అంతసేపు చలాకీగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన కల్పనా మరణించడం కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. (చదవండి : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు అస్వస్థత)
Comments
Please login to add a commentAdd a comment