online access
-
ఇంట్లోనే కూర్చొని స్మార్ట్‌ఫోన్‌తో డబ్బు సంపాదించడం ఎలా?
ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎలా? ఈరోజుల్లో రెండు చేతులా సంపాదించడం అనివార్యం అయిపోయింది. దీంతో ఆన్లైన్లో ఎక్స్ట్రా ఎన్‌కమ్ కోసం ఏవేవో వెబ్సైట్లను ఆశ్రయించి మోసపోతుంటారు. కానీ కాస్త తెలివిగా ఆలోచించి జెన్యూన్ వెబ్‌సైట్స్, యాప్స్‌ను సంప్రదిస్తే నెలకు ఈజీగా రూ.20-30వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ ఫోన్‌తో రెండు చేతూలా డబ్బులు సంపాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రీలాన్సింగ్: మీలో స్కిల్ ఉంటే చాలు అనేక వెబ్‌సైట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో Upwork, Fiverr, Freelancer.com వంటి పలు ప్లాట్‌ఫామ్స్ జెన్యూన్ అని చెప్పొచ్చు. ఈ వెబ్‌సైట్స్ క్లయింట్‌కి, యూజర్‌కి మధ్య మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఒక్కసారి ప్రాజెక్ట్ డీల్ కుదిరాక ఆ వెబ్‌సైట్స్ కొంత వాటాను తీసుకుంటాయి. అయితే ఫ్రీలాన్స్ వర్క్ ద్వారా ఒకే రోజులో ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు. Affliate marketing (అఫిలియేట్ మార్కెటింగ్ ) అఫిలియేట్ మార్కెటింగ్ ఈమధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఉదాహరణకు మొబైల్, టీవీ లాంటి ఏదైనా వస్తువులపై రివ్యూ చెప్తూ అది సూపర్ ప్రొడక్ట్ అని భ్రమ కల్పిస్తారు. అలా ప్రమోట్ చేసి ఆ వస్తువులను అమ్మడం , అలా అమ్మినందుకు మీకు కొంత కమిషన్ ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది . ఆన్లైన్ సర్వే: ఆన్లైన్ సర్వే కోసం మార్కెట్లో చాలా వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫ్రీగా ఉంటే మరికొన్ని యూజర్లకు డబ్బులు ఇస్తాయి. వెబ్‌సైట్‌పై సర్వే చేయడం ద్వారా డబ్బు సపాందించవచ్చు. బ్లాగింగ్: ఏదైనా ప్రత్యేకమైన సబ్జెక్ట్‌పై మీకు స్కిల్ ఉంటే దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు వంటలు బాగా వచ్చిన వాళ్లు, ప్రత్యేక కుకింగ్ బ్లాగ్ వ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదివచ్చు. గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ప్రకటనలు, అనుబంధ మార్కెటింగ్, ప్రొడక్ట్ రివ్యూలు వంటి బ్లాగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఆన్లైన్ ట్యూటరింగ్: ఆన్లైన్ ట్యూటరింగ్ ద్వారా ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. Chegg India, Vedantu వంటి ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో క్లాసులు చెప్పి డబ్బులు సంపాదించొచ్చు. పాడ్‌కాస్టింగ్: ఈమధ్య కాలంలో డబ్బు సంపాదించడానికి ట్రెండ్ అవుతున్న మరో మార్గం పాడ్‌కాస్టింగ్. ప్రత్యేకమైన గొంతు ఉంటే చాలు పాడ్కాస్ట్ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎంచుకొని డిజిటల్ ఆడియో రూపంలో పాడ్‌కాస్టింగ్ చేయొచ్చు. యూట్యూబ్ మనలో చాలామంది టైంపాస్ కోసమో, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసమో గంటలకొద్దీ యూట్యూబ్ చూస్తుంటాం. కానీ యూట్యూబ్ వల్లే ఈమధ్య కాలంలో పలువురు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎంచుకొని వీడియోలు చేసి వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడమే. యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. అలా యాడ్స్, వీడియో రన్‌టైం, వ్యూస్‌ని బట్టి మీకు గట్టిగానే ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఇండియాలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆన్లైన్ రైటింగ్: మీలో స్క్రిప్ట్ రాసే నేపుణ్యం ఉంటే ఈ అవకాశం మీకోసమే. ఆన్లైన్లో ఈమధ్యకాలంలో చాలా వెబ్‌సైట్స్ పార్ట్‌టైమ్ జాబ్ చేసేవాళ్ల కోసం వెతుకుతుంది. రైటింగ్ టాలెంట్‌తో బ్లాగ్స్, వెబ్‌సైట్స్‌కి కంటెంట్ రాయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆన్లైన్ ట్రాన్స్లేషన్: తెలుగు, హిందీ, ఇంగ్లీష్..ఇలా పలు భాషలపై మీకు పట్టుంటే చాలు ఈజీగా ట్రాన్స్‌లేట్ చేసి డబ్బులు సంపాదిచుకోవచ్చు. వెబ్‌సైట్స్, డాక్యుమెంట్స్, బ్లాగ్స్లో కంటెంట్‌ను అనువాదం చేయడం వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆన్లైన్ డేటా ఎంట్రీ: ఆన్లైన్లో ఎక్కువ మొత్తంలో ఈ తరహా జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. డేటా ఎంట్రీకి పెద్దగా ఎక్సీపీరియన్స్ అవరసం లేదు. -
సోషల్ మీడియాపై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: మార్కెట్ మోసాలను అరికట్టే దిశగా సోషల్ మీడియా, ఇతరత్రా ఆన్లైన్ ప్లాట్‌ఫాంలపై నిఘా పెంచడంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ‘వెబ్ ఇంటెలిజెన్స్ టూల్‘ను ఏర్పాటు చేసేందుకు నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. ఆమ్ట్రాక్ టెక్నాలజీస్, ఈఎస్ఎఫ్ ల్యాబ్స్, పెలోరస్ టెక్నాలజీస్, ల్యాబ్ సిస్టమ్స్ వీటిలో ఉన్నట్లు సెబీ తెలిపింది. ఇంటర్నెట్లో విస్తృతంగా ఉండే సమాచారం ఆధారంగా వివిధ సంస్థలు, వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాలను విశ్లేషించడం, ఎప్పటికప్పుడు రిపోర్టులు రూపొందించడం మొదలైన విధులు ఈ టూల్ నిర్వహించాల్సి ఉంటుంది. కొన్నాళ్లుగా ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగిపోయి, బోలెడంత సమాచారం అందుబాటులో ఉంటోంది. వివిధ సంస్థలు, వ్యక్తులు, గ్రూప్‌లు, అంశాలపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు ఈ డేటా ఉపయోగపడగలదని సెబీ భావిస్తోంది. విచారణ ప్రక్రియ సులభతరం కాగలదని, సమయం కూడా ఆదా అవుతుందనే ఉద్దేశంతో కొత్త వెబ్ ఇంటెలిజెన్స్ టూల్‌ని ఉపయోగించాలని నిర్ణయించింది. -
వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం జాబ్రా..లెనొవొ జట్టు!
హైదరాబాద్: వేగవంతమైన వీడియో కాన్ఫరెన్సింగ్ సొల్యూషన్ అందించే దిశగా జాబ్రా, లెనొవొ జట్టు కట్టాయి. ఇందులో జాబ్రా రూపొందించిన 180 డిగ్రీల కోణంలోని పనోరమిక్ 4కే ప్లగ్ అండ్ ప్లే వీడియో సొల్యూషన్ పానాక్యాస్ట్50, లెనొవొకి చెందిన థింక్స్మార్ట్హబ్ భాగంగా ఉంటాయి. 10 అంగుళాల థింక్స్మార్ట్ హబ్‌లో మైక్రోసాఫ్ట్ టీమ్స్ అప్లికేషన్ ప్రీ–లోడెడ్‌గా ఉంటుంది. సమావేశాల నిర్వహణను సులభతరం చేసేందుకు ఈ సొల్యూషన్ తోడ్పడగలదని ఇరు సంస్థలు తెలిపాయి. -
ఆన్లైన్ అధ్యయనం.. తిప్పలు తప్పట్లేదు
మూసాపేట: బ్లాక్ బోర్డ్, చాక్‌పీస్, డస్టర్ అంటూ తరగతి గదుల్లో తోటి విద్యార్థుల మధ్య సరదాగా చదువుకోవాల్సిన విద్యార్థులకు ఆండ్రాయిడ్ మొబైల్, ప్లే స్టోర్, ఇంటర్నెట్ వంటి కొత్త యాప్‌లతో కుస్తీ పడుతూ చదువుకోవాల్సి వస్తోంది. కరోనా మహమ్మారితో అన్ని రంగాలు కుదేలవటమే కాక విద్యార్థులు సైతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులుగా ప్రకటించి పై తరగతులకు అనుమతించారు. ఈ సంవత్సరం కూడా కరోనా వ్యాప్తితో ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు పేద కుటుంబానికి చెందిన వారే కావటంతో వారి వద్ద ఆండ్రాయిడ్ మొబైల్ లేకపోవటం, టీవీలు కొంత మందికి లేకపోవటం, మరి కొందరు కేబుల్ బిల్లు చెల్లించక పోవటంతో ప్రతి రోజు తరగతులను వినేందుకు అవకాశం లేకుండా పోయింది. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు ఎదురుగా ఉండి పాఠాలు బోధిస్తేనే అంతంత మాత్రంగా అర్థం చేసుకునే ఈ చదువులు ఆన్లైన్లో టీవీల ముందు, సెల్ఫోన్లో వింటే వారికి అర్థం కావటం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ►మూసాపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 435 మంది విద్యార్థులు ఉండగా 10వ తరగతిలో 75 మంది ఉన్నారు. ► ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పేద కుటుంబాల వారు కావటంతో మొబైల్ లేకపోవటం, టీవీల అందరి వద్ద లేకపోవటంతో పాఠాలకు దూరమవుతున్నారు. ► తరగతి గదుల్లో ఉండి చదివే చదువులకు ఆన్లైన్లో చదివే చదువులకు వ్యత్యాసం ఉండటమే కాకుండా విద్యార్థులకు అర్థం కాక సతమతమవుతున్నారు. ► ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు విద్యార్థులను పరీక్షిస్తూ మొబైల్లో టిశాట్ యాప్ ద్వారా, టీవీలో డీడీ యాదగిరి చానల్లో పాఠాలు వినాలని అందుకు సంబంధించిన టైం టేబుల్‌ను కూడా విద్యార్థులకు అందిస్తున్నారు. ► ఇదే విధంగా ఆన్లైన్లో చదివి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరైతే మాత్రం ఉత్తీర్ణత శాతం పడిపోయే అవకాశం ఉంది. అంతే కాక ఉన్నత చదువులకు వెళ్లటానికి అక్కడి పాఠాలు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ► అయితే ఆన్లైన్ పాఠాలు వింటూ తమ ఇంటి సమీపంలో ఉన్నత చదువులు చదివిన వారి వద్ద సందేహాలను నివృత్తి చేసుకుని కష్టపడి చదివితేనే ఉత్తీర్ణత సాధించుకోవచ్చు. ► అలా కాకుండా గతంలో మాదిరి ఇంట్లో వింటూ వదిలేసి ఉంటే మాత్రం అర్థం కాకపోవటమే కాక పరీక్షల సమయంలో ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉంటుందని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ► మొబైల్ విద్యార్థుల చేతుల్లో ఉండటంతో ఇంటర్నెట్లో కొత్త కొత్త గేమ్‌లు, సినిమాలు, వీడియోలకు అలవాటు పడుతున్నారు. చదువు సంగతి పక్కన పెడితే మొబైల్‌కు అలవాటు పడి ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ► అదే విధంగా కళ్లకు సంబంధించి జబ్బులు ప్రబలుతుండటం, మరి కొంతమంది విద్యార్థులు ఆన్లైన్ పాఠాల పేర్లతో మొబైల్లో గేమ్స్, సినిమాలు చూస్తున్నారని వారి భవిష్యత్ గురించి భయంగా ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
పాఠాలు వినాలంటే.. 6 కిలోమీటర్లు నడవాల్సిందే
కొచ్చి: ఆ గ్రామంలోని విద్యార్థులంతా చదువుల కోసం ఆరు కిలోమీటర్లు వెళ్తున్నారు. గతంలో ఇలాంటి జరిగేవి గానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఇటువంటి పరిస్ధితులు లేవని అనుకుంటే మాత్రం మన పొరపాటు అవుతుంది. కేరళలోని రాజమాలకు చెందిన విద్యార్థులు పాఠం వినడానికి ప్రతిరోజు ఇలా పాట్లుపడుతున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో ఆన్లైన్లోనే పాఠాలు వినాల్సి వస్తోంది. తమ ఊరిలో నెటవర్క్ సరిగా లేని సమస్యతో అక్కడి విద్యార్థుల పరిస్థితి ఇది. కేరళలలోని ఇడుక్కి జిల్లాలో రాజమాల అనే గ్రామంలో.. సరైన ఇంటర్నెట్ సౌకర్యం లేదు. ఒక వేళ వచ్చిన లోస్పీడ్ ఉంటుంది. అయితే నెట్ స్పీడ్‌గా బాగుంటే గానీ ఆన్లైన్లో క్లాసులు వినలేమని తెలిసిందే. ఈ కారణంగా ఆ ఊరికి చెందిన పన్నెండో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు వినడం కోసం ఊరికి దూరంగా ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరవికుళం నేషనల్ పార్కు చేరుకుంటున్నారు. ఎందుకంటే అక్కడి ఎత్తయిన ప్రదేశాల్లో సిగ్నల్ పుల్గా ఉంటుండంతో అక్కడే ఆన్లైన్ క్లాసులు విని వస్తున్నారు. తాము ప్రతిరోజు ఉదయం నేషనల్ పార్కుకు ఆటోలో వస్తున్నామని, తిరిగి సాయంత్రం నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నామని ఓ విద్యార్థి చెప్పాడు.రాజమాలలో ఇంటర్నెట్ వసతి లేదు. కొన్ని ప్రదేశాల్లో వచ్చినా.. అది చాలా తక్కువ స్పీడ్‌తో వస్తున్నది. దీంతో ఇంటర్నెట్ కోసం ప్రతిరోజు ఆరు కిలోమీటర్ల దూరం వెళ్లడం తమకు చాలా కష్టంగా ఉంది. కొన్నిసార్లు వానలు పడుతున్నాయి. దీనివల్ల తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఓ విద్యార్థి చెప్పాడు. Kerala: To attend online classes, students living in Idukki's Rajamala travel nearly 6-km daily to reach a location with internet connectivity in Eravikulam National Park. "In the morning, we reach here by auto & in evening, we walk back home," a Class 12 student said yesterday pic.twitter.com/xHVjz1srwu — ANI (@ANI) June 1, 2021 చదవండి: హైదరాబాద్‌లో కొవిడ్ వ్యాక్సిన్ల డ్రోన్ డెలివరీ ! -
ఆన్లైన్లో సివిల్స్ శిక్షణ
కరీంనగర్: సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తెలంగాణలో ఎనలేని క్రేజ్. ఏటా వేల మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసులే లక్ష్యంగా.. సివిల్స్ పరీక్షలకు సన్నద్ధం అవుతుంటారు. యూపీఎస్సీ వందల సంఖ్యలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే.. దేశవ్యాప్తంగా ఆరు లక్షల మందికిపై దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ.. ఇలా మూడంచెల సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. విజయం సాధించాలంటే.. కనీసం ఏడాదిన్నరపాటు నిపుణుల సలహాలతో అంకితభావంతో ప్రిపరేషన్ సాగించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా విద్యార్థులు వ్యక్తిగతంగా క్లాసులకు రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అభ్యర్థులు వీలున్న సమయంలో నిపుణులు రూపొందించిన వీడియో క్లాసులు వింటూ.. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యేలా.. క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ అందిస్తోంది. ఇందుకు సాక్షి మీడియా గ్రూప్.. మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఠీఠీఠీ. జుpజ్చీట. ఛిౌఝలో లాగిన్ అయి రిజిస్టర్ చేసుకోవచ్చు. కోర్సు కాల వ్యవధి ఏడాదిన్నర.‡ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.25,000. ప్లే స్టోర్ నుంచి క్రిష్ణప్రదీప్ 21 సెంచరీ ఐఏఎస్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా వీడియో క్లాసులు వినొచ్చు. ఈ వీడియోలను ఎప్పుడైనా, ఎక్కడైనా మొబైల్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్‌లో స్టడీ మెటీరియల్, అసైన్మెంట్స్, మల్టీపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ టెస్టులు ఉంటాయి. టెస్ట్ సబ్మిట్ చేయగానే ఫలితం వస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 9133637733, 9505514424, 9666013544 పని దినాల్లో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సంప్రదించొచ్చు. -
అరచేతిలో ‘e’ జ్ఞానం
సాక్షి, బాపట్ల(గుంటూరు) : శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. ఎక్కడో జరిగిన విషయాలను క్షణాల్లో మన ముందుంచడంతో పాటు, సక్రమంగా ఉపయోగించుకుంటే, చిన్న పిల్లల బొమ్మల దగ్గర నుంచి శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన సమాచారం లభిస్తోంది. ఈ కోవలోనే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు డిజిటల్ రూపంలో వివిధ వెబ్సైట్లలో లభిస్తున్నాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లి డబ్బు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేయలేని విద్యార్థులకు ఉచితంగా ఆయా పుస్తకాలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అందుబాటులో ఉండటంతో ‘ఈ’ జ్ఞానం ఎంతో ఉపయోగకరంగా మారింది. గ్రంథాలయ శాఖ పుస్తకాలను డిజిటల్ రూపంలో ఉంచింది. ఇందులో నుంచి చాలా రకాలైన పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా పుస్తకాలు అందుబాటులో.. మన దేశంలో 18 శతాబ్దంలో కోల్‌కతాలో పౌర గ్రంథాలయం, ఇంపీరియర్ గ్రంథాలయాలు ఉన్నాయి. 1953లో ఇంపీరియర్ గ్రంథాలయాన్ని భారత ప్రభుత్వం జాతీయ గ్రంథాలయంగా ప్రకటించింది. ఇక్కడ విలువైన వేలాది పుస్తకాలను భద్రపరిచారు. ఆ గ్రంథాలయంలోని పుస్తకాలను 2002లో ఇంటర్నెట్కు అనుసంధానించారు. ఇంటర్నెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (బెంగళూరు) వారి సహకారంతో డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అందులో విలువైన పుస్తకాలను డిజిటల్ రూపంలో చదువుకునేందుకు వీలుగా ఉంచింది. తిరిగి ఇచ్చేయవచ్చు ఇంటర్నెట్లో అనేక రకాలైన పుస్తకాలు లభ్యమవుతున్నా కాఫీరైట్ ఉన్న పుస్తకాలు లభించే అవకాశం లేదు. అలాంటి వాటిని కొనుగోలు చేయడం లేదా, అద్దెకు తీసుకునే అవకాశం కల్పించారు. రెంట్ మై టెక్ట్స్, కాఫీ కితాబ్ టెక్టŠస్ బుక్స్ వంటి వెబ్సైట్ల ద్వారా 30 నుంచి 70 శాతం వరకు పుస్తకాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త పుస్తకాలు చదవాలంటే వాటిని కొనుగోలు చేసి చదివిన తర్వాత తిరిగి ఇచ్చేస్తే, కొనుగోలు చేసిన ధరలో మనకు 70 శాతం నగదు మళ్లీ ఇచ్చేస్తారు. ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులకు ఉపయోగం ఇంజినీరింగ్, ఐటీ, మెడికల్ కోర్సులు చాలా ఖరీదైనవి. వాటికి సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.500 నుంచి రూ.1000 పైనే ధర ఉంటుంది. ఆ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉం టుంది. ఆయుర్వేదం, యునానీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పుస్తకాల ధర అధికంగా ఉన్నా, కొనుగోలు చేయాలన్నా మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పైకోర్సులకు సంబంధించి పుస్తకాలను ఈ గ్రంథాలయాల్లో ఉచితంగా చదువుకోవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్ కోర్సుల పుస్తకాలు లభ్యం ఐఏఎస్, ఐపీఎస్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు సైతం ఉచితంగా ఈ గ్రంథాలయంలో దొరుకుతాయి. విజ్ఞానానికి పనికివచ్చే ప్రముఖుల జీవిత చరిత్రల పుస్తకాలు, చరిత్రాత్మక, విజ్ఞాన సంబంధం, వినోద సంబంధ పుస్తకాలు చదువుకోవచ్చు. పుస్తకాలు డౌన్‌లోడ్‌కు ఉపయోగించే వెబ్సైట్లు ► www.nationallibrary.com ► www.bookbum.com ► www.medicalstudent.com ► www.onlinelibrary.com ► www.rentmytext.com ► www.compitative.com -
అటకెక్కిన ‘ఆన్లైన్’!
వికారాబాద్, న్యూస్‌లైన్: పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆన్లైన్ సేవలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. పంచాయతీలకు విడుదలవుతున్న నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా అన్నిం టినీ కంప్యూటరీకరించి ఉంచాలన్నది కేంద్ర ప్రభుత్వం సూచన. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తేనే 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని స్పష్టంచేసినా అధికారుల్లో మాత్రం చలనం కన్పించడం లేదు. ఆన్లైన్ విధానంపై పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. జిల్లాలో 705 పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి మాస్టర్ ఎంట్రీలు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓచర్ల సంఖ్య తదితర వాటి వివరాలను 2013మార్చి నెలాఖరు వరకు పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ సాఫ్ట్వేర్ (ప్రియా సాప్ట్) ద్వారా ఆన్లైన్లో ఉంచితే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సూచించింది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇలా.. కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి రూ.కోట్లాది నిధులు కుమ్మరిస్తున్నా ఆశించిన ప్రగతి కన్పించడం లేదు. నిధులు పక్కదారి పడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు సైతం చెల్లించలేని పరిస్థితులున్నాయి. ఇప్పటికే 13వ ఆర్థిక సంఘం నిధులు ఒక విడత విడుదలయ్యాయి. మిగిలిన నిధుల విడుదలకు పంచాయతీల పద్దుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, కావాల్సిన నిధులు తదితర వాటిని ఆన్లైన్లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కాగా, వీటిని ఆన్లైన్లో పెట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు కుస్తీ పడుతున్నారు. అయితే కంప్యూటర్ల కొరత, విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంటీముట్టనట్టు వ్యవహరిస్తోంది. ఈ వివరాలు నమోదు చేయని పంచాయతీలకు నిధులు నిలిచిపోయి అభివృద్ధికి విఘాతం కలిగే అవకాశం ఉంది. తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే ఆ శాఖ అధికారులు కనెక్షన్లు తొలగిస్తే నీటి సరఫరా నిలిచిపోతుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో ప్రజలు నీటికి కటకట ఎదుర్కొంటున్నారు. కారణాలు అనేకం.. పంచాయతీల ఆదాయ, వ్యయాలు, నిధులు విడుదల, వినియోగం తదితర వాటిని ఆన్లైన్లో పెట్టేందుకు పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. దీంతో వారికి అవగాహన లేక వివరాల నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 705 గ్రామ పంచాయతీలుండగా కేవలం 35 పంచాయతీల్లో మాత్రమే కంప్యూటర్లున్నాయి. దీంతో మిగతా గ్రామాల వారు వివరాలు నమోదు చేసేందుకు ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ స్నేహితుల దగ్గర అదే విధంగా సమీప బంధువుల ఇళ్లకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. అవగాహన రాహిత్యంతో పలువురు కార్యదర్శులు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లను పూర్తిస్థాయిలో ఆన్లై న్లో పొందుపరచకుండా మమ అంటున్నారు. దీంతో పూర్తి వివరాలు ఆన్లైన్లో లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ సేవల కోసం మరి కొంత కాలం ఆగాల్సిందేనని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇప్పటివరకు నమోదైనవి.. జిల్లాలోని 705 పంచాయతీల్లో 189 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఆన్లైన్లో వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. మిగతా పంచాయతీల్లో ఇంకా ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసి ఆరు నెలలు దాటుతున్నా ఇంకా ఆన్ లైన్ పనులు పూర్తి కాకపోవడంతో 516 గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు అందేది అనుమానమే. -
పోలీసుశాఖలో ఆధునిక పరిజ్ఞానం
ఏటీఅగ్రహారం(గుంటూరు), న్యూస్‌లైన్ :సిబ్బందిలో ఆధునిక పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు పోలీస్‌శాఖ శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా విడతల వారీగా ప్రత్యేక కంప్యూటర్ శిక్షణ ప్రారంభించింది. ఈ పరిజ్ఞానం ద్వారా శాఖను పటిష్ట పర్చడంతోపాటు నేరస్తుల ఆటకట్టించే అవకాశం ఉంటుంది. ఫిర్యాదులను స్థానిక అధికారులే కాకుండా ఉన్నతాధికారులు కూడా క్షణాల్లో తెలుసుకునేలా పోలీస్స్టేషన్లను కంప్యూటరీకరించి ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఇందుకుగాను ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు నాలుగు కంప్యూటర్లను కేటాయిస్తారు. ఒక్కసారి క్లిక్ చేస్తే... గతంలో నేరస్తుల వివరాలను అధికారులు తెలుసుకోవాలనుకుంటే జిల్లా పోలీస్ కార్యాలయంలోని డిస్ట్రిక్క్రైమ్ రికార్డ్సు బ్యూరో (డీసీఆర్బీ) లో వుండే రికార్డులను పరిశీలించేవారు. రికార్డుల్లో వుండే అరకొర సమాచారం ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టేవారు. ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకు రావడంతో కేసుల నమోదు వివరాలు, నేరస్తుల వివరాలను నివేదికలను కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. కొత్తగా ‘క్రిమినల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్’ అనే అప్లికేషన్‌ను కూడ నేరస్తుల వివరాలతో జతచేశారు. అప్లికేషన్లో నేరస్థుడి పేరు, చిరునామా, వేలిముద్రలు, గతంలో నేరాలకు పాల్పడిన వివరాలన్నింటినీ నమోదు చేస్తారు. సాధారణ వ్యక్తులకు పోలీస్ సాఫ్ట్వేర్ సమాచారం తెలియకుండా ప్రత్యేక పాస్వార్డ్ ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు, సంబంధిత విభాగం పర్యవేక్షించే అధికారులు దేశంలోని ఏమూల నుంచైనా ఒక్క క్లిక్ చేస్తే నేరస్తుల పూర్తి సమాచారం క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు కలిగింది. అందుబాటులో సీసీటీఎన్ఎస్ నేరస్తుల కదలికల నిఘా కొనసాగించేందుకు వారి కదలికలను తెలుసుకునేందుకు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్(సీసీటీఎన్ఎస్) అనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కరుడుకట్టిన నేరస్తులైనా నిఘా నుంచి తప్పుకోలేని విధంగా నూతన విధానాన్ని రూపొందించారు. దీనిపై కూడా సిబ్బందికి రెండు రోజులు పాటు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ-కాప్స్గా .. గతంలో పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేస్తే పోలీసులు చేతితోరాసి కేసు నమోదు చేస్తుండేవారు. వాటికి మరో మూడు ఫోటోస్టాట్లను తయారు చేసి డీఎస్పీ, సీఐ, న్యాయస్థానానికి పంపేవారు. అనంతరం టైప్మిషన్లపై సీడీ ఫైల్‌ను తయారు చేయించే క్రమంలో కొన్ని పొరపాట్లు దొర్లుతుండేవి. ఎఫ్ఐఆర్లో పలు పేర్లను తొలగించటం, వచ్చిన ఫిర్యాదులపై రెండు కేసులు నమోదు చేయటం వంటి పొరపాట్లు దొర్లుతుండేవి. వీటికి తోడు ఆయా కేసులకు సంబంధించిన వివరాలను ఉన్నతాధికారులు తెలుసుకోవాలంటే అదే పోలీసుస్టేషన్‌కు వె ళ్లి పరిశీలించాల్సివచ్చేది. పోలీసుస్టేషన్లలో రికార్డు రూములు సక్రమంగా లేకపోవటంతో పలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ క్రమంలో ఆధునిక పరిజ్ఞానం పోలీసుశాఖ అందుబాటులోకి తీసుకురావటంతో ప్రత్యేకంగా ఇంట్రానెట్(ఈ కాప్స్)పేరుతో స్టాఫ్‌వేర్‌ను ప్రతి పోలీసు స్టేషన్‌లోని కంప్యూటర్లకు అనుసంధానం చేశారు. దీంతో నేరస్తులను పట్టుకోవటంతోపాటు పరిపాలనా పరమైన అంశాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ కాప్స్‌ను ఆధునికీకరించి వేగవ తమైన సేవల కోసం విండోస్ ఎక్స్పీ స్థానంలో నూతనంగా యుబుంటును అందుబాటులోకి తెచ్చారు. ఈవిధానం అమలులోకి రావటంతో మరింత వేగవంతంగా అధికారులు సమాచారం తెలుసుకోగలుగుతున్నారు. శిక్షణ కీలకం: ఎస్పీ జిల్లాలో మొత్తం ఐదు వేల మందికిపైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ తెలిపారు. కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు ఈ కాప్స్, సీసీటీఎన్ఎస్ తదితర ఆధునిక పరిజ్ఞానంపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని, ఇది సిబ్బంది విధి నిర్వహణలో కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉండే నేరస్తులను గుర్తించి ఆదుపులోకి తీసుకొవచ్చాన్నారు. సైబర్ నేరాలను పరిష్కారించటంలో ఆధునిక పరిజ్ఞానం అవసరమని గుర్తించి బ్యాచ్‌లు వారీగా శిక్షణ కొనసాగిస్తున్నామని ఎస్పీ వివరించారు.