![11-Year-Old Girl Hangs Self After Fight With Sibling Over TV In Kerala - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/20/Hang.jpg.webp?itok=R2MWRpdZ)
ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం: టీవీ చూడడం కోసం అక్కతో గొడవపడిన చెల్లి క్షణికావేశంలో ఇంట్లోని కిటీకీ గ్రిల్స్‌కు ఉరి వేసుకొని చనిపోయింది. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఇడుక్కికి చెందిన 11 ఏళ్ల మైనర్ బాలిక తన అక్క, కజిన్‌తో కలిసి టీవీ చూస్తుంది. తనకు నచ్చిన చానెల్ పెట్టుకుంటానంటూ అక్క దగ్గర్నుంచి రిమోట్ లాక్కొని చానెల్ మార్చింది. దీంతో బాలిక అక్క ఆమె దగ్గర్నుంచి రిమోట్ లాక్కుని మేము పెట్టిందే చూడాలంటూ పేర్కొంది.
దీంతో అక్కతో గొడవపడిన చెల్లి బెడ్‌రూంకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని కిటికీ గ్రిల్స్‌కు తాడు కట్టి ఉరి వేసుకుంది. గదిలోకి వెళ్లిన బాలిక ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అనుమానమొచ్చిన ఆమె నానమ్మ బయటికి వెళ్లి చూసింది. అప్పటికే ఆమె కిటికీ గ్రిల్స్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే గది తలుపులు బద్దలు కొట్టి సదరు బాలికను కిందకు దింపి పరిశీలించగా.. అప్పటికే చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment