కొచ్చి: ఆ గ్రామంలోని విద్యార్థులంతా చదువుల కోసం ఆరు కిలోమీటర్లు వెళ్తున్నారు. గతంలో ఇలాంటి జరిగేవి గానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇటువంటి పరిస్ధితులు లేవని అనుకుంటే మాత్రం మన పొరపాటు అవుతుంది. కేరళలోని రాజమాలకు చెందిన విద్యార్థులు పాఠం వినడానికి ప్రతిరోజు ఇలా పాట్లుపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆన్‌లైన్‌లోనే పాఠాలు వినాల్సి వస్తోంది. తమ ఊరిలో నెటవర్క్ సరిగా లేని సమస్యతో అక్కడి విద్యార్థుల పరిస్థితి ఇది.
కేరళలలోని ఇడుక్కి జిల్లాలో రాజమాల అనే గ్రామంలో.. సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఒక వేళ వచ్చిన లోస్పీడ్ ఉంటుంది. అయితే నెట్ స్పీడ్‌గా బాగుంటే గానీ ఆన్‌లైన్‌లో క్లాసులు వినలేమని తెలిసిందే. ఈ కారణంగా ఆ ఊరికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు వినడం కోసం ఊరికి దూరంగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరవికుళం నేషనల్ పార్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడి ఎత్తయిన ప్రదేశాల్లో సిగ్నల్ పుల్‌గా ఉంటుండంతో అక్కడే ఆన్‌లైన్ క్లాసులు విని వస్తున్నారు. తాము ప్రతిరోజు ఉదయం నేషనల్ పార్కుకు ఆటోలో వస్తున్నామని, తిరిగి సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నామని ఓ విద్యార్థి చెప్పాడు.రాజమాలలో ఇంటర్నెట్ వసతి లేదు. కొన్ని ప్రదేశాల్లో వచ్చినా.. అది చాలా తక్కువ స్పీడ్‌తో వస్తున్నది. దీంతో ఇంటర్నెట్ కోసం ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లడం తమకు చాలా కష్టంగా ఉంది. కొన్నిసార్లు వానలు పడుతున్నాయి. దీనివల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓ విద్యార్థి చెప్పాడు.
Kerala: To attend online classes, students living in Idukki's Rajamala travel nearly 6-km daily to reach a location with internet connectivity in Eravikulam National Park.
— ANI (@ANI) June 1, 2021
"In the morning, we reach here by auto & in evening, we walk back home," a Class 12 student said yesterday pic.twitter.com/xHVjz1srwu
Comments
Please login to add a commentAdd a comment