
తిరువనంతపురం: ఇడుక్కిలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో ఓ పెంపుడు కుక్క సహాయక చర్యల్లో సేవలందించింది. మృత దేహాల వెలికితీతలో జాతీయ విపత్తు దళం (ఎన్డీఆర్‌ఎఫ్) సిబ్బందికి రెండేళ్ల ‘కూవి’ సహాయం చేసింది. అయితే, కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాని యజమాని కూడా మృత్యువాత పడటంతో అది ఒంటరైంది. దీంతో పోలీస్ ఆఫీసర్ అజిత్ మాధవన్ దానిని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఆయన పోలీస్ జాగిలాలకు ట్రైనర్ కూడా కావడం విశేషం. కాగా, ఆగస్టు 7న ఇడుక్కి జిల్లా మూనారు సమీపంలోని రాజమలై వద్ద కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తేయాకు తోటల్లో పనికివెళ్లే దాదాపు 65 మంది సజీవ సమాధి అయ్యారు. ఇప్పటికీ కొన్ని మృత దేహాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. గురువారం మరో మూడు మృత దేహాలు లభ్యమయ్యాయి.
(చదవండి: ప్రమాద స్థలం నుంచి కదలని శునకాలు)
(చదవండి: తవ్వేకొద్దీ శవాలు..!)
Comments
Please login to add a commentAdd a comment