అనకాపల్లి రూరల్/ యలమంచిలి రూరల్/రాంబిల్లి, న్యూస్‌లైన్: భారీ వర్షాలు, బెంబేత్తించిన వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో కేంద్ర బృందం సభ్యులు మంగళవారం పర్యటించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుబంధించిన తాగునీరు, పారిశుద్ధ్య విభాగం సహాయ సలహాదారు భాటియా, ఆర్థికశాఖ జేడీ పీజీఎస్ రావు, రహదారులు,రవాణాశాఖ నాణ్యత నియంత్రణ విభాగం ఎస్‌ఈ కృష్ణప్రసాద్ ఈ బృందంలో ఉన్నారు. వరద తీవ్రతను, అక్కడి పరిస్థితులను కలెక్టర్ ఆరోఖ్యరాజ్ వివరించారు.
అనకాపల్లి సమీపంలోని ఆవఖండం పొలాలను తొలుత పరిశీలించిన బృందం సభ్యులు అక్కడి పరిస్థితులపై రైతుతో మాట్లాడారు. ముంపునకు కారణాలను ఆరా తీశారు. ఏలేరు కాలువకు తరచూ గండ్లు కారణంగా పంటపొలాలు ముంపునకు గురవుతున్నాయని, శారదానది ముంచెత్తడం కూడా మరో కారణమని రైతులు వివరించారు. ఏటా సమస్య పునరావృతమవుతోందని వాపోయా రు. కుళ్లిన వరిదుబ్బులను అధికారులకు చూ పించారు. తోటాడ రెగ్యులేటర్‌ను ఆధునీకరిస్తే ముంపు బాధ నుంచి తప్పించుకోవచ్చని రైతు లు సూచించారు. పంట నష్టంపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని, శాశ్వత నివారణ చర్యల గురించి కలెక్టర్‌కు సూచిస్తామని బృందం సభ్యులు తెలిపారు.
బాధితుల ఆవేదన
యలమంచిలి పట్టణం ఏఎస్‌ఆర్‌కాలనీ, ఫైర్ ఆఫీస్‌కాలనీ, శేషుగెడ్డ ప్రాంతాల్లోని వరద బాధితులు కేంద్రబృందం వద్ద బావురుమన్నారు. అధికారులు శేషుగెడ్డకు పడిన గండిని పరిశీలించారు. గతేడాది నీలం తుఫాన్ సంభవించినప్పుడు శేషుగెడ్డకు గండి పడ్డ చోటే మళ్లీ గండి పడడంపై ఆరా తీశారు. గతేడాది గండిపడినపుడు పటిష్టంగా ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. వరదలో తమ కష్టాలను ఈరుగుల పోలయ్య అనే వ్యక్తి కేంద్ర బృందానికి వివరించాడు. తమను అధికారులు పట్టించుకోలేదని వాపోయాడు. ఈసందర్భంగా పలువురు బాధితులు కేంద్రబృందం వద్ద రోదించారు. శేషుగెడ్డనుంచి వరదనీరు ఉప్పొంగి ఇళ్లలోకి రావడంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నామన్నారు.
ఎకరాకు రూ. 10 వేలు
భారీవర్షాల వల్ల మేజర్, మైనర్ శారద నదులకు గండ్లు పడడం వల్ల తీవ్రంగా నష్టపోయామని కేంద్ర బృందం వద్ద రైతులు వాపోయా రు. పంచదార్లలో బృందం పర్యటించి, దెబ్బతిన్న వరిని పరిశీలించినప్పుడు రైతులు వారి తో మాట్లాడారు. గతేడాదీ ఇలాగే జరిగిందని,నదుల గట్లు శాశ్వత ప్రాతిపదికన పటిష్టపరచాలని డిమాండ్ చేశారు. అనంతరం నారాయణపురం వద్ద మైనర్ శారద నదికి పడిన గండి కారణంగా వాటిల్లిన నష్టం గురించి కలెక్టర్ ఆరోఖ్యరాజ్ బృందం సభ్యులకు వివరించారు. ఈ పర్యటనలో అనకాపల్లి ఆర్డీవో వసంతరాయుడు, అనకాపల్లి నీటిపారుదల శాఖ ఏఈ హరిప్రసాద్, అనకాపల్లి తహశీల్దార్ పాండురంగారెడ్డి, ఎంపీడీవో సందీప్, వ్యవసాయ శాఖ అధికారి భాస్కరరావు పాల్గొన్నారు. మున్సిపల్ ఆర్‌జేడీ ఆశాజ్యోతి, యలమంచిలి తహశీల్దార్ రాణి అమ్మాజీ, యలమంచిలి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌లు ఉన్నారు. రాంబిల్లి మండల ప్రత్యేకాధికారి కోటేశ్వరరావు, తహసీల్దార్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.
పాఠశాల పరిశీలన
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో వరద తాకిడికి గురైన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం కేంద్ర పరిశీలన బృందం సభ్యులు పరిశీలించారు. మామిడిగెడ్డ నుంచి వరద నీరు ప్రవేశించడంతో పాడైన కంప్యూటర్ ల్యాబ్‌ను, దెబ్బ తిన్న భవనాలను, ప్రహారీని పరిశీలించారు.
కేంద్ర బృందంతో సమావేశమైన కలెక్టర్
విశాఖ రూరల్: ఇటీవల వచ్చిన వరదలు కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం మంగళవారం జిల్లా లో పర్యటించింది. ఉదయం జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లతో ఈ బృందం సభ్యులు ప్రభుత్వ అతిథి గృహంలో భారీ వర్షాలు, వరద నస్టాలను సమీక్షించారు. అనంత రం సమాచార పౌర సంబంధాల శాఖ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిల కించారు. కలెక్టర్ వరద నష్టం ఫొటోలను చూపిస్తూ వరదల వల్ల కలిగిన పరిస్థితులను సభ్యులకు వివరించారు. అనంతరం బృందం జిల్లాలో పర్యటనటకు వెళ్లింది.
వచ్చారు.. చూశారు
Published Wed, Nov 20 2013 2:06 AM | Last Updated on Mon, May 28 2018 4:20 PM
Advertisement
Advertisement