Idukki
-
వైరల్: మామిడి పండ్ల దొంగ.. పోలీసోడే!
కొట్టాయం: కక్కుర్తితో ఎవరూ లేని టైంలో ఓ దుకాణం బయటి నుంచి మామిడి పండ్లను కాజేసిన దొంగను.. పోలీసుగా గుర్తించారు కేరళ అధికారులు. కొట్టాయం కంజిరాపల్లి సెప్టెంబర్ 28న ఓ రోడ్ సైడ్ దుకాణం దగ్గర ఈ దొంగతనం జరిగింది. ఇడుక్కి ఏఆర్ క్యాంప్‌లో పని చేసే పీవీ షిహాబ్.. ఓ మామిడి పండ్ల దుకాణం ముందు ఈ చోరీకి పాల్పడ్డాడు. ఎవరూ లేనిది చూసి సుమారు పది కేజీల మామిడి పండ్లను బైక్ ద్వారా తరలించాడతను. అయితే.. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఈ చోరీని గుర్తించాడు ఆ దుకాణం యాజమాని. దొంగ హెల్మెట్, రెయిన్‌కోట్ ధరించి ఉండడంతో.. తొలుత అతన్ని గుర్తించడం వీలుకాలేదు. అయితే బైక్ నెంబర్ ఆధారంగా.. అతను షిహాబ్‌గా గుర్తించారు. దీంతో డిపార్ట్మెంట్ పరువు తీసినందుకు అతన్ని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం అతను పరారీలో ఉండగా.. అధికారులు గాలింపు చేపట్టారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలోనే ఈ పండ్ల చోరీకి పాల్పడినట్లు అతను పాల్పడినట్లు తెలుస్తోంది. When @TheKeralaPolice was #caughtoncamera stealing mangoes... The incident happened in Kanjirappally, Kottayam. The accused has been identified as PV Shihab, a Civil Police Officer posted at Idukki AR Camp.#CCTV #theft #keralapolice pic.twitter.com/CqT3y8ESID — Bobins Abraham Vayalil (@BobinsAbraham) October 4, 2022 -
ఆస్తి వివాదం: వృద్ధుడు చేసిన పనికి నాలుగు ప్రాణాలు బలి
సాక్షి కేరళ(ఇడుక్కి): ఆస్తుల విషయంలో తన పర భేదాన్ని మరిచిపోయి చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంటారు. ఆఖరికి తన కడుపున పుట్టిన వాళ్లు అని కనికరం కూడా ఉండదేమో. బహుశా ఆస్తి మీద ఉన్న వ్యామోహం మానవతా విలువలు మరిచి పశువులా ప్రవర్తించేలా చేస్తుందేమో. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి ఆస్తి విషయమై కన్న కొడుకు, మనవరాళ్లు అనే బాంధవ్యాన్ని మరిచి నిద్రిస్తున్నప్పుడే పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించాడు. వాళ్లెవ్వరు బతికి బయట పడకూడదని పక్కా ప్లాన్‌తో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఆస్తి తగాదాల కారణంగా కేరళలోని ఇడుక్కిలో 79 ఏళ్ల హమీద్ తన కొడుకు కుటుంబాన్ని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ వృద్ధుడు వాళ్లు నిద్రిస్తున్న సమయంలో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో కొడుకు, కోడలు, ఇద్దరు మనవరాళ్లు చనిపోయారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకుని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే హమీద్ ఇంటికి తాళం వేసిన తర్వాత కిటికి లోంచి పెట్రోల్ నింపిన బాటిళ్లను విసిరి అనంతరం నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. మంటలను గమనించిన స్థానికులు సైతం వారిని కాపాడలేకపోయారని వెల్లడించారు. అతను పక్కా ప్లాన్‌తో వాటర్ ట్యాంకును ఖాళీ చేయడమే కాక పక్కనున్న బావి నుంచి నీళ్లు తోడి ఎవరైన కాపాడతారేమోనని బావి వద్ద ఉండే నీళ్లు తోడే బకెట్‌ని కూడా తీసేశాడని చెప్పారు. ఇంటి లోపల దృశ్యం చాలా హృదయ విదారకంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే స్థానికులు హమీద్ పెట్రోల్ పోసి హత్య చేయడం చూశామని చెప్పడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: సాగర్ కాల్వలో తేలిన కారు.. వీడిన మిస్టరీ, ఆ పని అన్నాచెల్లెలే చేశారు!) -
కేరళలో ఆగని వర్ష బీభత్సం
తిరువనంతపురం: కేరళలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో మృతుల సంఖ్య 22కి చేరుకుంది. ఆదివారం ఉదయం నుంచి వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో సైన్యం సహాయ చర్యల్ని ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 105 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు. నిర్వాసితుల్ని, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అక్కడిని తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు సహాయ చర్యల్ని సమీక్షిస్తున్నారు. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణంగా ఆ శిబిరాల్లో ఏర్పాట్లు చేశారు. మాసు్కలు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పాటు జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం 11 బృందాలను ఏర్పాటు చేసి సహాయ చర్యలను కొనసాగిస్తోంది. అన్ని విధాలా అండగా ఉంటాం.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళ ముఖ్యమంత్రి విజయన్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ప్రధాని ట్వీట్ చేశారు. మరోవైపు కేరళ ఏ సాయం అడిగినా కేంద్రం చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ‘‘మేము కేరళలో పరిస్థితులన్నింటినీ పర్యవేక్షిస్తున్నాం. ఎవరికి ఏ సాయం అవసరమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే కేరళలో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని అమిత్ షా ట్వీట్ చేశారు. కేరళలో సోమవారం నుంచి ప్రారంభించాలి్సన పాఠశాలల్ని 20వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శబరిమల ఆలయ సందర్శనకు రెండు రోజుల పాటు ఎవరూ రావొద్దని ఆలయ నిర్వహణ కమిటీ పేర్కొంది. కేరళలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా డ్యామ్‌లన్నీ పొంగి పొర్లుతూ ఉండడంతో పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. -
టీవీ కోసం అక్కతో గొడవ.. క్షణికావేశంలో దారుణం
తిరువనంతపురం: టీవీ చూడడం కోసం అక్కతో గొడవపడిన చెల్లి క్షణికావేశంలో ఇంట్లోని కిటీకీ గ్రిల్స్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇడుక్కికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక తన అక్క, కజిన్‌తో కలిసి టీవీ చూస్తుంది. తనకు నచ్చిన చానెల్ పెట్టుకుంటానంటూ అక్క దగ్గర్నుంచి రిమోట్ లాక్కొని చానెల్ మార్చింది. దీంతో బాలిక అక్క ఆమె దగ్గర్నుంచి రిమోట్ లాక్కుని మేము పెట్టిందే చూడాలంటూ పేర్కొంది. దీంతో అక్కతో గొడవపడిన చెల్లి బెడ్రూంకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని కిటికీ గ్రిల్స్‌కు తాడు కట్టి ఉరి వేసుకుంది. గదిలోకి వెళ్లిన బాలిక ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానమొచ్చిన ఆమె నానమ్మ బయటికి వెళ్లి చూసింది. అప్పటికే ఆమె కిటికీ గ్రిల్స్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే గది తలుపులు బద్దలు కొట్టి సదరు బాలికను కిందకు దింపి పరిశీలించగా.. అప్పటికే చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. -
పాఠాలు వినాలంటే.. 6 కిలోమీటర్లు నడవాల్సిందే
కొచ్చి: ఆ గ్రామంలోని విద్యార్థులంతా చదువుల కోసం ఆరు కిలోమీటర్లు వెళ్తున్నారు. గతంలో ఇలాంటి జరిగేవి గానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇటువంటి పరిస్ధితులు లేవని అనుకుంటే మాత్రం మన పొరపాటు అవుతుంది. కేరళలోని రాజమాలకు చెందిన విద్యార్థులు పాఠం వినడానికి ప్రతిరోజు ఇలా పాట్లుపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆన్లైన్లోనే పాఠాలు వినాల్సి వస్తోంది. తమ ఊరిలో నెటవర్క్ సరిగా లేని సమస్యతో అక్కడి విద్యార్థుల పరిస్థితి ఇది. కేరళలలోని ఇడుక్కి జిల్లాలో రాజమాల అనే గ్రామంలో.. సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఒక వేళ వచ్చిన లోస్పీడ్ ఉంటుంది. అయితే నెట్ స్పీడ్‌గా బాగుంటే గానీ ఆన్లైన్లో క్లాసులు వినలేమని తెలిసిందే. ఈ కారణంగా ఆ ఊరికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు వినడం కోసం ఊరికి దూరంగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరవికుళం నేషనల్ పార్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడి ఎత్తయిన ప్రదేశాల్లో సిగ్నల్ పుల్గా ఉంటుండంతో అక్కడే ఆన్లైన్ క్లాసులు విని వస్తున్నారు. తాము ప్రతిరోజు ఉదయం నేషనల్ పార్కుకు ఆటోలో వస్తున్నామని, తిరిగి సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నామని ఓ విద్యార్థి చెప్పాడు.రాజమాలలో ఇంటర్నెట్ వసతి లేదు. కొన్ని ప్రదేశాల్లో వచ్చినా.. అది చాలా తక్కువ స్పీడ్‌తో వస్తున్నది. దీంతో ఇంటర్నెట్ కోసం ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లడం తమకు చాలా కష్టంగా ఉంది. కొన్నిసార్లు వానలు పడుతున్నాయి. దీనివల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓ విద్యార్థి చెప్పాడు. Kerala: To attend online classes, students living in Idukki's Rajamala travel nearly 6-km daily to reach a location with internet connectivity in Eravikulam National Park. "In the morning, we reach here by auto & in evening, we walk back home," a Class 12 student said yesterday pic.twitter.com/xHVjz1srwu — ANI (@ANI) June 1, 2021 చదవండి: హైదరాబాద్‌లో కొవిడ్ వ్యాక్సిన్ల డ్రోన్ డెలివరీ ! -
చిరుతపులి పిల్లను చంపి వండుకు తిన్నారు
సాక్షి, చెన్నై: చిరుతపులి పిల్లను చంపి, ఆ మాంసాన్ని వండుకు తిన్న ఐదుగురు వేటగాళ్లను తమిళనాడులోని నీలగిరి జిల్లా అటవీ శాఖ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు.అటవీ గ్రామంలోకి దారి తప్పి వచ్చిన ఓ చిరుతపిల్లను కొందరు వ్యక్తులు వేటాడి హతమార్చినట్టు శనివారం అటవీశాఖ అధికారులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులకు అక్కడి ఓ పంట పొలంలో చిరుతపులిని వేటాడిన ఆనవాళ్లు లభించాయి. విచారణను వేగవంతం చేయగా ఆదివారం ఉదయం అదే ప్రాంతానికి చెందిన వినోద్, కురియ, బిను, కుంజప్పన్, విన్సంట్‌లను అరెస్టు చేశారు. వారంతా కలసిదాని మాంసాన్ని వండుకొని తిన్నట్లు గుర్తించారు. Kerala: Five persons were arrested for allegedly killing a leopard and consuming its meat in Idukki district. (23.01.2021) pic.twitter.com/GTTyFRtzHq — ANI (@ANI) January 24, 2021 -
విషాద ఘటనలో ఒంటరైన ‘కూవి’, దాంతో
తిరువనంతపురం: ఇడుక్కిలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఓ పెంపుడు కుక్క సహాయక చర్యల్లో సేవలందించింది. మృత దేహాల వెలికితీతలో జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్ఎఫ్) సిబ్బందికి రెండేళ్ల ‘కూవి’ సహాయం చేసింది. అయితే, కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాని యజమాని కూడా మృత్యువాత పడటంతో అది ఒంటరైంది. దీంతో పోలీస్ ఆఫీసర్ అజిత్ మాధవన్ దానిని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఆయన పోలీస్ జాగిలాలకు ట్రైనర్ కూడా కావడం విశేషం. కాగా, ఆగస్టు 7న ఇడుక్కి జిల్లా మూనారు సమీపంలోని రాజమలై వద్ద కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తేయాకు తోటల్లో పనికివెళ్లే దాదాపు 65 మంది సజీవ సమాధి అయ్యారు. ఇప్పటికీ కొన్ని మృత దేహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. గురువారం మరో మూడు మృత దేహాలు లభ్యమయ్యాయి. (చదవండి: ప్రమాద స్థలం నుంచి కదలని శునకాలు) (చదవండి: తవ్వేకొద్దీ శవాలు..!) -
తవ్వేకొద్దీ శవాలు..!
సాక్షి, చెన్నై: మూనారు రాజమలైలో తవ్వే కొద్ది శవాలు బయట పడుతున్నాయి. మృతులంతా తమిళులే కావడంతో బాధిత కుటుంబాల రోదనలు వర్ణణాతీతంగా మారాయి. అత్యధిక శాతం మంది కైతారు వాసులు కావడంతో ఆ గ్రామం శోక సంద్రంలో మునిగింది. ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం సంప్రదింపులు జరిపారు. కేరళ రాష్ట్రం ఇడిక్కి జిల్లా మూనారు సమీపంలోని రాజమలై తేయాకు తోటల్లో పనులకు వెళ్లిన కార్మికులు జలసమాధి అయిన విషయం తెలిసిందే. ఇక్కడ పనిచేస్తున్న కార్మికులంతా తిరునల్వేలి, తెన్ కాశి పరిసర వాసులకు చెందిన వారు కావడంతో ఇక్కడి కుటుంబాలు తీవ్ర మనోవేదనలో ఉన్నాయి. శనివారం 22 మృతదేహాలు బయట పడగా, ఆదివారం మరో 20 మేరకు మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 50 మేరకు మృతదేహాల కోసం అన్వేషణ సాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన 21 మంది జాడ కానరాకపోవడంతో వీరంతా తేయాకు తోటకు కూత వేటు దూరంలో ప్రవహిస్తున్న నదిలో కొట్టుకెళ్లి ఉంటారన్న నిర్ధారణకు సహాయక బృందాలు వచ్చాయి. దీంతో హెలికాఫ్టర్ల ద్వారా గాలింపు ముమ్మరం చేశారు. మృతదేహాలను సొంత గ్రామాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేయాలని కుటుంబీకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే మృతదేహాలు ఛిద్రమై ఉండడంతో అక్కడే ఖననం చేయడానికి ఏర్పాట్లు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. కాగా సహాయక చర్యలకు వర్షం అండ్డంకిగా మారిందని ఇడిక్కి ఎస్పీ కరుప్పుస్వామి పేర్కొన్నారు. మృతదేహాలను గుర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. బంధువుల ద్వారా వివరాలు సేకరిస్తున్నామన్నారు. (అగ్నిప్రమాదం కలచివేసింది) విజయన్‌తో పళని భేటి... కేరళ సీఎం పినరయి విజయన్‌తో ముఖ్యమంత్రి పళనిస్వామి ఫోన్లో మాట్లాడారు. మూనారులో సాగుతున్న సహాయక చర్యలు, మృతుల్లో తమిళులు ఉండడం గురించి మాట్లాడారు. అవసరమైతే తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాలను పంపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.సహాయక చర్యలకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడం లేదని, త్వరితగతిన అన్ని వివరాలను తమిళనాడుకు అందజేస్తామని విజయన్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలను కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఇది కంటి తుడుపు చర్య అని రూ. 25 లక్షలు ప్రకటించాలని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. నష్ట పరిహారం పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వం సైతం కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. -
కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి...
-
కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి...
తిరువనంతపురం : గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో కేరళ అతలాకుతలం అవుతోంది. భారీగా వరద నీరు చేరడంతో రాష్టంలోని కొన్నిప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఎర్నాకుళం, త్రిశూర్, పాలక్కాడ్, కొజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్‌గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్టు జారీ చేసింది. అదే విధంగా మలప్పురం, ఇడుక్కి జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఇడుక్కి జిల్లాలో శుక్రవారం ఉదయం కురిసిన అతి భారీ వర్షాలు, వరదలతో తేయాకు తోట కార్మికులు నివసించే మున్నార్ సమీపంలో కొండచరియలు విరిగిపడి అయిదుగురు మరణించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆ ప్రాంతంలో 70 నుంచి 80 మంది నివసిస్తున్నట్లు ఆయన తెలిపారు. (బిహార్‌లో వరద బీభత్సం: 21 మంది మృతి) వీరిలో కనీసం మూడు కుటుంబాలు ప్రమాదంలో చిక్కుకున్నాయని, మరో 10 మందిని సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. వర్షాల కారణంగా విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ఘటన ప్రాంతానికి కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాజమాలలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రజలను రక్షించడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని (ఎన్డిఆర్ఎఫ్) మొహరించామని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పోలీసులు, అగ్నిమాపక, అటవీ, రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. (రెడ్ అలర్ట్: భారీ నుంచి అతి భారీ వర్షాలు) -
‘ఇడుక్కి’లో డేంజర్ లెవెల్
తిరువనంతపురం : కేరళలో పోటెత్తిన వరదతో మృతుల సంఖ్య 39కి చేరింది. ఇడుక్కి డ్యామ్‌లో నీటి నిల్వ ప్రమాదకర స్థాయికి చేరడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 2403 అడుగులు కాగా, సోమవారం ఉదయం నీటి పరిమాణం 2397.94 అడుగులకు చేరింది. కేరళలో వరద పరిస్థితి తీవ్రంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రాష్ట్రానికి కేంద్రం అవసరమైన సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాల్లో కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి కేజే అల్ఫోన్స్‌తో కలిసి రాజ్‌నాథ్ ఏరియల్ సర్వే నిర్వహించారు. కాగా ప్రాథమిక అంచనాల ప్రకారం కేరళకు వరదల వల్ల రూ. 8316 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. రాష్ట్రంలో తక్షణ సహాయ, పునరావాస చర్యలు చేపట్టేందుకు రూ. 400 కోట్లు అదనంగా విడుదల చేయాలని తాను హోంమంత్రిత్వ శాఖను కోరానని విజయన్ ట్వీట్ చేశారు. భారీ వర్షాళతో దాదాపు 20,000 ఇళ్లు ధ్వంసమయ్యాయని, 10,000 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. -
కేరళ అతలాకుతలం
తిరువనంతపురం: భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటివరకు 29 మంది మృతి చెందగా, సుమారు 54వేల మంది నిర్వాసితులు అయ్యారు. వీరిలో 53,501 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు తెలిపారు. మరోవైపు వర్షాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ఏడు ఉత్తర జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు అదనంగా మరో 5 ఆర్మీ బృందాలను రంగంలోకి దింపారు. పెరియార్ నది నీటి మట్టం అతివేగంగా పెరుగుతోంది. ఇడుక్కి రిజర్వాయర్ నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో ఇడుక్కితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆసియాలో అతిపెద్ద ఆర్చ్ డ్యాం ‘ఇడుక్కి రిజర్వాయర్’ నిండడంతో మరో 3 గేట్లను ఎత్తారు. వరదలపై మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరదల నేపథ్యంలో ఈ నెల 12 వరకు ఆయన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. -
శవాలను ఒకదానిపై ఒకటి పేర్చి...
సాక్షి, తిరువనంతపురం: కనిపించకుండా పోయిన ఓ కుటుంబం దారుణంగా హత్యకు గురైన ఘటన కేరళలో కలకలం రేపింది. ఇడుక్కి జిల్లా తోడోపుజా గ్రామానికి చెందిన కృష్ణన్, అతని భార్య ఇద్దరు పిల్లలు గత నాలుగు రోజులుగా అదృశ్యమైనట్లు బంధువులు ఫిర్యాదు చేశారు. వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చివరకు ఇంటి పెరట్లోనే వారి మృతదేహాలను వెలికి తీశారు. దీంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నాలుగు రోజులుగా ఆ కుటుంబం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవటంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఇంట్లోకి వెళ్లిన బంధువులు ఇంటి గోడలకు రక్తపు మరకలు ఉండటం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డాగ్ స్క్వాడ్ సాయం తీసుకోగా.. అవి పెరట్లోని ఓ గుంత వద్ద ఆగిపోయాయి. అక్కడ తవ్వి చూసిన పోలీసులు నాలుగు మృత దేహాలు ఒకదానిపై ఒకటి పేర్చి ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. మృతులను కృష్ణన్(56), సుశీల(52), ఆర్ష(21), అర్జున్(19) గా గుర్తించారు. ఇంట్లో ఓ సుత్తి, కత్తికి రక్తపు మరకలు ఉండటంతో వారిని వాటితోనే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒంటిపై గాయాల ఆధారంగా వారిని కిరాతకంగా హత్య చేశారని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కృష్ణన్‌కు భూత వైద్యుడిగా, జ్యోతిష్యుడిగా ఆ ప్రాంతంలో పేరుంది. పలువురు ప్రముఖులు కూడా అతన్ని కలుస్తుంటారని తెలుస్తోంది. ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపే ఆ కుటుంబ సభ్యులు.. చుట్టుపక్కల వారితో కూడా కలివిడిగా ఉండేది కాదని స్థానికులు అంటున్నారు. చేతబడి, కోణంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టాయం మెడికల్ కాలేజీకి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం తరలించిన పోలీసులు.. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా కేసును త్వరగా చేధిస్తామని అంటున్నారు. బురారీ కేసు; ఊహించని ట్విస్ట్ -
కేరళలో భారీ వర్షాలు: 16 మంది మృతి
కేరళలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఇడుక్కి జిల్లాలో 14 మంది వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఎర్నాకుళం జిల్లాలో మరో ఇద్దరు మరణించారు. పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండే ఇడుక్కి జిల్లాపై వర్షాల ప్రభావం ఎక్కువగా ఉందని రెవెన్యూ మంత్రి అదూర్ ప్రకాశ్ తెలిపారు. ఆయన స్వయంగా ఆ జిల్లాకు వెళ్లి ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న సహాయ, పునరావాస కార్యకలాపాలను పరిశీలించారు. మున్నార్ సమీపంలోని చీయపర ప్రాంతంలో భారీ కొండచరియ విరిగిపడింది. రోడ్డుపక్కనే వాహనాలు పార్కింగ్ చేసి ఉన్న సమయంలో ఇది పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీన్ని తీసిన తర్వాత గానీ కింద ఎన్ని వాహనాలున్నాయో చెప్పలేమన్నారు. భారత నావికా దళానికి చెందిన సిబ్బంది ఇప్పటికే సహాయ కార్యక్రమాల కోసం అక్కడకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం పరిస్థితి తీవ్రత గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటుచేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఇడుక్కి ప్రాంతానికి ప్రత్యేక వైద్య బృందాలను పంపారు. కొచ్చిలో 40 విమాన సర్వీసులు రద్దు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం పార్కింగ్ ప్రాంతంతో పాటు టాక్సీ మార్గంలోకి కూడా నీళ్లు ప్రవేశించడంతో దాదాపు 40 విమాన సర్వీసులు రద్దుచేశారు. ఈ విమానాశ్రయం 1999లో ప్రారంభం కాగా, అప్పటినుంచి ఇలా జరగడం ఇదే మొదటిసారని విమానాశ్రయ డైరెక్టర్ ఏసీకే నాయర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా డ్యాం షట్టర్లు తెరవాల్సి రావడంతో విమానాశ్రయం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరుకుందని, లోపలకు కూడా నీళ్లు రావడంతో ఉదయం పదిన్నర గంటలకు మొత్తం ఆపరేషన్లన్నింటినీ సస్పెండ్ చేశామని ఆయన తెలిపారు. సాయంత్రానికి మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉందని నాయర్ చెప్పారు. గడిచిన రెండు రోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇడుక్కి, ఎర్నాకుళం జిల్లాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది.