కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విలయం పెను విషాదాన్ని సృష్టించింది. కుటుంబాలకు కుటుంబాలు నాశనమై పోయాయి. సొంతవారు, పొరుగువారు ఇలా సర్వం పోగొట్టుకుని గుండెలవిలసేలా కొందరు రోదిస్తోంటే, తోడును, ఉన్నగూడును కోల్పోయి మరికొంతమంది బిక్కుబిక్కుమంటున్నారు. దీనికి సంబంధించిన విషాద కథనాలు, ఫోటోలు మనల్ని కలచివేస్తున్నాయి. ఇంతటి విషాదంలోనూ మనసుకు స్వాంతన కలిగించే కథనాలు కూడా కనిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఒక సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వయనాడ్‌లో విషాదంలో మనుషులతో పాటు అనేక మూగజీవాలు అతలాకుతలమైపోయాయి. పెంపుడు జంతువులు తమ వాళ్లు ఎక్కడ, ఎలా ఉన్నారో, ఎటు పోవాలో తెలియక అల్లాడిపోయాయి. అలా తమ యజమాని కోసం విశ్వాసానికి మారుపేరైన ఒక కుక్క ఆశగా ఎదురు చూసింది. కళ్లు కాయలు కాచేలా ఆరు రోజులపాటు వెదికింది. ఇక కనిపించవా అమ్మా అన్నట్టు కంట నీరు పెట్టుకుంది. చివరికి దాని ఎదురు చూపు ఫలించింది. ఆనందమైన ఆ క్షణాలు రానేవచ్చాయి. అంతే.. ఆనందంతో ఎగిరి గంతేసింది. యజమానిని చూసిన ఆనందంతో ప్రేమతో తోక ఊపుకుంటూ, ఆమెను చుట్టేసుకుంది. కళ్లు చెమర్చే ఈ దృశ్యాలు నెట్టింట్ వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment