ప్రేమకు దూరతీరాలంటూ ఉండవు. ఈ వాక్యం ఆ జంటకు సరిగ్గా సరిపోతుంది. వారిద్దరూ 10 వేల కిలోమీటర్లకు మించిన దూరాన ఉన్నప్పటికీ తొలిచూపులోనే వారిమధ్య ప్రేమ చిగురించింది. వారు కలుసుకున్న రోజుకు సరిగ్గా 11 రోజుల తరువాత వారు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. తమ లవ్ స్టోరీని వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ప్రేమ కథ 29 ఏళ్ల క్రిస్టియన్ పరేడెస్, 27 ఏళ్ల రిబ్కా క్లోటెన్‌లది. క్రిస్టియన్ అర్జెంటీనాకు చెందిన యువకుడు. రిబ్కా డర్బిషైర్(యూకే)కు చెందిన యువతి. ఈ ఇరు దేశాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. క్రిస్టియన్, రిబ్కా ఎప్పుడూ కలుసుకోలేదు. విధి వారిని దగ్గర చేసింది.
మిర్రర్ యూకే తెలిపిన వివరాల ప్రకారం వీరి మధ్య ప్రేమ 2022, అక్టోబరులో చిగురించింది. ఆ సమయంలో క్రిస్టియన్ ఒక నార్వేజియన్ క్రూజ్‌లో గిఫ్ట్ షాప్ నడుపుతున్నాడు. రిబ్కా తన సెలవులను ఈ క్రూజ్‌లో ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. నాలుగు రోజుల్లో ఆమె సెలవులు ముగిసిపోయాయి. రిబ్కా, క్రిస్టియన్‌ను ఎవరిదారిన వారు విడిపోయారు.
అయితే కొద్ది నెలల తరువాత క్రూజ్ సౌతాంప్టన్(యూకే)లో ఆగింది. తిరిగి క్రిస్టియన్, రిబ్కాలు కలుసుకున్నారు. 11 రోజుల పాటు వారు కలసివున్నాక, ఇక తిరిగి విడిపోకూడదని నిర్ణయించుకున్నారు. తాము ఒకరికోసమే మరొకరు పుట్టామని అనిపించిందని వారు తెలిపారు. అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు.
రిబ్కా మీడియాతో మాట్లాడుతూ ‘నేను ప్రేమ విషయంలో చాలా దురదృష్టవంతుడిని. ప్రేమ విషయంలో నాకు తగిన వ్యక్తి అంటూ ఎవరూ దొరలేదు. అయితే క్రిస్టియన్ దొరకడం ఎంతో సంతోషంగా ఉంది. మేము తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాం. అయితే మా ప్రేమకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. మా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఏమాత్రం ఇష్టపడలేదు. అతి కష్టం మీద వారిని ఒప్పించగలిగాను’ అని పేర్కొంది.
క్రిస్టియన్ మీడియాతో మాట్లాడుతూ ‘మొదటి చూపులోనే ఆమె నీలి కళ్లు నన్నెంతో ఆకర్షించాయి. ఆమె ఎంతో అందమైనది. ఎంతో జాగ్రత్తగా ఆమెతో మాట్లాడాను. ఎందుకంటే ఏదైనా సమస్యవస్తే నన్ను క్రూజ్ నుంచి బయటకు పంపించేస్తారు. ఆమె నా షాప్ దగ్గరకు వచ్చినప్పుడు మేము మొబైల్ నంబర్లు షేర్ చేసుకున్నాం. కాల్స్ చేసుకోవడం,మెజేస్‌లు పంపించుకోవడం ద్వారా మా పరిచయం పెరిగింది. జనవరి 2023లో రిబ్కాకు ప్రపోజ్ చేశాను’ అని తెలిపారు.
క్రిస్టియన్.. రిబ్కాతో పాటు ఉండేందుకు యూకేకు షిఫ్ట్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను 7 వేల మైళ్లు(11000 కిలోమీటర్లు)కు పైగా దూరం ప్రయాణించి రిబ్కా ఉంటున్న నగరానికి చేరుకున్నాడు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ఈ లవ్ స్టోరీ తెలుసుకున్న నెటిజన్లు ఆ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నేరం.. కారణం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment