ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు వచ్చే పర్యాటకులు మెట్రో ప్రయాణాన్ని భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆగ్రా మెట్రో ప్రారంభించిన ఈ నాలుగు రోజుల్లో లక్ష మందికి పైగా ప్రయాణికులు దీనిలో ప్రయాణించారు. మెట్రో ప్రారంభమైన నాలుగో రోజు (ఆదివారం) ఆగ్రా మెట్రోలో అత్యధికంగా 39, 616 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) పంచనన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడచిన నాలుగు రోజుల్లో 1,22,000 మంది ప్రయాణికులు ఆగ్రా మెట్రోలో ప్రయాణించారు. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 39,616 మంది ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లేదా రైలులో ప్రయాణికులు మర్చిపోయిన 12 బ్యాగులను మెట్రో సిబ్బంది గుర్తించారు. వీటిని సంబంధీకులకు తిరిగి అప్పగించాం’ అని తెలిపారు.
2024, మార్చి 7 నుంచి ఆగ్రాలో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఆగ్రా మెట్రో కారిడార్ ప్రారంభంతో, మెట్రో రైలు నెట్‌వర్క్‌కు అనుసంధానమైన దేశంలోని 21వ నగరంగా ఆగ్రా అవతరించింది. ఆగ్రా మెట్రో ప్రారంభంతో నగరంలోని 21 లక్షల మంది ప్రజలు ఈ సేవలను అందుకుంటున్నారు. దీనికితోడు ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మంది ఆగ్రాను సందర్శించడానికి వస్తుంటారు. వీరు కూడా మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment