అండర్‌ వాటర్‌ మెట్రోకు అనూహ్య ఆదరణ | Underwater Metro Runs for Common People | Sakshi
Sakshi News home page

Underwater Metro: అండర్‌ వాటర్‌ మెట్రోకు అనూహ్య ఆదరణ

Mar 16 2024 7:16 AM | Updated on Mar 16 2024 7:16 AM

Underwater Metro Runs for Common People - Sakshi

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇలీవల పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో నీటి అడుగున నడిచే మెట్రో  రైలును ప్రారంభించారు. అది మొదలు ఈ మెట్రోపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ మెట్రోలో తాజాగా సాధారణ ప్రయాణికుల సేవలు ప్రారంభమయ్యాయి. 

ఈ సందర్భంగా కోల్‌కతా మెట్రో ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ అండర్‌వాటర్ మెట్రోలో ప్రయాణించడానికి జనం ఎంతో ఉత్సాహం చూపడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో జనం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ‘వందే భారత్’, ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేస్తున్నారు. 
 

కోల్‌కతాలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో కారిడార్‌లోని హౌరా మైదాన్ స్టేషన్ నుండి శుక్రవారం ఉదయం 7 గంటలకు  మెట్రో రైలు ప్రయాణాన్ని ప్రారంభించింది. అదే సమయంలో ఎస్ప్లానేడ్ స్టేషన్ నుండి మరో మెట్రో బయలుదేరింది. కోల్‌కతా మెట్రోపాలిటన్ రవాణా నెట్‌వర్క్‌లోని హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగం హుగ్లీ నదికి దిగువన ఉంది. నది కింద ఉన్న ఈ సొరంగం పొడవు 520 మీటర్లు. 

కోల్‌కతా మెట్రో సోషల్ మీడియాలో షేర్‌ చేసిన పలు ఫొటోలలో ప్రయాణికులు ఉత్సాహంగా డ్యాన్స్ చేయడాన్ని గమనించవచ్చు. ప్రయాణ సమయంలో, ఒక ప్రయాణికుడు ప్లకార్డుపై ‘భారతదేశాన్ని గర్వించేలా చేసినందుకు చాలా ధన్యవాదాలు మోడీ జీ’ అని రాశారు. కాగా హుగ్లీ నది దిగువ భాగాన్ని గుర్తించే సొరంగ భాగాన్ని నీలిరంగు ఎల్‌ఈడీ లైట్లతో అలంకరించారు. ఈ వాటర్‌ మెట్రో మార్గంలో ప్రతి 12 నుండి 15 నిమిషాలకు రైళ్లు నడుస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement