ఇంట్లోనే కూర్చొని స్మార్ట్‌ఫోన్‌తో డబ్బు సంపాదించడం ఎలా? | Ways To Earn Money Online Through Popular Websites | Sakshi
Sakshi News home page

Earn Money Online : ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించుకోవచ్చు, ఈ వెబ్‌సైట్స్‌ ఫాలో అవ్వండి

Published Wed, Nov 1 2023 4:24 PM | Last Updated on Wed, Nov 1 2023 6:21 PM

Ways To Earn Money Online Through Popular Websites - Sakshi

ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడం ఎలా? ఈరోజుల్లో రెండు చేతులా సంపాదించడం అనివార్యం అయిపోయింది. దీంతో ఆన్‌లైన్‌లో ఎక్స్‌ట్రా ఎన్‌కమ్‌ కోసం ఏవేవో వెబ్‌సైట్లను ఆశ్రయించి మోసపోతుంటారు. కానీ కాస్త తెలివిగా ఆలోచించి జెన్యూన్‌ వెబ్‌సైట్స్‌, యాప్స్‌ను సంప్రదిస్తే నెలకు ఈజీగా రూ.20-30వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని మొబైల్‌ ఫోన్‌తో రెండు చేతూలా డబ్బులు సంపాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. 

ఫ్రీలాన్సింగ్‌:
మీలో స్కిల్‌ ఉంటే చాలు అనేక వెబ్‌సైట్స్‌ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో Upwork, Fiverr, Freelancer.com వంటి పలు ప్లాట్‌ఫామ్స్‌ జెన్యూన్‌ అని చెప్పొచ్చు. ఈ వెబ్‌సైట్స్‌ క్లయింట్‌కి, యూజర్‌కి మధ్య మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఒక్కసారి ప్రాజెక్ట్‌ డీల్‌ కుదిరాక ఆ వెబ్‌సైట్స్‌ కొంత వాటాను తీసుకుంటాయి. అయితే ఫ్రీలాన్స్‌ వర్క్‌ ద్వారా ఒకే రోజులో ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు.

Affliate marketing (అఫిలియేట్ మార్కెటింగ్ )
అఫిలియేట్‌ మార్కెటింగ్‌ ఈమధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఉదాహరణకు మొబైల్‌, టీవీ లాంటి ఏదైనా వస్తువులపై రివ్యూ చెప్తూ అది సూపర్‌ ప్రొడక్ట్‌ అని భ్రమ కల్పిస్తారు. అలా ప్రమోట్ చేసి  ఆ వస్తువులను అమ్మడం , అలా అమ్మినందుకు మీకు కొంత కమిషన్ ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది .

ఆన్‌లైన్‌ సర్వే:
ఆన్‌లైన్ సర్వే కోసం మార్కెట్‌లో చాలా వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫ్రీగా ఉంటే మరికొన్ని యూజర్లకు డబ్బులు ఇస్తాయి. వెబ్‌సైట్‌పై సర్వే చేయడం ద్వారా డబ్బు సపాందించవచ్చు.

బ్లాగింగ్‌:
ఏదైనా ప్రత్యేకమైన సబ్జెక్ట్‌పై మీకు స్కిల్‌ ఉంటే దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు వంటలు బాగా వచ్చిన వాళ్లు, ప్రత్యేక కుకింగ్‌ బ్లాగ్‌ వ్లాగ్‌ ద్వారా డబ్బులు సంపాదివచ్చు. గూగుల్‌ యాడ్‌సెన్స్‌ ద్వారా ప్రకటనలు, అనుబంధ మార్కెటింగ్‌, ప్రొడక్ట్‌ రివ్యూలు వంటి బ్లాగ్‌ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. 

ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌:
ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ ద్వారా ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించుకోవచ్చు. Chegg India, Vedantu వంటి ఫ్లాట్‌ఫామ్స్‌ ద్వారా ఇంట్లోనే కూర్చొని ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పి డబ్బులు సంపాదించొచ్చు. 

పాడ్‌కాస్టింగ్‌:
ఈమధ్య కాలంలో డబ్బు సంపాదించడానికి ట్రెండ్‌ అవుతున్న మరో మార్గం పాడ్‌కాస్టింగ్‌.  ప్రత్యేకమైన గొంతు ఉంటే చాలు పాడ్‌కాస్ట్‌ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఏదైనా ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌ ఎంచుకొని డిజిటల్‌ ఆడియో రూపంలో పాడ్‌కాస్టింగ్‌ చేయొచ్చు. 

యూట్యూబ్‌
మనలో చాలామంది టైంపాస్‌ కోసమో, ఏదైనా ఇన్ఫర్మేషన్‌ కోసమో గంటలకొద్దీ యూట్యూబ్‌ చూస్తుంటాం. కానీ యూట్యూబ్‌ వల్లే ఈమధ్య కాలంలో పలువురు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదించడానికి ఇదొక బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పొచ్చు. ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌ ఎంచుకొని వీడియోలు చేసి వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడమే. యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా మధ్య మధ్యలో యాడ్స్‌ వస్తుంటాయి. అలా యాడ్స్‌, వీడియో రన్‌టైం, వ్యూస్‌ని బట్టి మీకు గట్టిగానే ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఇండియాలో యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్స్‌ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. 

ఆన్‌లైన్‌ రైటింగ్:
మీలో స్క్రిప్ట్‌ రాసే నేపుణ్యం ఉంటే ఈ అవకాశం మీకోసమే. ఆన్‌లైన్‌లో ఈమధ్యకాలంలో చాలా వెబ్‌సైట్స్‌ పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేసేవాళ్ల కోసం వెతుకుతుంది. రైటింగ్‌ టాలెంట్‌తో బ్లాగ్స్‌, వెబ్‌సైట్స్‌కి కంటెంట్‌ రాయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు.

ఆన్‌లైన్‌ ట్రాన్స్‌లేషన్‌:
తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌..ఇలా పలు భాషలపై మీకు పట్టుంటే చాలు ఈజీగా ట్రాన్స్‌లేట్‌ చేసి డబ్బులు సంపాదిచుకోవచ్చు. వెబ్‌సైట్స్‌, డాక్యుమెంట్స్‌, బ్లాగ్స్‌లో కంటెంట్‌ను అనువాదం చేయడం వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు.

ఆన్‌లైన్‌ డేటా ఎంట్రీ:
ఆన్‌లైన్‌లో ఎక్కువ మొత్తంలో ఈ తరహా జాబ్స్‌ అందుబాటులో ఉన్నాయి. డేటా ఎంట్రీకి పెద్దగా ఎక్సీపీరియన్స్‌ అవరసం లేదు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement