underwater
-
ముత్యాల నగరంలో మత్స్యకన్యలు
సాక్షి, హైదరాబాద్: మత్స్యకన్యలు, సాగర కన్యల గురించి కథలుగా చెప్పుకోవడం, సినిమాల్లో చూడటం తప్ప నిజంగా వారిని చూసిన వారెవరూ లేరు. అయితే ఈ జల కన్యలు ఉన్నది వాస్తవమో కాదో కానీ... హైదరాబాద్ నగరానికి చేరుకున్న మత్స్య కన్యలు మాత్రం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్ ఎగ్జిబిషన్ మెర్మెయిడ్ షోలో మనం చూస్తుంది నిజమేనేమో అనిపించేలా మత్స్యకన్యలు ఆకట్టుకుంటున్నారు. ఫిలిప్పీన్ సాగర కన్యలు.. అమెజాన్ చేపలు.. అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్‌ను ఏర్పాటు చేసి, అందులో అరుదైన చేపల ప్రదర్శన, స్కూబా డైవింగ్ వంటి వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేయడం నగరవాసులకు పరిచయమే. కానీ ఊహాజనిత కథలుగా చెప్పుకునే సాగరకన్యలు, హాలీవుడ్ సినిమాల్లో అందంగా కనిపించే మత్స్యకన్యల ప్రదర్శన మాత్రం దేశంలోనే ఇదే మొదటిసారి.దీని కోసం పసిఫిక్ మహాసముద్రంలో ప్రదర్శననిచ్చే ఫిలిప్పీన్‌కు చెందిన ఆరుగురు యువతులు నగరానికి చేరుకున్నారు. మర్మెయిడ్గా పిలుచుకునే వీరు జల కన్యల వస్త్రధారణతో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్లో ఆక్సిజన్ లేకుండా ప్రదర్శన చేయడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఈ మమెడ్ షోలు గతంలో దుబాయ్, థాయ్‌లాండ్, హాంకాంగ్ వంటి దేశాలకు మాత్రమే పరిమితం. ఈ అండర్ వాటర్‌లో సింగపూర్, మలేసియాతో పాటు అమెజాన్ నది నుంచి తీసుకువచి్చన 600 అరుదైన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడి స్కూబా డైవింగ్ కూడా మంచి అనుభూతిని అందిస్తుంది. మరో 37 రోజుల వరకు ఈ ప్రదర్శన జరగనుందని నిర్వాహకులు తెలిపారు. విజ్ఞానం, వినోదమే లక్ష్యంగా.. విదేశాల్లో మాత్రమే చూడగలిగే మెర్మెయిడ్ షోను కోట్ల రూపాయల వ్యయంతో, ఎంతో వ్యయప్రయాసలకోర్చి నగరంలో ఏర్పాటు చేశాం. ఎగ్జిబిషన్ రంగంలో మాకు 39 ఏళ్ల అనుభవం ఉంది. ప్రజలకు అద్భుత అనుభూతిని అందించేందుకు ఫిలిప్పీన్స్ నుంచి జలకన్యలను తీసుకువచ్చాం. ఆక్సిజన్ లేకుండా నిమిషానికిపైగా నీటిలోనే ఉంటూ ప్రదర్శన ఇవ్వడం అరుదైన కళ. వీటితో పాటు 27కు పైగా అమ్యూజ్మెంట్ గేమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానం, వినోదం అందిస్తున్నాం. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. షో మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. – రాజారెడ్డి, నిర్వాహకుడు -
Dubai Floods: దుబాయ్‌లో వర్ష బీభత్సం.. అంతటా అల్లకల్లోలం!
వర్ష బీభత్సానికి ఎడారి దేశం దుబాయ్ విలవిలలాడిపోతోంది. కేవలం గంటన్నర వ్యవధిలో అంటే 90 నిమిషాల్లో.. ఏడాదిలో కురవాల్సిన వర్షమంతా ఒకేసారి కురిసింది. May Allah protect Dubai and all Muslim Ummah! pic.twitter.com/DBULtsnODg — Allah Islam Quran (@AllahGreatQuran) April 17, 2024 భారీ వర్షానికి తోడు వేగంగా వీచిన ఈదురు గాలులకు చెట్లు నేల కూలాయి. కుండపోత వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. మాల్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. Dubai is experiencing serious flood disaster, but who added the screaming and gunshots sound to the video 🤦 pic.twitter.com/TYteXtM4dT — Lawrence I. Okoro ( Sir Law ) (@LawrenceOkoroPG) April 17, 2024 దుబాయ్ ఎయిర్ పోర్టులోనూ వర్ష బీభత్సం ప్రత్యక్షంగా కనిపించింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బయటి రోడ్లను చూస్తే అవి చెరువులను తలపించాయి. రైల్వే వ్యవస్థ చాలావరకూ దెబ్బతింది. సబ్ వేలన్నీ నీట మునిగాయి. రోడ్లపై నిలిపివుంచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. pic.twitter.com/zdHha4kaYv — Taswar Sial (@TaswarSial) April 17, 2024 దుబాయ్ తీరాన్ని తాకిన తుఫాను కారణంగా ఈ ప్రకృతి విలయం సంభవించింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదలతో యూఏఈ అంతటా జన జీవనం స్తంభించింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రైవేట్ ఉద్యోగులకు ఆయా సంస్థలు వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కల్పించాయి. Scenes of current Dubai weather pic.twitter.com/z7rGzUtlIB — Science girl (@gunsnrosesgirl3) April 16, 2024 ఫుజైరా ఎమిరేట్స్‌లో దుబాయ్‌కి మించిన వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ అయిన మాల్ ఆఫ్ ఎమిరేట్స్ లోపలికి నీరు ప్రవేశించింది. నీటి ఒత్తిడికి మాల్ పైకప్పు భాగాలు ఊడి కింద పడ్డాయి. గత 75 ఏళ్లలో ఎప్పుడూ ఇంతటి భారీ వర్షాలు కురియలేదని అధికారులు తెలిపారు. The torrents in Oman are worse than in Dubai. No jokes..pic.twitter.com/O6DGA8sFMe — Henry Kabogo 💧 ❄ 🇰🇪 (@Kabogo_Henry) April 17, 2024 రోడ్లపై భారీగా నిలిచిన నీటిని అధికారులు ట్రక్కుల్లో నింపి క్లియర్ చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా రాగల 48 గంటల్లో భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొంటూ జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకూడదని హెచ్చరించింది. -
అండర్ వాటర్ మెట్రోకు అనూహ్య ఆదరణ
దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నీటి అడుగున నడిచే మెట్రో రైలును ప్రారంభించారు. అది మొదలు ఈ మెట్రోపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మెట్రోలో తాజాగా సాధారణ ప్రయాణికుల సేవలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కోల్‌కతా మెట్రో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అండర్‌వాటర్ మెట్రోలో ప్రయాణించడానికి జనం ఎంతో ఉత్సాహం చూపడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జనం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ‘వందే భారత్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తున్నారు. #CommercialServices on #KaviSubhash-#HemantaMukhopadhyay stretch begins this morning.... pic.twitter.com/6bCxoz5oO9 — Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024 కోల్‌కతాలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్‌లోని హౌరా మైదాన్ స్టేషన్ నుండి శుక్రవారం ఉదయం 7 గంటలకు మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ఎస్ప్లానేడ్ స్టేషన్ నుండి మరో మెట్రో బయలుదేరింది. కోల్‌కతా మెట్రోపాలిటన్ రవాణా నెట్‌వర్క్‌లోని హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగం హుగ్లీ నదికి దిగువన ఉంది. నది కింద ఉన్న ఈ సొరంగం పొడవు 520 మీటర్లు. Regular service on Howrah Maidan - Esplanade, Kolkata Metro started today! pic.twitter.com/Rp2ofTHFS9 — Ashwini Vaishnaw (मोदी का परिवार) (@AshwiniVaishnaw) March 15, 2024 కోల్‌కతా మెట్రో సోషల్ మీడియాలో షేర్ చేసిన పలు ఫొటోలలో ప్రయాణికులు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించవచ్చు. ప్రయాణ సమయంలో, ఒక ప్రయాణికుడు ప్లకార్డుపై ‘భారతదేశాన్ని గర్వించేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు మోడీ జీ’ అని రాశారు. కాగా హుగ్లీ నది దిగువ భాగాన్ని గుర్తించే సొరంగ భాగాన్ని నీలిరంగు ఎల్ఈడీ లైట్లతో అలంకరించారు. ఈ వాటర్ మెట్రో మార్గంలో ప్రతి 12 నుండి 15 నిమిషాలకు రైళ్లు నడుస్తాయి. #Metro passengers queuing up at #Esplanade Metro station this morning to be a part of the history..... pic.twitter.com/smVgUQX9uJ — Metro Railway Kolkata (@metrorailwaykol) March 15, 2024 -
జలాంతర మెట్రో.. హూగ్లీ నదిపై నేడే ప్రారంభం
ఆధునిక భారత రైల్వే చరిత్రలో నూతన అధ్యాయానికి అండర్ వాటర్ మెట్రో శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. అత్యంత లోతైన హౌరా మెట్రో స్టేషన్ గుండా నీటి అడుగున మెట్రో రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇందుకు కోల్‌కతాలోని ఈస్ట్–కోస్ట్ మెట్రో కారిడార్ వేదికగా మారనుంది. ఈ కారిడార్‌లోని హౌరా మైదాన్– ఎస్ప్లానేడ్ సెక్షన్లో ఈ అండర్ వాటర్ మెట్రో సేవలు ప్రయాణికులకు అద్భుత అనుభూతిని పంచనున్నాయి. దేశంలోనే మొట్టమొదటిదైన ఈ అండర్‌వాటర్ మెట్రో సేవలను బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. హూగ్లీ నది జలాల కింద ఈ మెట్రో ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. విశేషాలు ఇవే... ► ఈస్ట్–వెస్ట్ మెట్రో మొత్తం పొడవు 16.6 కిలోమీటర్లు కాగా అందులో 10.8 కిలోమీటర్లమేర విస్తరించిన కారిడార్‌లో రైలు భూగర్భంలో ప్రయాణించనుంది. ► ఇందులో పూర్తిగా నదీజలాల కింద నుంచి 520 మీటర్లమేర రైలు పరుగులుపెట్టనుంది. 45 సెకన్లపాటు సాగే ఈ నదీగర్భ ప్రయాణం మెట్రో రైలు ప్రయాణికులకు అనిర్వచనీయ అనుభూతి ఇవ్వనుంది ► దేశంలో తొలిసారిగా నది అడుగున నిర్మించిన తొలి రవాణా టన్నెల్ కూడా ఇదే కావడం విశేషం. ► కోల్‌కతా పరిధిలోని జంట నగరాలుగా పేరొందిన హౌరా, సాల్ట్ లేక్‌లను కలుపుతూ ఈ మెట్రో రైల్వే సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ► 16.6 కిలోమీటర్లలో 4.8 కిలోమీటర్ల మార్గం కోల్‌కతాలోని సాల్ట్ లేక్ సిటీ ఐదో సెక్టార్, సెల్డాలోని కీలకమైన ఐటీ హబ్‌కు ఎంతో దోహదపడనుంది. ► హూగ్లీ నది అడుగున నిర్మించిన తొలి మెట్రో సొరంగ మార్గంగా ఇది రికార్డులకెక్కనుంది. ► ‘కోల్‌కతా మెట్రో’కు సంబంధించి 2023 ఏప్రిల్ నెల ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆ నెలలో నదీ అడుగున 32 మీటర్ల మేర ప్రయోగాత్మక మెట్రో రైలును విజయవంతంగా నడిపి చూశారు. ► నేడు ( బుధవారం) ప్రధాని మోదీ ఈ రైల్వే సేవలను లాంఛనంగా ప్రారంభించాక గురువారం నుంచి సాధారణ పౌరులను ప్రయాణాలకు అనుమతిస్తామని కోల్‌కతా మెట్రో అధికారి కౌశిక్ మిత్రా చెప్పారు. కవి సుభాష్ –హిమంత ముఖోపాధ్యాయ్, తారాతలా–మాజెర్హాట్ మెట్రో సెక్షన్లను మోదీ ప్రారంభిస్తారు. ► ఈ మెట్రో సెక్షన్లో మొత్తంగా ఆరు స్టేషన్లు ఉంటాయి. వీటిలో మూడింటిని భూగర్భంలోనే కట్టారు. అయినా సరే ప్రయాణికులు భూగర్భం లోపలికి, బయటకు వేగంగా వచి్చపోయేందుకు వీలుగా నిర్మించారు. ► అత్యంత రద్దీ, కాలుష్యమయ కోల్‌కతాలో పర్యావరణ అనుకూల ప్రయాణానికి భరోసానిస్తూ ఈ మెట్రోను ఇలా భూగర్భంలో డిజైన్‌చేశారు. దీంతో కాలుష్య తగ్గడంతోపాటు ప్రయాణికులకు ప్రయాణసమయమూ కలిసిరానుంది. ► ఈస్ట్–వెస్ట్ మెట్రో కారిడార్ పనులు 2009లోనే మొదలయ్యాయి. హూగ్లీ నది అంతర్భాగ పనులు మాత్రం 2017లో ఊపందుకున్నాయి ► 2019 ఆగస్ట్‌లో భూగర్భంలో కొన్ని చోట్ల భూగర్భ జలాలు ఉబికిరావడం, భూమి కుంగడం వంటి ఘటనలతో అండర్‌వాటర్ మెట్రో పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంది. 2022లో వాటర్ లీకేజీ ఘటనలూ ఎదురైనా అన్ని బాలారిష్టాలను దాటుకుంటూ ఎట్టకేలకు ఈ మెట్రో నేడు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ప్రపంచంలో ఎన్నెన్నో 19వ శతాబ్దిలోనే ఇంగ్లిష్ ఇంజనీర్లు భూగర్భ రైల్వే సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచంలోనే పురాతన భూగర్భ రైల్వే నెట్‌వర్క్‌గా థేమ్స్ టన్నెల్‌ను చెప్పుకోవచ్చు. 1843లోనే రోథర్‌హీట్, ర్యాపింగ్ పట్టణాల మధ్య ఈ మార్గాన్ని నిర్మించారు. ఇప్పుడిది లండన్‌లో కీలక రైలు మార్గాల్లో ఒకటి. దీని పొడవు కేవలం 400 మీటర్లు. జపాన్‌లోని సీకెల్ టన్నెల్ ప్రఖ్యాతిగాంచిన అండర్‌వాటర్ రైల్వే టన్నెల్‌గా పేరొందింది. దీని పొడవు ఏకంగా 53.85 కిలోమీటర్లు. హోన్షూ, హోకైడో ద్వీపాల మధ్య సుగారు జలసంధి కింద దీనిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే లోతైన, పొడవైన రైల్వే టన్నెల్‌గా రికార్డుసృష్టించింది. తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో బోస్ఫోరస్ జలసంధి కింద అండర్‌వాటర్ టన్నెల్ నిర్మించారు. ఇది ఇస్తాంబుల్‌లోని ఆసియా, యూరప్ భూభాగాలను కలుపుతుంది. ఈ రైల్వే టన్నెల్ పొడవు దాదాపు 14 కి.మీ.లు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అణు డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తరకొరియా
సియోల్: ఉత్తరకొరియా అణ్వాయుధాల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. తాజాగా పశ్చిమ సముద్ర జలాల్లో అణు దాడి చేసే సామర్థ్యమున్న డ్రోన్‌ను పరీక్షించినట్లు శుక్రవారం ప్రకటించింది. పోర్టులు, యుద్ధ నౌకలను ధ్వంసం చేసే సామర్థ్యం ఈ డ్రోన్‌కు ఉందని తెలిపింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్‌లు కలిసి ఈ వారంలో జెజు దీవికి సమీపంలో చేపట్టిన భారీ సైనిక విన్యాసాలకు స్పందనగానే తామీ పరీక్ష జరిపినట్లు చెప్పుకుంది. గత ఏడాది మొదటిసారిగా ఈ డ్రోన్‌ను పరీక్షించినట్లు తెలిపింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పర్యవసానాలుంటాయని హెచ్చరించింది. -
సముద్ర గర్భంలో ఏకంగా 8 అగ్నిపర్వతాలు
అవున్నిజమే. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 8 అగ్ని పర్వతాలు! అంటార్కిటికా మహాసముద్రంలో 4 వేల మీటర్ల లోతున చాలాకాలంగా నిద్రాణంగా ఉన్నాయట. ఇవి ఒక్కోటీ సగటున కిలోమీటరు పై చిలుకు ఎత్తులో ఉన్నాయి. వీటిలో అతి పెద్ద అగ్నిపర్వత శ్రేణి 1.5 కిలోమీటర్ల ఎత్తుంది! టాస్మేనియా నుంచి అంటార్కిటికా మధ్య 20 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిశోధనలు చేపట్టిన సీఎస్ఐఆర్ఓ వోయేజ్ నౌకలోని పరిశోధక బృందం వీటి ఉనికిని తాజాగా గుర్తించింది. 3డి ఇమేజింగ్ ద్వారా ఈ పర్వతాలను అత్యంత స్పష్టంగా మ్యాపింగ్ కూడా చేసింది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల ఉనికి ఇంత స్పష్టంగా చిక్కడం నిజంగా అద్భుతమని సీఎస్ఐఆర్ఓ జియో ఫిజిసిస్ట్ డాక్టర్ క్రిస్ యూల్ చెప్పారు. సముద్ర ప్రవాహాల వేగం అత్యంత ఎక్కువగా ఉండే ధ్రువ ప్రాంతంలో ఇవి ఉండటం ఆశ్చర్యమేనని ఆయనన్నారు. వీటిలో నాలుగు పర్వతాల ఉనికిని కొన్నేళ్లుగా అనుమానిస్తూనే ఉన్నారు. ఇప్పుడది ధ్రువపడటంతో పాటు వాటి పక్కనే మరో నాలుగు అగ్నిపర్వతాలు కూడా ఉన్నట్టు తేలింది. ఇవి మకారీ ద్వీపానికి దాదాపు 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్నాయి. భూ అయస్కాంత శక్తి చాలని ఫలితంగా బహుశా 20 లక్షల ఏళ్ల కింద ఇవి ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు. సీఎస్ఐఆర్ఓ వోయేజ్ ప్రాజెక్టును అమెరికా, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు ఉమ్మడిగా తలపెట్టాయి. సముద్ర అంతర్భాగపు రహస్యాలను అన్వేషించడంతో పాటు వాటిని స్పష్టంగా మ్యాపింగ్ చేయడం దీని ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ‘‘అంటార్కిటికా మహాసముద్రపు ధ్రువ ప్రవాహ గతి సముద్ర అడుగు భాగాన్ని ఢీకొనడం వల్ల ఏర్పడే భారీ సుడిగుండాలు వేడిమితో పాటు కర్బనాన్ని సముద్రంలో అన్నివైపులకూ చెదరగొడతాయి. అలా గ్లోబల్ వార్మింగ్ కట్టడిలో కీలకపాత్ర పోషిస్తాయి’’ అని వోయేజ్ మిషన్ చీఫ్ కో సైంటిస్టు డాక్టర్ హెలెన్ ఫిలిప్స్ వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఔరా అండర్ వాటర్ గార్బా
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గార్బా నృత్యాల సంబరం సహజమే. అయితే జయ్‌దీప్ గోహిల్ మాత్రం ‘అండర్–వాటర్ గార్బా డ్యాన్స్’తో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇంటర్నెట్లో ఈ అండర్ వాటర్ గార్బా డ్యాన్స్ వైరల్‌గా మారింది. కొన్నిరోజుల క్రితం ‘నవరాత్రి ఇన్ హెవెన్’ టైటిల్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో కూడా బాగా పాపులర్ అయింది. ఈ వీడియోలో ‘రాధే రాధే’ పాటకు అండర్ వాటర్ డ్యాన్స్ చేస్తూ కనిపించాడు జయ్‌దీప్. అండర్–వాటర్ గార్బా డ్యాన్స్ విషయానికి వస్తే...‘మాటలు చాలని అద్భుతం’ అంటూ నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జయ్‌దీప్ గోహిల్ పేరు వినిపించగానే ‘అండర్–వాటర్ డ్యాన్సర్’ అనే మాట వినిపిస్తుంది. అండర్–వాటర్ డ్యాన్సింగ్‌లో ప్రావీణ్యం సంపాదించడానికి ఎన్నో నెలల పాటు కష్టపడ్డాడు. చిన్నప్పటి నుంచి జయ్‌దీప్‌కు ఈత, నృత్యం అంటే ఇష్టం. ఇంజనీరింగ్ చేసిన జయ్‌దీప్ 9 టు 5 జాబ్ చేయాలనుకోలేదు. డ్యాన్సర్‌గా మంచి పేరు తెచ్చుకోవాలనుకున్నాడు. బ్రేక్ డ్యాన్స్ నుంచి హిప్–çహాప్ వరకు రకరకాల డ్యాన్సులు నేర్చుకున్నాడు. ఇక మైకేల్ జాక్సన్ డ్యాన్స్‌లను అచ్చం అలాగే చేసేవాడు. -
నీటి అడుగున అద్భుతాల్ని క్లిక్ మనిపించే డ్రోన్ కెమెరా
నీటి అడుగున ఉండే వింతలను కళ్లారా చూడాలని, వాటి ఫొటోలు తీసుకోవాలని చాలామందికి కోరికగా ఉన్నా, నేరుగా నీటిలోకి దూకడానికి తటపటాయిస్తారు. సరదాగా స్విమ్మింగ్ పూల్లోనో, చిన్నపాటి చెరువులోనో ఈతలు కొట్టేవాళ్లు కూడా సముద్రంలోకి దిగాలంటే వెనుకంజ వేస్తారు. మరి నీటి అడుగున ఉన్న వింత విడ్డూరాలను ఫొటోలు తీసుకోవడమెలా? ఇదిగో, ఈ ఫొటోలో కనిపిస్తున్న బుల్లి డ్రోన్ ఉంటే భేషుగ్గా నీటి అడుగున ఉండే వింత విడ్డూరాల ఫొటోలు సులభంగా తీసుకోవచ్చు. గ్రీస్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ ‘బెంటిక్స్’ ఈ మినియేచర్ అండర్‌వాటర్ డ్రోన్‌ను రూపొందించింది. ఇది లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే, నీటి అడుగున గంటన్నరసేపు నిక్షేపంగా చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసి దీనికి అనుసంధానమైన యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపగలదు. దీనిని రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. దీని పొడవు 11.8 అంగుళాలు, వెడల్పు 9.8 అంగుళాలు, ఎత్తు 5.9 అంగుళాలు. బరువు ఐదు కిలోలు మాత్రమే! దీనిని ఎక్కడికైనా తేలికగా తీసుకుపోవచ్చు. ‘బెంటిక్స్’ ప్రస్తుతం దీనిని నమూనాగా రూపొందించింది. ఆసక్తిగల సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే, మార్కెట్లోకి తీసుకొచ్చేలా దీని ఉత్పాదన భారీ స్థాయిలో ప్రారంభిస్తామని ‘బెంటిక్స్’ ప్రతినిధులు చెబుతున్నారు. -
నీటిలోని చేపను నీరే కబళిస్తే?.. దీని వెనకున్న మిస్టరీ ఏంటి!
చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సొర చేప మింగడం కామనే.. కానీ నీటిలోని చేపను నీరే కబళిస్తే? చేపలు సహా అక్కడి జలచరాలనే ‘మింగేస్తే’? విచిత్రంగా అనిపిస్తున్నా ఇది నిజమేనని శాస్త్రవేత్తలు తాజాగా నిర్ధారించారు. దీని వెనకున్న మిస్టరీని బయటపెట్టారు. అదేమిటంటే... ఈజిప్ట్, సౌదీ అరేబియా మధ్యన ఉన్న ఎర్ర సముద్రానికి ఉత్తరాన ఉన్న గల్ఫ్ ఆఫ్ అకాబాలో శాస్త్రవేత్తలు అరుదైన ‘డెత్ పూల్’ను గుర్తించారు. యూనివర్సిటీ ఆఫ్ మయామీకి చెందిన పలువురు శాస్త్రవేత్తలు రిమోట్ ద్వారా నడిచే అండర్‌వాటర్ వెహికల్ ద్వారా సముద్ర గర్భాన్ని పరిశీలించే క్రమంలో 1,770 మీటర్ల లోతున దీన్ని కనుగొన్నారు. సుమారు 100 అడుగుల పొడవున ఈ మడుగు ఉంది. సాంకేతికంగా బ్రైన్పూల్స్ అని పిలిచే ఈ నీటిలో లవణత అత్యంత ఎక్కువగా ఉంటుందని, ఫలితంగా అందులో ఆక్సిజన్ శాతం ఏమాత్రం ఉండదని పేర్కొన్నారు. చదవండి: ఆ చేప చిక్కడమే విషాదం ... హఠాత్తుగా మీదకు దూకి... అందువల్ల చేపలు సహా మరే జలచరాలైనా ఈ మడుగులోకి ప్రవేశించగానే మరణిస్తాయని శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ శామ్ పుర్కిస్ తెలిపారు. కానీ విచిత్రంగా ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ సూక్ష్మజీవులు ఈ మడుగులో జీవిస్తున్నాయని... ఈ నీటిలోకి వచ్చి మరణించే జలచరాలను ఆహారంగా తీసుకుంటున్నాయని వివరించారు. భూమిపై లక్షల ఏళ్ల కిందట సముద్రాలు ఎలా ఏర్పడ్డాయనే విషయంలో చేపట్టబోయే భావి పరిశోధనలకు తాజా పరిణామం దోహదపడుతుందని చెప్పారు. భూమిపై జీవం మనుగడకు ఉన్న పరిమితులు ఏమిటో అర్థం చేసుకోనిదే ఇతర గ్రహాలపై జీవం ఉనికిని అంచనా వేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ పరిశోధన వివరాలను ప్రముఖ జర్నల్ ‘నేచర్’ ప్రచురించింది. -
మహాసముద్రంలో మిస్టరీలు.. మరి మీరు రెడీనా!
సముద్రంలో కనివిని ఎరగని జీవజాలాలే కాదు... ఎన్నో మిస్టరీలు దాగున్నాయి. వాటిని ఛేదించాలనుకుంటున్నారా? ఉత్సాహం ఉందా? అయితే పదండీ... ఈ నెలలో విడుదలైన సర్రియల్ అండర్ వాటర్ అడ్వెంచర్ గేమ్ ఫజిల్... స్లీట్. సముద్రాన్ని బయటి నుంచి చూడడం వేరు, సముద్రగర్భంలోకి వెళ్లడం వేరు. ఇప్పుడు మనం లో లోపటికి వెళుతున్నాం. అదిగో... తిమింగలానికి బాప్‌లాంటి రాక్షస తిమింగలం ఎదురొస్తుంది. అది నోరు తెరిస్తే... కోరల రూపంలో పదునైన గునపాల వనం కనిపిస్తుంది. అది మళ్లీ నోరు మూసే లోపే మనం తప్పించుకోవాలి. (క్లిక్: యూట్యూబ్‌లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఇదే!) కమ్మని సంగీతం వినిపిస్తే అటువైపు వెళతాం. ఏదో జంతువులాగుంది. బూర వాయిస్తుంది. వెళ్లాలా? వద్దా? అని ఆలోచించేలోపే అది మనపై ఎటాక్ చేయవచ్చు. అటు వైపు వెళితే... మన ‘పాతాళభైరవి’లో హీరోకు కనిపించే పే.....ద్ద విగ్రహంలాంటిది కనిపించి కళ్లెర్ర చేయవచ్చు. ఇంకొంచెం దూరం వెళితే... అందమైన దీపాలు అద్భుతమైన వెలుగుతో కనిపిస్తాయి. ‘ఆహా’ అనుకునే లోపే ఆ దీపాలు కాస్త భారీ గొంగళి పురుగుల ఆకారంలో మనల్ని వేటాడడానికి వస్తుంటాయి. ఇవి కొన్ని మాత్రమే. మరి మీరు రెడీనా! జానర్: అడ్వెంచర్ ఇండీ డెవలపర్స్: స్పైరల్స్ సర్కస్ -
సముద్రంలోపల పార్టీ? ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటల ప్రయాణం.. ఇది ఒక సంచలనం!
సముద్రంపై నౌకలో పార్టీలు, పెళ్లిళ్లు మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. సముద్రంలోతుల్లోనూ పార్టీ చేసుకునే అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చిందో డచ్ కంపెనీ. సముద్రం లోపల సబ్‌మెరైన్‌లో పార్టీ... ఊహించడానికే థ్రిల్లింగ్‌గా ఉంది కదా! సాధారణంగా జలాంతర్గాములను నేవీకోసమో, లేదంటే సముద్రపు లోతుల్లోని రహస్యాలను కనుగొనేందుకో ఉపయోగిస్తారు. కానీ వ్యక్తిగత, వాణిజ్య జలాంతర్గాముల తయారీలో దిగ్గజ సంస్థ అయిన నెదర్లాండ్స్‌కు చెందిన యూ–బోట్‌వర్క్స్ ఈ అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ (యూడబ్ల్యూఈపీ)ను తయారు చేసింది. మినీ క్రూయిజ్ షిప్ తరహాలో రూపొందించిన ఈ సబ్‌మెరైన్ 200 మీటర్ల లోతువరకు డైవ్ చేయగలదు. 120మంది ప్రయాణించగలిగే సబ్‌మెరైన్‌లో 64 సీట్ల సామర్థ్యమున్న రెస్టారెంట్, జిమ్, కాసినో, వెడ్డింగ్ హాల్ కూడా ఉన్నాయి. సముద్రంలోపలి అద్భుతాలను వీక్షించేందుకు వీలుగా దీనికి 14 విశాలమైన కిటికీలను ఏర్పాటు చేశారు. వాటి బయట సముద్రం స్పష్టంగా కనిపించేందుకు ప్రకాశవంతమైన దీపాలను అమర్చారు. ఇది సముద్రతీరంలో ఉన్నప్పుడు, ఉపరితలంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తీరపు అందాలను ఆస్వాదించేలా యూడబ్ల్యూఈపీపై సన్‌డెక్‌ను, దాని చుట్టూ రెయిలింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ సబ్‌మెరైన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటలపాటు ప్రయాణించొచ్చు. యూడబ్ల్యూఈపీ ఓ సంచలనమని, నీటి అడుగున వేడుకలకు ఇది దారి చూపుతుందని యూ–బోట్‌వర్క్స్ వ్యవస్థాపక సీఈవో బెర్ట్ హౌట్మాన్ తెలిపారు. ఇంకెందుకాలస్యం.. నెదర్లాండ్స్‌కు వెళదాం అనుకుంటున్నారా! ఆగండాగండి.. ఏదైనా టూరిజం కంపెనీ కొనుగోలు చేసి టూర్స్ ఆఫర్ చేసేవరకూ మనం ఎదురుచూడాల్సిందే. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
నీటిలో అబ్బురపరిచే డ్యాన్స్ విన్యాసం.. ‘వారెవ్వా’ అనాల్సిందే
డ్యాన్స్ చాలా మందికి పిచ్చి. దాన్ని ఒక ఫ్యాషన్‌లా ఫీల్ అవుతూ ప్రాణాలను పణంగా పెట్టి చేస్తుంటారు. నాట్యంలో కొత్త మెలుకువలు నేర్చుకుంటూ తమ టాలెంట్‌ను నిరూపించుకుంటారు. తమ విన్యాసాలతో అందరి చేత శభాష్ అనిపించుకునేందుకు తహతహలాడుతుంటారు. అయితే ఇప్పటి వరకు ఫ్లోర్, బ్రేక్, హిప్ అప్, ఫోక్ వంటి వెరైటీ డ్యాన్లు చూసే ఉంటాం. అలాగే నేల మీద, తాడులతో వేలాడుతూ గాల్లో చేసే డ్యాన్లు కూడా తెలుసు. కానీ నీళ్లలో డ్యాన్స్ చేయడం చూశారా.. చాలా తక్కువ మంది ఇలా ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఓ జిమ్నాసిస్ట్ నీటి లోపల డ్యాన్స్ చేస్తూ ఎంతో మందిని అబ్బురపరిచింది. ఫ్లోరిడాలోని మయామికి చెందిన క్రిస్టినా మకుషెంకో అనేమహిళ నీటి లోపల అద్భుతమైన స్టెప్పులతో చేస్తున్న డ్యాన్స్ విన్యాసం పలువురిని ఆకట్టుకుంటోంది. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నెటిజనులు సర్ఫ్రైజ్కు గురవుతున్నారు. మకుషెంకో నీటి లోపల చేసిన డ్యాన్స్ ప్రతిభను చాలా మంది ప్రశంసించారు. ‘మీరు అద్భుతంగా చేస్తున్నారు. ఇది మాకెంతో నచ్చింది. వారెవ్వా సూపర్’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా అమెరికాకు చెందిన 26 ఏళ్ల క్రిస్టినా మకుషెంకో అంతర్జాతీయ స్విమ్మర్. 2011 లో యూరోపియన్ జూనియర్ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు కూడా సాధించారు. ఆ తరువాత ఆమె ఈతల పోటీల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. View this post on Instagram A post shared by Kristina Makushenko (@kristimakusha) -
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సముద్ర గర్భంలో ఒక్కటయ్యారు
సాక్షి , చెన్నై: అందరిలా బాజా భజంత్రీల నడుమ కల్యాణమండపంలో పెళ్లి చేసుకుంటే మజా ఏముందని అనుకుంది ఆ జంట. గతంలో తమిళనాడుకు చెందిన ఒక జంట భారీ బెలూన్‌లో ఆకాశంలో ఎగురుతూ పెళ్లి చేసుకుంది. అందుకు పూర్తి భిన్నంగా మరో జంట కడలి గర్భంలో కల్యాణం చేసుకుని మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. తమిళనాడులో సోమవారం జరిగిన ఈ చిత్రమైన కల్యాణం వివరాలు ఇలా ఉన్నాయి. తిరువన్నామలైకి చెందిన చిన్నదురై, కోయంబత్తూరు జిల్లాకు చెందిన శ్వేతకు పెద్దలు పెళ్లి నిశ్చయించారు. వీరిద్దరూ చెన్నైలోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. తమ పెళ్లిని ప్రత్యేకంగా జరుపుకోవాలని భావించారు. సముద్రపు జలాల అడుగులో పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పెళ్లికొడుకు చిన్నదురై పుదుచ్చేరికి వెళ్లి స్కూబా డైవింగ్ శిక్షణ కళాశాల నడిపే తన స్నేహితుని వద్ద శిక్షణ పొందాడు. సోమవారం ఉదయం పెళ్లికుమార్తె శ్వేతతో కలిసి చెన్నై సమీపం నీలాంగరై సముద్రంలో ఒక పడవలో అలలపై ప్రయాణిస్తూ 60 అడుగుల దూరానికి చేరుకున్నాడు. వధూవరులిద్దరూ అక్కడ పెళ్లి దుస్తులు వేసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్ అమర్చిన స్కూబా డైవింగ్ డ్రస్సును ఇద్దరు వేసుకుని సముద్రంలోకి దూకారు. సముద్రపు అడుగు భాగంలో ఉండే మొక్కల మధ్య పూలతో అలంకరించి ఉన్న వివాహవేదిక వద్దకు చేరుకున్నారు. అలల్లో తేలియాడుతూనే ఇద్దరూ మాలలు మార్చుకున్నారు. ఆ తరువాత పెళ్లికుమారుడు చిన్నదురై పెళ్లికుమార్తె శ్వేత మెడలో తాళి బొట్టుకట్టాడు. మాంగల్యధారణ పూర్తికాగానే వధూవరులిద్దరూ సముద్రతీరానికి చేరుకోగా అప్పటికే అక్కడ సిద్దంగా ఉన్న బంధువులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. సముద్ర గర్భంలో మాంగల్యధారణ దృశ్యం కాలుష్యంపై చైతన్యం కోసం.. వివాహానంతరం వరుడు చిన్నదొరై మీడియాతో మాట్లాడుతూ.. సముద్రంలోకి వెళ్లినప్పుడు సందర్శకులు విచ్చలవిడిగా విసిరేసిన వ్యర్థాలు, వాటి వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని చూసి బాధపడి, కడలిని కాపాడుకోవాలని ప్రజలకు సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా పెళ్లి చేసుకున్నానని చెప్పారు. పెళ్లిని నేరుగా చూడలేకపోయిన లోటును తీర్చేందుకు ఈ నెల 13న చెన్నై శోళింగనల్లూరులో రిసెప్షన్ ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు. -
నీటిలోపల రెస్టారెంట్..డిన్నర్ ఖరీదు ఎంతంటే..
లండన్ : యూరప్‌లో తొలి అండర్‌వాటర్ రెస్టారెంట్ నార్వేలో బుధవారం అందుబాటులోకి వచ్చింది. ఈ రెస్టారెంట్లో సముద్ర అందాలను వీక్షిస్తూ ఇష్టమైన సీఫుడ్‌ను ఆస్వాదించేందుకు ఇప్పటికే ఏడు వేల మంది కస్టమర్లు బుక్ చేసుకున్నారు. అండర్ పేరుతో నార్వే తీరంలో ఏర్పాటైన ఈ రెస్టారెంట్ సముద్రంలో పాక్షికంగా మునిగిన బారీ కాంక్రీట్ ట్యూబ్‌లా కనిపిస్తుంది. ఈ రెస్టారెంట్‌ను ఓస్లోలో ఒపెరా హౌస్, న్యూయార్క్‌లో సెప్టెంబర్ 11 నేషనల్ మెమోరియల్ మ్యూజియంను రూపొందించిన ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ స్నోహెట్టా డిజైన్ చేసింది. నీటిలోపల ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్లో భారీ విండో ద్వారా సముద్ర హొయలను వీక్షించవచ్చని, ఇది ఆక్వేరియం మాదిరి ఉండదని, వాస్తవ అనుభూతిని సందర్శకులకు అందిస్తుందని స్నోహెట్టా వ్యవస్థాపకుడు జెటిల్ ట్రాడెల్ థార్సెన్ చెప్పుకొచ్చారు. రెస్టారెంట్‌లోని డైనింగ్ హాల్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. దాదాపు 40 మంది అతిధులు కూర్చునేలా డిజైన్ చేసిన డైనింగ్ హాల్ నుంచి భారీ ట్రాన్స్పరెంట్ విండో ద్వారా సముద్ర అందాలను తిలకించే ఏర్పాటు ఆకట్టుకుంటోంది. ఆకుపచ్చని నీటి రంగును రిఫ్లెక్ట్ చేస్తూ పగలంతా రెస్టారెంట్లో సహజ సిద్ధమైన లైటింగ్ ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు. సందర్శకులకు మధురానుభూతిని మిగిల్చే అండర్ వాటర్ రెస్టారెంట్లో స్ధానిక రుచులు, సీఫుడ్ సహా 18 రకాల వంటకాలతో కూడిన భోజనానికి ఒక్కరికి రూ 29,610 వసూలు చేస్తారు. రెస్టారెంట్లో విందు ఆరగించిన వారు ఆ రాత్రికి హోటల్లోనే గడిపే అవకాశం కల్పిస్తారు. తొలిరోజు హోటల్ యజమానుల కుటుంబ సభ్యులు, స్నేహితుల కోసం రెస్టారెంట్‌ను తెరిచిఉంచగా తొలి పేయింగ్ గెస్ట్‌లకు ఏప్రిల్ తొలివారం నుంచీ అండర్ను అందుబాటులోకి తీసుకువస్తారు. ప్రపంచంలో కొద్ది సంఖ్యలోనే అండర్‌వాటర్ రెస్టారెంట్లు అందుబాటులో ఉండగా వీటిలో మాల్దీవుల్లోనే ఈ తరహా హోటళ్లు అధికంగా ఉన్నాయి. -
సాగరగర్భంలో తొలి మ్యూజియం!
సాక్షి, చెన్నై: దేశంలో తొలిసారిగా పుదుచ్చేరిలో సముద్ర గర్భంలో ఓ మ్యూజియం రూపకల్పనకు బీజం పడింది. 26 అడుగుల మేరకు నిర్మాణాలు సాగరంలో జరగనున్నాయి. పుదుచ్చేరి సముద్ర తీరం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్రెంచ్ వారి హయాంలో నిర్మించిన పురాతన చిహ్నాలు ఎన్నో ఈ తీరంలో ఉంటాయి. పుదుచ్చేరికి ఆదాయం విదేశీ, స్వదేశీ పర్యాటకుల ద్వారానే ఎక్కువగా వస్తోంది. దీంతో పర్యాటకంగా పుదుచ్చేరిని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో సముద్ర గర్భంలో ఓ మ్యూజియం ఏర్పాటుకు కార్యాచరణపై దృష్టి పెట్టింది. కొన్ని ప్రైవేటు సంస్థలు ముందుకు రావడంతో సమష్టి భాగస్వామ్యంలో నిర్మాణాలపై కసరత్తు జరుగుతోంది. నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ కడలూరు ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో ఈ జలాంతర్గామిని మ్యూజియం కోసం ఎంపిక చేశారు. 61.3 మీటర్ల పొడవు, 10.2 మీటర్ల వెడల్పు, 11.98 మీటర్ల ఎత్తు కల్గిన ఈ జలాంతర్గామిలో ఉన్న యంత్రాలు, ఇతర పరికరాల్ని తొలగించి మ్యూజియంగా మార్చడానికి అవసరమైన పనులు విశాఖపట్నంలో సాగుతున్నాయి. ఈ మ్యూజియంలోకి వెళ్లే మార్గంలో డాల్ఫిన్‌తో పాటు సముద్ర జలరాశుల్ని వీక్షించేందుకు తగ్గట్టుగా అద్దాలతో నిర్మాణాలు చేపట్టనున్నారు. -
సముద్ర గర్భంలో అద్భుతం.. అద్దె ఎంతో తెలుసా?!
మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలోయ్.. ఎప్పుడూ ఉరుకులూ, పరుగులూ, టెన్షన్లేనా..? కాంక్రీట్ జంగిల్లో, ఇరుకు గదుల్లో రోబోల్లా ఉండాల్సిందేనా..? ఇక చాలు.. అటువంటి బిజీ లైఫ్‌కి కాస్త విరామం ఇవ్వండి.. మా ‘మురాకా’ లో సేద తీరండి అంటూ ట్రావెల్ ప్రియులను ఆహ్వానిస్తోంది మాల్దీవుల ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా.. మురాకా అంటే పగడం అని అర్థం. మాల్దీవుల్లోని రంగాలీ ఐలాండ్‌లో ఉన్న ఓ విల్లా కూడా పగడంలా మెరిసిపోతుందట. అందుకే దానికి మురాకా అని పేరు పెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ విల్లాగా పేరు పొందిన ఈ విల్లా నిర్మాణానికి సుమారు 15 బిలియన్లు ఖర్చు అయిందట. సింగపూర్‌లో తయారు చేసిన ఈ విల్లాను మాల్దీవులకు తీసుకు వచ్చి కాంక్రీట్ పోల్స్ సహాయంతో సముద్రంలో దించారు. వేగమైన గాలులు, అలలను తట్టుకుని ఇది నిలబడగలదు. హిందూ మహాసముద్రంలో 16 అడుగుల లోతులో నిర్మితమైన ఈ రెండు అంతస్తుల విల్లా గుండా అరుదైన సముద్రపు జీవులను వీక్షిస్తూ హాయిగా సేద తీరవచ్చు. జిమ్, బార్ వంటి అదనపు సౌకర్యాలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు సూర్యుడిని చూసేందుకు విల్లా పైకి ఎక్కితే సరి. అయితే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మురాకాలో ఒక్కరాత్రి స్టే చేయాలంటే భారీగానే ఖర్చు పెట్టాల్సింది ఉంటుంది మరి. అంతేకాదు ఒక వ్యక్తి ఈ విల్లాను కేవలం నాలుగు సార్లు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఇంతకీ ఒక్కరోజు అద్దె ఎంతో చెప్పలేదు కదూ.. జస్ట్ 36 లక్షలేనటండీ. -
అట్టడుగు అద్భుతం.. బయటపడింది!
భూమిపైనేకాదు.. సముద్రంలోనూ గుహలుంటాయనే విషయం మీకు తెలుసా? మెక్సికోలో బయటపడ్డ ఓ గుహ గురించి తెలుసుకుంటే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఇది చదవండి! మెక్సికో: మనదేశంలో ఎన్నో దేవతా విగ్రహాలు గుహల్లో కొలువయ్యాయి. అయితే వాటి పొడవు కొన్ని మీటర్లు మాత్రమే. అప్పుడప్పుడూ విహారయాత్రకు వెళ్లినప్పుడు ఇంకాస్త పొడవుగా ఉండే బొర్రా గుహల్లాంటివి చూసుంటాం. ఇక ప్రపంచంలో ఇప్పటిదాకా డోస్ ఓజోస్ గుహలే పెద్దవనుకున్నారు. వీటి పొడవు 83 కిలో మీటర్లు. ఈ మధ్య మెక్సికోలో తులుమ్ దగ్గర బయటపడ్డ గుహే పెద్దదనుకున్నారు. దీని పొడవు 268 కిలోమీటర్లు. అయితే ఇవన్నీ భూమిపై ఉన్న గుహలు మాత్రమే. కానీ సముద్రంలోనూ ఓ పే..ద్ద గుహ బయట పడింది. ఈ అద్భుతమైన గుహను మెక్సికో శాస్త్రవేత్తలే ప్రపంచానికి పరిచయం చేశారు. అది ఎక్కడంటే మెక్సికో సముద్ర తీరంలో ఈ గుహను గుర్తించారు. సముద్రంలో నీళ్లలో ఉండే గుహల్లో ఇదే పొడవైనదట. దీని పొడవు ఏకంగా 347 కిలోమీటర్లుందని తెలిసిన తర్వాత శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. సరదాగా డైవర్లు సముద్రంలో చక్కర్లు కొడుతుంటూ ఈ గుహ బయటపడింది. దాని పై భాగం అంతా ఎంతో చిత్రంగా అనిపించింది. రాయి కరిగి కిందికి కారుతోందా అన్నట్లుంది. వెళ్లే కొద్దీ లోపలికి దారి కనిపిస్తూనే ఉంది. దీంతో పరిశోధనలు చేయడానికి సంసిద్ధమై.. ముఖానికి ఆక్సిజన్ సిలిండర్లు, చేతికి లైట్లున్న గ్లౌజులు వేసుకొని పరిశోధన కొనసాగించారు. ఇదే పెద్ద గుహ అని నిర్ధారించుకున్న తర్వాత దానికి డోస్ ఓజోస్ కేవర్న్ సిస్టమ్ అని పేరూ పెట్టారు. 20 ఏళ్ల పరిశోధన... యుకటన్ ద్వీపకల్పంలో మిస్టరీగా మారిన ఇలాంటి గుహలపై 20 ఏళ్లుగా రాబర్ట్ స్కిమిట్నర్ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. చివరకు గామ్ బృందం(పురాతత్వ పరిశోధన సంస్థ) సహకారంతో.. కొందరు స్కూబా డైవర్లను లోపలికి పంపి ఆయన ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. 10 నెలల నిరంతరాయ పరిశోధన తర్వాత వేల సంవత్సరాల నాటి శిలాజాలు లభించగా.. వాటిని చరిత్రకారులు పరిశీలిస్తున్నారు. -
బ్రిటిష్ మ్యూజియంలో ఈజిప్టు అద్భుతాలు!
ఫ్రెంచ్ పురాతత్వవేత్త గాడియో అద్భుత ఆవిష్కారాలు ఇప్పుడు బ్రిటిష్ మ్యూజియంలో సందర్శనకు సిద్ధమయ్యాయి. ప్రాచీన ఈజిప్టు నగరాల ఆనవాళ్ళు త్వరలో సందర్శకులకు కనువిందు చేయనున్నాయి. సముద్రంలో మునిగిపోయి, ఎవ్వరికీ కనిపించకుండా పోయిన గొప్ప ఈజిప్టు నగరాలు ఎన్నో వేల సంవత్సరాలపాటు రహస్య నగరాలుగానే మిగిలిపోయాయి. కనిపించకుండా పోయిన ఆ నగరాలను పురాతత్వవేత్త ఫ్రాంక్ గాడియో కొన్నేళ్ళ క్రితం సముద్రానికి అడుగు భాగంలో కనిపెట్టిన విషయం తెలిసిందే. ఆ నగరాలకు సంబంధించిన అనేక అద్భుతాలను ఇప్పుడు సందర్శకులకు అందుబాటులో బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు పెడుతున్నారు. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయిన థోనిస్ హెరాస్టెయిన్ నగరంలోని అద్భుత దేవాలయాలు, ప్రాచీన శిలాకృతులు గాడియో కనిపెట్టే వరకూ ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా నీటి అడుగున నిక్షిస్తమైపోయాయి. చేపలకు ఆవాసాలుగా మారిపోయాయి. ఆ నగరాలనుంచి సేకరించిన దేవతా విగ్రహాలు, శిల్ప సంపద ప్రస్తుతం ప్రపంచానికి పరిచయం కానున్నాయి. సంవత్సరాలకొద్దీ కాలం ఈ ప్రాచీన చిహ్నాలను గుర్తించేందుకు గాడియో ఎంతో శ్రమించాడు. దీనికి తోడు కానోపస్ ను కూడ అంగుళం లోతు ఇసుకలో కూరుకుపోయి నీటి అడుగు భాగంలో ఉన్నట్లుగా 1933లో బ్రిటిష్ ఆర్ ఏ ఎఫ్ పైలట్ కనుగొన్నాడు. ప్రస్తుతం ఆ ఈజిప్టు అద్భుత శిలా సంపదను మే 19న ప్రదర్శనకు అందుబాటులోకి తేనున్నట్లు మ్యూజియం క్యూరేటర్ మాసెన్ బెర్గోఫ్ తెలిపారు. ప్రాచీన గ్రీకు చరిత్రకారులు, గ్రంథాలు, పురాణాలు వంటి ఎన్నో విశేషాలను ఇప్పుడు మ్యూజియంను సందర్శించిన వారు తెలుసుకునే అవకాశం కల్పిస్తున్నారు. -
బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఇదేనా?
లండన్: పెద్ద పెద్ద నౌకలతోపాటు ఆ మార్గం గుండా ఆకాశమార్గాన ప్రయాణిస్తున్న విమానాలను కొన్ని క్షణాల్లోనే మింగేసి సముద్ర గర్భంలో దాచేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ గురించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోని నార్వే తీరానున్న బేరెంట్స్ సముద్ర గర్భంలో కిలోమీటరు వెడల్పు, 150 అడుగుల లోతైన క్రేటర్స్ (గొయ్యిలాంటి అగ్నిబిళ ముఖద్వారాలు) అనేకం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ క్రేటర్స్‌కు అడుగుభాగానున్న సహజవాయువుల నుంచి విపరీతంగా మిథేన్ గ్యాస్ వెలువడుతోందని, ఈ గ్యాస్‌కు పేలుడు స్వభావం ఉన్నందున అప్పుడప్పుడు పేలుళ్లు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పేలుడు సంభవించి మిథేన్ గ్యాస్ మండిపోయి ఆ ప్రాంతంలో ఏర్పడిన శూన్యాన్ని నింపడం కోసం సముద్ర జలాలు ఒక్కసారిగా క్రేటర్స్లోకి చొచ్చుకుపోవడం వల్ల భారీ నౌకలు కూడా మునిగిపోతున్నాయని వారు అంచనా వేశారు. కొన్ని సందర్భాల్లో మంచుగడ్డ రూపంలో ఉన్న మిథేన్ గ్యాస్ కూడా తగులబడి పోవడం శూన్యం మరింత విస్తరిస్తున్నట్లుగా వారు అభిప్రాయపడ్డారు. విమానాలు కూలి పోవడానికి కూడా మథేన్ గ్యాస్ మండిపోవడంతో ఏర్పడిన శూన్యమే కారణమా? అన్న అంశాన్ని ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని వారంటున్నారు. ఏదేమైనా క్రేటర్స్ను కనగొనడం ద్వారా బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనని వారు చెబుతున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ బ్రిటన్ అంతర్జాతీయ జలాల ప్రాదేశిక ప్రాంతం నుంచి ఫ్లోరిడా తీరంలోని ప్యూర్టోరికా వరకు విస్తరించి ఉంది. -
శక్తివంతమైన యువతి సంప్రీతి..!
ముఫ్పై ఏళ్లు కూడ నిండని ఆమె... అత్యంత ప్రతిభావంతుల జాబితాలో నిలిచింది. అండర్ వాటర్ డ్రోన్స్ ను అభివృద్ధి పరచి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. జీపీఎస్ పని చేయని సముద్రాంతర భాగాల్లో కూడ సులభంగా తిరుగుతూ అక్కడి విశేషాలను అన్వేషించే చిన్నపాటి పరికరాన్ని సృష్టించి ఫోర్బ్స్ టాప్ 30 శక్తివంతుల్లో ఒకతెగా పేరు సంపాదించింది. కోల్ కతాకు చెందిన 28ఏళ్ళ సంప్రీతి భట్టాచార్య మసాచు సెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో పీహెచ్ డీ చేసింది. అత్యంత సులభంగా అన్వేషించే చిన్నపాటి డ్రోన్ ను కనిపెట్టి ప్రపంచంలోనే ప్రతిభావంతుల సరసన చేరింది. జీపీఎస్ పనిచేయని ప్రదేశాల్లో, సముద్రంలోని నీటి అడుగు భాగంలో అన్వేషణ చేయడంతోపాటు, డేటాను మ్యాప్ చేసే డ్రోన్ ను రూప కల్పన చేసి అత్యంత శక్తివంతమైన యువతిగా పేరు తెచ్చుకుంది. కోడిగుడ్డు ఆకారంలో ఉండి, సుమారు ఫుడ్ బాల్ పరిమాణంలో ఉండే ఓ చిన్న స్వయం ప్రతిపత్తి కలిగిన డ్రోన్ ను మార్కెట్లోకి కొత్తగా విడుదల చేసి వార్తల్లోకెక్కింది. కోల్ కతాలోని సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యాలయంనుంచి ఇంజనీరింగ్ అభ్యసించిన సంప్రీతి... తరువాత ఓహియోస్టేట్ యూనివర్శిటీ లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేసింది. అనంతరం ఎంఐటీలో రోబోటిక్స్ పై అధ్యయనం చేసింది. ప్రస్తుతం సముద్రాంతరాల్లో, నీటి అడుగు భాగంలో చమురు, పర్యావరణ పర్యవేక్షణ, అన్వేషణా కార్యకలాపాలను అధ్యయనం చేసేందుకు అటానమస్ అండర్ వాటర్ వెహికిల్ (AUV) అనే చాలా ఖరీదైన మిషన్ ఆధారిత పరికరాన్ని వినియోగిస్తున్నారు. పైగా ఆ అతి పెద్ద మెషీన్ తో సముద్రంలోని రోజువారీ విషయాలను, పర్యావరణాన్నిఅధ్యయనం చేసే అవకాశం కూడ ఉండదు. ఇదే విషయాన్ని గమనించిన సంప్రీతి సముద్రాల్లో సులభంగా తిరిగి అక్కడి ప్రతివిషయాన్నీ పరిశీలించే అతి చిన్న డ్రోన్ ను అభివృద్ధి పరిచింది. దీని ద్వారా భవిష్యత్ తరాల్లో మార్పును సముద్రాంతరాల్లో డేటాను సేకరించడం సులభమౌతుందని చెప్తోంది. అండర్ వాటర్ నేవిగేషన్ అనేక సంవత్సరాల క్రితమే అమల్లోకి వచ్చిందని, అయితే ఆధునిక పరిశోధనల ద్వారా రూపొందించిన తన డ్రోన్ గూగుల్ మ్యాప్ లా త్వరితగతిన విషయాన్ని సేకరించే అవకాశం ఉంటుందని సంప్రీతి చెప్తోంది. అంతేకాక అతి చిన్న, సూక్ష్మమైన వస్తువులను, జీవులను కూడ ఇది గుర్తిస్తుందని, దీంతో నీటి అడుగుభాగాన ఉండే కాలుష్యాన్ని కూడ గుర్తించే అవకాశం ఉందని చెప్తోంది. జలజీవితాన్ని అధ్యయనం చేయడంలో ఈ డ్రోన్లు గంటకు వంద చదరపు కిలోమీటర్ల వరకు కవర్ చేస్తాయని, లోతైన సముద్రాల్లో కూడ అపారమైన ఒత్తిడిని తట్టుకుని, ఈతకొడుతూ విషయాలను గుర్తిస్తాయని వెల్లడించింది. తన డ్రోన్ ను వ్యాపారాత్మకం చేసే ఉద్దేశ్యంలో ఉన్న సంప్రీతి ఓ సంస్థను ప్రారంభించాలనుకుంది. అందులో భాగంగానే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొంది. ఎంఐటి 100కె. డాలర్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పోటీలో టాప్ 8 గా నిలిచి, 15,000 డాలర్లను ప్రైజ్ గా కూడ గెలుచుకుంది. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, చిన్న వయసులోనే ప్రయోగాలను నిర్వహిస్తున్న సంప్రీతి యువలోకానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. -
ప్లానెట్ ఓషన్ అండర్‌వాటర్
సముద్ర గర్భంలో హోటల్.. మత్స్యాలతో ముచ్చట్లాడుతూ.. జలచరాలతో జాలీగా గడిపే అద్భుతమైన ప్రదేశం.. ఇప్పటికే ఇలాంటి హోటళ్ల డిజైన్లు కొన్ని వచ్చాయి. అవన్నీ డిజైన్ల స్థాయిలోనే ఉండిపోయాయి. చిత్రంలోని ప్లానెట్ ఓషన్ అండర్‌వాటర్ హోటల్ మాత్రం త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెరుగయ్యాయి. ఎందుకంటే.. ప్రపంచంలోనే తొలి పూర్తిస్థాయి సముద్రగర్భ హోటల్‌గా దీనికి పేటెంట్, ట్రేడ్‌మార్క్ అనుమతులను అమెరికా తాజాగా జారీ చేసింది. దీంతో ఈ హోటల్‌ను నిర్మించేందుకు అనువైన ప్రదేశాల ఎంపిక కొనసాగుతున్నట్లు ఈ హోటల్ డిజైనర్ టోనీ వెబ్ తెలిపారు. ఈజిప్ట్, మలేసియా, హవాయి, బహమాస్ వంటివాటిని షార్ట్‌లిస్ట్ చేసినట్లు చెప్పారు. 28 అడుగుల లోతున నిర్మించే ఈ హోటల్‌కు అతిథులు ఎలివేటర్ సాయంతో వెళ్తారు. అంతేకాదు.. తుపాన్లు వంటివాటిని తప్పించుకునేందుకు వీలుగా.. ఈ హోటల్ ఎలక్ట్రో మెకానికల్ ప్రొపల్షన్ టెక్నాలజీ సాయంతో నౌకలా ప్రయాణిస్తుంది కూడా.. ఎవరికైనా కావాలంటే తాము ఈ హోటల్‌ను నిర్మించి ఇస్తామని టోనీ వెబ్ చెబుతున్నారు. 12 గదుల విలాసవంతమైన హోటల్‌కు ఎలివేటర్‌తో కలిపి రూ.135 కోట్లు అవుతుందని చెబుతున్నారు.