
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గార్బా నృత్యాల సంబరం సహజమే. అయితే జయ్‌దీప్ గోహిల్ మాత్రం ‘అండర్–వాటర్ గార్బా డ్యాన్స్’తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంటర్‌నెట్‌లో ఈ అండర్ వాటర్ గార్బా డ్యాన్స్ వైరల్‌గా మారింది. కొన్నిరోజుల క్రితం ‘నవరాత్రి ఇన్ హెవెన్’ టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో కూడా బాగా పాపులర్ అయింది. ఈ వీడియోలో ‘రాధే రాధే’ పాటకు అండర్ వాటర్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు జయ్‌దీప్.
అండర్–వాటర్ గార్బా డ్యాన్స్ విషయానికి వస్తే...‘మాటలు చాలని అద్భుతం’ అంటూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జయ్‌దీప్ గోహిల్ పేరు వినిపించగానే ‘అండర్–వాటర్ డ్యాన్సర్’ అనే మాట వినిపిస్తుంది. అండర్–వాటర్ డ్యాన్సింగ్‌లో ప్రావీణ్యం సంపాదించడానికి ఎన్నో నెలల పాటు కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి జయ్‌దీప్‌కు ఈత, నృత్యం అంటే ఇష్టం. ఇంజనీరింగ్ చేసిన జయ్‌దీప్ 9 టు 5 జాబ్ చేయాలనుకోలేదు. డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. బ్రేక్ డ్యాన్స్ నుంచి హిప్–çహాప్ వరకు రకరకాల డ్యాన్సులు నేర్చుకున్నాడు. ఇక మైకేల్ జాక్సన్ డ్యాన్స్‌లను అచ్చం అలాగే చేసేవాడు.
Comments
Please login to add a commentAdd a comment