Neeraj Chopra Perform Garba At Events In Vadodara, Video Viral - Sakshi
Sakshi News home page

Neeraj Chopra: గర్బా డ్యాన్స్‌తో అలరించిన నీరజ్‌ చోప్రా

Published Thu, Sep 29 2022 8:05 PM | Last Updated on Thu, Sep 29 2022 8:32 PM

Neeraj Chopra Performs Garba At Event In Vadodara Video Viral - Sakshi

జావెలిన్ స్టార్‌ నీరజ్‌ చోప్రా ఆటలోనే కాదు డ్యాన్స్‌లోనూ ఇరగదీయగలనని నిరూపించాడు. నీరజ్‌ చోప్రా గర్బా డ్యాన్స్‌తో తన అభిమానులను అలరించాడు. విషయంలోకి వెళితే.. బుధవారం గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ఒక ఈవెంట్‌కు నీరజ్‌ చోప్రా హాజరయ్యాడు. వేదిక వద్ద పూజలు చేసిన అనంతరం కొంత మంది స‌భ్యుల‌తో క‌లిసి గ‌ర్భా నృత్యంతో అలరించాడు. ఇక స్టేజ్ మీద‌కు నీర‌జ్ వెళ్లిన స‌మ‌యంలో జ‌న.. ''నీరజ్‌.. నీరజ్‌'' అంటూ భారీగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ చోప్రా జావెలిన్‌ త్రో విభాగంలో స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజతం కైవసం చేసుకున్న నీరజ్‌ పలు టోర్నీల్లో పతకాలతో మెరిశాడు. ఇటీవలే ప్రతిష్టాత్మక డైమండ్‌ లీగ్‌ మీట్‌ ఫైనల్‌లో ఈటెను 88.34 మీటర్ల దూరం విసిరి నీరజ్‌ చోప్రా తొలిసారి టైటిల్‌ గెలిచాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement