స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని రోజు రోజుకి ఇంటర్ నెట్ వినియోగం విపరీతంగా పెరుగుతూ ఉంది. చదువుకున్న వారితో పాటు చదువుకొని వారు కూడా ఈ మధ్య ఇంటర్నెట్ వాడటం ఎక్కువగా చేస్తున్నారు. అయితే, నిరక్ష్యరాసులను, అమాయక ప్రజలను టార్గెట్ చేసుకొని కొన్ని నకిలీ కంపెనీలు ఆన్లైన్ లో మోసాలకు పాల్పడుతున్నాయి. ఐదువేల పెట్టుబడి పెట్టి మీరు సులభంగా రోజుకి 500 నుండి 1000 వరకు డబ్బులు సంపాదించవచ్చని కొన్ని కంపెనీలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. దీంతో కొందరు అమాయక ప్రజలు పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఇవ్వాళ మీకు అలాంటి కోవకే చెందిన ఒక యాప్ గురుంచి తెలియజేస్తున్నాము.(చదవండి: గూగుల్ 'కెమెరా గో'లో సరికొత్త ఫీచర్)
ఓఎమ్ జీ(OMG) బర్స్ యాప్ అనేది ఆన్‌లైన్ మనీ యాప్. నేడు ఇది నిజమైందా లేదా నకిలీదా అనే దాని గురుంచి తెలుసుకుందాం. ఓఎమ్ జీ బర్స్ యాప్ అంటే ఏమిటి ?, ఓఎమ్ జీ బర్స్ యాప్ నిజమైనదా లేదా నకిలీనా?, ఓఎమ్ జీ బర్స్ యాప్ సురక్షితమా కాదా ?, ఓఎమ్ జీ బర్స్ యాప్ ఎలా పనిచేస్తుంది? అనే విషయాల గురించి తెలుసుకుందాం... అందుకే ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఓఎమ్ జీ బర్స్ యాప్ అంటే ఏమిటి?
ఓఎమ్ జీ బర్స్ అనే ఆన్‌లైన్ ఎర్నింగ్ యాప్ లేదా వెబ్‌సైట్ గురించి మీరు ఎప్పుడైనా వినవచ్చు లేదా చూడవచ్చు. ఈ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఎవరైనా వేలాది రూపాయలు సంపాదించవచ్చని వారు పేర్కొన్నారు. ఇక్కడ మేము వారి ఫీచర్స్ గురించి మాట్లాడటం లేదు, కానీ ఓఎమ్ జీ బర్స్ యాప్ చట్టబద్ధమైనదా లేదా నకిలీదో మేము మీకు తెలియజేస్తున్నాం.
ఓఎమ్ జీ బర్స్ యాప్ నకిలీదా.. నిజమైనదా?
ఓఎమ్ జీ బర్స్ యాప్ సురక్షితమేనదని మీరు భావిస్తున్నారా? కానీ అది నిజం కాదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు.. మీరు ఆ కంపెనీ వెబ్ సైట్ ని గమనిస్తే మీకు తెలుస్తుంది. ఒక కంపెనీకి ఉండాల్సిన విదంగా ఓఎమ్ జీ బర్స్ వెబ్‌సైట్, యాప్ లో పూర్తి వివరాలు లేవు. అలాగే దీని యజమాని ఎవరు, వ్యవస్థాపకుడి, రిజిస్ట్రేషన్ వంటి ఇతర వివరాలు కూడా లేవు. అందుకే ఎటువంటి సమాచారం లేని కంపెనీల యాప్ లను ఎప్పుడు వాడకూడదు, అలాగే దింట్లో మీరు మీ సున్నితమైన సమాచారాన్ని కూడా షేర్ చేయకూడదు అని హెచ్చరిస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనం వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఓఎమ్ జీ బర్స్ యాప్ ఎందుకు సేఫ్ కాదు?
మేము ఓఎమ్ జీ బర్స్ యాప్ గురుంచి సెర్చ్ చేసినప్పుడు. ఇది అక్టోబర్ 2020లో స్థాపించబడింది అనే విషయం మాత్రమే తెలిసింది కానీ ఆ కంపెనీ యొక్క యజమాని పేరు, కాంటాక్ట్ నంబర్స్ వంట వివరాలు ఏమి లభించలేదు. అలాగే ఓఎమ్ జీ బర్స్ యాప్ వారు వినియోగదారులను ఆకట్టుకోవడానికి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఎక్కువ మొత్తంలో రోజుకి 500 నుండి 1000 రూపాయలు వరకు సంపాందించవచ్చు అని వాళ్లు ఆఫర్స్ ప్రకటిస్తారు. అమాయకులను ట్రాప్ చేయడానికి మోసగాళ్ళు ఉపయోగించే సాధారణ ట్రిక్ ఇదే. ఇంకా సాధారణంగా చెప్పాలంటే ఈ యాప్ లకు సంబందించిన లింకులు ఏపీకే రూపంలో మాత్రమే ఎక్కువగా లభిస్తాయి. ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో లభించవు.
అలాగే, మీరు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే మీరు వారిని సంప్రదించడానికి ఏకైక మార్గం ఈ-మెయిల్ మాత్రమే. మీరు ఒకవేల వారికీ ఈ-మెయిల్ చేస్తే రిప్లై వస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేల వారి కస్టమర్ కేర్ నెంబర్ ఉన్న కూడా అది ఎప్పుడూ పనిచేయదు. అలాగే వెబ్‌సైట్ లేదా యాప్ లో యజమాని లేదా వ్యవస్థాపకుడి వివరాలు లేకపోతె ఆ యాప్ ని ఎవరు నడుపుతున్నారో మీరు కనుగొనలేరు. మోసగాళ్ళు పట్టుకుంటారనే భయంతో వారి వ్యక్తిగత సమాచారం, వివరాలను ఎక్కడ కూడా వెల్లడించరు. అలాగే దీని గురుంచి సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ వివరాలు మాకు లభించలేదు.
కానీ కొన్ని మనీ యాప్ లు మాత్రం అమాయక ప్రజలను నమ్మించడానికి మొదట్లో కొన్ని రోజులో పాటు డబ్బులు చెల్లించిన. కొద్దీ రోజుల తర్వాత ఎవరికీ కనబడకుండా పోతారు. ఒక్కోసారి చిన్న చిన్న మొసలే పెద్ద పెద్ద స్కాంలకు దారితీస్తుంది. అందుకే మేము ఈలాంటి నకిలీ యప్స్ లో మీరు పెట్టుబడి పెట్టకూడదని కోరుకుంటున్నాము. అలాగే, ఇందులో మీ బ్యాంకు, వ్యక్తిగత వివరాలు కూడా సమర్పించకూడదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మోసపోయిన వ్యక్తుల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి దయచేసి తెలుసుకోండి.
Comments
Please login to add a commentAdd a comment