distance
-
దగ్గరకానున్న చైనా సరిహద్దు.. చమోలి- పితోర్‌గఢ్ రోడ్డు పనులు షురూ!
ఇకపై ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాకు ఆనుకుని ఉన్న చైనా సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ, ఐటీబీపీల కదలికలు మరింత సులభతరం కానున్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) చమోలిలోని లాప్తాల్ నుండి పితోర్‌గఢ్ వరకు రోడ్డు పనులను ప్రారంభించింది.2028 నాటికి ఈ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని బీఆర్ఓ లక్ష్యంగా పెట్టుకుంది. చమోలీ నుంచి పితోర్‌గఢ్ వరకు ఉన్న 500 కి.మీ. దూరం ఈ రహదారి నిర్మాణంతో 80 కి.మీకి తగ్గనుంది. నీతి లోయలోని చివరి గ్రామమైన నీతిని ఆనుకుని చైనా సరిహద్దు ప్రాంతం ప్రారంభమవుతుంది. ఇక్కడ ఆర్మీ,ఐటీబీపీకి చెందిన ఫార్వర్డ్ పోస్ట్‌లు ఉన్నాయి.ప్రస్తుతం ఈ పోస్ట్‌లు మంచుతో కప్పబడి ఉన్నాయి. ప్రతికూల భౌగోళిక పరిస్థితుల మధ్య బీఆర్ఓ కార్మికులు ఇక్కడ సుమారు 40 కిలోమీటర్ల రహదారి కోసం కొండను కట్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. లాప్తాల్ నుండి మిలాం వరకు రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మూడు నెలలుగా ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు మళ్లీ ప్రారంభమయ్యాయి.చమోలీకి ఆనుకుని ఉన్న ఈ సరిహద్దు ప్రాంతంలో చైనా రైలు మార్గాన్ని కూడా విస్తరించింది. ఈ ప్రాంతంలోకి చైనా తరచూ చొరబడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం ఇక్కడ రోడ్డు విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది. లాప్తాల్ నుండి మిలామ్ పితోర్‌గఢ్ వరకు రహదారి నిర్మాణం చేపట్టడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.గత ఏడాది జూలైలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి, లాప్తాల్ నుంచి మిలామ్ వరకు 30 కిలోమీటర్ల పొడవైన సొరంగ ప్రాజెక్టును ఆమోదించాలని అభ్యర్థించారు. ఈ నిర్మాణం చేపడితే పితోర్‌ఘర్‌లోని జోహార్ లోయ చమోలీకి అనుసంధానమవుతుంది. భవిష్యత్తులో లేహ్ లడఖ్ మాదిరిగా ఇక్కడ కూడా పర్యాటక కార్యకలాపాలను ప్రారంభించే ప్రణాళిక ప్రభుత్వం వద్ద ఉంది. -
Israel-Hamas War: తీర్మానానికి భారత్ దూరం
ఐక్యరాజ్యసమతి: గాజాపై ఇజ్రాయెల్ దాడికి వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. మొత్తం 193 దేశాలున్న ఐరాస జనరల్ అసెంబ్లీలో 45 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉండగా 120 దేశాలు తీర్మానానికి మద్దతుగా, 14 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. మిగతావి ఓటింగ్‌లో పాల్గొనలేదు. అయితే ఉగ్రవాదం మానవాళి పట్ల ఎప్పటికీ మాయని మచ్చేనని భారత్ పునరుద్ఘాటించింది. ‘‘ఉగ్రవాదానికి సరిహద్దుల్లేవు. జాతి, జాతీయత లేవు. అందుకే కారణమేదైనా సరే, మతిలేని ఉగ్రవాద చర్యలకు ఎవరూ మద్దతివ్వరాదు. ఈ విషయంలో ప్రపంచమంతా ఒక్కతాటిపై ఉండాలి’’అని పిలుపునిచి్చంది. ఇజ్రాయెల్, హమాస్ తక్షణం పోరుకు స్వస్తి చెప్పాలని తీర్మానం పిలుపునిచి్చంది. గాజాకు అన్ని రకాల సాయం నిరి్నరోధంగా, పూర్తిస్థాయిలో, సురక్షితంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరింది. బందీలను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తీర్మానాన్ని జోర్డాన్ రూపొందించింది. అందులో హమాస్ పేరును ప్రస్తావించకపోవడాన్ని అమెరికా తప్పుబట్టింది. చర్చలతోనే పరిష్కారం: భారత్ ఐరాసలో మన దేశ ఉప శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ తీర్మానంపై చర్చలో భారత్ తరఫున పాల్గొన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి దిగడం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన పరిణామమన్నారు. దాన్ని అందరూ ఖండించాల్సి ఉందని చెప్పారు. విభేదాలు, వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ‘అలాగాకుండా పలు దేశాలు పరస్పరం హింసాకాండకు దిగుతుండటం ఆందోళనకరం. మానవతా విలువలకు పాతరేసే స్థాయిలో హింస, ప్రాణ నష్టం చోటుచేసుకుంటుండటం శోచనీయం. రాజకీయ లక్ష్యాల సాధనకు హింసను మార్గంగా చేసుకోవడం శాశ్వత పరిష్కారాలు ఇవ్వజాలదు’అని స్పష్టం చేశారు. ‘ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదు. ఈ విషయంలో దేశాలు పరస్పర విభేదాలను కూడా పక్కన పెట్టాలి’అని పిలుపునిచ్చారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగని చర్చలు ఉగ్రవాదానికి, హింసకు వ్యతిరేకంగా స్పష్టమైన సందేశమిచ్చాయని అభిప్రాయపడ్డారు. తక్షణం బందీలను విడిచిపెట్టాలని హమాస్‌కు సూచించారు. గాజాకు భారత్ కూడా మానవతా సాయం అందించిందని పటేల్ తెలిపారు. స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటే ఘర్షణకు పరిష్కారమన్నది ముందునుంచీ భారత్ వైఖరి అని స్పష్టం చేశారు. 38 టన్నుల మేరకు ఔషధాలు, పరికరాలు, నిత్యావసరాలను పంపినట్టు చెప్పారు. ఇరుపక్షాలు హింసకు స్వస్తి చెప్పి తక్షణం నేరుగా చర్చలు మొదలు పెట్టాలని కోరారు. హమాస్ పేరు ప్రస్తావించనందుకే...! ఐరాసలో జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంలో హమాస్ పేరును ప్రస్తావించనందుకే దానిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్, అమెరికా తదితర దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేశాయి. చైనా, ఫ్రాన్స్, రష్యా తదితర దేశాలు అనుకూలంగా ఓటేయగా భారత్‌తో పాటు కెనడా, జర్మనీ, బ్రిటన్, జపాన్, ఉక్రెయిన్ తదితర దేశాలు దూరంగా ఉన్నాయి. తీర్మానానికి కెనడా ప్రతిపాదించిన కీలక సవరణకు భారత్ మద్దతిచ్చింది. ‘‘ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిని, వందల మందిని బందీలుగా తీసుకోవడాన్ని ఏకగ్రీవంగా ఖండిస్తున్నాం. వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’అని తీర్మానంలో చేర్చాలని భారత్ కోరింది. భారత్‌తో పాటు మొత్తం 87 దేశాలు సవరణకు అనుకూలంగా, 55 దేశాలు వ్యతిరేకంగా ఓటేశాయి. 23 దేశాలు దూరంగా ఉన్నాయి. మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో సవరణ ఆమోదం పొందలేదు. -
ఆదిత్య –ఎల్1 కక్ష్య దూరం మళ్లీ పెంపు
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 2న ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగో విడత కక్ష్య దూరాన్ని పెంచారు. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), మారిషస్, అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టుబ్లెయిర్ గ్రౌండ్‌స్టేషన్ల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. మూడో విడతలో 296గీ71,767 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో నాలుగో విడుతలో భూమికి దగ్గరగా ఉన్న 296 కిలోమీటర్ల దూరాన్ని 256 కిలోమీటర్లకు తగ్గిస్తూ భూమికి దూరంగా ఉన్న 71,767 దూరాన్ని 1,21,973 కిలోమీటర్లకు పెంచారు. ఈనెల 19న అయిదోసారి కక్ష్యదూరం పెంపుదలలో భాగంగా ఆదిత్య –ఎల్1 ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యనుంచి సూర్యుడికి దగ్గరగా లాంగ్రేజియన్ పాయింట్–1 వద్ద çహాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
‘డూమ్స్‌డే క్లాక్’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా?
కొంతమందికే తెలుసు.. ప్రపంచంలో అలాంటి స్మార్ట్ వాచ్ ఉందని.. అది 1947 నుండి మనకు ప్రమాదాలను సూచిస్తోందని... ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత కొన్నేళ్లుగా ఈ వాచ్ తన స్పీడ్‌ని పెంచింది. అంటే మనం ఇప్పుడు గతంలో కంటే వేగంగా ప్రళయకాలానికి దగ్గరవుతున్నామని దాని అర్థం. ఇప్పుడు మనం ‘డూమ్స్‌డే క్లాక్’ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది సింబాలిక్ క్లాక్.. మహమ్మారి, అణు దాడులు, వాతావరణ సంక్షోభం కారణంగా ప్రపంచ విధ్వంస అవకాశాలను ఇది ప్రతిబింబిస్తుంది. ప్రళయానికి ముందు మనుషులను కాపాడేందుకు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ గడియారం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇది ప్రళయకాలాన్ని తెలియజేస్తోంది. 1945లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థుల బృందం, కొంతమంది అణు శాస్త్రవేత్తలు కలిసి డూమ్స్‌డే వాచ్‌ను రూపొందించారు. ప్రపంచ మనుగడకు ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో చెప్పడానికే డూమ్స్‌డే క్లాక్ రూపొందించారు. ఈ గడియారాన్ని 13 మంది నోబెల్ బహుమతి విజేతలతో కూడిన శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ గడియారంలో టైం మారుతుంటుంది. ఆ ఏడాదిలో జరిగిన సహజ మార్పులు, మానవాళికి జరిగిన నష్టం ఆధారంగా ఈవాచ్‌లో టైమ్ మారుతుంటుంది. దీనిని తొలిసారిగా 1947లో సృష్టించినప్పుడు మానవాళికి ఉన్న ఏకైక ముప్పు అణు దాడి. దీనిని రూపొందించినప్పుడు ఈ గడియారపు సమయాన్ని 10 సెకన్లు తగ్గించారు. దీని ప్రభావం మూడేళ్లలో కనిపించింది. దీని వేగం సాధారణ గడియారాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అయితే కాలానుగుణంగా సహజ, మానవ వాతావరణ మార్పుల కారణంగా ఇది వేగవంతం అవుతుంది. బులెటిన్ ఆఫ్ ది అటామిక్ సైంటిస్ట్ అనే సంస్థ ఈ గడియారాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ సంస్థ అణు దాడులు, జీవ రసాయన ఆయుధాలు, సైబర్ భద్రత, వాతావరణ మార్పులను పర్యవేక్షిస్తుంది. కరోనా వైరస్, ఎబోలా వ్యాప్తి, సిరియా దాడులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత డూమ్స్‌డే సమయం నిరంతరం తగ్గుతూవస్తోంది. ప్రపంచం ముందున్న సవాళ్లను ఇకనైనా అరికట్టకపోతే ప్రళయం మరింత వేగంగా ముంచుకువస్తుందని ఈ డూమ్స్‌డే గడియారం మానవాళిని హెచ్చరిస్తోంది. ఇది కూడా చదవండి: బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్ అంటే ఏమిటి? 70 వేల మందిని బురద ఎందుకు చుట్టుముట్టింది? -
చంద్రయాన్–3కి నాలుగోసారి కక్ష్య తగ్గింపు
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గత నెల 14న ప్రయోగించిన చంద్రయాన్–3 మిషన్ లూనార్ ఆర్బిట్ (చంద్రుడి కక్ష్య)లో చంద్రుడికి దగ్గరగా 177 కిలోమీటర్లు, దూరంగా 150 కిలోమీటర్ల ఎత్తులోకి చేరుకుంది. దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్–3 మిషన్‌కు నాలుగోసారి సోమవారం మధ్యాహ్నం కక్ష్య దూరాన్ని తగ్గించే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. కక్ష్య దూరాన్ని వంద కిలోమీటర్లకు తగ్గించే ప్రక్రియను ఈనెల 17న చేపట్టనున్నారు. అయితే రష్యా ప్రయోగించిన లూనా–25 అనే మిషన్ చంద్రుడిపైన దిగింది. చంద్రుని ఉపరితలంపై ఈ నెల 23న దక్షిణ ధృవంలో దిగబోయే మొట్టమొదటి మిషన్ చంద్రయాన్–3దే పై చేయి అవుతుంది. -
11 రోజుల ప్రేమ.. 10 వేల కి.మీ. ప్రయాణం.. సరిహద్దులు చెరిపేసిన ప్రేమ కథ
ప్రేమకు దూరతీరాలంటూ ఉండవు. ఈ వాక్యం ఆ జంటకు సరిగ్గా సరిపోతుంది. వారిద్దరూ 10 వేల కిలోమీటర్లకు మించిన దూరాన ఉన్నప్పటికీ తొలిచూపులోనే వారిమధ్య ప్రేమ చిగురించింది. వారు కలుసుకున్న రోజుకు సరిగ్గా 11 రోజుల తరువాత వారు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. తమ లవ్ స్టోరీని వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ప్రేమ కథ 29 ఏళ్ల క్రిస్టియన్ పరేడెస్, 27 ఏళ్ల రిబ్కా క్లోటెన్లది. క్రిస్టియన్ అర్జెంటీనాకు చెందిన యువకుడు. రిబ్కా డర్బిషైర్(యూకే)కు చెందిన యువతి. ఈ ఇరు దేశాల మధ్య వేల కిలోమీటర్ల దూరం ఉంది. క్రిస్టియన్, రిబ్కా ఎప్పుడూ కలుసుకోలేదు. విధి వారిని దగ్గర చేసింది. మిర్రర్ యూకే తెలిపిన వివరాల ప్రకారం వీరి మధ్య ప్రేమ 2022, అక్టోబరులో చిగురించింది. ఆ సమయంలో క్రిస్టియన్ ఒక నార్వేజియన్ క్రూజ్‌లో గిఫ్ట్ షాప్ నడుపుతున్నాడు. రిబ్కా తన సెలవులను ఈ క్రూజ్‌లో ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్నారు. నాలుగు రోజుల్లో ఆమె సెలవులు ముగిసిపోయాయి. రిబ్కా, క్రిస్టియన్‌ను ఎవరిదారిన వారు విడిపోయారు. అయితే కొద్ది నెలల తరువాత క్రూజ్ సౌతాంప్టన్(యూకే)లో ఆగింది. తిరిగి క్రిస్టియన్, రిబ్కాలు కలుసుకున్నారు. 11 రోజుల పాటు వారు కలసివున్నాక, ఇక తిరిగి విడిపోకూడదని నిర్ణయించుకున్నారు. తాము ఒకరికోసమే మరొకరు పుట్టామని అనిపించిందని వారు తెలిపారు. అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. రిబ్కా మీడియాతో మాట్లాడుతూ ‘నేను ప్రేమ విషయంలో చాలా దురదృష్టవంతుడిని. ప్రేమ విషయంలో నాకు తగిన వ్యక్తి అంటూ ఎవరూ దొరలేదు. అయితే క్రిస్టియన్ దొరకడం ఎంతో సంతోషంగా ఉంది. మేము తొలిచూపులోనే ప్రేమలో పడిపోయాం. అయితే మా ప్రేమకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. మా కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఏమాత్రం ఇష్టపడలేదు. అతి కష్టం మీద వారిని ఒప్పించగలిగాను’ అని పేర్కొంది. క్రిస్టియన్ మీడియాతో మాట్లాడుతూ ‘మొదటి చూపులోనే ఆమె నీలి కళ్లు నన్నెంతో ఆకర్షించాయి. ఆమె ఎంతో అందమైనది. ఎంతో జాగ్రత్తగా ఆమెతో మాట్లాడాను. ఎందుకంటే ఏదైనా సమస్యవస్తే నన్ను క్రూజ్ నుంచి బయటకు పంపించేస్తారు. ఆమె నా షాప్ దగ్గరకు వచ్చినప్పుడు మేము మొబైల్ నంబర్లు షేర్ చేసుకున్నాం. కాల్స్ చేసుకోవడం,మెజేస్‌లు పంపించుకోవడం ద్వారా మా పరిచయం పెరిగింది. జనవరి 2023లో రిబ్కాకు ప్రపోజ్ చేశాను’ అని తెలిపారు. క్రిస్టియన్.. రిబ్కాతో పాటు ఉండేందుకు యూకేకు షిఫ్ట్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం అతను 7 వేల మైళ్లు(11000 కిలోమీటర్లు)కు పైగా దూరం ప్రయాణించి రిబ్కా ఉంటున్న నగరానికి చేరుకున్నాడు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారు. ఈ లవ్ స్టోరీ తెలుసుకున్న నెటిజన్లు ఆ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఈఫిల్ టవర్‌కు రాత్రివేళ ఫొటోలు తీయడం నేరం.. కారణం ఇదే! -
మామా.. చందమామా మరింత దూరమా?
చంద్రునితో భూమికి అవినాభావ సంబంధం. భూమికి ఉపగ్రహమైతే మనకేమో ఏకంగా చంద‘మామ’. భూమిపైనా, మనిషితో పాటు జంతుజాలం మీదా చంద్రుని ప్రభావమూ అంతా ఇంతా కాదు. సముద్రంలో ఆటుపోట్లు మొదలుకుని అనేకానేక విషయాల్లో ఆ ప్రభావం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. భూమిపై ప్రాణం ఆవిర్భావానికి చంద్రుడే కారణమన్న సిద్ధాంతమూ ఉంది. మన రోజువారీ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసే పలు కీలక వాతావరణ వ్యవస్థల్లో కూడా భూమి చుట్టూ చంద్రుని కక్ష్య తాలూకు నిర్మితి కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. అలాంటి చంద్రుడు భూమిపై రోజు తాలూకు నిడివి రోజురోజుకూ పెరిగేందుకు కూడా ప్రధాన కారణమట...! చాలాకాలం క్రితం. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. భూమ్మీద రోజు నిడివి ఎంతుండేదో తెలుసా? ఇప్పుడున్న దాంట్లో దాదాపు సగమే! సరిగ్గా చెప్పాలంటే 13 గంటల కంటే కాస్త తక్కువ!! అప్పట్నుంచీ అది క్రమంగా పెరుగుతూ ఇప్పటికి 24 గంటలకు చేరింది. ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉందట! చంద్రుడు క్రమంగా భూమికి దూరంగా జరుగుతుండటమే ఇందుకు కారణమని సైంటిస్టులు తేల్చారు!! భూమికి చంద్రుడు దూరంగా జరుగుతున్న తీరును శాస్త్ర పరిభాషలో ల్యూనార్ రిసెషన్గా పిలుస్తారు. ఇది ఎంతన్నది అపోలో మిషన్లలో భాగస్వాములైన ఆస్ట్రోనాట్లు ఇటీవల దీన్ని కచ్చితంగా లెక్కించారు. చంద్రుడు భూమికి ఏటా 3.8 సెంటీమీటర్ల మేరకు దూరంగా జరుగుతున్నట్టు తేల్చారు. అందువల్లే భూమిపై రోజు నిడివి అత్యంత స్వల్ప పరిమాణంలో పెరుగుతూ వస్తోందట. మహాసముద్రాలతో, అలలతో చంద్రుని సంబంధమే ఇందుకు ప్రధాన కారణమని యూనివర్సిటీ ఆఫ్ లండన్ రాయల్ హోలోవేలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ వాల్టాం చెబుతున్నారు. ఆయన భూమి, చంద్రుని మధ్య సంబంధంపై చిరకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ‘‘ఇటు భూమి, అటు చంద్రుడు ఎవరి కక్ష్యలో వారు తిరిగే క్రమంలో చంద్రుని ఆకర్షణ వల్ల మహాసముద్రాల్లో ఆటుపోట్లు (అలల్లో హెచ్చు, తగ్గులు) సంభవిస్తూ ఉంటాయి. సదు అలల ఒత్తిడి భూ భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్ప పరిమాణంలో తగ్గిస్తుంటుంది. అలా తగ్గిన శక్తిని చంద్రుడు తన కోణీయ గతి కారణంగా గ్రహిస్తుంటాడు. తద్వారా చంద్రుడు నిరంతరం హెచ్చు కక్ష్యలోకి మారుతూ ఉంటాడు. మరో మాటల్లో చెప్పాలంటే భూమి నుంచి దూరంగా జరుగుతూ ఉంటాడన్నమాట’’ అని ఆయన వివరించారు. అప్పట్లో రోజుకు రెండు సూర్యోదయాలు ‘‘అప్పట్లో, అంటే ఓ 350 కోట్ల ఏళ్ల క్రితం ఇప్పటి రోజు నిడివిలో ఏకంగా రెండేసి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు జరిగేవి! ఎందుకంటే రోజుకు 12 గంటలకు అటూ ఇటుగా మాత్రమే ఉండేవి. ఈ నిడివి క్రమంగా పెరుగుతూ వచ్చింది, వస్తోంది’’ అని జర్మనీలోని ఫ్రెడరిక్ షిల్లర్ యూనివర్సిటీ జెనాలో జియోఫిజిసిస్టుగా చేస్తున్న టామ్ ఈలెన్ఫెల్డ్ వివరించారు. మరో విశేషం ఏమిటంటే, భూమికి చంద్రుడు దూరం జరుగుతున్న వేగం కూడా ఎప్పుడూ స్థిరంగా లేదు. అది నిత్యం మారుతూ వస్తోందట. ఉదాహరణకు 60 కోట్ల ఏళ్ల కింద చూసుకుంటే ఆ వేగం ఇప్పటికి రెట్టింపుండేదట. అంటే అప్పుడు చంద్రుడు భూమికి ఏటా సగటున 7 సెంటీమీటర్లు దూరం జరిగేవాడట! అలాగే ఈ వేగంలో భవిష్యత్తులో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని ఈలెన్ఫెల్డ్ చెబుతున్నారు. ‘‘మహాసముద్రాల, ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రపు పరిమాణమే ఇందుకు కారణం కావచ్చు. అది గనక ఇప్పుడున్న దానికంటే కాస్త సన్నగా గానీ, వెడల్పుగా గానీ ఉంటే మూన్ రిసెషన్ వేగంలో పెద్దగా మార్పులుండేవి కావని నా అభిప్రాయం’’ అని చెప్పారాయన. కొసమెరుపు: ఏదెలా ఉన్నా, చంద్రుడు మాత్రం భూమికి ఎప్పటికీ శాశ్వతంగా దూరమైపోడంటూ సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు! ‘‘అలా జరిగేందుకు కనీసం మరో 500 నుంచి 1,000 కోట్ల ఏళ్లు పట్టొచ్చు. కానీ అంతకు చాలాముందే సౌర కుటుంబమంతటికీ మహారాజ పోషకుడైన సూర్యుడే లేకుండా పోతాడు! సూర్యునితో పాటే భూమి, మొత్తం సౌరకుటుంబమే ఆనవాలు లేకుండా పోతాయి’’ అంటూ వారు చమత్కరించారు!! శతాబ్దానికి 1.09 మిల్లీ సెకను పెరుగుతున్న రోజు... చంద్రుడు క్రమంగా దూరం జరుగుతున్న కారణంగా భూమిపై రోజు నిడివి క్రీస్తుశకం 1,600 నుంచి ప్రతి శతాబ్దానికి సగటున 1.09 మిల్లీసెకన్ల మేరకు పెరుగుతూ వస్తోందని తాజా విశ్లేషణలు తేల్చాయి. ఇది 1.78 మిల్లీసెకన్లని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చూట్టానికి మిల్లీసెకన్లే అయినా, 450 కోట్ల భూ పరిణామ క్రమంలో రోజు తాలూకు నిడివిని ఇది ఊహాతీతంగా పెంచిందని సైంటిస్టులు అంటున్నారు. చంద్రుడు ఒకప్పుడు భూమికి ఇప్పటికంటే చాలా చాలా దగ్గరగా ఉండేవాడని ఇప్పటికే నిరూపితం కావడమే ఇందుకు రుజువని చెబుతున్నారు. ఉదాహరణకు చంద్రుడు ప్రస్తుతం భూమికి 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల ఏళ్ల కింద ఈ దూరం కేవలం 1,70,000 మైళ్లే ఉండేదని పలు అధ్యయనాల్లో తేలింది! ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్1758ఎస్ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉన్నాయి. నాసా తాలూకు చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాలూకు జర్నల్ మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదు
వాషింగ్టన్: ఆరుబయట కాకుండా ఆఫీస్, నివాస స్థలం వంటి ఇండోర్ ప్రాంతాల్లో గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ఆరు అడుగుల భౌతిక దూరం సరిపోదని ఓ తాజా అధ్యయనంలో తేలింది. ‘సస్టేనబుల్ సిటీస్, సొసైటీ’ జర్నల్‌లో ఈ అధ్యయనం ఫలితాలు ప్రచురితమయ్యాయి. వైరస్‌ని అడ్డుకోవాలంటే భౌతిక దూరం ఒక్కటే సరిపోదని, మాస్క్ ధరించడం, గదిలో ధారాళంగా గాలి, వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. చదవండి: కరోనా ఎఫెక్ట్ నిల్.. అంటార్కిటికా కంటే పెద్ద హోల్, 2070 కూడా కష్టమేనా? నిర్దిష్ట ప్రాంతం గుండా ప్రయాణించే గాలి; వెలుగురు, గాలి వచ్చేందుకు ఉన్న వెంటిలేషన్ పరిస్థితులు; మాట్లాడినపుడు గాల్లోకి వెదజల్లబడే వైరస్ స్థాయి.. ఇలా మూడు ప్రాథమిక అంశాలపై పరిశోధకులు అధ్యయనం కొనసాగించారు. భవంతుల్లో కరోనా వైరస్ సోకిన వ్యక్తులు వదిలే గాలి ద్వారా ఎంత స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతుందనే తెల్సుకునేందుకే అధ్యయనం చేసినట్లు యూఎస్‌లోని పెన్సిల్వే నియా వర్సిటీ విద్యార్థి జెన్ పీ చెప్పారు. చదవండి: క్యాన్సర్‌పై సంచలన వివరాలు వెల్లడించిన బ్రిటన్ శాస్త్రవేత్తలు -
పాఠాలు వినాలంటే.. 6 కిలోమీటర్లు నడవాల్సిందే
కొచ్చి: ఆ గ్రామంలోని విద్యార్థులంతా చదువుల కోసం ఆరు కిలోమీటర్లు వెళ్తున్నారు. గతంలో ఇలాంటి జరిగేవి గానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇటువంటి పరిస్ధితులు లేవని అనుకుంటే మాత్రం మన పొరపాటు అవుతుంది. కేరళలోని రాజమాలకు చెందిన విద్యార్థులు పాఠం వినడానికి ప్రతిరోజు ఇలా పాట్లుపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆన్లైన్లోనే పాఠాలు వినాల్సి వస్తోంది. తమ ఊరిలో నెటవర్క్ సరిగా లేని సమస్యతో అక్కడి విద్యార్థుల పరిస్థితి ఇది. కేరళలలోని ఇడుక్కి జిల్లాలో రాజమాల అనే గ్రామంలో.. సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఒక వేళ వచ్చిన లోస్పీడ్ ఉంటుంది. అయితే నెట్ స్పీడ్‌గా బాగుంటే గానీ ఆన్లైన్లో క్లాసులు వినలేమని తెలిసిందే. ఈ కారణంగా ఆ ఊరికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు వినడం కోసం ఊరికి దూరంగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరవికుళం నేషనల్ పార్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడి ఎత్తయిన ప్రదేశాల్లో సిగ్నల్ పుల్గా ఉంటుండంతో అక్కడే ఆన్లైన్ క్లాసులు విని వస్తున్నారు. తాము ప్రతిరోజు ఉదయం నేషనల్ పార్కుకు ఆటోలో వస్తున్నామని, తిరిగి సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నామని ఓ విద్యార్థి చెప్పాడు.రాజమాలలో ఇంటర్నెట్ వసతి లేదు. కొన్ని ప్రదేశాల్లో వచ్చినా.. అది చాలా తక్కువ స్పీడ్‌తో వస్తున్నది. దీంతో ఇంటర్నెట్ కోసం ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లడం తమకు చాలా కష్టంగా ఉంది. కొన్నిసార్లు వానలు పడుతున్నాయి. దీనివల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓ విద్యార్థి చెప్పాడు. Kerala: To attend online classes, students living in Idukki's Rajamala travel nearly 6-km daily to reach a location with internet connectivity in Eravikulam National Park. "In the morning, we reach here by auto & in evening, we walk back home," a Class 12 student said yesterday pic.twitter.com/xHVjz1srwu — ANI (@ANI) June 1, 2021 చదవండి: హైదరాబాద్‌లో కొవిడ్ వ్యాక్సిన్ల డ్రోన్ డెలివరీ ! -
తెలంగాణ మున్సి‘పోల్స్’: భౌతిక దూరం పాటించని ఓటర్లు
-
మోదీకి బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవి కావాలట!
న్యూఢిల్లీ: ప్రజలంతా మాస్కు ధరించడం.. భౌతిక దూరం పాటించడం.. ఆరోగ్యవంతమైన భూగోళం కోసం అందరూ కృషి చేయడం..ఇవే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు కానుకలుగా కోరుకున్నవి. ప్రధాని మోదీ గురువారం 70వ జన్మదిన వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఆయనకు దేశ, విదేశాల నుంచి ఎందరో శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో ప్రధాని వాటికి బదులిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని ట్విట్టర్లో..‘పుట్టిన రోజు కానుకగా ఏం కావాలని ఎందరో నన్ను అడిగారు. ఇదే నా సమాధానం. మాస్కును సరైన రీతిలో ధరించడం కొనసాగించండి. రెండు గజాల భౌతిక దూరం పాటించండి. గుంపులుగా సంచరించకండి. రోగ నిరోధకత పెంచుకోండి. మన భూగ్రహాన్ని ఆరోగ్యవంతంగా చేద్దాం.. వీటినే పుట్టిన రోజు కానుకలుగా ఇవ్వండి’ అని ప్రజలను ఆయన కోరారు. ప్రధానికి ట్రంప్ బర్త్‌డే విషెస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత ప్రధాని నరేంద్ర మోదీకి 70వ జన్మదిన శుభాకాంక్షలు. గొప్పనేత, విశ్వాసపాత్రుడైన మోదీ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి’అని ట్విట్టర్లో ట్రంప్ ఆకాంక్షించారు. -
ర్యాలీలో చంద్రబాబు భౌతిక దూరం పాటించలేదు
-
‘సోషల్ డిస్టెన్సింగ్’ పిల్ కొట్టివేత
న్యూఢిల్లీ: సోషల్ డిస్టెన్సింగ్ పదాన్ని వినియోగించరాదంటూ దాఖలైన పిల్‌ని కోర్టు కొట్టివేయడమే కాకుండా పిల్ దాఖలు చేసిన వ్యక్తికి 10,000 జరిమానా విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. సోషల్ డిస్టెన్స్‌కి బదులు, ఫిజికల్ డిస్టెన్స్ అనే పదాన్ని వాడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ బీ.ఆర్ గవాయ్ లతోకూడిన ధర్మాసనం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపి, ప్రజాప్రయోజనవ్యాజ్యం విచారణార్హం కాదని కోర్టు కొట్టివేసింది. డిస్టెన్సింగ్ అనే పదం వివక్షతో కూడుకున్నదనీ, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమనీ అందుకే ఆ పదం వాడుక మార్చాలనీ షకీల్ ఖురేషీ పిల్ దాఖలు చేసిన నేపథ్యంలో ధర్మాసనం పై విధంగా స్పందించింది. -
ఆ పెళ్లిలో భౌతిక దూరం మాయం
సాక్షి, బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్ వివాహం నిరాడంబరంగా జరిగింది. దేవెగౌడ మనవడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి కొడుకు నిఖిల్ వివాహం మాజీ మంత్రి క్రిష్ణప్ప మేనకోడలు రేవతితో రామనగర జిల్లా బిదడిలోని కుమారస్వామికి చెందిన కేతగనహళ్లి ఫాంహౌస్‌లో శుక్రవారం జరిగింది. కాగా, వివాహానికి హాజరైన వారు ఎవరూ భౌతిక దూరం పాటించకపోగా, కనీసం మాస్కులు కూడా ధరించలేదని విమర్శలు వెల్లువెత్తాయి. మరో ఘటన.. కోవిడ్ హాట్ స్పాట్‌గా ఉన్న కలబురిగి జిల్లా చిత్తపూర్ తాలూకా రావూర్ గ్రామంలోని సిద్ధలింగేశ్వర ఆలయంలో గురువారం ఉదయం లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా రథోత్సవం జరిగింది. ఇందుకు సంబంధించి ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ అధికారితోపాటు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. -
వీడియో కాన్ఫరెన్సింగ్
న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో అత్యవసరమైతే తప్ప కోర్టులకు రావాల్సిన అవసరం లేదనీ, అన్ని కోర్టులు భౌతిక దూరం పాటిస్తూ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. టెక్నాలజీని ఉపయోగించుకుని కోర్టుల్లో విచారణ చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ రాసిన లేఖను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలను జారీచేసింది. న్యాయప్రక్రియ సజావుగా సాకేందుకు ఆధునిక సాంకేతిక తను ఉపయోగించుకుని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ చేపట్టేందుకు దేశంలోని హైకోర్టులన్నింటికీ అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. -
అందరూ భౌతిక దూరం పాటించాలి
-
రేషన్ షాపుల వద్ద ఇబ్బందులు
-
సాక్షి టీవీ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే
-
భౌతిక దూరం ఎనిమిది మీటర్లు?
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ ఊపిరి వదిలినప్పుడు ఎనిమిది మీటర్ల దూరం వరకూ ప్రయాణించగలదని, గాల్లోనే నాలుగు గంటలపాటు ఉండగలదని అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు జరిపిన తాజా పరిశోధన తెలిపింది. దీంతో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్న ఒకట్రెండు మీటర్ల భౌతిక దూరం ఎంతవరకూ పనిచేస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. జర్నల్ ఆఫ్ ద అమెరికన్ మెడికల్ అసోసియేషన్ తాజా సంచికలో ప్రచురితమైన పరిశోధన వ్యాసంలో ఎంఐటీ శాస్త్రవేత్తలు ఈ విషయాలను స్పష్టం చేశారు. (కమ్ముకున్న కరోనా) దగ్గు, తుమ్ము వంటి వాటివల్ల గాల్లో ఏర్పడే మేఘాల్లాంటి నిర్మాణాలపై 1930లలో జరిగిన పరిశోధనల ఆధారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒకట్రెండు మీటర్ల భౌతిక దూరాన్ని ప్రతిపాదించిందని, కానీ ఈ అంచనాలు ఇప్పుడు పనికిరావని అసోసియేట్ ప్రొఫెసర్ లిడియా బౌరౌబా హెచ్చరించారు అన్ని రకాల నీటి తుంపర్లు వైరస్‌ను కలుపుకుని 23 నుంచి 27 అడుగుల దూరం ప్రయాణించగలవని తెలిపారు.తుంపర బిందువు పరిమాణంపై ఏకపక్షంగా నిర్ణయాలు జరిగాయని, వాటి ఆధారంగా మార్గదర్శకాలు జారీ చేశారని ఆరోపించారు. (దివాలా అంచున ఎయిర్‌లైన్స్) -
కరోనాకు 35,349 మంది బలి
ప్యారిస్/మాస్కో/జెరూసలెం/వాషింగ్టన్: కరోనా మహమ్మారికి బలవుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. సోమవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 7,43,190 మంది ఈ వ్యాధి బారిన పడగా 35,349 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, మొత్తం 183 దేశాల్లో చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,57,069 వరకూ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కరోనా క్రోధానికి బలవుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీలతో కలిపి అమెరికా మొత్తమ్మీద 1.45 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారు. మొత్తం 2,606 మంది ప్రాణాలు కోల్పోగా 4,574 మంది కోలుకున్నారు. ఇటలీలో కరోనాతో 10,779 మంది మరణించగా లక్ష మంది బాధితులుగా మారారు. కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు 13,030 మంది ఉన్నారు. స్పెయిన్‌లో మొత్తం 7,340 మంది కరోనాకు బలికాగా వీరిలో గత 24 గంటల్లో మరణించిన వారు 812 మంది కావడం గమనార్హం. మొత్తమ్మీద చూస్తే ఈ వైరస్ యూరప్‌లో 25 వేల మందిని పొట్టనబెట్టుకుంది. సుమారు నాలుగు లక్షల మంది వ్యాధి కోరల్లో చిక్కుకున్నారు. చైనాలో 81,470 మంది ఈ వ్యాధికి గురికాగా, 3,304 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కొత్తగా 31 కేసులు నమోదు కాగా, నలుగురు మరణించారు. ఇరాన్లో 41,495 మందికి వైరస్ సోకగా ఇప్పటివరకు 2,757 మంది ప్రాణాలు కోల్పోయారు. క్వారంటైన్లోకి ఇజ్రాయెల్ ప్రధాని సహాయకుడు ఒకరికి కరోనా సోకిన నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ ముందు జాగ్రత్తగా సోమవారం క్వారంటైన్లోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్‌లో కరోనా బాధితుల సంఖ్య సోమవారానికి 4347కు చేరుకోగా 16 మంది మరణించారు. అమెరికాలో ఏప్రిల్ 30 వరకూ భౌతిక దూరం కరోనా నుంచి అమెరికా జూన్ ఒకటో తేదీకల్లా తప్పించుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈలోగా వచ్చే రెండు వారాల్లో కేసులు, మృతుల సంఖ్య గణనీయంగా పెరుగుతాయని, లక్ష మంది వరకు ప్రాణాలు కోల్పోవచ్చునని ఆయన హెచ్చరించారు. అందుకే ఏప్రిల్ 30 వరకూ భౌతిక దూరం(సోషల్ డిస్టెన్సింగ్) నిబంధనలను పొడిగిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటికే 1.45 లక్షల మంది వైరస్ బారిన పడగా, 2,606 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. రష్యాలో లాక్డౌన్ రష్యా రాజధాని మాస్కోలో సోమవారం లాక్డౌన్ ప్రకటించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇదే తరహా చర్యలకు ప్రయత్నాలు మొదలయ్యాయి. మాస్కో జనాభా కోటీ 20 లక్షలు. రష్యాలో ఇప్పటివరకూ 1,835 మంది కోవిడ్ బారిన పడగా 9 మంది మరణించారు. -
సామాజిక దూరం పాటించేలా రైతుబజార్ల ఏర్పాటు
-
సామాజిక దూరాన్ని పాటించేలా మార్కింగ్‌లు
-
వ్యవసాయానికి సడలింపు
సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ఆంక్షల నుంచి వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ అరుణ్ కుమార్ ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, శాంతి భద్రతలు పర్యవేక్షించే ఉన్నతాధికారులకు ఉత్తర్వులు పంపారు. మినహాయింపులు ఇవీ.. - సామాజిక దూరం పాటిస్తూ రైతులు ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలు చేపట్టవచ్చు. - తమ పొలాల్లో పండించే వ్యవసాయ ఉత్పత్తులను కూడా రవాణా చేసుకోవచ్చు. నిత్యావసర వస్తువుల ఉత్పత్తితో సంబంధమున్న తయారీ యూనిట్లను నిర్వహించుకోవచ్చు. - రబీ పంటల కోతలను నిర్వహించుకోవచ్చు. కోత అనంతరం పంట నూర్పిడి, ఆరబెట్టడం, గోతాల్లో నింపుకోవడం వంటివి చేపట్టవచ్చు. వచ్చే సీజన్‌కు విత్తనాలను ప్యాకింగ్ చేసుకోవచ్చు. - హైబ్రీడ్ మొక్కజొన్న, సజ్జ, చిరుధాన్యాలు, పత్తి, పప్పుధాన్యాలు, వరి, వేరుశనగ, కూరగాయల విత్తనాలను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శుద్ధి కేంద్రాలకు తరలించుకోవచ్చు. రాష్ట్రంలో ప్రస్తుతం ముమ్మరంగా సాగుతున్న విత్తన నిల్వ, పరీక్ష, శుద్ధి, గ్రేడింగ్, ప్యాకింగ్ వంటి కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగించవచ్చు. - వచ్చే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పొలం పనులు చేసుకోవచ్చు. ముడి విత్తనాలను ఒక చోటి నుంచి మరో చోటికి తరలించుకోవచ్చు. - ఖరీఫ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాన విత్తన కంపెనీలు అన్ని జాగ్రత్తలతో తమ విత్తనాలను తరలించవచ్చు. నిర్వహణకు సంబంధించిన కార్యకలాపాలు చేపట్టవచ్చు. అయితే ఇవన్నీ లాక్ డౌన్ నిబంధనలకు లోబడి చేపట్టాలి. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. - ఎరువులు, పురుగు మందుల కంపెనీలు కూడా తగు జాగ్రత్తలతో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు. రైల్వే గిడ్డంగుల నుంచి ఎరువులను తమ ప్యాకింగ్ పాయింట్లకు తరలించే సమయంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. బ్లాక్ మార్కెటింగ్‌కు లేదా ఒకే చోట పెద్దఎత్తున నిల్వ చేసేందుకు అవకాశం లేదు. - ఎరువులు, పురుగు మందుల షాపులు తెరిచి ఉంటాయి. రైతులు మూడు అడుగుల దూరంలో ఉంటూ కొనుక్కోవాలి. - నిత్యావసర వస్తువులు, ఎరువులు, పురుగు మందులు వంటి వాటిని తీసుకువెళ్లే వాహనాలకు అధికారులు అనుమతి ఇస్తారు. - గిడ్డంగుల్లో వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, క్రిమిసంహారక మందులు వంటి వాటిని నిర్వహించే సిబ్బందికి ఎలాంటి ప్రమాదం లేకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి. - లాక్డౌన్ కాలానికి కార్మికులు, ఇతర ఉద్యోగులకు వేతనాలు పూర్తిగా ఇవ్వాలి. ఐదుగురుకు మించి ఒకే చోట పని చేయకుండా, గుమికూడకుండా చర్యలు తీసుకోవాలి. -
బడి దూరం పెరగనుందా?
సాక్షి, హైదరాబాద్ : విద్యా హక్కు చట్టం ప్రకారం నివాస ప్రాంతానికి (నైబర్‌హుడ్) కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కి.మీ. దూరంలోపు ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్లలోపు ఉన్నత పాఠశాల ఉండాలి. ఈ నిబంధన ఇకపై మారబోతోందా అంటే, విద్యాశాఖ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నైబర్‌హుడ్ పరిధి పెంపునకు కసరత్తు మొదలైందని విద్యాశాఖ వర్గాలు నిర్ధారించాయి. పాఠశాల కేటగిరీని బట్టి ఒక కిలోమీటర్, 3 కి.మీ., 5 కి.మీ. ఉండగా, ఇకపై అన్నింటికి 5 కి.మీ. దూరాన్నే వర్తింపజేసే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే అది సాధ్య మవుతుందా? లేదా? విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది. అది సాధ్యం కాకపోతే ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టవచ్చునన్న అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈనెల 15వ తేదీన విద్యాశాఖ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. ఆ కమిటీ ఈ నెల 22వ తేదీలోగా నివేదిక అందజేయాలని స్పష్టం చేసింది. అందులో మరోవైపు మున్సిపాలిటీ, కార్పొరేషన్, కంటోన్మెంట్ వంటి సంస్థల పరిధిలో ఉండే పట్టణ ప్రాంతాల్లో నైబర్‌హుడ్ పరిధిని ఒక వార్డుగా చేర్చేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు విద్యా హక్కు చట్టం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో చట్టం అమలుకు ఇచ్చిన రూల్స్‌కు సవరణ చేసేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. హేతుబద్ధీకరణ కోసమేనా? రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో 26,754 పాఠశాలలుంటే.. ఒక్క విద్యార్థీ లేని స్కూళ్లు 916 ఉన్నాయి. ఈస్కూళ్లలో 748 మంది టీచర్లున్నారు. వారిని విద్యాశాఖ ఇతర స్కూళ్లలో తాత్కాలికంగా సర్దుబాటు చేసింది. అయితే 1–10 మందిలోపు విద్యార్థులున్న పాఠశాలలు 1,752 ఉండగా, వాటిల్లో 2,022 మంది టీచర్లు ఉన్నారు. 11 నుంచి 20 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 3,441 ఉండగా, వాటిల్లో 5,275 మంది టీచర్లను కొనసాగించాల్సి వస్తోంది. మొత్తంగా 20 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లలోనే 5 మందికి పైగా టీచర్లను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హేతుబద్ధీకరణకు ఆలోచనలు చేసింది. అయితే ఉపాధ్యాయ సంఘాలు స్కూళ్లు మూసేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. వాస్తవానికి ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండే ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక టీచర్ ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ప్రస్తుతం ఉన్న టీచర్లను సర్దుబాటు చేయకుండా, పాఠశాలల హేతుబద్ధీకరణ చేయకుండా అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. విద్యార్థులు చాలా తక్కువ మంది ఉన్నా 5 వేల మందికి పైగా టీచర్లను వాటికి కేటాయించడం ద్వారా మానవ వనరులు వృథా అవుతున్నాయి. వారిని ఆయా స్కూళ్లలోనే కొనసాగించాల్సి రావడం వల్ల ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు వారిని పంపించలేని పరిస్థితి నెలకొంది. విద్యా హక్కు చట్టంలో ఆవాస ప్రాంతానికి నిర్ధేశిత దూరంలో పాఠశాల లేకపోతే ట్రాన్స్‌పోర్టు సదుపాయం కల్పించాలని చట్టం చెబుతోంది. దానిని కొన్ని చోట్ల అమలు చేస్తున్నా.. తక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూళ్లను ఇతర స్కూళ్లలో విలీనం చేసేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. అందుకే విద్యాహక్కు చట్టం నిబంధనలకే మార్పులు చేయడం సాధ్యమా? అది సాధ్యమైతే తమ ఆలోచనలను సులభంగా ఆచరణలో పెట్టవచ్చన్న భావనతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చెబుతున్నదీ అదే.. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టిన నూతన విద్యా విధానంలో కూడా స్కూల్ కాంప్లెక్స్ పేరుతో ఉన్నత పాఠశాలలను అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఆ కాంప్లెక్స్‌కు 5 నుంచి 10 మైళ్ల పరిధిలో కింది తరగతులతో కూడిన పాఠశాలలను కొనసాగించాలని గతంలోనే ఎడ్యుకేషన్ కమిషన్ సిఫారసు చేసిందని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అభిప్రాయపడింది. ఇప్పుడు స్కూల్ కాంప్లెక్స్ విధానాన్ని అమల్లోకి తేవాల్సిన అవసరం ఉందని పాలసీని రూపొందించిన నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అది అమల్లోకి రావాలంటే విద్యాహక్కు చట్టంలోని నివాస ప్రాంతంలో స్కూల్ ఉండాల్సిన నిర్ధేశిత పరిధిని పెంచేలా మార్పులు చేయాల్సి వస్తుంది. కేంద్రం ఇంకా దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏం సిఫారసు చేస్తుందన్నది ఇపుడు ఆసక్తికరంగా మారింది. పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులు.. హైదరాబాద్ ఆర్జేడీ హైదరాబాద్ డీఈవో రంగారెడ్డి డీఈవో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఒక డిప్యూటీ ఈవో. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక ఎంఈవో సమగ్ర శిక్షా అభియాన్ నుంచి ఏఎస్పీడీ తరపున ఒక ప్రతినిధి -
పాక్ ఎన్నికల్లో పోటీకి హఫీజ్ సయీద్ దూరం
లాహోర్: ముంబై పేలుళ్ల సూత్రధారి, జమాత్ ఉద్ దవా నాయకుడు హఫీజ్ సయీద్ పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అయితే, జాతీయ, ప్రావిన్షియల్ అసెంబ్లీ సీట్లకు 200 మందికిపైగా తన మద్దతుదారులను బరిలోకి దించనున్నాడు. తన పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వకపోవడంతో అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా(ఎల్ఈటీ)కు అనుబంధ సంస్థ అయిన జమాత్ ఉద్ దవా(జేయూడీ) నాయకుడు హఫీజ్ మిల్లీ ముస్లిం లీగ్(ఎంఎంఎల్) పేరిట రాజకీయ పార్టీని స్థాపించాడు. కానీ, ఎంఎంఎల్‌కు ఎన్నికల కమిషన్ గుర్తింపునివ్వలేదు. దీంతో ఈసీ గుర్తింపు ఉన్న అల్లాహు అక్బర్ తెహ్రీక్(ఏఏటీ)తో ఎంఎంఎల్ జట్టు కట్టింది. సీట్ల పంపకంలో భాగంగా ఎంఎంఎల్ 200 మందికిపైగా అభ్యర్థులను రంగంలోకి దించనుంది. ఎంఎంఎల్ పార్టీలో చేరిన వారికి ఏఏటీ పార్టీ టికెట్లు ఇస్తామని చెప్పారు.