వైరల్‌ వీడియో: సైనికుల గార్బా డాన్స్‌ ! | Jawans Playing Garba Dance Posted By Anand Mahindra | Sakshi
Sakshi News home page

వైరల్‌ వీడియో: సైనికుల గార్బా డాన్స్‌ !

Published Tue, Oct 8 2019 1:53 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

దేశ వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బతుకమ్మ ఆటలు, దాండియా, గార్బా డాన్సులతో ప్రజలంతా సంతోషంగా గడుపుతున్నారు. అయితే సరిహద్దుల్లో గస్తీకాస్తున్న మన సైనికులు కూడా.. హ్యాపీ దసరా చెబుతూ... గార్బా డాన్స్ చేశారు. ఈ వీడియోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. పండుగ సమయంలో దాండియా డాడీల సునామీ అంటు క్యాప్షన్‌ చెట్టారు. ఈ వీడియో కొద్ది సమయంలోనే ఇది వైరల్‌గా మారింది. కాగా దసరా నవరాత్రుల సమయంలో గుజరాతీలు తమ సంప్రదాయ నృత్యం గార్భా ఆడటం ఆనవాయితీ. పండుగ సమయంలో చాలా మంది గార్భా డాన్స్ చేస్తుంటారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement