garba dance
-
నవరాత్రుల్లో గర్బా నృత్యం ఎందుకు చేస్తారో తెలుసా..!
‘‘ఇది నవరాత్రుల పవిత్ర సమయం. ప్రజలు దుర్గాదేవి పట్ల భక్తితో వివిధ మార్గాల్లో కలిసి మెలిసి పూజలు జరుపుకుంటున్నారు. ఈ సంతోషంతో ఆమె దయకు పరవశుడనై రాసిన ‘ఆవతికలాయ్’ అనే గర్బా గేయాన్ని ఇక్కడ ఉంచాను. ఆమె ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలి’’ అంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గాయని పూర్వామంత్రి పాడిన ఈ గేయం గర్బా నృత్యానికి ఉన్న ప్రాధాన్యత తెలుసుకునేలా చేయడంతోపాటు ప్రతి మదిని ఆధ్యాత్మిక సౌరభమై తాకుతోంది. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. గర్బా నృత్యం అనగానే సంప్రదాయదుస్తులు ధరించిన సమూహాలు, ఆనందంగా నృత్యం చేస్తున్న దృశ్యాలు మన కళ్లముందు మెదలుతాయి. ఆధ్యాత్మిక బలానికి మానసికోల్లాసాన్ని కలిపి జరుపుకునే ఈ వేడుక మొదట గుజరాతీ గ్రామాలలో పుట్టి, దేశ ఎల్లలు దాటి నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. చిల్లులు గల మట్టి కుండలో దీపం వెలిగించి, తలపైన పెట్టుకుని అమ్మవారి విగ్రహం చుట్టూ వలయాకారంగా తిరుగుతూ భక్తి పారవశ్యంలో నృత్యం చేస్తారు. మట్టికుండ తల్లి గర్భాన్ని, జ్యోతి నుండి వెలువడే కాంతి లోపల పెరుగుతున్న కొత్త జీవిని సూచిస్తుంది. భక్తుల కోసం రాక్షసుడితో పోరాడిన దేవత పట్ల తమ ప్రేమ, కృతజ్ఞతలను ఈ నృత్యం ద్వారా తెలియజేస్తారు. మనలో ఉన్న అన్ని చెడులను నాశనం చేయడానికి, లోపల ఉన్న శక్తిని మేల్కొలిపే విధానంగా కూడా గర్బా నృత్యాన్ని చెబుతారు. గర్బా నృత్య రూపం స్త్రీత్వం, సంతానోత్పత్తిని తెలియజేస్తుంది. ఇందులో భజనలు, కీర్తనలకు చోటు ఎక్కువ. ఎక్కువ భక్తి ఆకర్షణను కలిగి ఉండే గర్బాను అమ్మవారి హారతికి ముందు నిర్వహిస్తారు.కాలచక్రం .. పునరావృతందేవీ ఆరాధనలో భాగంగా చెప్పుకునే ఈ నృత్యాన్ని స్త్రీ–పురుషులు ఇద్దరూ తొమ్మిది రాత్రులు చేస్తారు. చాలా మంది ఈ తొమ్మిది రోజులూ కొన్ని ప్రత్యేక ఆహార నియమాలు, ఉపవాసాలు పాటిస్తారు. కాలచక్రం ఎప్పుడూ తిరుగుతూ పునరావృతం అవుతుంది. పుట్టుక నుంచి మరణం వరకు, మరణం నుంచి పునర్జన్మ వరకు ఆత్మ తిరుగుతూ ఉంటుంది. ఈ అన్ని అంశాల్లోనూ కదలకుండా నిరంతరాయంగా ఉండేది దైవశక్తి ఒకటే. దానికి ప్రతీకగా నృత్య వలయం మధ్య దేవీ ప్రతిమ లేదా పెద్ద దీపపు సెమ్మెను పెడతారు. జీవన చక్రం దాని చుట్టూనే పరిభ్రమిస్తుంటుందని చెప్పేందుకు ఇదొక ప్రతీక.మహిషుని అంతం చేసిన మహిళా శక్తిఒక్క స్త్రీ చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణించకుండా ఉండాలన్న వరబలంతో మహిషాసురుడు తన శక్తులను చెడు కోసం ఉపయోగించడం ప్రారంభించాడు. అతడి దాడికి దేవతలు నిస్సహాయలైపోయారు. దుర్గాదేవి వద్దకు వెళ్లి, వేడుకున్నారు. దుర్గాదేవి ఒక్క కంటిచూపుతో ఆ రాక్షసుని అంతం చేయగలదు. కానీ, అసుర సంహారానికి ముందు తొమ్మిది పగళ్లు, తొమ్మిది రాత్రుల పాటు సాగిన సర్వోన్నతమైన యుద్ధం ద్వారా మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చింది. అసాంఘిక, అధార్మిక శక్తులు ఎంత బలంగా కనిపించినా, యుద్ధం ఎంతకాలం సాగినా, చివరికి ధర్మమే విజయం సాధిస్తుందని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ కథనాన్ని గర్బా నృత్యం ద్వారా ప్రదర్శించడం అంతర్లీనంగా కనిపిస్తుంది.బేతే గర్బాగుజరాత్లోని నాగర్ కమ్యూనిటీ ‘బేతే గర్బా’ అంటే కూర్చున్న గర్బా అని జరుపుకుంటారు. ఇక్కడ, భక్తులు ఒకరి ఇంటి వద్ద గుమిగూడి, గర్బా పాటలు పాడతారు. హిందువులు తమ పండుగలను బహిరంగంగా జరుపుకోవడాన్ని నిజాం నిషేధించినప్పుడు, ఇస్లామిక్ పాలనలో జునాగఢ్ లో బేతే గర్బా ప్రారంభమైంది. చాలామంది కఠినమైన ఉపవాస దీక్షలో ఉన్నప్పటికీ నృత్యం, సంగీతంతో ఉల్లాసంగా మారి΄ోతారు. ఉత్తర భారతదేశంలో గర్బాలో భక్తులు తబలా, మంజీరను ఉపయోగిస్తారు.సంప్రదాయ దుస్తులతో...ఈ నృత్యంలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, శక్తి దేవత ఆశీర్వాదాలు కోరుకుంటూ నృత్యం చేస్తారు. గర్బా, దాండియా ఒకే విధంగా కనిపించినా, ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. గర్బాలో చేతులు, కాళ్లను సమన్వయంతో కదిలిస్తూ చేస్తారు. దాండియాలో కోలాటం కర్రలను ఉపయోగిస్తారు. గర్బా పాటలు దుర్గాదేవి, ఆమె అవతారాల చుట్టూ ఉంటే, దాండియాలో పాటలు కృష్ణుడి రాసలీలలపై ఉంటాయి.పాదరక్షలు లేకుండా..గర్బా దైవారాధనా రీతుల్లో చెప్పులు ధరించకపోవడం సకల జీవులకు ఆలవాలమైన భూదేవి పట్ల మనం చూపే గౌరవంగా భావిస్తారు. భూమిని నిరంతరం అంటి పెట్టుకుని ఉండే ఈ పాదాల ద్వారానే శరీరంలోకి శక్తి ప్రవాహం జరుగుతుందని నమ్మకం. ఆ దేవితో మనకు నేరుగా సంబంధాన్ని కల్పించేవి పాదాలే. అందుకే చెప్పులు లేకుండా చేసే ఈ నృత్యం పవిత్రమైన దైవారాధన వంటిది.గర్బా.. యునెస్కోనవరాత్రి ఉత్సవాలను గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహిస్తుంటారు. మన దేశానికే ప్రత్యేకమైన ఈ ప్రముఖ నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్) జాబితాలో కిందటేడాది చేర్చింది. అమ్మవారి ఎదుట భక్తిని నృత్య రూపంలో చాటే ఈ ప్రాచీన సంప్రదాయం ఇప్పటికీ ఎప్పటికీ సజీవమే అనడానికి ప్రతీకగా నిలుస్తోంది గర్బా.(చదవండి: ఏడో రోజు చదువుల తల్లి సరస్వతిగా .. త్రిరాత్ర వ్రతం..! ) -
నవరాత్రి గార్బా : మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే! వైరల్ వీడియో
దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అత్యంత ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుచుకొంటూ భక్తిపారవశ్యంలో భక్తులు మునిగి తేలుతున్నారు. మరోవైపు దాండియా, గార్బా నృత్యం, కోలాటాలతో ఈ ఉత్సవాలు మరింత శోభను సంతరించు కుంటున్నాయి. తాజాగా గుజరాత్లో నిర్వహించిన గార్బా డ్యాన్స్ కార్యక్రమం విశేషంగా నిలుస్తోంది. నెటిజన్ల ఫన్నీ కమెంట్లతో నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఆ సందడి ఏంటో తెలుసుకుందాం పదండి! దసరా అంటే గార్బా సందడి ఉండాల్సిందే. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు,ఆఫీసులు, ఇతర ప్రదేశాలలో గర్బా ఈవెంట్లలో చిన్నా పెద్దా అంతా అందంగా ముస్తాబై నృత్యం చేస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతంలో నవరాత్రి ఉత్సవాలకు దాండియా, గార్భా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గుజరాత్‌లోని ఒక గార్బా ఈవెంట్లో బ్రౌన్ కుర్తా, జీన్స్ ధరించిన యువకుడు తన చేతుల్లో పుస్తకాన్ని పట్టుకుని మరీ గార్బా స్టెప్పులేయడం విశేషంగా నిలుస్తోంది. తన తోటి డ్యాన్సర్లు నవ్వుతున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా, చక్కగా తన దారిన తాను నృత్యం చేస్తూ, పుస్తకంలో లీనమై పోయాడు. (అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?)చదువుకోవాలని అంటే ఎలా అయినా చదువుకోవచ్చు అనే క్యాప్షన్‌తో ఈ వీడియో ఎక్స్ లో పోస్ట్ అయింది. దీనిపై నెటిజన్లు ఆ అబ్బాయి కమిట్మెంట్పై ప్రశంసలు కురిపించారు. మరోవైపు ఇది మరీ విడ్డూరం.. చదువుకోవడానికి వేరే ప్రదేశమే దొరకలేదా? అంటూ మరికొందరు కమెంట్ చేశారు. ఈ వీడియో మా అమ్మ చూసిందంటే నాకు దబిడి దిబిడే అన్నట్టు ఇంకొక యూజర్ స్పందించారు. UPSC పరీక్షలకు సిద్ధమవుతున్నాడ నుకుంటా అని మరొక వినియోగదారు చమత్కరించారు. (సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్)'Padhne wale bacche kahi bhi padh lete hai' just got real 😭😭 pic.twitter.com/cieAIqUMmd— Ankita (@Memeswalimulagi) October 6, 2024 -
శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యం
దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమైనాయి. భక్తులు తొమ్మిది రోజుల పాటు, ఆ జగన్మాతను భక్తితో ఆరాధిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వారి వారి ఆచారాలు, పద్ధతుల ప్రకారం అత్యంత ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ వడోదరలో ఒక ప్రత్యేకమైన నవరాత్రి సంప్రదాయం గురించి తెలుసుకుందాం.నవరాత్రి వేడుకల్లో భాగంగా గుజరాత్లో పురుషులు ఆనాదిగా ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు. 200 సంవత్సరాల నాటి శాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నవమిరోజు సంప్రదాయ బద్ధంగా మహిళల్లా దుస్తులు ధరిస్తారు. అంతేకాదు చీర కట్టుకొని అష్టమి రోజు రాత్రం జానపద నృత్యమైన షేరీ , గర్బా నృత్యం చేస్తారు. ‘సాదుబా మాత’ను పూజిస్తారు. ( Dussehra 2024 నవదుర్గా నమోస్తుతే!)తరతరాలుగా ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం 200 ఏళ్ల క్రితం, ‘సదుబెన్’ అనే మహిళను ఒక మొఘల్ కులీనుడు లైంగికంగా లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. దీంతో బారోట్ సమాజంలోని పురుషులను రక్షణ కోరింది. దీనికి సదరు పురుషులు సాయం చేసేందుకు నిరాకరిస్తారు. ఫలితంగా ఆమె బిడ్డను కోల్పోతుంది. ఈ బాధ, దుఃఖం, ఆవేదనతో భవిష్యత్ తరాల పురుషులు పిరికిపందలుగా మారతారని శపించి 'సతీ'ని పాటించింది. (మహిళ తనలోని ఖాళీలను కనుక్కోవాలి!)ఇదీ చదవండి: శతాబ్దాల శాప భయం : చీర సింగారించుకుని మరీ పురుషుల గర్భా నృత్యంఆ శాపం చాలా శక్తివంతమైందిగా అక్కడి వారు ఇప్పటికీ నమ్ముతారు. అందుకే ఈ ఈ ఆచారాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తారు. సాదుమాను శాంతింప చేసేందుకు, ఆమెను గౌరవించుకునేందుకు ఒక ఆలయాన్ని నిర్మించారు. నవమి రోజు ప్రత్యేక పూజలు చేసి భవిష్యత్తరాన్ని కాపాడాలని వేడుకుంటారు. -
మోదీకి భూటాన్‌లో అరుదైన గౌరవం
థింపూ: భూటాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనకు శుక్రవారం ఉదయం భూటాన్ రాజధాని థింపూ చేరుకున్న మోదీకి ప్రధాని త్సెరింగ్ టొబ్గే స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి థింపూ దాకా 45 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి భారత్, టిబెట్ పతాకాలతో స్వాగతం పలికారు. కొందరు యువకులు మోదీ స్వయంగా రాసిన పాటకు భారత సంప్రదాయ దుస్తుల్లో గర్బా నృత్యం చేశారు. దాన్ని మోదీ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. రాజు వాంగ్‌చుక్‌తో భేటీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్, ప్రధాని త్సెరింగ్‌లతో మోదీ సమావేశమయ్యారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను తొలిసారిగా మోదీకి రాజు ప్రదానం చేశారు. భారత్, భూటాన్ ప్రజల అనుబంధం ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోందని మోదీ అన్నారు. భూటాన్ ప్రజల గుండెల్లో భారత్ ఉంటుందన్నారు. ఈ సుందర దేశంలోకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్వాగతం పలికిన భూటాన్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ధన్యవాదాలని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్, భూటాన్ మైత్రి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ‘మా పెద్దన్న మోదీ జీకి భూటాన్‌లోకి స్వాగతం’అని త్సెరింగ్ టొబ్గే ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అనంతరం ప్రధానుల సమక్షంలో ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయం వంటి రంగాల్లో పలు ఒప్పందాలు, ఎంవోయూలపై అధికార ప్రతినిధులు సంతకాలు చేశారు. రెండు దేశాల నడుమ కొక్రాఝర్– గెలెఫు, బనార్హట్–సంత్సెల మధ్య రైల్వే లైనుపై ఎంవోయూకు తుదిరూపం ఇచ్చారు. 21, 22వ తేదీల్లోనే మోదీ భూటాన్‌లో పర్యటించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం వల్ల ఒక రోజు వాయిదా పడింది. ద్వైపాక్షిక, ప్రాంతీయ విషయాలపై భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి ప్రధాని పర్యటన ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. నేడు డిజొంగ్ మఠ సందర్శన భూటాన్‌లోని శక్తిమంతమైన తషిఛో డిజొంగ్ బౌద్ధ మఠాన్ని మోదీ శనివారం సందర్శించనున్నారు. థింపూలో భారత్ సహకారంతో ఏర్పాటైన అత్యాధునిక మాతా శిశు ఆస్పత్రిని ప్రారంభిస్తారు. గత వారం భూటాన్ ప్రధాని త్సెరింగ్ భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. -
గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు
గుజరాత్‌కు చెందిన ప్రముఖ గర్బా నృత్యాన్ని యునెస్కో ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ (ఐసీహెచ్)జాబితాలో చేర్చిందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక ప్రాంతాలలో నిర్వహించే గర్బాను ఈ జాబితాలో చేర్చాలంటూ భారతదేశం నామినేట్ చేసింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ పటేల్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘అమ్మవారి ఎదుట భక్తిని చాటే ఈ గర్భా నృత్యం ఒక పురాతన సంప్రదాయం. ఇది సజీవంగా వర్ధిల్లుతోంది. గుజరాత్‌కు గుర్తింపుగా నిలిచిన గర్బాను యునెస్కో తన ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్‌లో చేర్చింది. ఈ గుర్తింపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుజరాతీలకు గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశ వారసత్వ సంపదకు ప్రాముఖ్యతనిస్తూ, ప్రపంచవ్యాప్తంగా వీటికి గుర్తింపును తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కింది. గుజరాత్ ప్రజలకు అభినందనలు’ అని పేర్కొన్నారు. గర్బా అనేది ఒక నృత్య రూపకంగా ప్రాచుర్యం పొంది, సంప్రదాయాన్ని కలబోస్తూ, అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేసేదిగా నిలుస్తున్నదని యునెస్కో పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆ మూడు రాష్ట్రాల్లో సీఎం లేదా డిప్యూటీ సీఎంలుగా మహిళలు? -
అతిగా నృత్యం చేస్తే ఏమవుతుంది? ఆయాసం రాగానే ఏం చేయాలి?
గుజరాత్లో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల గర్బా ఈవెంట్లలో పాల్గొన్నవారిలో 12 మంది మృతి చెందారు. ఈ ఘటన గడచిన 24 గంటల్లో చోటుచేసుకుంది. బాధితుల్లో యువకులు మొదలుకొని 50 ఏళ్లు పైబడిన వారి వరకు ఉన్నారు. వీరిలో అత్యంత పిన్న వయస్కుడు దభోయికి చెందిన 13 ఏళ్ల బాలుడు. శుక్రవారం అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా కుప్పకూలి మృతి చెందాడు. కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల యువకుడు కూడా గర్బా ఆడుతూ మృతి చెందాడు. రాష్ట్రంలో ఇలాంటి ఉదంతాలు అనేకం వెలుగు చూస్తున్నాయి గర్బా అనేది ఒక తరహా నృత్య రూపం. దీనిలో సామూహికంగా డాన్స్ చేస్తారు. అయితే ఈ విధంగా డ్యాన్స్ చేసేటప్పుడు శారీరక పరిమితికి మించి నృత్యం చేయకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధికసమయం నృత్యం చేయడం వలన గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. నిజానికి అధికంగా నృత్యం చేసినప్పుడు, అది శరీరంపై, ముఖ్యంగా గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. శరీరంలో ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో డీహైడ్రేటెడ్‌గా ఉంటే, అనేక శారీరక సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం గుండె మన శరీరంలోని రక్తాన్ని పంప్ చేస్తుంటుంది. అయితే మనం జిమ్, వ్యాయామం లేదా డ్యాన్స్ చేసినప్పుడు, మన శరీరం చురుకుగా మారుతుంది. ఫలితంగా మన శరీరం ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో రక్తపోటు పెరగడం సహజం. అదేసమయంలో హృదయ స్పందన రేటు కూడా పెరుగుతుంది. ఈ పరిస్థితిలో శరీరానికి గరిష్ట ఆక్సిజన్ అవసరమవుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి బీపీ బాధితునికి ఎదురైతే గుండె సంబంధిత సమస్యలు ఎదురుకావచ్చు. మధుమేహం లేదా బీపీ బాధితులు ఏ పరిమితితో పనిచేయాలో ముందుగా తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగానే పనిచేయాలి. వ్యాయామం చేసేటప్పుడు లేదా డ్యాన్స్ చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వెంటనే విశ్రాంతి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: బ్రిటీషర్లను తరిమికొట్టిన చీమలు? ‘సిపాయిల తిరుగుబాటు’లో ఏం జరిగింది? -
నీటిలో గర్భా నృత్యం.. నివ్వెరపోతున్న జనం!
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వేడుకగా కొనసాగుతున్నాయి. పలుచోట్ల గర్బా, దాండియా నృత్యాల కోలాహలం కనిపిస్తోంది. ఈ సంప్రదాయ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే నీటిలో గార్బా నృత్యం చేస్తున్న ఓ డ్యాన్సర్‌కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో క్లిప్‌లో నీటిలో మునిగి గర్బా నృత్యం చేస్తున్న ఒక యువకుడిని చూడవచ్చు. ఇది వీక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ నృత్యం చేస్తున్న కళాకారుని పేరు జైదీప్ గోహిల్. తన ఇన్స్టాగ్రామ్ బయోలో తాను భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున నృత్యం చేసే వ్యక్తినని పేర్కొన్నాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ కళాకారుడని అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇది కూడా చదవండి: టాయిలెట్‌కు కారు దిగిన భర్త.. అంతలోనే మాయమైన భార్య! -
నవరాత్రుల్లో విషాదం
దేశవ్యాప్తంగా ప్రస్తుతం దసరా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా జరుగుతుండటం విశేషం. నవరాత్రులలో గుజరాత్లో నిర్వహించే గర్బా నృత్యాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రి వేడుకల్లో యువతతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు, పురుషులు వినూత్నంగా ఏర్పాటు చేసిన వేదికలపై దాండియా ఆడుతున్నారు. నవరాత్రుల సందర్భంగా గుజరాత్లో జరుగుతున్న వేడుకల్లో గుండెపోటు కేసులు అత్యధికంగా వెలుగు చూస్తున్నాయి. గడచిన 24 గంటల్లో గర్బా నృత్యం చేస్తూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం జరుగుతున్న నవరాత్రులలో ఇప్పటివరకూ గుండె సంబంధిత సమస్యలకు సంబంధించి అత్యవసర అంబులెన్స్‌లకు 521 కాల్స్ వచ్చాయి. నవరాత్రి వేడుకల్లో గుజరాత్లో ఒక్కసారిగా గుండెపోటు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా యువత గుండెపోటుకు గురవుతోంది. రాజ్‌కోట్‌లో 28 ఏళ్ల యువకుడు గర్బా నృత్యం చేస్తూ, గుండెపోటుకు గురై మృతి చెందాడు. రాయరోడ్డులోని ఓ బిల్డర్‌కు గుండెపోటు రావడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్యులు ఆ బిల్డర్ ప్రాణాలను కాపాడలేకపోయారు. అహ్మదాబాద్‌లోని హతీజన్లో గర్బా నృత్యం చేస్తున్న సమయంలో ఒక యువకుడు మృతిచెందాడు. ద్వారక, గ్రేటర్ అంబాలా, రాంనగర్లో ముగ్గురు యువకులు హఠాన్మరణం చెందారు. సూరత్‌లోనూ గత 24 గంటల్లో ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో కన్నుమూశారు. వడోదరలోని హర్ని ప్రాంతంలో గర్బా ఆడుతూ ఓ వ్యక్తి మృతి చెందాడు. దభోయ్‌లో కూడా 13 ఏళ్ల బాలుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. నవ్సారిలో ఒక యువకుడు గర్బా నృత్యంలో పాల్గొన్న అనంతరం గుండెపోటుతో మరణించినట్లు వార్తలు వచ్చాయి. అమ్రేలి, జామ్‌నగర్‌లో ఇద్దరు చొప్పున, ద్వారకలో ఇద్దరు రైతులు గుండెపోటుతో మరణించారు. అమ్రేలికి చెందిన దినేష్ షియాల్ (23) నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంలో మృతి చెందాడు. నవరాత్రి వేడుకల్లో పాల్గొంటున్న యువతలో గుండెపోటు సమస్య పెరగడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇది కూడా చదవండి: పుల్ అండ్ పుష్ ట్రైన్ అంటే ఏమిటి? -
ఔరా అండర్ వాటర్ గార్బా
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గార్బా నృత్యాల సంబరం సహజమే. అయితే జయ్‌దీప్ గోహిల్ మాత్రం ‘అండర్–వాటర్ గార్బా డ్యాన్స్’తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంటర్నెట్లో ఈ అండర్ వాటర్ గార్బా డ్యాన్స్ వైరల్‌గా మారింది. కొన్నిరోజుల క్రితం ‘నవరాత్రి ఇన్ హెవెన్’ టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో కూడా బాగా పాపులర్ అయింది. ఈ వీడియోలో ‘రాధే రాధే’ పాటకు అండర్ వాటర్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు జయ్‌దీప్. అండర్–వాటర్ గార్బా డ్యాన్స్ విషయానికి వస్తే...‘మాటలు చాలని అద్భుతం’ అంటూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జయ్‌దీప్ గోహిల్ పేరు వినిపించగానే ‘అండర్–వాటర్ డ్యాన్సర్’ అనే మాట వినిపిస్తుంది. అండర్–వాటర్ డ్యాన్సింగ్‌లో ప్రావీణ్యం సంపాదించడానికి ఎన్నో నెలల పాటు కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి జయ్‌దీప్‌కు ఈత, నృత్యం అంటే ఇష్టం. ఇంజనీరింగ్ చేసిన జయ్‌దీప్ 9 టు 5 జాబ్ చేయాలనుకోలేదు. డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. బ్రేక్ డ్యాన్స్ నుంచి హిప్–çహాప్ వరకు రకరకాల డ్యాన్సులు నేర్చుకున్నాడు. ఇక మైకేల్ జాక్సన్ డ్యాన్స్‌లను అచ్చం అలాగే చేసేవాడు. -
దేవీ శరన్నవరాత్రులు: ప్రధాని మోదీ అద్భుత గిఫ్ట్, మాస్టర్ పీస్!
యావద్దేశం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్దమైన వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీరాసిన ‘గర్బా’ సాంగ్ శనివారం రిలీజైంది. స్వయంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేశారు. ఈ పాట విడుదలైన 9 గంటల్లో 1.9 మిలియన్ల వ్యూస్‌తో దూసుకు పోతుండటం విశేషం. ఈ సందర్బంగా టీం మొత్తానికి ధన్యవాదాలు చెప్పిన ప్రధాని ఈ పాటకు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. చాలా యేళ్ల క్రితం రాసిన గర్బా సాంగ్ ఇది అని పేర్కొన్నారు. చాలా జ్ఞాపకాలను ఇది గుర్తు చేస్తోందన్నారు. కొన్ని సంవత్సరాలుగా తాను ఏమీ రాయలేక పోయినప్పటికీ గత కొన్ని రోజులనుంచి ఈ కొత్త గర్బా పాట రాసానని, నవరాత్రి శుభ సందర్భంగా దీన్ని పంచుకుంటున్నా అంటూ మోదీ ప్రకటించారు. Thank you @dhvanivinod, Tanishk Bagchi and the team of @Jjust_Music for this lovely rendition of a Garba I had penned years ago! It does bring back many memories. I have not written for many years now but I did manage to write a new Garba over the last few days, which I will… https://t.co/WAALGzAfnc — Narendra Modi (@narendramodi) October 14, 2023 ఈ గార్బో(గార్బా) పాటను ధ్వని భానుశాలి ఆలపించగా, తనిష్క్ బాగ్చి స్వరపర్చారు. 190 సెకన్ల ఈ వీడియోను దసరా సందర్భంగా విడుదల చేశారు. నటుడు, నిర్మాత జాకీ భగ్నాని సొంత నిర్మాణ సంస్థ జుస్ట్ మ్యూజిక్ బ్యానర్‌పై దీన్ని రూపొందించారు. అద్భుతం,మాస్టర్ పీస్ దీంతో అద్భుతం అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మోదీజీ ఈ పాట రాశారంటే నమ్మలేకపోతున్నాం. గొప్ప సాహిత్యం, మంచి సంగీతంతో చాలా మంచి పాట అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ నవరాత్రికి ఈ పాట చరిత్ర సృష్టించబోతోంది. ఈ మాస్టర్ పీస్ గిఫ్ట్ ఇచ్చినందుకు లవ్ యూ మోదీ జీ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. -
USA : ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు
అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జరుగనున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి అక్టోబర్ 1 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపైకి చేర్చే ఈ ఉత్సవాలను గతంలో 3 సార్లు వివిధ దేశాలలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ నిర్వహించింది. 4వ విడత ఉత్సవాలను ఈ ఏడాది వాషింగ్టన్ డిసిలోని నేషనల్ మాల్ ప్రాంగణంలో మరింత ఘనంగా, చిరస్మరణీయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసిలోని క్యాపిటల్ భవనం ముందున్న విశాల ప్రాంగణంలో ఫుట్ బాల్ మైదానమంత విస్తీర్ణంలో భారీ వేదికను ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి 17,000 మంది కళాకారులు, అనేక దేశాల నేతలు, ప్రముఖులు ఈ ఉత్సవాలలో పాల్గొంటున్నారు. లక్షలమంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొంటారని అంచనా వేస్తున్న ఈ ఉత్సవాలలో ప్రధాన ఆకర్షణగా 50కి పైగా ప్రదర్శనలు జరుగబోతున్నాయి. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి అమరుడయిన మార్టిన్ లూధర్ కింగ్ ప్రఖ్యాత ఉపన్యాసం “ఐ హావ్ ఎ డ్రీమ్” ను నేషనల్ మాల్ వేదికపై నుండే ఇచ్చారు.1963వ సంవత్సరంలో జరగిన ఈ ఉపన్యాసం ద్వారా ప్రపంచ సమైక్యత, సమానతా సందేశాన్ని అందరికీ చాటిచెప్పాడు. దానికి ఒక శతాబ్ది క్రితం షికాగోలోని ప్రపంచ పార్లమెంటు సదస్సులో స్వామి వివేకానందుని ఉపన్యాసం అక్కడి ప్రజలను సన్మోహితులను చేసి, ఆయన జ్ఞానానికి పాదాక్రాంతులను చేసింది. ప్రపంచంలోని వివిధ మత నాయకులను తన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు గా పేర్కొంటూ మతవిశ్వాసాల పేరుతో ప్రజలను విభజించడం, ఇతర ధర్మాల పట్ల అసహనం విడనాడ వలసిందిగా అతడు హితవు పలికాడు. ఈ సెప్టెంబర్ 29వ తేదీన ప్రారంభం కానున్న ఈ చారిత్రాత్మక ఉత్సంలో శ్రీ శ్రీ రవిశంకర్, ప్రపంచంలో దేశాలు, ధర్మాలు, జాతుల మధ్య భేదాభిప్రాయాలను, అంతరాలను చెరిపివేసి, 180 దేశాలకు చెందిన ప్రజలను “ఒకే ప్రపంచ కుటుంబం” గా ఒకే వేదికపై ఆవిష్కరిస్తారు.మానవాళిని సమైక్యంగా ఉంచేవాటిలో ప్రధాన పాత్రగా ఉండే ఆహారం అనేది ఇక్కడ కూడా తన పాత్రను పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధదేశాలకు చెందిన వంటకాలు ఇక్కడి కార్యక్రమాలకు హాజరయ్యే ప్రేక్షకులకు విందుచేయనున్నాయి. ఈ సారి అనేకమంది ఔత్సాహిక కళాకారులు సైతం తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా హాజరౌతున్నవారిలో ఐక్యరాజ్య సమితి 8వ సెక్రటరీ జనరల్ బాన్-కి-మూన్, భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్, అమెరికాలోని ప్రముఖ వైద్యుడు వివేక్ మూర్తి, అమెరికా సెనేటర్ రిక్ స్కాట్, నాన్సి పెలోసి, భారత మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, సురినామ్ దేశ రక్షణ మంత్రి కృష్ణకుమారి మాథెరా ఉన్నారు. -
విధి ఆడిన వింత నాటకం.. అప్పటి వరకు ఎంజాయ్ చేసి ఒక్కసారిగా..
మనిషి జీవితం ఎంత విచిత్రమైనదో ఇప్పటికే ఎన్నో ఘటనల్లో చూసే ఉంటాము. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి క్షణకాలంలో కుప్పకూలి ప్రాణాలు విడిచిన ఘటనలు షాక్‌కు గురిచేస్తున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా దేవీ నవరాత్రుల వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో గర్బా డ్యాన్స్‌లు చేస్తూ భక్తులు వేడుకలు జరుపుకుంటున్నారు. కాగా, వేడుకల్లో గుజరాత్‌కు చెందిన ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఆనంద్ జిల్లాలోని తారాపూర్‌లో ఉన్న ఆతీ శివశక్తి సొసైటీలో ఆదివారం సాయంత్రం గర్బా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీ, యువకులు చుట్టూ తిరుగుతూ పాటలకు డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో.. వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్‌పుత్(21) అందరితో కలిసి గర్బా డ్యాన్స్ చేశాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా డ్యాన్స్ చేస్తూ ముందుకు వచ్చి కింద కుప్పుకూలిపోయాడు. దీంతో, అక్కడున్న వారంతా సడెన్‌గా ఆందోళనకు గురయ్యారు. బంధువులు, స్నేహితులు అతడిని పైకి లేపడానికి ఎంత ప్రయత్నించినా అతడు కదలలేదు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆ యువకుడు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో, పండుగ పూట వారి కుటుంబంలో విషాదఛాయలు అములుకున్నాయి. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతోంది. Anand : गरबा खेलते खेलते एक शख्स की मौत। तारापुर में आती शिवशक्ति सोसायटी में गरबा आयोजित किया गया था। युवक को अस्पताल ले जाया गया लेकिन तब तक देरी हो चुकी थी। वजह दिल का दौरा पड़ने से मौत बताई जा रही है। pic.twitter.com/GlUA1irveA — Janak Dave (@dave_janak) October 2, 2022 -
పండగ వేళ విషాదం..కొడుకు మృతిని జీర్ణించుకోలేక ఆగిన తండ్రి గుండె
పూణె: దసరా ఉత్సవాలు దేశమంతటా అట్టహాసంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పలు చోట్ల ఆయా సంప్రదాయాల రీత్యా డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అచ్చం ఇలానే ఆనందోత్సహంతో పండుగా చేసుకుంటూ ఒక వ్యక్తి ఉన్నట్టుండి హఠాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...35 ఏళ్ల మనీష్ నీరాప్జీ సోనిగ్రా గ్లోబల్ సిటీలోని విరార్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న గర్బా ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆ రోజు రాత్రి ఆనందంగా చిందులేస్తూ ఉన్నటుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సదరు వ్యక్తి తండ్రి అతన్ని హుటాహుటిని ఆస్పత్రికి తరలించగా... అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కొడుకు మరణ వార్త విన్న సదరు వ్యక్తి తండ్రి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు. దీంతో పోలీసులు ప్రమాదవశాత్తు సంభవించిన మరణాలుగా కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి.. ఒకరిని కాపాడబోయి ఒకరు) -
గర్బా డ్యాన్స్‌తో అలరించిన నీరజ్ చోప్రా
జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఆటలోనే కాదు డ్యాన్స్‌లోనూ ఇరగదీయగలనని నిరూపించాడు. నీరజ్ చోప్రా గర్బా డ్యాన్స్‌తో తన అభిమానులను అలరించాడు. విషయంలోకి వెళితే.. బుధవారం గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ఒక ఈవెంట్‌కు నీరజ్ చోప్రా హాజరయ్యాడు. వేదిక వద్ద పూజలు చేసిన అనంతరం కొంత మంది సభ్యులతో కలిసి గర్భా నృత్యంతో అలరించాడు. ఇక స్టేజ్ మీదకు నీరజ్ వెళ్లిన సమయంలో జన.. ''నీరజ్.. నీరజ్'' అంటూ భారీగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకున్న నీరజ్ పలు టోర్నీల్లో పతకాలతో మెరిశాడు. ఇటీవలే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీట్ ఫైనల్లో ఈటెను 88.34 మీటర్ల దూరం విసిరి నీరజ్ చోప్రా తొలిసారి టైటిల్ గెలిచాడు. #WATCH | Gujarat: Tokyo Olympics gold medallist Neeraj Chopra participated in a Garba event in Vadodara yesterday#navratri2022 pic.twitter.com/lM7MAmVgm2 — ANI (@ANI) September 29, 2022 🇮🇳's Golden Boy @Neeraj_chopra1 attends special Garba night in #Vadodara among thousands of people🤩 The enthusiasm and celebrations at the garba ground multiplied when he surprised his fans at the spot🤩#36thNationalGames #NationalGames2022 pic.twitter.com/VYxyhIFwIM — SAI Media (@Media_SAI) September 28, 2022 -
గార్బా డ్యాన్స్‌తో అదరగొట్టిన ఎంపీ సుప్రియా సూలే.. వీడియో వైరల్
దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా కొనసాగుతున్నాయి. ఆడపచులు సంప్రదాయ నృత్యాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలోనే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తనయ, బారామతి ఎంపీ సుప్రియా సూలే గార్బా, దాండియా ఆటలతో అలరించారు. మహారాష్ట్ర ఇందాపూర్‌లోని లఖెవాడి ప్రాంతంలో ఆమె స్థానికులతో కలిసి బుధవారం గార్బా నృత్యం చేశారు. చేతుల్లో చెక్క కోలలు పట్టుకుని దాండియా ఆడారు. లోవెయాత్రి సినిమాలోని చొగడా పాటకు ఆమె ఆడిపాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (చదవండి: తల్లి గర్భంలోనే రుచుల మక్కువ) కాగా, గుజరాత్ ప్రాంతంలో గార్బా, దాండియా నృత్యాలు సంప్రదాయంగా ఉన్నాయి. దేవి నవరాత్రుల్లో వీటిని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇతర ప్రాంతాల్లో సైతం వీటికి ఈ మధ్య కాలంలో ప్రాధాన్యం పెరిగింది. ఇదిలాఉండగా.. ముంబైలోని ప్రఖ్యాత మెరైన్ డ్రైవ్‌లో బుధవారం యువతీయువకులు భారీ స్థాయిలో సెలబ్రేట్ చేసుకున్న గార్బా నృత్యానికి సంబంధించిన దృశ్యాలు సైతం వైరల్‌గా మారాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహింద్రా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. నవరాత్రి ఉత్సవ వేడుకలకు ముంబై ప్రసిద్ధి అని క్యాప్షన్ జత చేశారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. గాయపడిన చిన్నారిని చూసి కన్నీరు పెట్టుకున్న మహిళా అధికారి) -
Dussehra 2022: నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ రెడీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం మరో వేడుకకు సిద్ధమవుతోంది. దసరా నవరాత్రి ఉత్సవాలకు సమాయత్తమవుతోంది. దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజలు చేసి అనంతరం నిమజ్జనం గావిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలోని ధూల్‌పేట్‌లో దుర్గామాత ప్రతిమల తయారీ పనులు ఊపందుకున్నాయి. కళాకారులు వీటికి రంగులు అద్ది తుది మెరుగులు దిద్దుతున్నారు. నగరం వేదికగా దసరా నవరాత్రి సందడి వైభవంగా మొదలైంది. ఇందులో భాగంగా ప్రముఖ సామాజికవేత్త బినా మెహతా ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ వేదికగా ఆదివారం ప్రీ నవరాత్రి ఫెస్ట్‌ను నిర్వహించారు. ఈ వేడుకల్లో సంప్రదాయ గర్బా నృత్యంతో పాటు దాండియాతో అలరించారు. నగరంలో దాండియా సందడి మొదలైంది. శిల్పి ఈవెంట్స్, ఎస్కే క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 4 వరకు తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. పోస్టర్ ఆవిష్కరణ ఆదివారం ఇంపీరియల్ గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. నగరంలోనే అతిపెద్ద ‘నవరాత్రి ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉత్సవాల్లో పాల్గొని, ఉత్తమంగా నృత్యం చేసిన వారికి రూ.25 లక్షల విలువ చేసే బహుమతులు అందజేస్తామన్నారు. (క్లిక్: దాండియా జోష్...స్టెప్పులు అదరహో..) 26 నుంచి రామాయణ్ మేళా అబిడ్స్: ఈ నెల 26 నుంచి 50వ రామాయణ మేళా వేడుకలు నిర్వహిస్తున్నట్లు రామాయణ మేళా చీఫ్ కన్వీనర్ గోవింద్‌రాఠి పేర్కొన్నారు. సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రామాయణ మేళాలో భాగంగా కవి సమ్మేళనం నిర్వహించి పలువురు కవులను సన్మానిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే రామాయణ్ మేళాలో ప్రతి రోజు రామాయణం పట్ల అవగాహన కల్పిస్తామన్నారు. 29 నుంచి 3వ తేదీ వరకు గర్బా దాండియా నిర్వహిస్తామన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దాండియా వేడుకలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. దసరా రోజు అక్టోబర్ 5న వేలాదిమంది భక్తుల మధ్య రావణ దహనం, శమీ పూజ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో కమల్‌నారాయణ అగర్వాల్, గిరిధర్ లాల్, మనోజ్ జైస్వాల్, రామ్‌దేవ్, సుమిత్‌రాఠి పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: 25 నుంచి బతుకమ్మ ఉత్సవాలు) -
రైల్వేస్టేషన్లో ఉత్సాహంగా స్టెప్పులేసిన ప్రయాణికులు.. ఎందుకో తెలుసా!
భోపాల్: రైలు ప్రయాణమంటే ఉండే హడావుడి అంతా ఇంత కాదు.. ఎంత ఇంటి నుంచి బయల్దేరినా అప్పుడప్పుడు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిందే. ఏదో కష్టాలు పడి చివరికి స్టేషన్ చేరుకుంటే ట్రైన్ ఆలస్యమని అనౌన్స్ వినిపిస్తోంది. ఈ సౌండ్ చెవికి ఎంత చిరాకుగా ఉంటోందో ప్రతి ఒక్కరికి అనుభవమయ్యే ఉంటుంది. అదే ట్రైన్ రావాల్సిన సమయానికి వస్తే ఎంత ఆనందమో.. అచ్చం ఇలాగో ఓ రైలు అనుకున్న సమయం కంటే ముందే వచ్చినందుకు ప్రయాణికులందరూ తెగ సంబరపడిపోయారు. ఆ సంతోషంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకోగా దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాంద్రా-హరిద్వార్ రైలు బుధవారం రాత్రి షెడ్యూల్ సమయానికి 20 నిమిషాల ముందే రత్లాం స్టేషన్‌కి చేరుకుంది. స్టేషన్లో రైలు పది నిమిషాలు ఆగి బయల్దేరుతుంది. దీంతో 30 నిమిషాల సమయం ఉండటంతో ఓ బోగీలోని ప్రయాణికులు గర్భా డ్యాన్స్ చేయడం ప్రారంభించారు. గుజరాత్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్న దాదాపు 90 మంది కలిసి ప్లాట్‌ఫాంపై ఎంతో ఆనందంగా డ్యాన్స్ చేశారు. చదవండి: బైక్ వెనుక కూర్చొని హెల్మెట్ పెట్టుకోవడం లేదా? ఈ వార్త మీకోసమే! గుజరాత్లో అత్యంత పాపులర్ పాటలు, బాలీవుడ్ పాటలపై స్టెప్పులేశారు. చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకు అందరూ కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. 20 నిమిషాల పాటు బోగీలో కూర్చునే కంటే ఇలా డ్యాన్స్ చేస్తే అలసట తీరిపోతుందనే తాము ఇలా చేశామని ప్రయాణికులు తెలిపారు. ఈ వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూ యాప్‌లో షేర్ చేశారు. ఇప్పుడిది నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ట్రైన్ సమయానికి వస్తే ఇలాగే ఆనందంగా ఉంటుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ज़िंदगी को जिंदादिली से जियो :) रतलाम रेलवे स्टेशन पर समय से पहले पहुंच गई ट्रेन! हॉल्ट लंबा था लिहाज़ा पैसेंजर्स ने प्लेटफार्म पर गरबा कर बोरियत दूर की @RatlamDRM @RailMinIndia @AshwiniVaishnaw pic.twitter.com/zXg2mVRY1y — Ravish Pal Singh (@ReporterRavish) May 26, 2022 -
జిమ్‌లో డ్యాన్స్ చేసి అలరించిన హృతిక్
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ సెట్ లేదా జిమ్‌లోనూ ఎక్కువ సేపు సరద సరదాగా గడపడానికే ఇష్టపడతాడు. ఎప్పుడు సోషల్ మాధ్యమాల్లో తన ఆనంద క్షణాలని షేర్ చేస్తుండే హృతిక్ ఈసారి జిమ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేశాడు. అందులో హృతిక్ 1979లో మిస్టర్ నట్వర్లాల్ సినిమాలోని 'పరదేశీయా' అనే పాటకు గుజరాతీ గర్బా డ్యాన్స్‌తో (దాండియా నేపథ్యం) అలరించాడు. (చదవండి: నేను మా ఆంటీకి గుడ్ బై చెప్పొచ్చా!) ఆ తర్వాత నవరాత్రి కదా అందుకే ఈ డ్యాన్స్ అంటూ చెబుతాడు. అయితే 80 నిమిషాల నిడివిగల ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. పైగా ఈ వీడియోలో ఆధ్యంతం హృతిక్ డ్యాన్స్‌తో చక్కగా అలరించాడు. ఈ క్రమంలో హృతిక్ సహ నటి దీపికా పదుకొనే హృతిక మంచి హస్యగాడు అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు ఇతర నటులు రణవీర్ సింగ్, ప్రీతి జింటా, ఆయుష్మాన్ ఖురానా, కృతి సనన్ మరియు వరుణ్ ధావన్ ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం హృతిక్, దీపికా పదుకునే జంటగా 'ఫైటర్' అనే సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. (చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు) -
‘పీపీఈ’ డ్యాన్స్ చూశారా.. భలే ఉందే!
గుజరాత్: కోవిడ్ -19 దృష్ట్యా గత కొన్నేళ్లుగా పండుగ వాతావరణం కనుమరుగవుతుందేమో అన్నట్లుగా తయారయ్యింది. ఈ కరోనా మహమ్మారీ కారణంగా ఎవరి ఇళ్ల వద్ద వాళ్లే పండుగు చేసుకుంటున్నారు. బంధువుల సందడి, సాముహిక పూజలు, ఉత్సవాలు, ఆటపాటలతో జరిగే సంబరాలను గతేడాది నుంచే నిలిచిపోయిన సంగతి తెలిసిందే. (చదవండి: 9 రోజులు జగన్నాథుని ఆలయాన్ని మూసేవేయనున్నట్లు నిర్ణయం) పైగా ఈ కరోనా మహమ్మారీ ప్రపంచదేశాలను ఇంకా పీడిస్తూనే ఉన్న నేపథ్యంలో గుజరాత్‌లోని బాలికలు ఈ దసరా పండుగను కరోనా నిబంధనలను పాటిస్తునే విన్నూతనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి చెందిని బాలికలంతా దేవి నవరాత్రి సందర్భంగా గుజరాత్లో ప్రముఖంగా నిర్వహించే గర్బా(గుజరాతీ వాసుల నృత్యం) కార్యక్రమంలో పీపీఈ కిట్లు ధరించి నృత్యం చేశారు. పైగా వారు ఒక పక్క కోవిడ్ నియంత్రణ ప్రజలకు అవగాహన కల్పించే విధంగానూ మరోవైపు వారి సంప్రదాయాన్ని పాటిస్తూ విన్నూతనమైన రీతిలో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు గర్బా కార్యక్రమ నిర్వాహకుడు కోవిడ్ -19 నియంత్రణ పై ప్రజలకు అవగాహన కల్పించటమే లక్క్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నాడు. (చదవండి: ఎర్ర జెండాలనే ఎందుకు వాడుతున్నారో తెలుసా?) -
విషాదం : గర్బా డ్యాన్స్ చేస్తూ మృత్యుఒడిలోకి
గాంధీనగర్ : గుజరాత్‌లోని గాంధీనగర్‌లో శుక్రవారం రాత్రి పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. అందరితో కలిసి సరదాగా గర్బా డ్యాన్స్ చేస్తున్న మహిళ గుండెపోటు రావడంతో సెకండ్ల వ్యవధిలోనే మరణించింది. వివరాలు.. గాంధీనగర్ జిల్లా రూపాన గ్రామానికి చెందిన 45 ఏళ్ల కల్పనాబెన్ గాద్వి తమ బంధువుల వివాహానికి హాజరైంది. (చదవండి : పెద్దాయన క్రూరత్వం, నెటిజన్ల మండిపాటు) వివాహ వేడుకలో తోటి మహిళలతో కలిసి గర్భా డ్యాన్స్ ఆడుతున్న కల్పనాబెన్ వద్దకు ఆమె కూతురు పరిగెత్తుకు వచ్చింది. దీంతో పాపను ఎత్తుకున్న కల్పనా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలింది. డ్యాన్స్ చేస్తున్న తోటి మహిళలు వచ్చేలోపే ప్రాణాలు విడిచింది. దీంతో అంతసేపు చలాకీగా డ్యాన్స్ చేస్తూ కనిపించిన కల్పనా మరణించడం కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. (చదవండి : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు అస్వస్థత) -
క్వారంటైన్ సెంటర్లో గర్భా డ్యాన్స్
ముంబై : దసరా శరనవరాత్రి ఉత్సవాలు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అంగరంగ వైభవంగా జరిగేవి. అయితే ఈసారి కోవిడ్ నేపథ్యంలో ఆ సందడి కోలాహలమే లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ సెంటర్లో నర్సులతో పాటు రోగులు సైతం పీపీఈ కిట్లు ధరించి గర్భా నృత్యం చేసిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబై గోరేగావ్‌లోని నెస్కో కోవిడ్ సెంటర్ ఇందుకు వేదికైంది. సంప్రదాయ నృత్యం దాండియాకు బదులుగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని మహారాష్ర్ట ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. నవరాత్రి వేడుకలకు అన్ని జాగ్రత్తల నడుమ కోవిడ్ బాధితులకు దగ్గర చేస్తూ వారిలో ఉత్సాహాన్ని పెంపొందించేలా ఆసుపత్రి యాజమాన్యం చర్యలు తీసుకుంది. అంతకుముందు అస్సాంకు చెందిన డాక్టర్ అరూప్ సేనాపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్ ధరించి 'వార్' చిత్రంలోని ఘంగ్రూ పాటకు కాలుకదిపాడు. ఈ వీడియోను సహోద్యోగి అయిన డాక్టర్ ఫైజన్ అహ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కరోనా కాలంలో నెగిటివిటీని దరిచేరనీయకుండా.. మిగిలిన వారికీ ఆదర్శంగా ఉండటమే మంచిదని పలువురు కామెంట్ చేస్తున్నారు. (వైరల్: పీపీఈ కిట్‌లో డాక్టర్ అదిరిపోయే స్టెప్పులు) #WATCH Maharashtra: Patients perform 'Garba' with health workers at the Nesco #COVID19 Center in Goregaon, Mumbai. (19.10.20) pic.twitter.com/14AkyeBzpX — ANI (@ANI) October 19, 2020 -
ఓ చేతిలో పాము.. మరో చేతిలో కత్తి..
గాంధీనగర్ : గార్భా వేడుకల్లో భాగంగా కొంతమంది మహిళలు విష సర్పాలతో విన్యాసాలు చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో పాటు పన్నెండేళ్ల బాలికను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు... నవరాత్రి ఉత్సవాల సందర్బంగా జునాగఢ్ జిల్లాలోని షిల్ గ్రామంలో గార్భా నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఇందులో పాల్గొన్న మహిళలు చేతిలో నాగుపాములను పట్టుకుని నృత్యం చేశారు. మరో మహిళ ఓ చేతిలో కత్తి పట్టుకుని.. మరో చేతిలో పామును ఆడిస్తూ విన్యాసాలు చేసింది. ఈ విషయం గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ విషయం గురించి అటవీ శాఖ అధికారి మాట్లాడుతూ.. ‘ షిల్ గ్రామంలో పాములతో నృత్యాలు చేస్తున్నారన్న విషయం మాకు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెండు పాముల కోరలు తీసేసిన నిందితులు.. మరో పామును మాత్రం అలాగే ఉంచి ప్రమాదకర విన్యాసాలు చేశారు. ఇందులో ఓ బాలిక కూడా ఉంది. మొత్తం ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదైంది. ప్రస్తుతం నలుగురిని పోలీసులు అరెస్టు చేయగా... పాములను సరఫరా చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు’అని తెలిపారు. అయితే ఈ ఘటనలో అరెస్టైన నిందితులకు స్థానిక కోర్టు వెంటనే బెయిలు ఇవ్వడం గమనార్హం. -
వైరల్ వీడియో: సైనికుల గార్బా డాన్స్ !
-
వైరల్ వీడియో: సైనికుల గార్భా డాన్స్ !
దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఆటలు, దాండియా, గార్భా డాన్సులతో ప్రజలంతా సంతోషంగా గడుపుతున్నారు. అయితే సరిహద్దుల్లో గస్తీకాస్తున్న మన సైనికులు కూడా.. హ్యాపీ దసరా చెబుతూ... గార్భా డాన్స్ చేశారు. ఈ వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో షేర్ చేశారు. పండుగ సమయంలో దాండియా డాడీల సునామీ అంటు క్యాప్షన్ చెట్టారు. ఈ వీడియో కొద్ది సమయంలోనే ఇది వైరల్‌గా మారింది. కాగా దసరా నవరాత్రుల సమయంలో గుజరాతీలు తమ సంప్రదాయ నృత్యం గార్భా ఆడటం ఆనవాయితీ. పండుగ సమయంలో చాలా మంది గార్భా డాన్స్ చేస్తుంటారు. pic.twitter.com/ZfWLqWAboB — Ninad Korhale (@korhaleninadn) October 5, 2019 -
నిన్ను చూస్తే అలా కన్పించడం లేదే!
గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించి సరికొత్త విషయాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్త కరణ్ జానీ, అతడి స్నేహితులకి అట్లాంటాలో అవమానం జరిగింది. తన ఇంటి పేరు, రూపం కారణంగా గర్భా వేడుకలో పాల్గొనకుండా నిర్వాహకులు అడ్డుకున్నారని సోషల్ మీడియాలో వరుస పోస్టులతో కరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే... నవరాత్రుల సందర్భంగా అట్లాంటాలో జరుగుతున్న గర్భా వేడుకలో పాల్గొనేందుకు కరణ్ జానీ తన స్నేహితులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా వారి ఐడీ కార్డులను పరిశీలించిన ఆర్గనైజర్స్ వ్యవహరించిన తీరు తన స్నేహితురాలిని భయభ్రాంతులకు గురిచేసిందని కరణ్ పేర్కొన్నారు. ‘నేను, కొంకణీ ప్రాంతానికి చెందిన నా స్నేహితురాలు గర్భా వేడుకలో పాల్గొనేందుకు వెళ్లాం. మమ్మల్ని క్యూలో నిల్చోవాల్సిందిగా నిర్వాహకులు ఆదేశించారు. కానీ అకస్మాత్తుగా ఆమెను లాగి పడేసి.. మీ కార్యక్రమాలకు మేము రాలేదు కదా.. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు. మీకు ఇక్కడ ప్రవేశం లేదంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అయితే తాను కూడా హిందువేనని.. కన్నడ మరాఠీనని చెప్పేందుకు తను ప్రయత్నించింది. ఆమె ఇలా చెప్పడంతో మా గుజరాతీ సోదరులు.. అసలు కన్నడ అంటే ఏంటి. నువ్వు ఇస్మాయిలీవి(ముస్లింవి) అంటూ ఆమెను గద్దించారు. నా మిగతా స్నేహితుల పరిస్థితి కూడా దాదాపుగా అదే విధంగా ఉంది. మొట్టమొదటి సారి గర్భా వేడుకను చూసేందుకు వచ్చిన వాళ్లకు... మా గుజరాతీ సోదరులు భయంకర అనుభవాన్ని మిగిల్చారు’ అంటూ కరణ్ జానీ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. కాగా వడోదరలో జన్మించిన కరణ్ అస్ట్రోఫిజిసిస్ట్గా గుర్తింపు పొందారు. గతేడాది ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రచురించిన అత్యంత శక్తిమంతమైన 30 మంది శాస్త్రవేత్తల జాబితాలో కరణ్ చోటు దక్కించుకున్నారు.