‘ఫీజు’ కోత! | 'Fees' cut! | Sakshi
Sakshi News home page

‘ఫీజు’ కోత!

Published Thu, Aug 11 2016 11:35 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

'Fees' cut!

– రీయింబర్స్‌మెంట్‌కు దూరమైన 3,911 మంది విద్యార్థులు 
– వేలిముద్రలు పడకపోవడమే కారణం.. పట్టించుకోని ప్రభుత్వం
 
అనంతపురం ఎడ్యుకేషన్‌ : 
వేలిముద్రలు పడక ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిరుపేద విద్యార్థులు దూరమయ్యారు. వీరిలో ఎక్కువగా బీసీ, ఈబీసీ విద్యార్థులే ఉన్నారు. తర్వాత ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉన్నారు. వీరంతా రెండేళ్లుగా ఆయా సంక్షేమశాఖ అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అదిగో.. ఇదిగో అంటూ ఆశలు పెట్టుకుని తిరిగినా లాభం లేకపోయింది. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ఆయా విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది.
 
యజమాన్యాల ఒత్తిళ్లు
వేలిముద్రలు పడక ఫీజు మొత్తం విడుదల కాకపోవడంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిళ్లు చేస్తున్నాయి. ‘ఆన్‌లైన్‌లో మీ దరఖాస్తులే సబ్‌మిషన్‌ కాలేదు. ఈ పరిస్థితుల్లో ఫీజు వచ్చే పరిస్థితి లేదు. ఆ మొత్తం చెల్లించాల్సిందే’ అంటూ యాజమాన్యాలు ఒత్తిళ్లు చేస్తున్నాయి. బకాయి ఫీజు మొత్తం చెల్లిస్తేనే  ద్వితీయ సంవత్సరంలో కూర్చోబెడతామంటూ తెగేసి చెబుతున్నారని రాప్తాడు మండలానికి చెందిన విద్యార్థి తండ్రి శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వేలిముద్రలు పడని విద్యార్థులపై ఒక నిర్ణయం తీసుకుంటే మంచిదని కోరుతున్నారు.
 
రెండేళ్లుగా ఆయా శాఖల వారీగా వేలిముద్రలు పడని విద్యార్థులు 
బీసీ,           ఈబీసీ    ఎస్సీ ఎస్టీ
2,836         838       237
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement