ఆ ముగ్గురికి ఐసీసీ క్లీన్‌చిట్ | Lalit Modi's email to ICC accuses Raina, Jadeja and Bravo | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురికి ఐసీసీ క్లీన్‌చిట్

Published Mon, Jun 29 2015 11:48 PM | Last Updated on Tue, Aug 14 2018 3:47 PM

Lalit Modi's email to ICC accuses Raina, Jadeja and Bravo

దుబాయ్: ముగ్గురు అంతర్జాతీయ ఆటగాళ్లు భారీ స్థాయిలో ముడుపులు స్వీకరించారన్న లలిత్ మోదీ ఆరోపణలను ఐసీసీ తోసిపుచ్చింది. వారు అలాంటి పనికి పాల్పడినట్టుగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని స్పష్టం చేసింది. సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో తలా రూ.20 కోట్లను ఓ పారిశ్రామిక వేత్త నుంచి స్వీకరించినట్టు ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోది ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా ఇప్పుడు ముగిసిన వ్యవహారమని, ఆ విషయంపై పూర్తి స్థాయిలో పరిశోధన చేశామని ఐసీసీ తెలిపింది.  మరోవైపు లలిత్ మోదీపై ముగ్గురు క్రికెటర్లు పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తమ ఆటగాళ్లపై మోదీ చేసిన బెట్టింగ్ ఆరోపణలపై బీసీసీఐ కూడా స్పందించింది. ఆ ఆటగాళ్లు తప్పు చేసినట్టుగా ఏమీ రుజువు కాలేదని తేల్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement