Traveled
-
ఆకర్షిస్తున్న ఆగ్రా మెట్రో.. 4 రోజుల్లో 1.22 లక్షల మంది ప్రయాణం!
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు వచ్చే పర్యాటకులు మెట్రో ప్రయాణాన్ని భలేగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆగ్రా మెట్రో ప్రారంభించిన ఈ నాలుగు రోజుల్లో లక్ష మందికి పైగా ప్రయాణికులు దీనిలో ప్రయాణించారు. మెట్రో ప్రారంభమైన నాలుగో రోజు (ఆదివారం) ఆగ్రా మెట్రోలో అత్యధికంగా 39, 616 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈ వివరాలను అధికారులు మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) పంచనన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ‘గడచిన నాలుగు రోజుల్లో 1,22,000 మంది ప్రయాణికులు ఆగ్రా మెట్రోలో ప్రయాణించారు. ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 39,616 మంది ప్రయాణించారు. మెట్రో స్టేషన్ లేదా రైలులో ప్రయాణికులు మర్చిపోయిన 12 బ్యాగులను మెట్రో సిబ్బంది గుర్తించారు. వీటిని సంబంధీకులకు తిరిగి అప్పగించాం’ అని తెలిపారు. 2024, మార్చి 7 నుంచి ఆగ్రాలో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ఆగ్రా మెట్రో కారిడార్ ప్రారంభంతో, మెట్రో రైలు నెట్‌వర్క్‌కు అనుసంధానమైన దేశంలోని 21వ నగరంగా ఆగ్రా అవతరించింది. ఆగ్రా మెట్రో ప్రారంభంతో నగరంలోని 21 లక్షల మంది ప్రజలు ఈ సేవలను అందుకుంటున్నారు. దీనికితోడు ప్రతి సంవత్సరం సుమారు 60 లక్షల మంది ఆగ్రాను సందర్శించడానికి వస్తుంటారు. వీరు కూడా మెట్రో సేవలను ఉపయోగించుకుంటున్నారు. -
11 రోజుల ప్రేమ.. 10 వేల కి.మీ. ప్రయాణం.. సరిహద్దులు చెరిపేసిన ప్రేమ కథ
ప్రేమకు దూరతీరాలంటూ ఉండవు. ఈ వాక్యం ఆ జంటకు సరిగ్గా సరిపోతుంది. వారిద్దరూ 10 వేల కిలోమీటర్లకు మించిన దూరాన ఉన్నప్పటికీ తొలిచూపులోనే వారిమధ్య ప్రేమ చిగురించింది. వారు కలుసుకున్న రోజుకు సరిగ్గా 11 రోజుల తరువాత వారు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. తమ లవ్ స్టోరీని వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రేమ కథ 29 ఏళ్ల క్రిస్టియన్ పరేడెస్, 27 ఏళ్ల రిబ్కా క్లోటెన్లది. క్రిస్టియన్ అర్జెంటీనాకు చెందిన యువకుడు. రిబ్కా డర్బిషైర్(యూకే)కు చెందిన యువతి. ఈ ఇరు దేశాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. క్రిస్టియన్, రిబ్కా ఎప్పుడూ కలుసుకోలేదు. విధి వారిని దగ్గర చేసింది. మిర్రర్ యూకే తెలిపిన వివరాల ప్రకారం వీరి మధ్య ప్రేమ 2022, అక్టోబరులో చిగురించింది. ఆ సమయంలో క్రిస్టియన్ ఒక నార్వేజియన్ క్రూజ్‌లో గిఫ్ట్ షాప్ నడుపుతున్నాడు. రిబ్కా తన సెలవులను ఈ క్రూజ్‌లో ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. నాలుగు రోజుల్లో ఆమె సెలవులు ముగిసిపోయాయి. రిబ్కా, క్రిస్టియన్‌ను ఎవరిదారిన వారు విడిపోయారు. అయితే కొద్ది నెలల తరువాత క్రూజ్ సౌతాంప్టన్(యూకే)లో ఆగింది. తిరిగి క్రిస్టియన్, రిబ్కాలు కలుసుకున్నారు. 11 రోజుల పాటు వారు కలసివున్నాక, ఇక తిరిగి విడిపోకూడదని నిర్ణయించుకున్నారు. తాము ఒకరికోసమే మరొకరు పుట్టామని అనిపించిందని వారు తెలిపారు. అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. రిబ్కా మీడియాతో మాట్లాడుతూ ‘నేను ప్రేమ విషయంలో చాలా దురదృష్టవంతుడిని. ప్రేమ విషయంలో నాకు తగిన వ్యక్తి అంటూ ఎవరూ దొరలేదు. అయితే క్రిస్టియన్ దొరకడం ఎంతో సంతోషంగా ఉంది. మేము తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాం. అయితే మా ప్రేమకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. మా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఏమాత్రం ఇష్టపడలేదు. అతి కష్టం మీద వారిని ఒప్పించగలిగాను’ అని పేర్కొంది. క్రిస్టియన్ మీడియాతో మాట్లాడుతూ ‘మొదటి చూపులోనే ఆమె నీలి కళ్లు నన్నెంతో ఆకర్షించాయి. ఆమె ఎంతో అందమైనది. ఎంతో జాగ్రత్తగా ఆమెతో మాట్లాడాను. ఎందుకంటే ఏదైనా సమస్యవస్తే నన్ను క్రూజ్ నుంచి బయటకు పంపించేస్తారు. ఆమె నా షాప్ దగ్గరకు వచ్చినప్పుడు మేము మొబైల్ నంబర్లు షేర్ చేసుకున్నాం. కాల్స్ చేసుకోవడం,మెజేస్‌లు పంపించుకోవడం ద్వారా మా పరిచయం పెరిగింది. జనవరి 2023లో రిబ్కాకు ప్రపోజ్ చేశాను’ అని తెలిపారు. క్రిస్టియన్.. రిబ్కాతో పాటు ఉండేందుకు యూకేకు షిఫ్ట్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను 7 వేల మైళ్లు(11000 కిలోమీటర్లు)కు పైగా దూరం ప్రయాణించి రిబ్కా ఉంటున్న నగరానికి చేరుకున్నాడు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ఈ లవ్ స్టోరీ తెలుసుకున్న నెటిజన్లు ఆ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నేరం.. కారణం ఇదే! -
పూర్తిస్థాయిలో తగ్గేవరకు పునరావాసం
నరసాపురం రూరల్ : జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఆదివారం విస్తృతంగా పర్యటించారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు తుపాను పరిస్థితిని గమనించి అందుకు అనుగుణంగా అధికారులకు సూచనలు ఇచ్చారు. తుపాను పరిస్థితులు చక్కబడే వరకు పునరావాస కేంద్రాల్లో ప్రజలకు భోజన సౌకర్యం కల్పించాలని సుజాత అధికారులను ఆదేశించారు. ఆదివారం తుపాను ప్రభావిత గ్రామాలైన పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు, కేపీ పాలెం, పేరుపాలెం ఏటిమొండి తదితర ప్రాంతాల్లో పర్యటించి పునరావాస కేంద్రాల్లో ప్రజలకు అందుతున్న సేవలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. వర్షాల కారణంగా కొన్ని గ్రామాల్లో నీరు ఇళ్లలోకి ప్రవేశించిందని, అటువంటి వారు సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని సూచించారు. అధికార యంత్రాంగం తీసుకున్న పటిష్ట చర్యల కారణంగానే జిల్లాలో ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించలేదన్నారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో పకృతి వైపరీత్యాల సమయంలో నష్టాల నివారణకు శాశ్వత పరిష్కారంగా కోస్టల్ కారిడార్, నరసాపురంలో పోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. తుపాను అనంతరం గ్రామాలన్నింటిలోనూ పారిశుధ్య నిర్వహణ పూర్తిస్థాయిలో జరిగేలా చూడాలని, వైద్యశిభిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు కలిగిన నష్టాలకు తక్షణమే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. తుపాను పూర్తిగా తగ్గేంత వరకు మత్స్యకారులు వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, ఆర్డీవో పుష్పమణి, జిల్లాపరిషత్ సీఈవో ద్వారంపూడి వెంకటరెడ్డి, ఎంపీపీ వాతాడి కనకరాజు, జెడ్పీటీసీలు బాలం ప్రతాప్, గుబ్బల నాగరాజు, మైల వీర్రాజు, ఎంపీడీవో యన్వీ శివప్రసాద్‌యాదవ్, తహసిల్దార్లు ఎస్ బ్రహ్మానందం, హరనాథ్ పాల్గొన్నారు. కోస్టల్ కారిడార్ ఏర్పాటు చేస్తాం లింగపాలెం : పకృతి వైపరీత్యాలను శాశ్వతంగా ఎదుర్కొనేందుకు వీలుగా కోస్టల్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి సుజాత తెలిపారు. ధర్మాజీగూడెంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ కారిడార్ వల్ల ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ముందస్తు చర్యలను మరింత పటిష్టవంతంగా తీసుకోగలుగుతామన్నారు. జిల్లాలో 24 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేసి 8,500 మందికి సహాయక చర్యలు అందించినట్టు చెప్పారు. -
వచ్చారు.. చూశారు
అనకాపల్లి రూరల్/ యలమంచిలి రూరల్/రాంబిల్లి, న్యూస్‌లైన్: భారీ వర్షాలు, బెంబేత్తించిన వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు మంగళవారం పర్యటించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధించిన తాగునీరు, పారిశుద్ధ్య విభాగం సహాయ సలహాదారు భాటియా, ఆర్థికశాఖ జేడీ పీజీఎస్ రావు, రహదారులు,రవాణాశాఖ నాణ్యత నియంత్రణ విభాగం ఎస్ఈ కృష్ణప్రసాద్ ఈ బృందంలో ఉన్నారు. వరద తీవ్రతను, అక్కడి పరిస్థితులను కలెక్టర్ ఆరోఖ్యరాజ్ వివరించారు. అనకాపల్లి సమీపంలోని ఆవఖండం పొలాలను తొలుత పరిశీలించిన బృందం సభ్యులు అక్కడి పరిస్థితులపై రైతుతో మాట్లాడారు. ముంపునకు కారణాలను ఆరా తీశారు. ఏలేరు కాలువకు తరచూ గండ్లు కారణంగా పంటపొలాలు ముంపునకు గురవుతున్నాయని, శారదానది ముంచెత్తడం కూడా మరో కారణమని రైతులు వివరించారు. ఏటా సమస్య పునరావృతమవుతోందని వాపోయా రు. కుళ్లిన వరిదుబ్బులను అధికారులకు చూ పించారు. తోటాడ రెగ్యులేటర్‌ను ఆధునీకరిస్తే ముంపు బాధ నుంచి తప్పించుకోవచ్చని రైతు లు సూచించారు. పంట నష్టంపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని, శాశ్వత నివారణ చర్యల గురించి కలెక్టర్‌కు సూచిస్తామని బృందం సభ్యులు తెలిపారు. బాధితుల ఆవేదన యలమంచిలి పట్టణం ఏఎస్‌ఆర్‌కాలనీ, ఫైర్ ఆఫీస్కాలనీ, శేషుగెడ్డ ప్రాంతాల్లోని వరద బాధితులు కేంద్రబృందం వద్ద బావురుమన్నారు. అధికారులు శేషుగెడ్డకు పడిన గండిని పరిశీలించారు. గతేడాది నీలం తుఫాన్ సంభవించినప్పుడు శేషుగెడ్డకు గండి పడ్డ చోటే మళ్లీ గండి పడడంపై ఆరా తీశారు. గతేడాది గండిపడినపుడు పటిష్టంగా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. వరదలో తమ కష్టాలను ఈరుగుల పోలయ్య అనే వ్యక్తి కేంద్ర బృందానికి వివరించాడు. తమను అధికారులు పట్టించుకోలేదని వాపోయాడు. ఈసందర్భంగా పలువురు బాధితులు కేంద్రబృందం వద్ద రోదించారు. శేషుగెడ్డనుంచి వరదనీరు ఉప్పొంగి ఇళ్లలోకి రావడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నామన్నారు. ఎకరాకు రూ. 10 వేలు భారీవర్షాల వల్ల మేజర్, మైనర్ శారద నదులకు గండ్లు పడడం వల్ల తీవ్రంగా నష్టపోయామని కేంద్ర బృందం వద్ద రైతులు వాపోయా రు. పంచదార్లలో బృందం పర్యటించి, దెబ్బతిన్న వరిని పరిశీలించినప్పుడు రైతులు వారి తో మాట్లాడారు. గతేడాదీ ఇలాగే జరిగిందని,నదుల గట్లు శాశ్వత ప్రాతిపదికన పటిష్టపరచాలని డిమాండ్ చేశారు. అనంతరం నారాయణపురం వద్ద మైనర్ శారద నదికి పడిన గండి కారణంగా వాటిల్లిన నష్టం గురించి కలెక్టర్ ఆరోఖ్యరాజ్ బృందం సభ్యులకు వివరించారు. ఈ పర్యటనలో అనకాపల్లి ఆర్డీవో వసంతరాయుడు, అనకాపల్లి నీటిపారుదల శాఖ ఏఈ హరిప్రసాద్, అనకాపల్లి తహశీల్దార్ పాండురంగారెడ్డి, ఎంపీడీవో సందీప్, వ్యవసాయ శాఖ అధికారి భాస్కరరావు పాల్గొన్నారు. మున్సిపల్ ఆర్జేడీ ఆశాజ్యోతి, యలమంచిలి తహశీల్దార్ రాణి అమ్మాజీ, యలమంచిలి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌లు ఉన్నారు. రాంబిల్లి మండల ప్రత్యేకాధికారి కోటేశ్వరరావు, తహసీల్దార్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు. పాఠశాల పరిశీలన కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో వరద తాకిడికి గురైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం కేంద్ర పరిశీలన బృందం సభ్యులు పరిశీలించారు. మామిడిగెడ్డ నుంచి వరద నీరు ప్రవేశించడంతో పాడైన కంప్యూటర్ ల్యాబ్‌ను, దెబ్బ తిన్న భవనాలను, ప్రహారీని పరిశీలించారు. కేంద్ర బృందంతో సమావేశమైన కలెక్టర్ విశాఖ రూరల్: ఇటీవల వచ్చిన వరదలు కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం మంగళవారం జిల్లా లో పర్యటించింది. ఉదయం జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లతో ఈ బృందం సభ్యులు ప్రభుత్వ అతిథి గృహంలో భారీ వర్షాలు, వరద నస్టాలను సమీక్షించారు. అనంత రం సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిల కించారు. కలెక్టర్ వరద నష్టం ఫొటోలను చూపిస్తూ వరదల వల్ల కలిగిన పరిస్థితులను సభ్యులకు వివరించారు. అనంతరం బృందం జిల్లాలో పర్యటనటకు వెళ్లింది.