కరోనా కారణంగా, లేదంటే ఒకరిపై ఆధారపడకుండా ఆర్ధికంగా ఎదగాలనే తాపత్రయం ఉన్న ప్రతీ ఒక్కరూ ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడంపై దృష్టిసారిస్తున్నారు. అయితే వారిలో అవగాహనలేని చాలా మంది రకరకాల పెయిడ్ సర్వేల పేరుతో ఇటు టైమ్‌తో పాటు డబ్బుల్ని వృదా చేసుకుంటున్నారు. అలా కాకుండా కొంచెం టెక్నికల్ స్కిల్ తో పాటు సోషల్ మీడియా వినియోగంపై కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆలస్యం అయినా జెన్యూన్ పద్దతిలో డబ్బులు సంపాదించవచ్చు.
కరోనా కారణంగా ఆఫీస్‌లు, స్కూల్స్ తో పాటు బిజినెస్ అంతా ఆన్‌లైన్ నుంచే జరుగుతుంది. దీంతో ఆయా టెక్ సంస్థలు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను ఉపయోగించి యూజర్లు మనీ ఎర్నింగ్ చేసుకునేందుకు కొత్త కొత్త టూల్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. అలాంటి ఆన్‌లైన్ మనీ ఎర్నింగ్‌లో ఫేస్‌బుక్ సైతం ముందజలో ఉంది. అందుకే ఫేస్‌బుక్‌లో ప్రతినెలా 2బిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉంటే...రోజుకి 1.37 బిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు.వారిలో టైమ్ పాస్ చేసేందుకు వచ్చే యూజర్లు కంటే డబ్బులు సంపాదించే యూజర్లే ఎక్కువ మంది ఉన్నట్లు కొన్ని గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. మరి అలాంటి ఫేస్‌బుక్‌ను ఉపయోగించి మనీ ఎర్నింగ్ ఎలా చేయోచ్చో తెలుసుకుందాం.
ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్ :
ముందుగా మనం ఉండే ఏరియాని బట్టి ఎలాంటి బిజినెస్ నడుస్తుందో తెలుసుకోవాలి. అనంతరం అమెజాన్ వెబ్ సైట్‌లో ఎలా ప్రాడక్ట్‌లను సేల్ చేస్తామో ఆ తరహాలోనే ఫేస్‌బుక్ మార్కెట్ ప్లేస్‌ను ఉపయోగించే ప్రాడక్ట్‌ను సేల్ చేసుకోవచ్చు. అందులో గృహోపకరణాలు, గాడ్జెట్స్,వంటసామాగ్రి, ఫెస్టివల్ సీజన్ బట్టి ప్రాడక్ట్‌లను మార్చుకొని సేల్ చేసుకోవచ్చు.ముఖ్యంగా స్థానికంగా ఉండే ప్రజలు ఎలాంటి ప్రాడక్ట్‌లు కావాలని కోరుకుంటున్నారో తెలుసుకొని.. అందుకు అనుగుణంగా మార్కెట్ ప్లేస్‌లో బిజినెస్ చేయడం ఉత్తమం.
ఫేస్ బుక్ ఫ్యాన్ పేజ్
ఫేస్ బుక్ ఫ్యాన్ పేజ్‌లో మనీ ఎర్నింగ్ సంపాదించడం కొంచెం కష్టం కూడుకున్నది. కాకపోతే మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటున్న సమయం కంటే ఒక ఆరునెలలు, లేదంటే సంవత్సరం ముందే కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజీ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకుంటే ముందుగా మనకి ఏదో ఒక రంగంలో పట్టుసాధించాలి.
ఉదాహరణకు : ఎంటర్‌టైన్మెంట్,హెల్త్, బిజినెస్, గాడ్జెట్స్, టెక్నాలజీ.
మీకు హెల్త్ గురించి పూర్తి అవగాహన ఉంటే.. సంబంధింత అంశంపై యూజర్లకు ఉపయోగపడే కంటెంట్‌తో పోస్టర్లను డిజైన్ చేసి ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజ్‌లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా రెగ్యులర్‌గా హెల్త్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం వల్ల యూజర్లు త్వరగా అట్రాక్ట్ అవుతారు. తద్వారా మిమ్మల్ని ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంటుంది. ఫాలోవర్లను బేస్ చేసుకొని ప్రాడక్ట్‌లను సేల్ చేసుకోవచ్చు.లేదంటే ఆయా హెల్త్ కేర్ కంపెనీ ప్రతినిధుల్ని సంప్రదిస్తే పెయిడ్ మార్కెటింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో పోస్ట్‌ను బట్టి మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు.
ఫేస్‌బుక్ గ్రూప్స్
ఫేస్‌బుక్ గ్రూప్స్ నుంచి మనీ ఎర్నింగ్స్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఓ వ్యక్తి జెన్యూన్ గా ఎలాంటి బిజినెస్ చేయాలి. ఎలాంటి బిజినెస్ చేస్తే నష్టం వస్తుంది. ఎలాంటి బిజినెస్ చేస్తే లాభం వస్తుందనే విషయాలపై పోస్టర్లను డిజైన్ చేసి ఫేస్‌బుక్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తున్నాడు. ఆ కంటెంట్ జెన్యూన్‌గా ఉంటే చాలు యూజర్లు ఆటోమెటిగ్గా ఆ గ్రూప్స్ ను ఫాలో అవుతుంటారు. ఫాలోవర్స్ పెరిగే కొద్ది మీ ఐడియా స్ట్రాటజీస్‌ను అప్లయ్ చేస్తుండాలి. ఉదాహరణకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో బిజినెస్‌కు సంబంధించి ఓ చిన్న ఈ- బుక్‌ను కొద్ది మొత్తానికి ఆఫర్ చేస్తే యూజర్లు ఆ ఈబుక్‌ను కొనుగోలు చేయడం ద్వారా మనీ ఎర్న్ చేయవచ్చు. దీంతో పాటు పెయిడ్ బిజినెస్ కన్సల్టెన్సీ నిర్వహించడం ద్వారా అదనపు ఆదాయాన్ని గడించవచ్చు.
ఇన్ ఫ్లూయన్సర్ మార్కెటింగ్
మార్కెట్‌లో అనేకరకాలైన జాతీయ,అంతర్జాతీయ ప్రాడక్ట్‌లు ఉంటాయి. అయితే వాటి సేల్స్ జరగాలన్నా, లేదంటే ఆ బ్రాండ్ గురించి అందరికి పరిచయం అవ్వాలన్నా ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ల చేతిలో ఉంటుంది. ప్రాడక్ట్ ల ప్రచారం కోసం కోట్లు కుమ్మరించే బదులు లోకల్ ఇన్ ఫ్లూయన్సర్లను ఆశ్రయిస్తే తక్కువ ఖర్చు. ఎక్కువ ప్రచారం. పైగా బిజినెస్ జరుగుతుంది. అందుకే మార్కెట్‌లో ఇన్ ఫ్లూయన్సర్ మార్కెటింగ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఆయా రంగాల్ని బట్టి ఇన్ ఫ్లూయన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. గాడ్జెట్స్ పనితీరు ఎలా ఉంది. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.ఎలాంటి దుస్తులు ధరిస్తే నలుగురిలో ప్రత్యేకంగా ఉండొచ్చు. ఇలాంటి ప్రతీ అంశాన్ని బట్టి ప్రమోట్ చేసి ఇన్ ఫ్లూయన్సర్లుగా చెలామణి అవ్వొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment