జడేజా పెళ్లికి 'బ్రేవో' స్టెప్పులు! | Suresh Raina, Dwayne Bravo to perform Garba dance at Ravindra Jadeja's marriage ceremony! | Sakshi
Sakshi News home page

జడేజా పెళ్లికి 'బ్రేవో' స్టెప్పులు!

Published Thu, Apr 14 2016 10:04 AM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

జడేజా పెళ్లికి 'బ్రేవో' స్టెప్పులు! - Sakshi

జడేజా పెళ్లికి 'బ్రేవో' స్టెప్పులు!

ఐపీఎల్ గుజరాత్‌ లయన్స్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్రజడేజా పెళ్లివేడుకల్లో సురేష్ రైనా, బ్రేవోలు ఆడిపాడనున్నారు. మేకానికల్ ఇంజినీర్ రివాబా సోలంకీ, జడేజాలు ఏప్రిల్ 17న పెళ్లి చేసుకోనున్నారు. దీని కోసం రైనా, బ్రేవోలు ప్రత్యేకంగా గార్భా డాన్స్ చేయనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టులో కలిసి ఆడినప్పటి నుంచే జడేజా, రైనా, బ్రేవోలు మైదానం బయట కూడా మంచి స్నేహితులు. జడేజా, బ్రేవోలు కలిసి గుజరాత్‌ లయన్స్  డ్రెస్‌లో ఇటీవలే ఛాంపియన్ సాంగ్‌కు కూడా చిందులేశారు.

పెళ్లి వేడుకల్లో దంపతులతో కలిసి బాలివుడ్ పాటలకు బ్రేవో డాన్స్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. గుజరాత్‌లోని కలావడ్‌ రోడ్ లో పెళ్లి జరగనుంది. ఛాంపియన్‌ సాంగ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను పొందిన బ్రేవో స్టెప్పులతో జడేజా పెళ్లి మరింత కళకళలాడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement