Money Earnings
-
Save Money: పండగ ఆఫర్లు.. ఇవి పాటిస్తే డబ్బు ఆదా!
పండగల నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ షాపింగ్‌ల వద్ద రాయితీలు కనిపిస్తున్నాయి. మరోవైపు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు. దానికితోడు అధికమవుతున్న ద్రవ్యోల్బణమూ ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు, ఇతర నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు వడ్డీ రేట్లు పెంచడంతో రుణాల భారం హెచ్చవుతుంది. ఈ తరుణంలో డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయాలి. రూపాయి ఖర్చు చేసేముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకువాలి. తర్కంతో ఆలోచించి ఖర్చు తగ్గించుకుంటే పరోక్షంగా ఆ డబ్బును సంపాదించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. వృథా ఖర్చులకు కళ్లెం వేయకపోతే.. భవిష్యత్ లక్ష్యాలు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో వ్యయ నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆర్థికనిపుణులు సూచిస్తున్నారు. ఎమోషన్స్.. సమాజంలో లగ్జరీగా జీవిస్తున్నామని ఇతరులకు చెప్పుకోవడానికి చాలామంది అనవసర ఖర్చులు చేస్తారు. ఆర్భాటాలకు ప్రయత్నించి అప్పుల్లో కూరుకుంటారు. అనేక సందర్భాల్లో డబ్బు ఖర్చు చేయడం భావోద్వేగాలకు సంబంధించిన వ్యవహారంగా ఉంటుంది. స్తోమతకు మించి ఖర్చు చేయడం ఎప్పుడూ సరికాదు. కొత్త వస్తువును కొనాలి.. ఖరీదైన భోజనం, దుస్తులు.. ఇలా అతిగా ఖర్చు చేసే ప్రతి చోటా ఒకసారి ఆలోచించాలి. అతిగా ఖర్చు చేయాలనే కోరికను సాధ్యమైనంత మేరకు తగ్గించుకోవాలి. బడ్జెట్.. చేసే ప్రతిఖర్చుకూ లెక్క కచ్చితంగా ఉండాలి. మీ ఆదాయం, వ్యయాలను తెలుసుకునేందుకు బడ్జెట్ ఉపకరిస్తుంది. పండగల వేళ ఎంత ఖర్చు చేయాలన్నదీ బడ్జెట్ వేసుకోండి. బోనస్‌ల లాంటివి అందినా.. అందులో నుంచి ఎంత మొత్తం కొనుగోళ్లకు కేటాయించాలి అన్నది ముందే నిర్ణయించుకోవాలి. వచ్చిన బోనస్‌లో సగంకంటే ఎక్కువ పెట్టుబడికి మళ్లించాలి. నెలకు వచ్చిన ఆదాయంలోనూ 20-30 శాతం ముందుగా పొదుపు చేశాకే ఖర్చు చేయాలనే నిబంధన విధిగా పాటించాలి. 40 శాతానికి మించి నెలవారీ వాయిదాలు లేకుండా జాగ్రత్తపడాలి. ఖర్చుల కోసం ప్రత్యేక ఖాతాను కేటాయించాలి. క్రెడిట్ కార్డులు పండగల వేళ ఏదైనా వస్తువులు కొనేందుకు క్రెడిట్ కార్డులపై రాయితీలు ప్రకటిస్తారు. కంపెనీలు ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు పెంచుకుని లాభాలు సాధించేందుకు ఇదొక విధానం. నిజంగా ఆ వస్తువులు అవసర నిమిత్తం తీసుకుంటున్నామా లేదా కేవలం ఆఫర్ ఉంది కాబట్టి కొనుగోలు చేస్తున్నామా అనేది నిర్ణయించుకోవాలి. కార్డులోని లిమిట్ మొత్తం వాడేస్తే తిరిగి చెల్లించడం కష్టం అవుతుంది. అవసరం అనుకున్నప్పుడే పండగల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డును వాడాలి. వస్తువులు తీసుకుని తర్వాత బిల్లు చెల్లించకపోతే సమస్యలు వస్తాయి. అపరాధ రుసుములు, వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఆలస్యంగా చెల్లింపులు చేస్తే సిబిల్ స్కోరూ దెబ్బతింటుంది. క్రెడిట్ కార్డు పరిమితిలో 30-40 శాతానికి మించి వాడకుండా చూసుకోండి. ఇదీ చదవండి: ఆ ఫోన్ నంబర్లు మళ్లీ మూడు నెలలకే యాక్టివేట్ ఖర్చులు అన్నీ అయిపోయాక మిగిలిన డబ్బును పొదుపు చేద్దామని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి భావన ఉన్న కొందరు వ్యక్తులవద్ద నెలాఖరుకు పొదుపు చేయడానికి డబ్బే ఉండదు. అదిపోగా చివరికి రోజువారి ఖర్చుల కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ముందు పొదుపు.. తర్వాతే ఖర్చు. సమయం, సందర్భాన్ని బట్టి చేసే వ్యయాలు కొన్ని ఉంటాయి. వీటిని తప్పించుకోలేం. కానీ, చేతిలో డబ్బు ఉంది కదా అని ఖర్చు చేయడం పొరపాటు. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటిని సాధించే వరకూ డబ్బును కూడబెట్టాలి. అందుకు వీలుగా ఖర్చులు తగ్గించుకోవాలి. ఆర్థిక ప్రణాళిక నిర్ణయించుకోవడం ముఖ్యం. అయితే దాన్ని క్రమశిక్షణతో పాటించడం మరీముఖ్యం. ఖర్చులు, పొదుపు విషయంలో ఆలోచన సరళిమార్చుకుంటే తప్పకుండా ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు. -
ఇంట్లోనే కూర్చొని స్మార్ట్‌ఫోన్‌తో డబ్బు సంపాదించడం ఎలా?
ఆన్లైన్లో డబ్బులు సంపాదించడం ఎలా? ఈరోజుల్లో రెండు చేతులా సంపాదించడం అనివార్యం అయిపోయింది. దీంతో ఆన్లైన్లో ఎక్స్ట్రా ఎన్‌కమ్ కోసం ఏవేవో వెబ్సైట్లను ఆశ్రయించి మోసపోతుంటారు. కానీ కాస్త తెలివిగా ఆలోచించి జెన్యూన్ వెబ్‌సైట్స్, యాప్స్‌ను సంప్రదిస్తే నెలకు ఈజీగా రూ.20-30వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇంట్లోనే కూర్చొని మొబైల్ ఫోన్‌తో రెండు చేతూలా డబ్బులు సంపాదించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రీలాన్సింగ్: మీలో స్కిల్ ఉంటే చాలు అనేక వెబ్‌సైట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిలో Upwork, Fiverr, Freelancer.com వంటి పలు ప్లాట్‌ఫామ్స్ జెన్యూన్ అని చెప్పొచ్చు. ఈ వెబ్‌సైట్స్ క్లయింట్‌కి, యూజర్‌కి మధ్య మధ్యవర్తిగా పనిచేస్తుంది. ఒక్కసారి ప్రాజెక్ట్ డీల్ కుదిరాక ఆ వెబ్‌సైట్స్ కొంత వాటాను తీసుకుంటాయి. అయితే ఫ్రీలాన్స్ వర్క్ ద్వారా ఒకే రోజులో ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు. Affliate marketing (అఫిలియేట్ మార్కెటింగ్ ) అఫిలియేట్ మార్కెటింగ్ ఈమధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. ఉదాహరణకు మొబైల్, టీవీ లాంటి ఏదైనా వస్తువులపై రివ్యూ చెప్తూ అది సూపర్ ప్రొడక్ట్ అని భ్రమ కల్పిస్తారు. అలా ప్రమోట్ చేసి ఆ వస్తువులను అమ్మడం , అలా అమ్మినందుకు మీకు కొంత కమిషన్ ఆ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది . ఆన్లైన్ సర్వే: ఆన్లైన్ సర్వే కోసం మార్కెట్లో చాలా వెబ్‌సైట్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఫ్రీగా ఉంటే మరికొన్ని యూజర్లకు డబ్బులు ఇస్తాయి. వెబ్‌సైట్‌పై సర్వే చేయడం ద్వారా డబ్బు సపాందించవచ్చు. బ్లాగింగ్: ఏదైనా ప్రత్యేకమైన సబ్జెక్ట్‌పై మీకు స్కిల్ ఉంటే దాని ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఉదాహరణకు వంటలు బాగా వచ్చిన వాళ్లు, ప్రత్యేక కుకింగ్ బ్లాగ్ వ్లాగ్ ద్వారా డబ్బులు సంపాదివచ్చు. గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ప్రకటనలు, అనుబంధ మార్కెటింగ్, ప్రొడక్ట్ రివ్యూలు వంటి బ్లాగ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఆన్లైన్ ట్యూటరింగ్: ఆన్లైన్ ట్యూటరింగ్ ద్వారా ఆన్లైన్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. Chegg India, Vedantu వంటి ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో క్లాసులు చెప్పి డబ్బులు సంపాదించొచ్చు. పాడ్‌కాస్టింగ్: ఈమధ్య కాలంలో డబ్బు సంపాదించడానికి ట్రెండ్ అవుతున్న మరో మార్గం పాడ్‌కాస్టింగ్. ప్రత్యేకమైన గొంతు ఉంటే చాలు పాడ్కాస్ట్ల ద్వారా డబ్బు సంపాదించవచ్చు. ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎంచుకొని డిజిటల్ ఆడియో రూపంలో పాడ్‌కాస్టింగ్ చేయొచ్చు. యూట్యూబ్ మనలో చాలామంది టైంపాస్ కోసమో, ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసమో గంటలకొద్దీ యూట్యూబ్ చూస్తుంటాం. కానీ యూట్యూబ్ వల్లే ఈమధ్య కాలంలో పలువురు లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆన్లైన్లో డబ్బు సంపాదించడానికి ఇదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఎంచుకొని వీడియోలు చేసి వాటిని యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడమే. యూట్యూబ్‌లో వీడియో చూస్తుండగా మధ్య మధ్యలో యాడ్స్ వస్తుంటాయి. అలా యాడ్స్, వీడియో రన్‌టైం, వ్యూస్‌ని బట్టి మీకు గట్టిగానే ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఇండియాలో యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఆన్లైన్ రైటింగ్: మీలో స్క్రిప్ట్ రాసే నేపుణ్యం ఉంటే ఈ అవకాశం మీకోసమే. ఆన్లైన్లో ఈమధ్యకాలంలో చాలా వెబ్‌సైట్స్ పార్ట్‌టైమ్ జాబ్ చేసేవాళ్ల కోసం వెతుకుతుంది. రైటింగ్ టాలెంట్‌తో బ్లాగ్స్, వెబ్‌సైట్స్‌కి కంటెంట్ రాయడం ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆన్లైన్ ట్రాన్స్లేషన్: తెలుగు, హిందీ, ఇంగ్లీష్..ఇలా పలు భాషలపై మీకు పట్టుంటే చాలు ఈజీగా ట్రాన్స్‌లేట్ చేసి డబ్బులు సంపాదిచుకోవచ్చు. వెబ్‌సైట్స్, డాక్యుమెంట్స్, బ్లాగ్స్లో కంటెంట్‌ను అనువాదం చేయడం వల్ల డబ్బులు సంపాదించుకోవచ్చు. ఆన్లైన్ డేటా ఎంట్రీ: ఆన్లైన్లో ఎక్కువ మొత్తంలో ఈ తరహా జాబ్స్ అందుబాటులో ఉన్నాయి. డేటా ఎంట్రీకి పెద్దగా ఎక్సీపీరియన్స్ అవరసం లేదు. -
Money Earnings: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..!
డబ్బు సంపాదించాలని ఎవరి ఉండదు.. ఉద్యోగం, వ్యాపారం, కూలీపని, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఆర్జించడం.. ఇలా ఏది చేసినా డబ్బుకోసమే. మన చదువు, మనం చేసే పనినిబట్టి డబ్బు సంపాదన మారుతోంది. అయితే చదువు అయిపోయిన వెంటనే కొందరు ఉద్యోగంలో స్థిరపడుతారు. మరికొందరికి కొన్ని కారణాల వల్ల కొంచెం సమయం పడుతుంది. చదువుకున్న గ్రాడ్యుయేట్లు కేవలం ఉద్యోగం ద్వారానే కాకుండా ఎన్నో మార్గాల వల్ల డబ్బు సంపాదించవచ్చు. మన నైపుణ్యాలు, ఆసక్తులు, కెరీర్ లక్ష్యాల ఆధారంగా గ్రాడ్యుయేట్ల సంపాదన మారవచ్చు. డబ్బు సంపాదించే కొన్ని మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఫుల్‌టైం ఉద్యోగం: ఇది సంప్రదాయ మార్గం. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సంపాదించవచ్చు. అందులోనే స్థిరపడవచ్చు. అయితే కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను పరిశోధించడం ముఖ్యం. స్థిరమైన ఉద్యోగం, ఉద్యోగ భద్రతతో ఎన్నో ప్రయోజనాలు, మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. 2. ఫ్రీలాన్సింగ్: నిర్దిష్ట నైపుణ్యాలు (రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్)ఉంటే ఫ్రీలాన్సర్‌గా సేవలు అందించవచ్చు. అందుకు కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా శిక్షణ ఇస్తున్నాయి. 3. కన్సల్టింగ్: నిర్ణీత రంగంలో నైపుణ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు కన్సల్టెంట్లుగా మారవచ్చు. వీరు వ్యాపారాలు లేదా వ్యక్తులకు సలహాలు, సమస్యలకు పరిష్కారాలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ లేదా ఐటీ వంటి వివిధ రంగాల్లోని కంపెనీలను సంప్రదించవచ్చు. 4. సొంత వ్యాపారం: మంచి వ్యాపార ఆలోచనతో కొంత పెట్టుబడితో డబ్బు సంపాదించవచ్చు. ఇందులో భాగంగా ఏదైనా ఉత్పత్తులు తయారుచేయడం, వాటికి సేవలు అందించడం వంటి విభాగాల్లో వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. 5. టీచింగ్/ ట్యూటర్: సంబంధిత సబ్జెక్టులో పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లు ఇతర విద్యార్థులకు ట్యూటరింగ్ సేవలను అందించవచ్చు. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో వివరాలు నమోదుచేసుకుని ఈ పనిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా పాఠశాల ఉపాధ్యాయులుగా లేదా కళాశాల ప్రొఫెసర్‌గా మారవచ్చు. 6. ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్: ఆన్లైన్ బ్లాగ్, యూట్యూబ్ ఛానెల్ లేదా పోడ్‌క్యాస్ట్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఛానెల్‌కు ఫాలోవర్లు పెరిగిన తర్వాత ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, మార్కెటింగ్ లేదా వస్తువులు విక్రయించడం ద్వారా డబ్బు ఆర్జించవచ్చు. 7. ఆన్లైన్ కోర్సులు: ఆన్లైన్ కోర్సులు అందించే ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోర్సులను సిద్ధం చేసి విక్రయించవచ్చు. అయితే ఈ కోర్సులు మన అధ్యయన రంగానికి, నైపుణ్యాలకు సంబంధించి ఉంటే మరీ మంచిది. 8. పెట్టుబడులు: స్టాక్‌లు, బాండ్లు, రియల్ఎస్టేట్ వంటి మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టాలి. ఆయా విభాగాల్లో ర్యాలీనిబట్టి మనకొచ్చే ఆదాయం పెరుగుతుంది. అయితే ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా స్పష్టమైన అవగాహన ఎంతో అవసరం. 9. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు: చదువుతున్న వారైనా, చదువు పూర్తయిన వారైనా స్థిరమైన ఆదాయ మార్గం వచ్చేంత వరకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయవచ్చు. రిటైల్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఈ ఉద్యోగాల పాత్ర కీలకం. రిమోట్ వర్క్, గిగ్ ఎకానమీ ఉద్యోగాలు, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఈకామర్స్ వంటి ఎన్నో రంగాల్లో పని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. Follow the Sakshi TV channel on WhatsApp -
ట్వీట్లతో ‘X.COM’లో డబ్బు సంపాదించేయండి.. మీకు కావాల్సిన అర్హతలివే!
X's ads revenue programme: ట్విటర్ (x.com) అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించారు. ట్విట్లతో డబ్బులు సంపాదించుకునే వెసలు బాటు కల్పించారు. ఇందుకోసం మస్క్ యాడ్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్‌ను డెవలప్ చేశారు. దీని సాయంతో యూజర్లు ఎక్స్ డాట్ కామ్‌లో చేసే ట్వీట్లపై యూజర్ల ఎంగేజ్మెంట్ ఆధారంగా ఆయా కంపెనీల యాడ్స్ డిస్ప్లే కానున్నాయి. వాటికి అనుగుణంగా యూజర్లు మనీని ఎర్న్ చేయొచ్చు. ఈ ఫీచర్‌పై ఎక్స్.కామ్ యాజమాన్యం స్పందించింది. కంటెంట్ క్రియేటర్లు ఈ ఫీచర్ వినియోగించుకొని సోషల్ మీడియా(x.com) ఫ్లాట్‌ఫామ్‌లో నేరుగా డబ్బులు సంపాదించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం, ఈ ఫీచర్ భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లో సైతం అందుబాటులోకి తెచ్చింది. ఎక్స్.కామ్‌లో యూజర్లు డబ్బులు సంపాదించుకునేందుకు కావాల్సిన అర్హతలు ►ఎక్స్.కామ్‌లో యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ఫీచర్‌ను పొందాలంటే యూజర్లు ముందుగా ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోవాలి. లేదంటే ఎక్స్. కామ్ గుర్తింపు పొందిన సంస్థ ఉండాలి. ►మూడు నెలల లోపల యూజర్లు చేసిన ట్విట్లపై 15 మిలియన్ ఇంప్రెషన్స్ ఉండాలి. ►500 ఫాలోవర్స్ తప్పనిసరి. ►పైన పేర్కొన్న అర్హతలు ఉంటే యూజర్లు ఎక్స్.కామ్ నుంచి డబ్బులు పొందవచ్చు. ఇందుకోసం యూజర్లు వినియోగించే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌లలో స్ట్రైప్ ఆప్షన్ తప్పని సరిగా ఉండాలి. స్ట్రైప్ అనేది ఓ సర్వీస్ మాత్రమే. ఈ స్ట్రైప్ సర్వీసుల్ని ఆయా బ్యాంక్‌లు, ఇతర ఫైనాన్షియ్ కంపెనీలు అందిస్తుంటాయి. ఈ స్ట్రైప్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఎక్స్. కామ్ యూజర్ల అకౌంట్లకు డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ►అంతేకాకుండా, అర్హులైన యూజర్లు కంపెనీ ప్రకటనల రాబడి వాటా నిబంధనల్ని కూడా పాటించాలి ►ఈ నిబంధనలలో క్రియేటర్ మానిటైజేషన్ ప్రమాణాలు, ఎక్స్.కామ్ నియమాలు ఉన్నాయి. సెట్టింగ్‌లలోని మానిటైజేషన్ ఆప్షన్‌ను యాక్సెస్ చేయడం ద్వారా వినియోగదారులు క్రియేటర్ సబ్స్క్రిప్షన్లు, యాడ్స్ రెవెన్యూ షేరింగ్ రెండింటికీ అప్లయ్ చేసుకోవచ్చు. ఇక, వినియోగదారులు యాడ్స్ రెవెన్యూ షేర్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారు ఎక్స్. కామ్ ద్వారా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఎక్స్.కామ్‌లో సంపాదించిన డబ్బుల్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలంటే ముందుగా, ఎక్స్.కామ్‌లోని ట్విట్ అనే ఆప్షన్‌పై మోర్‌పై ట్యాప్ చేయాలి. చేస్తే మీకు మానిటైజేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సైడ్ మెనూలో ‘‘జాయిన్ అండ్ పే అవుట్ సెటప్’’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పేమెంట్ ప్రాసెస్ అవుతుంది. ఈ సమయంలో ఎక్స్.కామ్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్‌కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేందుకు మరికొన్ని ఆప్షన్స్‌లో అడిగిన వివరాల్ని ఎంటర్ చేయాలి. ఇదంతా పూర్తయితే వినియోగదారులు ఎక్స్. కామ్ క్రమం తప్పకుండా డబ్బులు చెల్లిస్తుంది. మినిమం 50 డాలర్ల ఉంటే ఎక్స్.కామ్ నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు. అర్హులైన యూజర్లు ప్రతినెల చివరి వారంలో పెమెంట్స్ను పొందవచ్చని ఎక్స్.కామ్ యాజమాన్యం పేర్కొంది. చదవండి👉 ఎంతపని చేశావయ్యా ఎలన్ మస్క్? -
'చాట్‌జీపీటీ' తో డబ్బులు సంపాదించడం ఎలాగో తెలుసుకోండి!
గూగుల్‌కు గుబులు పుట్టిస్తున్న చాట్‌జీపీటీని యూజర్లు చాట్‌జీపీటీ సాయంతో డబ్బులు ఎలా సంపాదించవచ్చు’ అని ప్రశ్నిస్తున్నారు. చాట్ జీపీటీ ఇచ్చిన సమాధానాల్ని సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా చాట్‌జీపీటీని అడిగిన ప్రశ్నలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో 2023లో చాట్‌జీపీటీ సాయంతో డబ్బులు సంపాదించడం ఎలా? అని ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. ఇక యూజర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చాట్‌జీపీటీని ఉపయోగించి 7 మార్గాల్లో డబ్బులు సంపాదించవచ్చని ఏఐ మోడల్ సమాధానం ఇచ్చింది. 1. చాట్‌జీపీటీ ఉపయోగించి చాట్‌బాట్ తయారు చేసి వాటికి లైసెన్స్ పొందవచ్చు. అనంతరం వ్యాపార సంస్థలకు లేదంటే వ్యక్తులకు అమ్ముకోవచ్చు. డబ్బులు సంపాదించవచ్చు. ఈ చాట్‌బాట్ సాయంతో కస్టమర్ సర్వీస్, వర్చువల్ అసిస్టెన్స్ లేదా ఇతర పనులకు ఉపయోగించవచ్చు. 2. చాట్‌జీపీని సొంతం ప్రాజెక్ట్‌లలో ఇంటిగ్రేట్ చేయొచ్చు. కన్సల్టింగ్, డెవలప్మెంట్ సర్వీసుల్ని అందించవచ్చు. 3. ఏఐ ఆధారిత చాట్‌బోట్ సాయంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌లు, లేదా ఇండస్ట్రీస్‌కు సంబంధించిన డేటాను తయారు చేసి.. కోర్సుల పేరుతో ఆ డేటాను అమ్ముకోవచ్చు. 4. చాట్‌జీపీటీ అందించే యూనిక్ అండ్ ఎంగేజింగ్ కంటెంట్ సాయంతో సోషల్ మీడియా, బ్లాగ్స్, వెబ్‌సైట్స్‌ను రన్ చేయొచ్చు. తద్వారా యాడ్స్, ప్రమోషనల్ యాడ్స్‌ను డిస్ప్లే చేసి ఆదాయాన్ని గడించవచ్చు. 5.మీకు స్టాక్ మార్కెట్‌పై పట్టుంటే చాట్‌జీపీని ఉపయోగించి ఆటోమెటెడ్ ట్రేడింగ్‌ను స్ట్రాటజీని బిల్డ్ చేయొచ్చు. ట్రేడింగ్, లేదంటే కన్సల్టింగ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలను అప్లయి చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. 6. అంతేకాదు చాట్‌జీపీటీ బేస్డ్ చాట్‌బోట్‌ను తయారు చేసి కస్టమర్ సర్వీస్, వర్చువల్ అసిస్టెంట్స్ పేరుతో సబ్స్క్రిప్షన్ మోడల్‌తో డబ్బులు సంపాదించవ్చు. 7. చాట్ జీపీటీతో లాంగ్వేజెస్‌ను ఉపయోగించే సంబంధింత బిజినెస్‌లలో కొన్ని పనులు చేసేందుకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్, టెక్ట్స్ సమరైజేషన్ వంటి పనులు చేస్తూ ఉపాధి పొందవచ్చు. చదవండి👉 ChatGPT: యూజర్లకు భారీ షాక్.. చాట్ జీపీటీకి కొత్త చిక్కులు! -
మీరు విద్యార్థులా? చదువుకుంటూ డబ్బు సంపాదించండి ఇలా
పార్ట్ టైమ్ జాబ్స్.. కొన్నేళ్ల క్రితం వరకు విదేశాలకే పరిమితం. ఉన్నత విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనూ పార్ట్‌టైమ్ కొలువుల కల్చర్ విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, ఈ–కామర్స్ రంగాల విస్తరణ కారణంగా.. విద్యార్థులు చదువుకుంటూనే ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి కొంత ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. పార్ట్‌టైమ్ అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుకునేందుకు మార్గాలు, వేతనాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం... మన దేశంలో ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్స్ ట్రెండ్ మారుతోంది. గతంలో పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్ అంటే ట్రాన్స్‌లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. కానీ..ప్రస్తుత కార్పొరేట్ యుగంలో..అన్ని రంగాల్లోనూ పార్ట్ టైమ్ ఉద్యోగాల సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సేవల రంగం మొదలు ఐటీ వరకూ..పార్ట్ టైమ్ జాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. అఫ్లియేట్ మార్కెటింగ్ ఇటీవల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో వినిపిస్తున్న మాట.. అఫ్లియేట్ మార్కెటింగ్. సొంతంగా వెబ్సైట్ రూపొందించుకున్న వ్యక్తులు.. సదరు పోర్టల్‌లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్ లింక్స్‌ను, ఉత్పత్తులను తమ వెబ్సైట్ వీక్షకులకు కనిపించేలా చేయడమే అఫ్లియేట్ మార్కెటింగ్. ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్సైట్ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్‌గా పేర్కొనొచ్చు. ఈ పద్ధతిలో సంస్థలు సదరు వెబ్సైట్ నుంచి ఎక్స్టర్నల్ లింక్స్‌తో తమ ఉత్పత్తులను వీక్షించిన వారి సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లిస్తున్నాయి. ఈ విధానంలోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి. డెలివరీ అసోసియేట్స్ డెలివరీ అసోసియేట్స్ అంటే.. సంస్థల ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే వారు. ఇవి ఎక్కువగా ఈ–కామర్స్, రిటెయిల్ రంగాల్లో లభిస్తున్నాయి. వీటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతగా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారని క్వికర్జాబ్స్ నివేదిక పేర్కొంది. వీరికి సగటున రూ.15వేలు లభిస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్స్ పార్ట్ టైమ్ ఉపాధి పరంగా మరో చక్కటి అవకాశం..ట్యూటర్స్‌గా పని చేయడం. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం హోంట్యూటర్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి వీరు ఆన్లైన్,పార్ట్‌టైమ్ విధానాల్లో నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందడానికి ఇది చక్కటి మార్గం. ప్రస్తుతం ఎన్నో ఎడ్టెక్ స్టార్టప్ సంస్థలు ఆన్లైన్ ట్యాటర్స్కు స్వాగతం పలుకుతున్నాయి. కాపీ రైటర్ పార్ట్ టైమ్ జాబ్స్ విభాగంలో టాప్ లిస్టింగ్‌లో ఉన్న కొలువు.. కాపీ రైటర్. సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్‌లో ఒక సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్‌కు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా రాయడం కాపీ రైటర్ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్లైన్ విధానంలో కాపీ రైటర్స్‌ను నియమించుకుంటున్నాయి. తొలుత ఒక నమూనా కాపీని అడుగుతున్న సంస్థలు..దానికి మెచ్చితే పని చేసే అవకాశం ఇస్తున్నాయి. టైమ్ రేట్, పీస్ రేట్ ప్రాతిపదికన రూ.800 నుంచి రూ.వేయి వరకు అందిస్తున్నాయి. డేటాఎంట్రీ టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటే.. ఆదాయం అందించే మరో పార్ట్ టైమ్ అవకాశం.. డేటాఎంట్రీ. బీపీఓ, కేపీఓ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి సేవలు అందించే సంస్థలు తమ క్లయింట్లు పంపించే రికార్డ్లను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్ టైమ్ లేదా ఆన్లైన్ విధానంలో నియమించుకునేందుకు ప్రాంధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. పీస్ రేట్, టైమ్ రేట్ విధానంలో పారితోషికం లభిస్తోంది. పీస్ రేట్ విధానంలో ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్ రేట్ విధానంలో గంటకు రూ.300 నుంచి వేయి వరకు సంపాదించుకునే అవకాశముంది. యాడ్ హోస్టింగ్ ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్మెంట్ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేయడమే..ఆన్లైన్ యాడ్ పోస్టింగ్. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ ఉంటే.. ఈ పార్ట్‌టైమ్ జాబ్‌లో రాణించొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ యాడ్ హోస్టింగ్స్కు క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర వెబ్‌సైట్స్ ప్రధాన ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నాయి. ఒక్కో యాడ్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు పొందే వీలుంది. ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇది కూడా యువతకు పార్ట్ టైమ్ ఆదాయ వనరుగా నిలుస్తోంది.జిమ్‌లు,ఫిట్నెస్ సెంటర్స్‌లో ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఈ విభాగం సరితూగుతుందని చెప్పొచ్చు. పార్ట్ టైమ్ విధానంలో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్‌గా రోజుకు రెండు,మూడు గంటల సమయం వెచ్చిస్తే రూ.500 వరకు సం΄ాదించొచ్చు. సేల్స్ అసోసియేట్ ప్రతి రోజు నిర్దిష్టంగా ఒక సమయంలో.. స్టోర్స్‌లో సేల్స్ విభాగంలో పని చేసే వ్యక్తులనే పార్ట్ టైమ్ సేల్స్ అసోసియేట్స్‌గా పిలుస్తున్నారు. విధుల పరంగా సదరు అవుట్‌లెట్‌లోని స్టాక్ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. ఏ కోర్సు చదువుతున్న వారైనా రిటెయిల్ సేల్స్ అసోసియేట్‌గా పార్ట్ టైమ్‌గా పని చేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించే వీలుంది. క్యాబ్ డ్రైవర్స్ ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మరో పార్ట్ టైమ్ ఆదాయ మార్గం.. క్యాబ్ డ్రైవర్స్‌గా పని చేయడం. ప్రస్తుతం పలు సంస్థలు ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్ ద్వారా సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి రైడర్స్ కొరత ఏర్పడుతోంది. దీంతో పార్ట్ టైమ్ అవకాశాలకు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తో పాటు, పదో తరగతి ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. సోషల్ మీడియా అసిస్టెంట్ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వీసులు, ప్రొడక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ తదితరాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు ఉండాలి. సోషల్ మీడియా రైటింగ్‌పై అవగాహనతో పాటు,ఎస్ఈఓ, ఎస్ఈఎం, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం. వీరు సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందొచ్చు. ఐటీ రంగంలోనూ ఐటీ రంగంలో సైతం పార్ట్ టైమ్ జాబ్స్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రోగ్రామర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్ కోర్సులు చదువుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న వారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకున్న జాబ్ ప్రొఫైల్,ప్రాజెక్ట్ ఆధారంగా నెలకు రూ.20వేల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఆన్లైన్ కన్సల్టెంట్ ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి..ఆన్లైన్ కన్సల్టెంట్. కంపెనీల్లో ఉన్నత స్థాయి వ్యూహాలు మొదలు ప్రోగ్రామింగ్, కోడింగ్ వరకూ.. ఆన్లైన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. అందుకునే మార్గాలివే ప్రస్తుత టెక్ యుగంలో ఒక్క క్లిక్‌తో వందల ఉద్యోగాల సమాచారం అందించే వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో జాబ్ సెర్చ్ పోర్టల్స్ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే చాలు.. వాటికి సంబంధించిన సమాచారం, నిర్వర్తించాల్సిన విధులు, లభించే పారితోషికం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. పలు మొబైల్ యాప్స్ కూడా పార్ట్‌టైమ్ జాబ్స్ వివరాలు అందిస్తున్నాయి. -
స్పెషల్ కోర్స్, యూనివర్సిటీలో టిక్ టాక్ పాఠాలు!
ట్రెండ్ మారింది. సాధారణంగా ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత జాబ్, లేదంటే బిజినెస్ చేస్తూ డబ్బులు ఎలా సంపాదించాలనే విషయాల గురించి ఆలోచిస్తుంటాం. కానీ నేటి తరం యువత అలా కాదు. కాలేజీలో ఉండగానే ఎలాంటి బిజినెస్ చేయాలి.ఎంత సంపాదిస్తే ఫ్యూచర్ బాగుంటుందనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలకు తగ్గట్లు అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ ఆఫ్ డర్హామ్ విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా టిక్ టాక్ కోర్స్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రముఖంగా టిక్ టాక్‌ను ఉపయోగించి దాని ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలనే విషయాల గురించి విద్యార్ధులకు క్లాస్‌లు చెబుతున్నారు యూనివర్సిటీ ప్రొఫెసర్లు. ఈ క్లాసుల్లో టిక్‌టాక్ వీడియోలు ఎలా తీయాలి? వాటిని ఎలా ప్రమోట్ చేసుకోవాలి.ఎలా ప్రమోట్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. పర్సనల్ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకొని ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించవచ్చో' అని టిక్ టాక్ కోర్స్‌ను అందుబాటులోకి తెచ్చిన ప్రొఫెసర్ ఆరోన్ డినిన్ క్లుప్తంగా వివరిస్తున్నారు. అంతేకాదండోయ్ కోర్స్ నేర్చుకునే సమయంలో ప్రొఫెసర్ క్లాసులు వింటున్న విద్యార్ధులు టిక్ టాక్ వీడియోలు చేసి వాటికి వచ్చే వ్యూస్, బ్రాండ్ ప్రమోషన్లతో నెలకు రూ.4లక్షలకు పైగా సంపాదింస్తున్నట్లు ఆరోన్ డినిన్ చెబుతున్నారు. -
బంపర్ ఆఫర్: పోస్టాఫీస్ ఫ్రాంఛైజ్,పెట్టుబడి తక్కువ..సంపాదన ఎక్కువ
ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి..ఎక్కువ ఆదా పొందేలా ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్‌ను ఫ్రాంఛైజ్ తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కేంద్రప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్ వర్క్‌ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 1.55లక్షల పోస్టాఫీస్‌లు ఉన్నాయి. అందులో 89 శాతం పోస్టాఫీసులు గ్రామీణ ప్రాంతాల్లో సేవల్ని అందిస్తున్నాయి. అయితే కేంద్రం ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చెందుతున్న రూరల్, అర్బన్ ఏరియాల్లో సైతం ఈ సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు 2019లో ఈ ఫ్రాంఛైజ్ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. పోస్టాఫీస్ ఫ్రాంఛైజీ తీసుకుంటే ఏం చేయాలి? ► స్టాంప్స్, స్టేషనరీని అమ్ముకోవచ్చు. ► బుకింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, మనీ ఆర్డర్స్ సర్వీస్‌లను అందించాల్సి ఉంటుంది ► పోస్టల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ (పీఎల్ఐ- ఏజెంట్)కు సంబంధించిన అమ్మకాలు, ప్రీమియంను కట్టించుకోచ్చు. ► పోస్టాఫీస్ పరిధిలోకి వచ్చే రీటైల్ సర్వీసులు అంటే బిల్స్, ట్యాక్స్, పన్నుల వసూళ్లు లేదా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఫ్రాంఛైజీకి కావాల్సిన అర్హతలు ► ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవాలంటే మినిమం 8వ తరగతి చదివి ఉండాలి. ఇక డిపాజిట్ కింద రూ.5000 నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. ► దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పోస్టాఫీస్ అధికారులు మీ దరఖాస్తును డివిజనల్ హెడ్‌కు పంపిస్తారు. ► అలా మీ ధరఖాస్తును చెక్ చేస్తారు. మీ ఫ్రాంఛైజీకోసం అప్లయ్ చేసిన ధరఖాస్తుకు చెందిన అడ్రస్‌ను పరిశీలిస్తారు. దీంతో పాటు ఫ్రాంఛైజీని నిర్వహించే సామర్ధ్యం ఉందా లేదా, కంప్యూటర్ సౌకర్యం ఉందా లేదా అని పరిగణలోకి తీసుకుంటారు. ► అనంతరం 14 రోజుల్లో ఫ్రాంఛైజీకి మీరు అర్హులు, కాదా అంశంపై నిర్ణయం తీసుకుంటారు. ఫ్రాంఛైజీకి ఎవరికి? ఏ ప్రాంతంలో ఇవ్వరు ► 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి అవకాశం ఇవ్వరు. ► పోస్టాఫీస్ ఉద్యోగం చేస్తున్నా, లేదంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఫ్రాంఛైజీని తీసుకునేందుకు అనర్హులు ► పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ పథకంలో భాగంగా పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్లు ఉన్న గ్రామాలకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరు. ఫ్రాంఛైజీ వల్ల లాభాలు (⇔ ఈ లింక్ క్లిక్ చేస్తే 22పేజీలో పూర్తి వివరాలు) ► పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ నిర్వాహకులు అందించే సేవలపై కమీషన్ లభిస్తుంది. ► రిజిస్టర్డ్ పోస్ట్‌కు రూ.3, స్పీడ్పోస్టుకు రూ.5 కమీషన్, రూ.100 నుంచి రూ.200 మనీ ఆర్డర్‌పై రూ.3.50, అంతకన్నా ఎక్కువ మనీ ఆర్డర్‌పై రూ.5 కమీషన్ వస్తుంది. ► నెలలో 1000 రిజిస్టర్ పోస్టులు, 1000 స్పీడ్ పోస్ట్‌లు బుక్ చేస్తే 20శాతం కమీషన్ అదనంగా లభిస్తుంది. ► ఇక స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ, మనీ ఆర్డర్ ఫామ్ లాంటి అమ్మకాలపై 5 శాతం కమిషన్ ఉంటుంది. చదవండి : ఏటీఎం సెంటర్లలో మారిన రూల్స్, వాటి గురించి మీకు తెలుసా? -
లాక్డౌన్లో తిండి కూడా లేదు.. అప్పుడొచ్చిన ఓ ఐడియా జీవితాన్నే మార్చింది
కరోనా వైరస్ కారణంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది దీన్నే అవకాశంగా మలుచుకని తమ జీవితాలను మూడుపూవులు ఆరుకాయల్లా మార్చుకున్నారు. ఆ కొంతమందిలో అమెరికాలోని అలబామా, పెల్ సిటీకి చెందిన 32 ఏళ్ల బ్రాంట్లీ గెర్హార్డ్ట్ ఒకడు. లాక్డౌన్ సమయంలో అతనికొచ్చిన ఓ ఐడియా తన జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే.. గ్రిన్చ్ ( ఒళ్లంతా జుట్టు ఉండే ఓ వింత జంతువు) వేషాన్ని ధరించి ఆ పరిసరాలు మొత్తం చక్కర్లు కొట్టడం. అలా ఎందుకంటే.. లాక్డౌన్ సమయం కాబట్టి పిల్లల్ని బయటికి రాకుండా చూడటం వారి తల్లిదండ్రులకు చాలా కష్టంగా మారింది. కనుకు అతను పిల్లలను భయపెట్టి వాళ్లు ఇళ్లలోంచి బయటకు రాకుండా చూడాలి. అతడి ఆలోచన నచ్చి భార్య సరేనంది. దీంతో అతడు గ్రిన్చ్ వేషంలో దగ్గరలోని నిత్యవసర వస్తువుల దుకాణాలు తిరగటం మొదలుపెట్టాడు. అలా ప్రతీ షాపు దగ్గర కొంత సేపు చక్కర్లు కొట్టేవాడు. కొంతమంది పిల్లలు అతడ్ని చూసి భయపడగా, మరికొంతమంది ఫొటోలు తీసుకోవటానికి ఎగబడేవారు. అలా కొంత మేర డబ్బు సంపాదించిన అది సరిపోయేది కాదు. ఓ రోజు గ్రిన్చ్ దుస్తుల్లో బ్రాంట్లీని చూసిన ఓ వ్యక్తి తన పిల్లల్ని భయపెట్టాలని, అందుకోసం 20 డాలర్లు (సుమారు 1500రూపాయలు) ఇస్తానని అన్నాడు. ఆ రోజు నుంచి గత సంవత్సరం వరకు ఆ వ్యక్తి పిల్లలను భయపెట్టేందుకు దాదాపు 20 వేల కుటుంబాలను కలుసుకున్నాడు. రోజుకు కనీసం 20 ఇళ్లలోని పిల్లల్ని భయపెడుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు. ఇందులోనూ కొత్తదనం కోరుకుంటూ ఎప్పటికప్పుడు తన వేషాలను మారుస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆ నగరంలో అతనో సెలబ్రిటీలా మారిపోయాడు దీంతో అతడితో ఫొటోలు దిగటానికి జనం ఎగబడుతున్నారట. ప్రస్తుతం అతను పిల్లల్ని భయపెట్టడానికి 30 డాలర్లు(2,251రూపాయలు) వసూలు చేస్తున్నాడు. ఓ ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు కదా.. బహుశా అది ఇదేనేమో. చదవండి: Niloufer Cafe Hyderabad: కప్పు చాయ్ రూ.1000.. ఎక్కడో తెలుసా? -
ఫేస్బుక్ ద్వారా డబ్బుల్ని ఇలా సంపాదించండి
కరోనా కారణంగా, లేదంటే ఒకరిపై ఆధారపడకుండా ఆర్ధికంగా ఎదగాలనే తాపత్రయం ఉన్న ప్రతీ ఒక్కరూ ఆన్లైన్లో డబ్బులు సంపాదించడంపై దృష్టిసారిస్తున్నారు. అయితే వారిలో అవగాహనలేని చాలా మంది రకరకాల పెయిడ్ సర్వేల పేరుతో ఇటు టైమ్‌తో పాటు డబ్బుల్ని వృదా చేసుకుంటున్నారు. అలా కాకుండా కొంచెం టెక్నికల్ స్కిల్ తో పాటు సోషల్ మీడియా వినియోగంపై కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆలస్యం అయినా జెన్యూన్ పద్దతిలో డబ్బులు సంపాదించవచ్చు. కరోనా కారణంగా ఆఫీస్‌లు, స్కూల్స్ తో పాటు బిజినెస్ అంతా ఆన్లైన్ నుంచే జరుగుతుంది. దీంతో ఆయా టెక్ సంస్థలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను ఉపయోగించి యూజర్లు మనీ ఎర్నింగ్ చేసుకునేందుకు కొత్త కొత్త టూల్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాంటి ఆన్లైన్ మనీ ఎర్నింగ్‌లో ఫేస్బుక్ సైతం ముందజలో ఉంది. అందుకే ఫేస్బుక్లో ప్రతినెలా 2బిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉంటే...రోజుకి 1.37 బిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు.వారిలో టైమ్ పాస్ చేసేందుకు వచ్చే యూజర్లు కంటే డబ్బులు సంపాదించే యూజర్లే ఎక్కువ మంది ఉన్నట్లు కొన్ని గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. మరి అలాంటి ఫేస్‌బుక్‌ను ఉపయోగించి మనీ ఎర్నింగ్ ఎలా చేయోచ్చో తెలుసుకుందాం. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ : ముందుగా మనం ఉండే ఏరియాని బట్టి ఎలాంటి బిజినెస్ నడుస్తుందో తెలుసుకోవాలి. అనంతరం అమెజాన్ వెబ్ సైట్లో ఎలా ప్రాడక్ట్‌లను సేల్ చేస్తామో ఆ తరహాలోనే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్‌ను ఉపయోగించే ప్రాడక్ట్‌ను సేల్ చేసుకోవచ్చు. అందులో గృహోపకరణాలు, గాడ్జెట్స్,వంటసామాగ్రి, ఫెస్టివల్ సీజన్ బట్టి ప్రాడక్ట్‌లను మార్చుకొని సేల్ చేసుకోవచ్చు.ముఖ్యంగా స్థానికంగా ఉండే ప్రజలు ఎలాంటి ప్రాడక్ట్లు కావాలని కోరుకుంటున్నారో తెలుసుకొని.. అందుకు అనుగుణంగా మార్కెట్ ప్లేస్‌లో బిజినెస్ చేయడం ఉత్తమం. ఫేస్ బుక్ ఫ్యాన్ పేజ్ ఫేస్ బుక్ ఫ్యాన్ పేజ్‌లో మనీ ఎర్నింగ్ సంపాదించడం కొంచెం కష్టం కూడుకున్నది. కాకపోతే మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటున్న సమయం కంటే ఒక ఆరునెలలు, లేదంటే సంవత్సరం ముందే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఫేస్బుక్ ఫ్యాన్ పేజీ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుంటే ముందుగా మనకి ఏదో ఒక రంగంలో పట్టుసాధించాలి. ఉదాహరణకు : ఎంటర్టైన్మెంట్,హెల్త్, బిజినెస్, గాడ్జెట్స్, టెక్నాలజీ. మీకు హెల్త్ గురించి పూర్తి అవగాహన ఉంటే.. సంబంధింత అంశంపై యూజర్లకు ఉపయోగపడే కంటెంట్‌తో పోస్టర్లను డిజైన్ చేసి ఫేస్బుక్ ఫ్యాన్ పేజ్‌లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా రెగ్యులర్‌గా హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల యూజర్లు త్వరగా అట్రాక్ట్ అవుతారు. తద్వారా మిమ్మల్ని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంటుంది. ఫాలోవర్లను బేస్ చేసుకొని ప్రాడక్ట్‌లను సేల్ చేసుకోవచ్చు.లేదంటే ఆయా హెల్త్ కేర్ కంపెనీ ప్రతినిధుల్ని సంప్రదిస్తే పెయిడ్ మార్కెటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో పోస్ట్‌ను బట్టి మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ గ్రూప్స్ ఫేస్బుక్ గ్రూప్స్ నుంచి మనీ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఓ వ్యక్తి జెన్యూన్ గా ఎలాంటి బిజినెస్ చేయాలి. ఎలాంటి బిజినెస్ చేస్తే నష్టం వస్తుంది. ఎలాంటి బిజినెస్ చేస్తే లాభం వస్తుందనే విషయాలపై పోస్టర్లను డిజైన్ చేసి ఫేస్బుక్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తున్నాడు. ఆ కంటెంట్ జెన్యూన్‌గా ఉంటే చాలు యూజర్లు ఆటోమెటిగ్గా ఆ గ్రూప్స్ ను ఫాలో అవుతుంటారు. ఫాలోవర్స్ పెరిగే కొద్ది మీ ఐడియా స్ట్రాటజీస్‌ను అప్లయ్ చేస్తుండాలి. ఉదాహరణకు పీడీఎఫ్ ఫార్మాట్లో బిజినెస్‌కు సంబంధించి ఓ చిన్న ఈ- బుక్‌ను కొద్ది మొత్తానికి ఆఫర్ చేస్తే యూజర్లు ఆ ఈబుక్‌ను కొనుగోలు చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. దీంతో పాటు పెయిడ్ బిజినెస్ కన్సల్టెన్సీ నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయాన్ని గడించవచ్చు. ఇన్ ఫ్లూయన్సర్ మార్కెటింగ్ మార్కెట్లో అనేకరకాలైన జాతీయ,అంతర్జాతీయ ప్రాడక్ట్లు ఉంటాయి. అయితే వాటి సేల్స్ జరగాలన్నా, లేదంటే ఆ బ్రాండ్ గురించి అందరికి పరిచయం అవ్వాలన్నా ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ల చేతిలో ఉంటుంది. ప్రాడక్ట్ ల ప్రచారం కోసం కోట్లు కుమ్మరించే బదులు లోకల్ ఇన్ ఫ్లూయన్సర్లను ఆశ్రయిస్తే తక్కువ ఖర్చు. ఎక్కువ ప్రచారం. పైగా బిజినెస్ జరుగుతుంది. అందుకే మార్కెట్లో ఇన్ ఫ్లూయన్సర్ మార్కెటింగ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఆయా రంగాల్ని బట్టి ఇన్ ఫ్లూయన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. గాడ్జెట్స్ పనితీరు ఎలా ఉంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.ఎలాంటి దుస్తులు ధరిస్తే నలుగురిలో ప్రత్యేకంగా ఉండొచ్చు. ఇలాంటి ప్రతీ అంశాన్ని బట్టి ప్రమోట్ చేసి ఇన్ ఫ్లూయన్సర్లుగా చెలామణి అవ్వొచ్చు. -
పైసా ఖర్చుండదు.. కానీ, డబ్బులే డబ్బులు
ముంబై: సోషల్ మీడియా వేదికలపై బ్రాండ్ల ప్రచారం గణనీయంగా జరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇన్ఫ్లుయెన్సర్ (ప్రభావితం చేసేవారు) మార్కెటింగ్ ఈ ఏడాది రూ. 900 కోట్లకు చేరనుంది. 2025 నాటికి ఇది 25 శాతం వార్షిక వద్ధి రేటుతో రూ. 2,200 కోట్లకు చేరనుంది. మీడియాలో ప్రకటనల స్పేస్‌ని కొనుగోలు చేసే సంస్థ గ్రూప్ఎం రూపొందించిన ఐఎన్సీఏ ఇండియా ఇన్ఫ్లుయెన్సర్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల వినియోగం ఊపందుకోవడంతో .. కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవల ప్రచారం కోసం ఇన్ఫ్లుయెన్సర్లను నియమించుకునే ధోరణి కూడా పెరుగుతోందని నివేదిక పేర్కొంది. కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులతో ఈ తరహా మార్కెటింగ్ విధానాల్లో మార్పులు చోటు చేసు కుంటున్నాయి. ఇన్ఫ్లుయెన్సర్లపై ఫాలోవర్లకు ఉంటున్న నమ్మకాన్ని చూస్తున్న బ్రాండ్లు తమ ఉత్పత్తుల ప్రచారానికి వారితో జట్టు కట్టడంపై ఆసక్తి చూపుతున్నాయని గ్రూప్ఎం సీఈవో (దక్షిణాసియా) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్‌లో సుమారు 70 శాతం వాటా నాలుగు కేటగిరీలది ఉంటోంది. వీటిలో పర్సనల్ కేర్ (25 శాతం), ఆహారం..పానీయాలు (20 శాతం), ఫ్యాషన్..ఆభరణాలు (15 శాతం), మొబైల్.. ఎలక్ట్రానిక్స్ (10 శాతం) ఉన్నాయి. ఈ తరహా మార్కెటింగ్ ఆదాయాల్లో సెలబ్రిటీల వాటా 27 శాతం ఉండగా.. ఇతర ఇన్ఫ్లుయెన్సర్ల వాటా ఏకంగా 73 శాతంగా ఉండటం గమనార్హం. చదవండి: YouTube Shorts: చేస్తున్నారా.. పర్సు నిండుతుందిలెండి! -
రేజర్‌పేతో ట్విటర్ జట్టు
న్యూఢిల్లీ: నగదు బదిలీ సర్వీసులకు ఉపయోగపడే తమ టిప్ జార్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు పేమెంట్ గేట్‌వే సంస్థ రేజర్‌పేతో జట్టు కట్టినట్లు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్ వెల్లడించింది. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్లు మొదలైన విధానాల్లో రేజర్‌పే ఇంటర్ఫేస్ ద్వారా దేశీయంగా నగదు పంపడం, అందుకోవడానికి సంబంధించి లావాదేవీలు జరపవచ్చని పేర్కొంది. రాబోయే రోజుల్లో మరిన్ని పేమెంట్ ప్రొవైడింగ్ సంస్థలతో కూడా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నాయని వివరించింది. ట్విటర్లో కంటెంట్ క్రియేట్ చేసేవారు, దాని ద్వారా ఆదాయం పొందడానికి టిప్ జార్ ఫీచర్ ఉపయోగపడనుంది. అంతర్జాతీయంగా పరిమిత సంఖ్యలో క్రియేటర్లు, జర్నలిస్టులు, లాభాపేక్ష రహిత సంస్థలు మొదలైన వర్గాలకు చెందిన యూజర్లకు ట్విటర్ దీన్ని గత నెల అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్‌ను తమ ప్రొఫైల్‌కు జోడించడం ద్వారా యూజర్లు .. టిప్‌లను స్వీకరించవచ్చు. చదవండి: క్రెడిట్ కార్డ్ మంచిదా.. పర్సనల్ లోన్ మంచిదా! -
యూట్యూబ్ కొత్త అప్ డేట్స్, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న క్రియేటర్స్
కరోనా కారణంగా ఆన్ లైన్ మనీ ఎర్నింగ్స్ కోసం పెద్దసంఖ్యలో జనాలు యూట్యూబ్ ను ఆశ్రయిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్సే కాకుండా టెక్నాలజీపై అవగాహన, అభిరుచి ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ను ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు. అందుకే యూట్యూబ్ సైతం తన క్రియేటర్స్ కు అనుగుణంగా మార్పులు చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా మే నెలలో కొన్ని అప్ డేట్స్ ను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో ప్రధానమైంది. గూగుల్ అకౌంట్ ఛేంజ్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ నేమ్ తో పాటు ప్రొఫైల్ నేమ్ మార్చుకునే సౌలభ్యం.వాస్తవానికి జీమెయిల్ అకౌంట్ సాయంతో యూట్యాబ్ ఛానల్ ఓపెన్ చేస్తాం. అదే అకౌంట్ ను ఇతర యాప్స్ లలో వినియోగించడం ద్వారా హ్యాకర్స్, వ్యక్తిగత డేటా భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కాబట్టి ఈ కొత్త అప్ డేట్ ను పరిచయం చేసింది. ఈ అప్ డేట్ వల్ల నార్మల్ క్రియేట్స్ కంటే వెరిఫైడ్ అకౌంట్స్ ఉన్న ఛానల్స్ క్రియేటర్స్ ఇబ్బంది పడుతున్నారు. యూట్యూబ్ వెరిఫైడ్ అకౌంట్ అంటే? యూట్యూబ్ లో క్రియేటర్స్ లక్షమంది సబ్ స్కైబర్స్ ను సొంతం చేసుకుంటే యూట్యూబ్ టిక్ మార్క్ తో వెరిఫైడ్ అకౌంట్ అందిస్తుంది. అయితే తాజా అప్ డేట్ తో వెరిఫైడ్ అకౌంట్స్ ను కోల్పోవాల్సి వస్తుంది. చదవండి : YouTube Shorts: చేస్తున్నారా.. పర్సు నిండుతుందిలెండి! కొత్త అప్ డేట్ ఏంటంటే? జీమెయిల్ అకౌంట్ మార్చకుండా ఛానల్ నేమ్ మార్చుకోవచ్చు. దీని వల్ల నార్మల్ క్రియేటర్స్ కు పెద్ద నష్టం లేదు. కానీ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉన్న క్రియేటర్లు ఛానల్ పేరు మార్చుకుంటే, ఇప్పటికే ఉన్న వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోల్పోవాల్సి ఉంటుంది. ఛానల్ పేరు మార్చిన తరువాత బ్యాడ్జి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఇలాంటి యూట్యూబ్ యూజర్లు కొత్త అప్డేట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ పేరును ఎలా మార్చాలి? • యూట్యూబ్ ఛానల్ పేరు మార్చుకునేందుకు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది. డెస్క్ టాప్ అవసరం లేదు. • ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఫోటో పై ట్యాప్ చేయాలి • ట్యాప్ చేసిన తరువాత ఛానల్ లో ఎడిట్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. • ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్లిన తరువాత ఛానల్ కొత్త నేమ్‌ను ఎంటర్ చేసి సేవ్ చేయాలి. • దీంతో ఛానల్ నేమ్ మారిపోతుంది. ఛానల్ తో పాటు ఫోటో మార్చుకోవచ్చు. ఫోటో మార్చాలంటే ఫోటో ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎడిట్ చేస్తే న్యూ ఫోటో ఆప్షన్ కనిపిస్తుంది ఆ న్యూ ఫోటో ఆప్షన్ ను క్లిక్ చేసి ఫోటో అప్ లోడ్ చేయాలి. ఆ పై సేవ్ చేస్తే ఫోటో కూడా మారిపోతుంది -
5000లు పెడితే రోజుకు 500 వస్తాయనే ఆశతో..
స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని రోజు రోజుకి ఇంటర్ నెట్ వినియోగం విపరీతంగా పెరుగుతూ ఉంది. చదువుకున్న వారితో పాటు చదువుకొని వారు కూడా ఈ మధ్య ఇంటర్నెట్ వాడటం ఎక్కువగా చేస్తున్నారు. అయితే, నిరక్ష్యరాసులను, అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని కొన్ని నకిలీ కంపెనీలు ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతున్నాయి. ఐదువేల పెట్టుబడి పెట్టి మీరు సులభంగా రోజుకి 500 నుండి 1000 వరకు డబ్బులు సంపాదించవచ్చని కొన్ని కంపెనీలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. దీంతో కొందరు అమాయక ప్రజలు పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇవ్వాళ మీకు అలాంటి కోవకే చెందిన ఒక యాప్ గురుంచి తెలియజేస్తున్నాము.(చదవండి: గూగుల్ 'కెమెరా గో'లో సరికొత్త ఫీచర్) ఓఎమ్ జీ(OMG) బర్స్ యాప్ అనేది ఆన్లైన్ మనీ యాప్. నేడు ఇది నిజమైందా లేదా నకిలీదా అనే దాని గురుంచి తెలుసుకుందాం. ఓఎమ్ జీ బర్స్ యాప్ అంటే ఏమిటి ?, ఓఎమ్ జీ బర్స్ యాప్ నిజమైనదా లేదా నకిలీనా?, ఓఎమ్ జీ బర్స్ యాప్ సురక్షితమా కాదా ?, ఓఎమ్ జీ బర్స్ యాప్ ఎలా పనిచేస్తుంది? అనే విషయాల గురించి తెలుసుకుందాం... అందుకే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి. ఓఎమ్ జీ బర్స్ యాప్ అంటే ఏమిటి? ఓఎమ్ జీ బర్స్ అనే ఆన్లైన్ ఎర్నింగ్ యాప్ లేదా వెబ్సైట్ గురించి మీరు ఎప్పుడైనా వినవచ్చు లేదా చూడవచ్చు. ఈ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఎవరైనా వేలాది రూపాయలు సంపాదించవచ్చని వారు పేర్కొన్నారు. ఇక్కడ మేము వారి ఫీచర్స్ గురించి మాట్లాడటం లేదు, కానీ ఓఎమ్ జీ బర్స్ యాప్ చట్టబద్ధమైనదా లేదా నకిలీదో మేము మీకు తెలియజేస్తున్నాం. ఓఎమ్ జీ బర్స్ యాప్ నకిలీదా.. నిజమైనదా? ఓఎమ్ జీ బర్స్ యాప్ సురక్షితమేనదని మీరు భావిస్తున్నారా? కానీ అది నిజం కాదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు.. మీరు ఆ కంపెనీ వెబ్ సైట్ ని గమనిస్తే మీకు తెలుస్తుంది. ఒక కంపెనీకి ఉండాల్సిన విదంగా ఓఎమ్ జీ బర్స్ వెబ్సైట్, యాప్ లో పూర్తి వివరాలు లేవు. అలాగే దీని యజమాని ఎవరు, వ్యవస్థాపకుడి, రిజిస్ట్రేషన్ వంటి ఇతర వివరాలు కూడా లేవు. అందుకే ఎటువంటి సమాచారం లేని కంపెనీల యాప్ లను ఎప్పుడు వాడకూడదు, అలాగే దింట్లో మీరు మీ సున్నితమైన సమాచారాన్ని కూడా షేర్ చేయకూడదు అని హెచ్చరిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనం వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓఎమ్ జీ బర్స్ యాప్ ఎందుకు సేఫ్ కాదు? మేము ఓఎమ్ జీ బర్స్ యాప్ గురుంచి సెర్చ్ చేసినప్పుడు. ఇది అక్టోబర్ 2020లో స్థాపించబడింది అనే విషయం మాత్రమే తెలిసింది కానీ ఆ కంపెనీ యొక్క యజమాని పేరు, కాంటాక్ట్ నంబర్స్ వంట వివరాలు ఏమి లభించలేదు. అలాగే ఓఎమ్ జీ బర్స్ యాప్ వారు వినియోగదారులను ఆకట్టుకోవడానికి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో రోజుకి 500 నుండి 1000 రూపాయలు వరకు సంపాందించవచ్చు అని వాళ్లు ఆఫర్స్ ప్రకటిస్తారు. అమాయకులను ట్రాప్ చేయడానికి మోసగాళ్ళు ఉపయోగించే సాధారణ ట్రిక్ ఇదే. ఇంకా సాధారణంగా చెప్పాలంటే ఈ యాప్ లకు సంబందించిన లింకులు ఏపీకే రూపంలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో లభించవు. అలాగే, మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మీరు వారిని సంప్రదించడానికి ఏకైక మార్గం ఈ-మెయిల్ మాత్రమే. మీరు ఒకవేల వారికీ ఈ-మెయిల్ చేస్తే రిప్లై వస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేల వారి కస్టమర్ కేర్ నెంబర్ ఉన్న కూడా అది ఎప్పుడూ పనిచేయదు. అలాగే వెబ్సైట్ లేదా యాప్ లో యజమాని లేదా వ్యవస్థాపకుడి వివరాలు లేకపోతె ఆ యాప్ ని ఎవరు నడుపుతున్నారో మీరు కనుగొనలేరు. మోసగాళ్ళు పట్టుకుంటారనే భయంతో వారి వ్యక్తిగత సమాచారం, వివరాలను ఎక్కడ కూడా వెల్లడించరు. అలాగే దీని గురుంచి సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ వివరాలు మాకు లభించలేదు. కానీ కొన్ని మనీ యాప్ లు మాత్రం అమాయక ప్రజలను నమ్మించడానికి మొదట్లో కొన్ని రోజులో పాటు డబ్బులు చెల్లించిన. కొద్దీ రోజుల తర్వాత ఎవరికీ కనబడకుండా పోతారు. ఒక్కోసారి చిన్న చిన్న మొసలే పెద్ద పెద్ద స్కాంలకు దారితీస్తుంది. అందుకే మేము ఈలాంటి నకిలీ యప్స్ లో మీరు పెట్టుబడి పెట్టకూడదని కోరుకుంటున్నాము. అలాగే, ఇందులో మీ బ్యాంకు, వ్యక్తిగత వివరాలు కూడా సమర్పించకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మోసపోయిన వ్యక్తుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి తెలుసుకోండి. -
డాలర్ల కోసం పరుగులు తీయొద్దు
విద్యార్థులకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ హితవు న్యూఢిల్లీ: కెరీర్‌ను కేవలం ధనసంపాదన కోణంలోనే చూడొద్దని, డాలర్లకోసం విదేశాలకు పరుగులు తీయొద్దని లెఫ్టినెంట్ గవర్నర్, ఛాన్సలర్ నజీబ్‌జంగ్ హితవు విద్యార్థులకు హితవు పలికారు. సమాజ సువిశాల ప్రయోజనాల కోసం ముందుకు సాగాలన్నారు. ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం (డీటీయూ)లో బుధవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉన్నత విద్యకోసం వందలాదిమంది విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారని, దేశాన్ని గాలికొదిలేస్తున్నారంటూ విచారం వ్యక్తం చేశారు. ఇటువంటి విద్యార్థులంతా వెనక్కి రావాలని ఆయన సూచిం చారు. ఇంకా అనేకమంది విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశమే రావడం లేదన్నారు. దేశ పురోభివృద్ధికి పాటుపడాలన్నారు. సమయం కేటాయించండి ప్రభుత్వంతోపాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై వివిధ రూపాల్లో ఎంతో పెట్టుబడి పెట్టారని ఎల్జీ పేర్కొన్నా రు. ఈ విషయాన్ని గుర్తుంచుకుని విద్యార్థులు కొంత సమయాన్ని దేశం కోసం కేటాయిస్తారని తాను ఆశిస్తున్నట్టు తెలిపారు. కాగా స్నాతకోత్సవ కార్యక్రమంలో భాగంగా 72 మంది అండర్గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయే ట్ విద్యార్థులకు ఎల్జీ పట్టాలను అందజేశా రు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు పతకాలను అందజేశారు. నైతిక విలువల్ని పెంపొందించుకోవాలి అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్సీ) మేనేజింగ్ డెరైక్టర్ మంగూసింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నైతిక విలువలను పెంపొం దించుకోవాలని హితవు పలికారు. జీవి తంలో విజయపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. డిగ్రీ పట్టా ప్రతి ఒక్కరికీ అవసరమేనని, నైతిక విలువలు కూడా అంతకంటే ముఖ్యమని అన్నారు. వార్షిక నివేదికను సమర్పించిన వీసీ ఈ సందర్భంగా ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం (డీటీయూ) వైస్ ఛాన్సలర్ ప్రదీప్ కుమార్ డీటీయూ వార్షిక నివేదికను ఆహూతులకు చదివి వినిపించారు. 2013-14 విద్యా సంవత్సరంలో మొత్తం 13 నూతన ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. విద్యలో నాణ్యత పెంపుకోసం రూ. 12.5 కోట్ల మేర నిధులను వెచ్చించామన్నారు.